ఉన్నత పరిణామ క్రమానికి ప్రతి నిత్యము చేసుకోవలసిన కొన్ని ముఖ్య సాధనలను ఇచ్చట ఇవ్వటం జరిగింది. శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురుదేవుల జీవితం సాధనామయం. వారి నోటి నుండి వెలువడిన సాధనలు, ప్రవచనముల కొన్ని పుస్తకములను బుక్స్ లింక్ లో చదవవచ్చు.
అంతర్యాగ సాధన-Antaryaga Sadhana
సమస్త వాస్తు, గ్రహ, నక్షత్ర దోష నివారణకొరకు, ఆధ్యాత్మిక ఉన్నతికి అంతర్యాగ సాధన Procedure
ఈ యజ్ఞము ప్రతి ఆదివారము వరుసగా ఒక సంవత్సరము పాటు చేసిన ఎంతోమంది తమ జీవితాలలో అద్భుత ఫలితాలను పొందారు. అసంభవాలను సంభవం చేసుకున్నారు. వసుధైక కుటుంబమును నిర్మాణం చేసేందుకు ఈ యజ్ఞాన్ని చేస్తాము. గాయత్రీ లలితా భాగవత విశ్వయేకీకరణ యజ్ఞము ఈ యజ్ఞమునందు 108 విశ్వఏకీకరణ మంత్ర ఆహుతులను కానీ, 1 గంట సేపు విశ్వఏకీకరణ మంత్రముతో ఆహుతులను కానీ తప్పనిసరిగా సమర్పించాలి.
ప్రతి నెలా అమావాస్య కు ముందు త్రయోదశి చతుర్దశి, అమావాస్య,తరువాత పాడ్యమి, విదియ – మొత్తం 5 రోజులు శ్రీ మహాలక్ష్మీ సాధనను చేయవలెను. శ్రీ విద్యారణ్య స్వామివారు అందించిన శ్రీ మహాలక్ష్మీ సాధన
Daily Sadhana – *Must for all sadhaks* ఈ సాధనలో పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీ రామ శర్మ ఆచార్యగారు క్రాంతి ధర్మి సాహిత్యములో అందించిన సాధన. ఈ అతి చిన్న సాధన అత్యంత శక్తివంతమైనది.
బలివైశ్వదేవము – ప్రాణాగ్నిహోత్ర ఆహుతులు బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, ఋషి యజ్ఞము, నర యజ్ఞము, భూత యజ్ఞము అను ఈ 5 ఆహుతులను సమర్పించటం వలన వంశాభివృధ్ధి, ఆధ్యామిక శక్తి అభివృధ్ధితోఆటు, ఆ వంశములో అందరికీ ఎప్పటికీ ఆహారానికి లోటు ఉండదు.
శ్రీ గాయత్రీ సహస్రనామ స్తోత్రం- Sri Gayatri Sahasranama Stotra
మనందరినీ సన్మార్గంలోకి నడిపిస్తూ బుధ్ధి తలంలోకి మనల్ని తీస్కొనివెళ్ళగలిగే సహస్రనామం. బుధ్ధి తలలంలోకి ప్రవేశించినవారికి ఎటువంటి కష్టములు బాధలు ఉండవు, అన్ని సమస్యలకు సమాధానం అక్కడినుండే లభిస్తుంది.
ప్రతి జీవి వెనకాల తమ కర్మలను అనుసరించి ఫలితములను తయారుచేసే ఒక కఠోర వ్యవస్థ ఉన్నదని తెలుసుకొని ఆత్మ క్రింది పొరలలో పేర్కొని ఉన్న పాపకర్మలను, ప్రారబ్ధ కర్మలను తొలగించుకొనుటకు చిత్రగుప్త వ్రతమును ఆచరించాలి.
మనందరినీ సరైన దారిలో నడిపించేందుకు ప్రతి రోజూ గుర్తుంచుకోవలసిన 5 నియమాలు. సాధకులు వీటిని ప్రింట్ చేసుకుని అద్దంవద్ద అంటించుకుని ప్రతి నిత్యము చదువుకోవాలి.
ఋషుల కార్యక్రమాలను పున: ప్రారభించటానికి మార్గదర్శనం- Rishi Pranalika
ఋషుల కార్యక్రమాలను పున: ప్రారభించటానికి మార్గదర్శనం, ఏ ఋషులు ఏ కార్యక్రమములను చేసారు ? వారి గోత్రములను మనం మన గోత్రములుగా చేసుకుని వారి కార్యక్రామలను చేసేందుకు కావలసిన వివరముల వ్యాసము.
మన ప్రార్ధన, ప్రకృతి యొక్క ప్రతి స్పందనను స్వస్థిప్రజాభ్య పరిపాలయంతా ను ప్రార్ధనలో వివరించారు. ప్రతి శ్లొకము దాని అంతరార్ధము వివరం గా ఉన్నాయి , సాధకులు ఈ అర్ధాన్ని తెలుసుకుని శుభకామన పఠిస్తే అధిక ఫలితాలను పొందగలరు.
స్థల ప్రదక్షిణ ఇది అంతా చెయ్యటానికి కేవలం 2 నిమిషాలు పడుతుంది. దీని వలన మన జీవితంలో మన జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నా ఆ రోజు మాత్రం ఆ గ్రహాల అనుకూలత మీకు ఖచ్చితంగా ఉంటుంది.