జనవరి

010199 అనుగ్రహ నగరము

అనుగ్రహ మాలా మంత్రము ప్రతి ఒక్కరూ కనీసము రోజుకి 24 సార్లు జపించాలి. మహా యోగేశ్వరీదేవి రాబోయే కొత్త యుగానికి సంబంధించిన దేవత. ఆ యోగమాయా శక్తికి సంపూర్ణ సమర్పణ చేసుకొని కనీసము 24 సార్లు జపించండి. అనుగ్రహ నిర్మాణము చేసుకుని సాధకులంతా కలిసి ఉండెందుకు ఒక చక్కని ప్రదేశాన్ని ఏర్పాటు చేస్కొంటే బాగుంటుంది. ఒక ప్రేమమయ వాతావరణాన్ని నిర్మించుకోండి.

110199 భాగవత పరిచయం

భారతీయ ఆధ్యాత్మిక విధానములో గురువు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది గురువు లేనిదే మన జీవితాన్ని ఎటువైపుకి తిప్పుకోవలో మనకి తెలియదు. కానీ గురువు ఎవరు గురుబ్రహ్మ:, గురువిష్ణు: గురు దేవో మహేశ్వర: అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం ఆచరణలో పెట్టలేని శ్లోకము ఎందుకు పనికిరాదు. అంచేత ఆ గురువు యొక్క త్రిమూర్తి స్వరూపము (సర్వసమర్ధత, సర్వవ్యాపకత్వము, సర్వశక్తి) గుర్తించటం నేర్చుకోవాలి. గో అంటే ఇంద్రియాలు అని కూడా అర్ధము వున్నది. ఇంద్రియాల ద్వారా ప్రకృతి ఏం నేర్పుతోందో అది నేర్చుకోవట్టానికి ప్రయత్నించాలి. మీరు కనుక భాగవతాన్ని అర్ధం చేసుకుంటే ఒకొక్క రోజు ఒక్కొక కనిక పగులుతుంది.

110199 అనుగ్రహ మాలా మంత్రము- పరివ్రాజక శిబిరము

అనుగ్రహ మాలామంత్రమును అర్ధం చేసుకోవాలి, హ్రీం భువనేశ్వరీ దేవి బీజాక్షరము, విశాలత్వము మన ఆలోచనలలో రావాలి. చంద్రుడు నుంచి వచ్చే నిత్యకళలకు 16 పేర్లు ఉన్నాయి, సూర్యుడి నుండి వచ్చే కిరణాలు అవి. మీ శరీరము సంపూర్ణముగా అనుగ్రహ మాలా మంత్ర స్వరూపమే. అనుగ్రహమాలా మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడూ మీ చేతనత్వములో ఎక్కడ ఏమి మార్పులు వస్తున్నాయో గమనించాలి, మీలోని కొత్త శక్తి కేంద్రాలు జాగృతము అవ్వటము మీరు గమనిస్తారు.

120199 భాగవతము చదివే విధానము

రామాయణము, భగవద్గీత, భాగవత జీవిత విధానాన్ని వైజ్ఞానికంగా ప్రపంచానికి అందచేసారు. ఈ దేవతశాక్తులన్ని ఎలా అయితే ఋషులు చెప్పారో అలానే మన శరీరం లో వుంటారు. జీవితము యొక్క ఆధారము 7, మనము ఏది చేసిన ఈ 7 లోనే తిరుగుతూ వుంటాయి 7 రోజులు. ఈ సంఖ్య సూర్యుడి దగ్గరి నుంచి వచ్చింది, ఈ 7 యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటూ 12 స్కందాలు వుంటాయి అవి జీవిత సత్యాలు అదే భాగవతము చెప్తుంది. 12 గ్రహాలు కనుక భాగవతాని అర్ధం చేసుకుంటే జీవన్ముక్తులు అవుతారు అంటారు.

170199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము-సంజీవని

సూర్యుడియొక్క వెలుగు సూర్యుడు దగ్గరే ఉండదు, ప్రపంచము అంతా విస్తరిస్తుంది. మీరు కళ్ళు మూస్కొని చీకటిలో ఉంటారో కళ్ళు తెరుచుకుని ఆ ప్రజ్ఞను మీలోకి దింపుకుంటారో అది మీ చేతిలోనే ఉంది.

200199 జగత్ గురు వాణి

మనము చదువుకునే చదువులు డాక్టర్ ఐతే ఆ ప్రత్యేక విషయముపై, ఇంజనీరింగ్ చదివితే వారు ఒక ప్రత్యేక విషయము పైన మాత్రమే జ్ఞానాన్ని కలిగి ఉంటారు, కానీ యోగ విద్యద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని సాధించవచ్చు. ఒక జన్మకు మాత్రమే కాదు, కొన్ని జన్మలకు కావలసిన జ్ఞనాన్నిపొందుతారు.

200199 శ్వాస ధ్యానము 1

శ్వాసను గమనించటము అనేది మన నిత్యజీవితములో భాగముగా మారినప్పుడే యోగవిద్య మీద మీకు పట్టు వస్తుంది, భూత భవిష్యత్, వర్తమానాలు మనకు తెలుస్తాయి. మీరు శ్వాసను పట్టుకోవటము నేర్చుకోండి.

200199 శ్వాస ధ్యానము 2

శ్వాస ధ్యానము ద్వారా అద్భుతమైన వ్యక్తిత్వాలు ఏర్పడతాయి. ఒకప్పుడు సినిమా హీరోలు కష్టపడి చదువుకోవటము, సమాజానికి ఒక రోల్ మోడల్ లాగా ఉండేవారు. ఇప్పుడు హీరోలు రౌడీలు. ఒకప్పుడు సినిమాలో ఎవరినన్నా తీసెయ్యాలి అంటే వాళ్ళకి టి.బి.వచ్చి పోయినట్టు చూపించేవారు. ఇప్పుడు క్యాన్సర్, మనం అర్ధము చేసుకోవలసింది ఏమిటి అంటే చాలా పెద్ద పెద్ద రోగాలను మనుషులు ఎదుర్కోవలసిన పరిస్ధితులు వస్తున్నాయి. మనము ధ్యాన మార్గముద్వారా మన రోగాలే కాక, మన చుట్టుపక్కల వాళ్ళ రోగాలను కూడా తగ్గించవచ్చు.

240199 ప్రేమ ధ్యానము

పరస్పరం కలిసి పనిచేయటం నేర్చుకోవాలి అందుకోసం ప్రేమతత్వము ధ్యానము చేయాలి. ఈ ధ్యానములో మనం నిరంతరం మట్లాడుకుంటూ వుంటాం. ప్రేమతత్వములో దు:ఖమే తప్ప సుఖము వుండదు. కాని ఆ దు:ఖమే సుఖములా అనిపిస్తుంది.

310199 పౌర్ణమి యజ్ఞము

భారతీయ ఆధ్యాత్మికత అంటే సనాతనమైనటువంటి నిత్యనూతనమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యాలను అర్ధం చేసుకొని దానికి అనుగుణంగా జీవించుట. ఈ పౌర్ణమి అమావాస్య ఒక పండుగగా మారాలి. సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క విద్యను నేర్చుకోబోతున్నాము. ఈ యజ్ఞములో ప్రకృతిలో లీనమైపోయి దానికి తగినట్లు వుండే విధి విధానాన్ని నేర్చుకోబోతున్నాము .

ఫిబ్రవరి

100299 సావిత్రి 1

సావిత్రి లో మనం చదువుకునేటటువంటిది సనాతనంగా ఆధ్యాత్మికత లో చదువుకునేటటువంటి విషయాలే కొత్త ఏముంటుంది అంటే అందులో ప్రెసెంట్ చేసేటటువంటి విషయము ఆధునిక కాలములో చేసేటటువంటి విధి విధానము. ఆధ్యాత్మికత అంటే ఎప్పుడో లాభాలు రావడం కాదు తక్షణం లాభాలు పొందడం అది నేర్చుకుంటాం ఈ సావిత్రి లో. సావిత్రి అనేది వేదమే.

280299 క్లీం బీజ సాధన

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా చేసినటువంటి ప్రయోగం, ఇది కలిసి చేసేటటువంటి సాధన, ఒకే భాష అంటే పరిపుర్ణమైనటువంటి మౌనము పాటించాలి. మౌనాన్ని ఒక భాష గా అలవాటుచేసుకోవటం.

280299 క్లీం బీజ సాధన 2

24 గంటలని సద్వినియోగ పరచుకోవటం ఎలా అన్నది క్లీం భీజ సాధన చెప్తుంది. అశరీర ధారులైనవంటి ఈ 3 శక్తులు (భూ:,భువ:,స్వ:) ఈ మూడింటిని అర్ధం చేసుకోవాలి.

మార్చి

010399 క్లీం బీజ సాధన

క్లీం బీజ సాధకుడు సాధన చేసేప్పుడు ఆ శబ్ధాన్ని క్లీం బీజము నా శరీరములో ఎక్కడ ధ్వనిస్తోంది అనేది గమనించుకోవాలి. ఆ స్పందనలను పట్టుకోవాలి. కంప్యూటర్ కర్సర్ నొక్కితే ఏది కావాలో అది మనము సెలెచ్ట్ చేస్కోగలము, చేసుకున్నాక మనకు కావల్సిన మార్పులు మనము చేసుకోవచ్చు. అదే విధముగా ఆ శబ్ధము ఎక్కడ నొక్కబడుతుందో అర్ధం చేసుకోవటము చాలా అవసరము.

010399 క్లీం బీజ సాధన

వేళ్ళకు భూమినుండి శక్తి వస్తే అది ప్రతి ఆకుకు చేరుతుంది, అలాగే నిద్రా స్ధితిలో మీకు శక్తి లభిస్తే భౌతిక జగత్తులో మీకు కావల్సిన శక్తి మీ శరీరానికి సహజంగా వస్తుంది. పరిణామ క్రమాన్ని అర్ధము చేసుకొని మీ జీవిత విధానాన్ని మీదైన రీతిలో మల్చుకోవటము నేర్చుకోవాలి. జాగృతావస్థలో మన జీవితము 5 ఇంద్రియాలకు లొంగిపోయి ఉంటుంది. క్లీం బీజ సాధన ద్వారా మీరు వీటిని మీ అదుపులోకి తెచ్చుకోవచ్చు.

010399 క్లీం బీజ సాధన

డైనమిక్ సైలెన్స్ నుండి వేదాలు ఉద్భవిస్తాము, ఋచో అక్షరే పరమే వ్యోమన్ అను మంత్రాన్ని ఉపయోగించుకోండి. మనలో ఉన్న చెడు బయటికి పూర్తిగా పోతే తప్ప మనకి ఈ స్ధితులు అర్ధం కావు.

010399 క్లీం బీజ సాధన

నా శరీరము కూడా ఒక కణమే, దీని లోపల బయట కొన్ని రసాలు ఉన్నాయి, రసోవైసహ:. సముద్రంలో మునిగితే మన లోపల అనేక జివరసాలు ఉన్నాయి, సముద్రము బయట నీరు ఉన్నది. మనం అలాంటి ఒక ప్రాణ సమద్రములో నిండి ఉన్నాము. ఈ క్లీం బీజ ధ్యానాన్ని బాగా అర్ధం చేస్కొని ఆచరించండి. మన శరీరములో సమత్వం ఈ క్లీం బీజము వలన వస్తుంది

010399 క్లీం బీజ సాధన

క్లీం పరమాణువులు, శ్రీం పదార్ధము హ్రీం కణాలు. కణాలు స్వయంపోషక ప్రవృత్తిని ఇచ్చే శక్తి, కణాలు ఈ శక్తిని పరమాణువులకు, పదార్ధానికి కల్గిస్తాయి.

010399 క్లీం బీజ సాధన

ప్రకృతి ఎప్పుడూ మీకు కొత్త విషయాలను నేర్పించటానికి కావలసిన పరిస్ధితులను కల్పిస్తుంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడే నేర్పిస్తుంది, ఎక్కడికీ వెళ్ళక్ఖర్లేదు. ప్రతీ సంఘఠన వెనకాల ఒక దిశా నిర్దేశము ఉంటుంది, అది పట్టుకునే ప్రయత్నము చెయ్యండి.

010399 క్లీం బీజ సాధన

క్లీం బీజ సాధన శిబిరములో పాటించవలసిన నియమాలు. దీక్షా విజ్ఞానికి నాంది ప్రస్తావన.

020399 ఎంట్రీ టు స్పిరిట్ ( ఆత్మలోనికి ప్రవేశము)

ఆధ్యాత్మికత అనేది ఒక జీవిత విధానము. రెండు సత్యాలు మన జీవితం లోకి అనుభవం లో కి వస్తే ఈ ఆధ్యాత్మికత యొక్క ప్రవేశము మన జీవితం లో కి వస్తుంది. మొదటిది జన్మ జన్మల యొక్క అవగాహన అనుభూతి లోకి రావాలి. రెండవది కర్మ సిద్దాంతము. సేవ చేయడం ద్వారా మన జీవితాలలో వున్నా కర్మను పోగొట్టుకోగలము. కర్మ సంబంధం అర్ధం కావాలి అంటే క్లీం బీజం కావాలి.

020399 క్లీం బీజ సాధన

ఏ లక్ష్యం కోసం మీరు పని చేస్తున్నారో ఆ లక్ష్యం ఏ స్థితిలో ఉంటుందో అ స్థితిలోకి మీరు ఇప్పుడే వెళ్ళి పని చెయ్యండి. క్లీం బీజ మంత్రాన్ని మీరు మననం చేసుకోవాలి. లక్ష్యం ఒకటే ఐనా నేను పదే పదే రకరకాలుగా చెప్తున్నా, ప్రతిసారి కొత్త విద్యని చెప్తున్నా , దృష్టికోణంలో మార్పు అనేది గుర్తుంచుకోవాలి. ఈ భౌతిక శరీర నిర్మాణం ఒక అత్యంత అద్భుతమైన ప్రాతిపదికమీద సృష్టింపబడింది. పరమాణువుల కలయిక ఆణువులు, ఈ పరమాణువులను ఒక విశేష పధ్ధతులలో కలిపితే పదార్ధములు ఏర్పడతాయి. ఉప్పు - సోడీయం క్లోరిన్ కలిపితే ఏర్పడతాయి, అలానే పంచదార.....విశేషమైన రంగు, రుచి, వాసన గుణాలు కలిగిన వాటీకి స్వయంగా స్వయంపోషక శక్తి లేదు, ఎంత తయారుచేస్తే అంతే ఉంటాయి. పంచదార పంచదారలాగే ఉంటుంది పెరగదు, తరగదు. పరమాణువులు అన్నే కలిసి అణువులుగా మారతాయి, ఇలా మారిన అణువులు జీవాన్ని పోసుకుంటే వాటిని సెల్స్ ( కణాలు) అంటాం. అవి స్వయం పోషక శక్తిని కలిగి ఉంటాయి, వాటికి కావలసిన ఆహారాన్ని తీసుకొనగలదు, అఖర్లేనివి బయటికి పంపగలదు. క్లీం పరమాణువులు, శ్రీం పదార్ధము, హ్రీం జీవ కణాలు ( సెల్స్) . కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మన శరీరంలో ఎక్కువ శాతం ఉంటాయి, ఏ వస్తువు ఎంత పరిమాణంలో తీస్కోవాలో మన శరీరం చెప్తూనే ఉంటుంది. పదార్ధపరమైన సర్వోత్కృష్ఠ స్ధితికి మానవ శరీరం చేరింది. జలతత్వాన్ని అర్ధం చేసుకుంటే మీరు చాలా అద్భుతాలని పట్టుకోగలరు. శబ్ధముద్వారా మనం మన శరీరంలో సమత్వాన్ని తీస్కొనిరావచ్చు. " క్లీం" బీజ మంత్రము మీలో ఆ సమత్వాన్ని తీస్కొని వస్తుంది.

030399 క్లీం బీజ సాధ

క్లీం బీజ సాధన : Practice session నా శరీరము కూడా ఒక కణమే, ఈ కణములోపల కొన్ని కణాలు, బయట కొన్ని ఉన్నాయి, "రసోవై సహ". మీరు ఒక ప్రాణ సముద్రంలో కూర్చుని ఉన్నారు. అనంతమైన ప్రాణ సముద్రంలో మీరు తేలుతున్నారు. క్లీం బీజ సాధనతో మనం మన శరీరాన్ని ఒక శబ్ధ శక్తితో స్పందింపచేస్తున్నాం.

030399 అనుగ్రహ మాలా మంత్ర సాధన

ప్రతి శబ్దాన్ని ఉచ్ఛారణ చేసేటపుడు ప్రతి అక్షరాన్ని ఉచ్ఛారణ చేయాలనే సంకల్పం వస్తుంది. అది ఎక్కడ నుంచి వస్తోందో దాన్ని పట్టుకోవాలి . పట్టుకున్నాక ఈ సంకల్పం ఉచ్ఛారణ చేయటానికి ఆ వాక్కు ఉచ్చరింపబడటానికి శ్వాస వుండాలి. ఆ శ్వాస మీ లోపలి వెళ్ళి అక్కడ నుంచి ఈ సంకల్పం శబ్దావళిగా మారేటటువంటి ప్రక్రియ మనలో ఎలా జరుగుతోందో దాన్ని మనం గమనించబోతున్నాము

030399 నవ్య యుగ ప్రణాళిక- కార్యకర్తలకు మార్గదర్శనము

సంఘీ భావము కలిసి పని చెయ్యటము అనేది మొదటి సూత్రము, పండుగలు సామూహికముగా జరుపుకోవాలి. రామ నవరాత్రులలో 11 సార్లు ప్రతి రోజూ రామ రక్షా స్తోత్రము పారాయణ చేస్తే ఆ స్తోత్రము సిధ్ధిస్తుంది. ఆదిత్య హృదయము 108 సార్లు పూర్తిచేసుకోవాలి.

030399సమంకాయ శిరోగ్రీవం - Audio poor quality

సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్ధిర: సంప్రేక్ష నాసికా గ్రం సం దిసశ్చా నవలోకయన్

040399 అనుగ్రహమాలా మంత్ర సాధన - మౌనము

మంత్రోచ్ఛరణ చేసేప్పుడు ఆ శబ్ధమును వింటూ చెయ్యాలి. శబ్ధముల యొక్క ఉత్పత్తి స్థానములోకి వెళ్ళాలి. పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ స్ధితులలో పరా స్ధితిని పట్టూక్నే ప్రయత్నము చేస్తూ మంత్రోచ్ఛారణ చెయ్యాలి. మనము చేసేది మంత్ర జపము కాదు, అది ఏ స్థానము నుండి ఉద్భవితోందో ఆ స్థానం కవాలి. దానిని పట్టుకోవాలి.

040399 అనుగ్రహమాలా మంత్ర సాధన - మౌనము

అనుగ్రహమాలా మంత్ర సాధన - సాధకుడు శబ్ధాల మాయలో మంత్రాల మాయలో పడకుండా మంత్రాన్ని ఉపయోగించుకుని , పరాపశ్యంతీ స్ధితిని పట్టుకోవాలి.

050399 అర్జున విషాదయోగ గీతా సాధన

సాధకుడు ద్వంద్వాతీత స్ధితికి వెళ్ళి విషాదమునుండి ఎలా బయటపడవచ్చు- వివరణ

060399 క్లీం బీజ సాధన

భారతీయ ఆధ్యాత్మికత అనే మాటలో భారతీయత అనేది అదొక దేశానికి సంభందించిన జ్ఞానం అని కాదు మొట్టమొదట్ట అది భారతీయులు గమించారు అని అర్ధం. వేద విజ్ఞానం లో ఋషుల యొక్క అర్ధము ఏంటి అంటే వాళ్ళు ద్రష్టలు మాత్రమే అందుకని వాళ్ళని మంత్ర ద్రష్ట ఋషులు అంటాము. మంత్రం అంటే పరా స్థితి నుంచి ఒక్క విశేషమైన ప్రాకృతిక శక్తిని మీ వద్దకు తీసుకువచ్చేటటువంటి అక్షర సముదాయము.

070399 సక్రియ మౌనము

ఋషులు గురువులు మాట్లాడిన మాట్లాడకపోయినా వాళ్లెప్పుడు ఈ సైలెన్స్ లో నే వుంటారు. బాహ్యజీవితనికి సంబంధించిన ఈ నియమాలు ఈ మౌనానికి వర్తించవు. కాని ఈ మౌనం వల్లే బౌతిక జీవితం లో వున్న అన్ని నియమాలు పని చేస్తాయి, పదార్ధానికి వున్న నియమాలు ప్రాకృతిక శక్తులు ప్రాకృతిక శక్తుల లాగా పనిచేయటానికి కూడా కారణమూ ఆ మౌనమే . ఆ మౌనం వల్లే అనంతమైనటువంటి శక్తి కణములోకి ప్రవేశిస్తుంది.

120399 క్లీం బీజ సాధన

రామాయణంలోని కీ ఆదిత్య హృదయములోను, మహా భారతము యొక్క "కీ"భగవద్గీతలోను ఉంది, మీరు క్లీం అనే స్ధితిలో ఉంటే మీకు ఈ స్ధితి అర్ధము అవుతుంది. సాధకులకు బుక్ ఆఫ్ లైఫ్ రామాయణము, భారతము, భాగవతము - స్థూల, సూక్ష్మ, కారణ సరీలకు సాధకులకు బుక్ ఆఫ్ లైఫ్ ఇవి. 27 మందిని సరైన వ్యక్తులు కలిసి చక్కటి సాధన చేస్కోగలిగితే మీరు ఎన్నో అద్భుతాలు చెయ్యచ్చు. మన ఆలోచనలకి, మన భావావేశానికి, మనం చేసే పనికి చాలాసార్లు కనెక్షన్ ఉండదు. టెంపుల్ బ్యూటిఫుల్ యొక్క గురువుల కోరికకి భౌతిక జగత్తులో మనకు కనిపించే బ్యూటీ పార్లర్ లు క్షుద్ర రూపం.

170399 శ్రీ రామ నవరాత్రి- సూర్య కిరణ విజ్ఞానము

రామ అనే మంత్రము మనలో ఎక్కడ ఉద్భవిస్తోందో పట్టుకోండి. రాముడు, హనుమంతుడు, వాలి ఒకళ్ళని ఒకళ్ళు గుర్తించుకున్నతరువాత సుగ్రీవుడు దగ్గరకి తీస్కొని వెళ్తాడు. ఒకే బాణముతో 7 తాటి చెట్లను సంహరించగలిగితే వాలి సంహారము చెయ్యగలవు. తార, అంగదుడు వాలి సంహారము తరువాత సుగ్రీవుడి దగ్గరకు వస్తారు. ఇది సాధన, ఇది మన శరీరములో జరుగుతోది. శ్రీ రామ నవరాత్రులలో మీరు ఈ సూర్య విజ్ఞానాన్ని. సుగ్రీవుడు విశుధ్ధి చక్రము, వాలి మీ అలవాట్లు, తార మీరు పుట్టిన నక్షత్రము మీ పేరులో, రాముడు హృదయ చక్రము. మూలాధారము నూండి సహస్రారమువరకు ఆయనమే రామాయణము.

170399 నవ్య యుగ ప్రణాళిక

ఈ జీవిత విధానం రాబోయే 2౦౦ కోట్ల సంవత్సరాల వరుకు మీకు పనిచేస్తుంది. ఈ కొత్త జీవితానికి సంకేతంగా ఈ క్లీం బీజ సాధన ఇవ్వబడింది, ఇది తల్లి నుంచి బయటికి వచ్చేటటువంటి 9 నెలలలో చేసుకుంటాము. బయటికి వచ్చిన దగ్గర నుంచి 2౦ సంవత్సరాల వరకు శ్రీం సాధన, ఆ తర్వాత నుంచి చనిపోయే అంత వరుకు హ్రీం సాధన జరుగుతుంది ప్రతి మనిషిలో.

180399 నవ్య యుగ ప్రణాళిక

సిరీస్ అనే నక్షత్రము నుండి భూమి ఉపరితలం మీదకి వచ్చి కొన్ని కిరణాలు ఆగి ఉన్నాయి, దానిని సైంటిస్ట్లు ఓజోన్ పొరకు చిల్లుపడింది అని అనుకుంటున్నారు, వాళ్ళకి అంతే తెలుసు. కానీ సిరీస్ నక్షత్రానికి భూమికి ఒక అలౌకిక సంబంధము ఉంది, దీనిని డాగ్ స్టార్ అంటారు. డాగ్ స్టార్ యొక్క శక్తి కిరణాలు మన భూమి చుట్టూతా ఆవరించి ఉన్నాయి. వాటిని నెమ్మదిగా భూమి మీదకు దింపేందుకు పరిక్రమా విధానాన్ని పాటించాలి. దీనికిగాను మీరు ఆదిత్య హృదయ పారాయణా పరిక్రమ, గురుచరిత్ర పారాయణా పరిక్రమ, అనుగ్రహ మాలా మంత్రము, లలితా సహస్రనామ పారాయణ, రామరక్షా స్తోత్ర పారాయణ, లలితా స్తోత్ర పారాయణ ఇవన్నీ 24/7 జరగాలి. ఒక్క గాయత్రీ సహస్రనామము, ఆదిత్య హృదయ స్తోత్రము రాత్రి 6 నుండి పగలు 6 వరకు చెయ్యకూడదు. ధర్మము, మతము ఈనాడు ఈ రెండు పదాలు ఒకే అర్ధముతో వాడుతున్నాము, కానీ అది తప్పు. హిందూ ధర్మము శాశ్వత సనాతన నిత్య నూతనమైంది హిందూ ధర్మము - అది దాని లక్షణము. హిందూ మతము దీని గురుంచి నువ్వు ఏమి అనుకుంటున్నావో అది. హిందూ మతము నుండి మనము హిందూ ధర్మములోకి ఎదగాలి. ఇప్పుడున్న మతాలన్నీ రూపుమారిపోతాయి. ఈనాటి మానవజాతిలో ఉన్న మనల్ని చూస్తే మన తరువాత 3 వ తరం వారు మనల్ని జంతువులుగా మాత్రమే పరిగణిస్తారు. వాళ్ళకి ఒకే ధర్మము, ఒకే మతము, ఒకే విశ్వము. ఎప్పుడైతే మనస్సు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మొత్తము 1 + 10 రావణాసురిడి తలలను రామ బాణంతో నాభిస్థానం దగర కొడుతుందో ఇంక ఆక్షణములో మనస్సు ఉండదు, బుధ్ధి మాత్రమే ఉంటుంది. బుధ్ధి భూత భవిష్య వర్తమానాలను బేరీజు వేస్కోగలదు, మనస్సు బేరీజు వేసుకున్నా దానికి తగిన నిర్ణయము తీసుకొనలేదు. మనస్సు బుధికి ఉన్న తేడాను అర్ధము చేస్కోవాలి, మనస్సుకి తెలుసు కానీ వినదు

190399 నవ్య యుగ ప్రణాళిక

శరీరమే దేవతల నిలయము. ఈ దేవాలయాలు కేవలము దాని గుర్తుచేయడానికి ఒక్క స్థితి మాత్రమే. దేవతల స్పర్శ అందించేటటువంటి దేవాలయాలు మనము నిర్మించాలి. యముడులోంచి నచికేతాగ్ని నుంచి ఉపయోగించుకుంటూ సావిత్రి యొక్క అనుగ్రహముతో ఆ దేవాలయాల నిర్మాణము.కాని ఇది జరగడానికి మీలో నిద్రాణమైనటువంటి ఈ దేవతా శక్తులు మేల్కోవాలి

200399 నవ్య యుగ ప్రణాళిక

రామ నవరాత్రులలో మీతో హనుమాన్ చాలీసా పారాయణ, రామరక్షా స్తోత్ర పారాయణ చేయించటానికి కారణము మీ అందరిలోకి సూర్యుని 3 వ కిరణము దిగాలని. సర్వ ధర్మాన్ పరిత్యంచ మామేకం శరణ వ్రజ..అనే మానసిక స్ధితి తెచ్చుకోవటము, అది ఒక చివటం అమ్మలాగా, ఒక సాయి లాగా మీరు తత్క్షణమే ఆ సర్వ సమర్ధత, సర్వాంతర్యమిత, సర్వ వ్యాపకత మీకు తెలుస్తుంది. మరి ఈ మార్గము మీకు చేతకావట్లేదు కాబట్టి సాధనలు చెయ్యటం చదవటం తప్పదు, షార్ట్ కట్స్ లేవు.

200399 భగవత్ గీత - Audio poor quality

భగవత్ గీత ని అర్ధము చేసుకునేందుకు మనము అలవరచుకోవలసిన లక్షణాలు అష్టాంగ యోగ విద్యలో చెప్పబడిన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు.

210399 నవ్య యుగ ప్రణాళిక -1

5 విశేషమైన దేవతాశక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నాయి . ఆ శక్తి ధారలని ప్రుద్వి గ్రహంపై జీవించేటటువంటి 5 రకాలైనటువంటి ప్రాణికోటి యొక్క ఉపాసనకు బీజాలు. సమస్త మానవజాతి బదులు రామకృష్ణ పరమహంస ఉపాసన చేసి దేవతలని నిలిపాడు.

210399 ఆత్మ సంయమన యోగము

ధీర మనస్సు, ధైర్యము ఉన్న మనస్సు అధ్యాత్మికతకి చాలా అవసరము. ధైర్యము ఉంటే తప్ప మనము ఏ సాధనా చెయ్యము. అధ్భుతమైన సుఖము, దీనిని మించిన ఆనందము ఇంకొకటి లేదు అని ఋషులు చెప్తున్నా చెయ్యలేని దుర్బలత మానవులది. అందుకు ధైర్యము కావాలి, ఎలాంటీ ఫలితము వచ్చినా పరవాలేదు నేను సాధన చెయ్యాలి అన్న ధైర్యము కావాలి.

230399 శరీర ధర్మము

వేద విజ్ఞానం నిత్యజీవితం లో ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి సూత్రమే రామాయణము. ఈ మౌలికమైన సిద్ధాంతాలు మనము మర్చిపోవడం వల్లనే ఈ లోకహితమైన గ్రంధాలను మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. మన లక్ష్యము వేద విజ్ఞానాన్ని తిరిగి భారతదేశములో పున్నరుద్ధరీకరించుట

240399 నవ్య యుగ ప్రణాళిక

పరమాణు శక్తి అతి సూక్ష్మమైన శక్తి. పరమాణు శక్తి పరమాణు శక్తిని కొన్ని కోట్ల రెట్లు సూక్ష్మీకరణ చెందిన తరువాత దానిని విస్ఫోటనం చేస్తే వచ్చే శక్తి కుండలినీ శక్తి. అది భౌతికమైన శక్తి మాత్రమే, ఇంకా అధ్యాత్మిక శక్తి అవతరణ సూక్ష్మ జగత్తులో గత 2,3 సంవత్సరాలుగా జరుగుతోంది. ఏది జరిగినా ముందు సూక్ష్మ జగత్తులో జరిగాకే కిందకి వస్తుంది కదా, అలా సూక్ష్మ జగత్తులో ప్రస్తుతం ఈ మార్పు ఈ కుండలినీ శక్తి తయారై ఉంది. అనంతమైన కాలచక్రములో చిరంజీవులైన ఋషులు, భగవంతుని తమ జ్ఞానంతో బంధించగలిగిన ఋషులు ( అంటే కరెంటు ఎలా పని చేస్తుందో తెలిస్తే దానిని వైరులో బంధించి వాడుకున్నట్టే) ఋషుల జ్ఞానాన్ని క్రిందకి దింపటానికి ఒక వాహకము కావాలి, అది మీరుగా మారండి.

250399 రామనవమి విశిష్ఠత

మానవుడిగా జన్మ ఎత్తిన మనకు మనిషిగా కొన్నిబాధ్యతలు వున్నాయి. సమాజంలో వున్నంతవరుకు సంఘానికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవడం. అదే ఋషిమయ జీవితం. అసలైనటువంటి మానవుడిగా ఏ బాధ్యతలు వున్నాయో అవి స్వీకరించటం. మన జీవితంలో ఏది జరిగినా రామాయణం లో వున్న ఏడు ఖండాలే జరుగుతాయి. అందుకే అవి మనము ఇప్పటికీ చెప్పుకుంటున్నాము .

270399 సాధకుని మానసిక స్ధితి

నూతన యుగావతరణ వల్ల కొన్ని విశేషమైనటువంటి బాధ్యతలని మనం స్వీకరించవలసి వచ్చింది. ఏ విద్య తెలుస్తే మిగతా అన్ని విద్యలు తెలుస్తాయో అదే ఆధ్యాత్మిక విద్య. క్రైస్ట్ కి కృష్ణుడికి మొహమద్ కి వున్న సమన్వయాన్ని అర్ధం చేసుకోవటము. రాముడే మళ్లీ కృష్ణుడి గా పుట్టొచ్చు , కానీ ఇద్దరు ఒక్కటే చెప్పలేదు. అలానే క్రిష్టియానిటి ప్రపంచానికి ఏం చెప్పింది. ఈ మూడు విద్యలు మీకు తెలియాలి. సాధకుని మానసికస్థితి కదలకూడదు స్థిరంగా వుండాలి అలా అని రాయిలా మారడం కాదు.

ఏప్రిల్

060499 శ్రీం & క్లీం బీజ సాధన - 1

శ్రీం బీజ సాధన - సమయాన్ని దాటగలిగినప్పుడు ఈ సాధన ఫలిస్తుంది. ఆర్తో, జిజ్ఞాసో, జ్ఞాని, అర్ధార్ధీ- ఈ నాలుగు స్థాయిలు ఉంటాయి. ఐశ్వర్యవంతులని చూసే మనస్సు, వారిని మెచ్చుకునే మనస్సు తెచ్చుకోవాలి ముందు. భారతీయ అధ్యాత్మికతను ఐశ్వర్యమును కల్గి ఉండుట తప్పు అనే ఒక భ్రమలో ఉన్నారు, కానీ మన చుట్టు అనంతమైన సంపద ఉన్నది. గౌతమ ఋషిదగ్గర అనంతమైన సంపద ఉన్నది, ఆయన పొద్దున్న పంట నాటి మధ్యాహ్నము కోసేసావారు.

060499 శ్రీం బీజ సాధన

పరిపూర్ణంగా భౌతిక జగత్తులో మీరు రోజుకు 24 గంటలను సవ్యంగా ఉపయోగించుకుంటే వాటిని 48 గంటలు ఎలా జీవించచ్చో నేర్చుకోవచ్చు. గురువుల వద్ద కొండలు కొండలు జ్ఞానం ఉన్నది, మనము తీసుకోవాలి కానీ వాళ్ళ వద్దకు అసలు మనం ఆ జ్ఞానం పొందాలని వెళ్ళట్లేదు. సమయాన్ని దాటగలిగే సాధన చేస్తేనే శ్రీం బీజ సాధన ముందుకు వెళుతుంది.

060499 మహా యోగేశ్వరీదేవి యొక్క యోగమాయా శక్తి - శ్రీం బీజ సాధన

2000 లోపు నేను నాటవలసిన ఆధ్యాత్మిక బీజాలన్నిటిని నాటుతున్నాను, ఇప్పుడు ఈ పని జరగకపోతే మళ్ళీ 24 కోట్ల సంవత్సరాలవరకు మానవజాతికి మళ్ళీ ఈ అవకాశము రాదు. అందుకు నేను క్లీం బీజ సాధనలో సమయాన్ని సద్వినియోగము చేసుకొనుటగురుంచి చెప్తున్నాను. ఏ శక్తివల్ల శ్రీ కృష్ణుడు లాంటి జగద్గురువు మహయోగేశ్వరీ దేవి అనుగ్రహముతో దాటగలిగాడో ఆ మాహాయోగేశ్వరీ దేవిని మనము ఇప్పుడు మళ్ళీ మన హృదయములోకి దిఫుకుంటున్నాము. ఆవిడ మాహా మాయను దాటించగల సమర్ధురాలు. భగవద్గీత 18వ అధ్యాయములో భగవద్గీత 61, 62 శ్లొకములలో శ్రీం బీజ సాధనకు కావల్సిన వివరణ ఉంది, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేఅర్జునతిష్ఠతి...యంత్రారూఢాని మాయయా. ఏ శక్తి వలన శ్రీ కృష్ణుడు మహా మాయా దాటగలిగాడో ఆవిడే యోగమాయ మహాయోగేశ్వరీదేవి. క్షమా, ధైర్యము, బుధ్ధి, స్మృతి, వాక్కు, సంపద, కీర్తి ఈ ఏడు శ్రీ కి 7 లక్షణాలు.

070499 శ్రీం & క్లీం బీజ సాధన - 2

సాధకులు ముందుగా కుటుంబము పట్ల బాధ్యత, సమాజము పట్ల బాధ్యత తెలుసుకోవాలి. స్వప్న స్ధితి మన వశంలోకి రావటమే శ్రీం బీజ సాధన, దానికి చెయ్యవలసినది జాగృత స్ధిని సద్వినియోగము చేసుకొనుట. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్ధిర: అనే శ్లోకానికి అద్భుతమైన వివరణనిచ్చారు. ఆత్మ సంయమన యోగములోని శ్లోకాల వివరణ. సూర్య కిరణ విజ్ఞానము నేర్చుకోవటనికే గాయత్రీ మంత్రము చేసుకోవాలి. ఆ సౌభాగ్య సూర్యోదయము మీలో జరగటానికి మీ సాధనలు ఉపయోగపడాలి.

070499 శ్రీం & క్లీం బీజ సాధన - 3

శ్రీం బీజ సాధన - శీత్కారీ ప్రాణాయామము - గాలి లోపలికి పీలుస్తున్నప్పుడు శ్రీం అను శబ్ధాన్ని పీల్చాలి, వదిలేటప్పుడు శాంత స్ధితిలో గాలి బయటీకి వదలాలి. మనము పంట బాగా పండటానికి ఎరువు వేస్తాము, ఎరువు వేసినప్పుడు పంట బాగా పండుతుంది, దానితో పాటూ కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి, మనము సాధన చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుది. మనము కలుపు మొక్కల్ని జాగ్రత్తగా పీకి పారెయ్యాలి. చాల మంది సాధకులు ఈ ముఖ్యమైన విషయాన్ని అర్ధము చేసుకొనలేక ఆధ్యాత్మిక మార్గములో తప్పుదోవలోకి వెళ్ళిపోతారు, అలా జరగకుండా మీ మానసిక స్ధితిని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. భోజనానికి ముందు అశ్వనీ ముద్ర వేసుకోవాలి, మినిమం 10 మాక్సిమం 21 అంతే. ఉడ్డియాన బంధము, జాలందర బంధము వివరణ. జల తత్వానికి ప్రాణానికి సంబంధం ఉంది, వాయువుకి విజ్ఞానమయ కోశానికి సంబంధం ఉంది.

070499 శ్రీం బీజ సాధన

ప్రతి వ్యక్తి సామాజిక నియమాలు పాటించాలి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే....ఒకసారి యోగ స్ధితిలో ఉండె రుచి తెలిస్తే ఇంక దానికంటే రుచికరమైనది ఏదీ ఉండదు. హృదయములోని అత్యంత సుఖమయ స్ధితికి మీరు వెళ్ళాలి అంటే అత్యంత దు:ఖమయ పరిస్ధితులను దాటి వెళ్ళాలి, కానీ మీరు ఈ సాధనలు చాలా జన్మలుగా చేస్తుండబట్టి ఇంక అంత దు:ఖాన్ని భరించాల్సిన అవసరం లేదు, ఆడుతూ పాడుతూ ఈ స్ధితికి చేరగలరు.

080499 శ్రీం & క్లీం బీజ సాధన - 4

సూర్యుని మొదటి కిరణము - సంకల్పము - ఈ సంకల్ప శక్తినుండి ప్రజ్ఞలోకి మీరు ప్రవేశించాలి అంటే మీకు ప్రేమ ఉండాలి. అందుకే సూర్యుని రెండవ కిరణము ప్రజ్ఞ - ప్రేమ. సూర్య కిరణాల ద్వారానే మీరు వీటిని పట్టుకోగలరు. ఈ ఉపన్యాసాలను మళ్ళీ మళ్ళీ విని రాసుకుంటే కానీ మీకు నేను అందిస్తున్న ఈ జ్ఞానము అర్ధము కాదు. శ్రీం బీజ సాధన, క్లీం బీజ సాధన అంటే మీకు ఈ జ్ఞానము లేకుండా ఆ బీజాలు మీలో అంకురించవు. ఏ జన్మ సంస్కారమో మీకు ఈ ఉపన్యాసాల ద్వారా మీకు అద్భుత జ్ఞానాన్ని పొందే అవకాశము దక్కింది అనే సత్యాన్ని తెలుసుకుని జాగ్రత్తగా వినండి

080499 సంకల్పము ప్రేమ

"భారతీయత అంటె వెలుగు కోసం తాపత్రయం. చెట్టుకు సూర్యుడు వైపు ఎదిగే లక్షణం ఉంది. అంటే అది ఆత్మ నిర్ణయాన్ని పాటిస్తుంది. ఆత్మ యొక్క నిర్ణయాన్ని పాటించె వాళ్ళే వెలుగు వైపుకు ప్రయాణిస్తారు. కుంటుబం యొక్క,సమాజం యొక్క నిర్ణయాలని కాకుండ ఆత్మ యొక్క నిర్ణయన్ని పాటించె వాళ్ళే వెలుగు వైపు ప్రయాణిస్తారు. "

100499 శ్రీం & క్లీం బీజ సాధన - 5

శ్రీం బీజ సాధన ద్వారా మనలో బీజాలు పడతాయి, కానీ వాటిని రక్షించాలి , జాగ్రత్తగా పెంచుకోవాలి. వాటికి తగిన మానసిక స్ధితిని ఎల్ల వేళలా ఉంచుకోవటం తెలియాలి. క్లీం బీజ సాధన కానీ శ్రీం బీజ సాధన కానీ మన మనోభూమిలో నాటాక క్లీం అంటే సంకల్పముగా నాటుతాము, సమయాన్ని సద్వినియోగము చేసుకుంటాము, వీటికి సంబంధించిన భావాలు మీకు అర్ధము కావాలి.

110499 యూనివర్శిటీ ఆఫ్ సిరీస్

"సిరీస్ అనే నక్షత్రము లేకపోతే ధర్మము అనేది ఇంత పటిష్టంగా వుండి వుండేది కాదు , దాన్నే యమ అంటాము. నియామకం చేసేటటువంటి విద్య సిరీస్. ఈ యూనివర్సిటీ ఆఫ్ సిరీస్ అనేది కోట్ల కోట్ల సంవత్సరాలనుండి వుంది. గురుపరంపరకు మూలమైనటువంటి స్థానం అది. "

120499 శ్రీం & క్లీం బీజ సాధన - 6

ఎక్కడ ఎక్కడ పసుపు రంగు వాడతామో అక్కడ అక్కడ మనము వనరులను మన వద్దకు లాక్కొంటాము, శ్రీం బీజ సాధనలో మన లక్ష్యాన్ని పూర్తి చెయ్యటానికి ఒక ముహుర్తము ఉండాలి, పసుపు రంగుతో మన కర్మలను మార్చుకొనవచ్చు. కాలాన్ని అతిక్రమించే శక్తి అభ్యాసము వలన వస్తుంది. ఆర్తో, జిజ్ఞాసో, జ్ఞానీ, అర్ధార్ధీ వీళ్ళందరికీ ఉదారత్వము ఉంటుంది. శ్రీం బీజ సాధనకు కావలసిన ముఖ్య మానసిక స్ధితి ఉదారత్వము. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభా:.స్వప్న లోకంలో జరిగే అధ్యాత్మిక తరగతులకు మీరు అటెండ్ అవ్వదలచుకుంటే భువ: ఆలోచనలకు మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి.

130499 శ్రీం & క్లీం బీజ సాధన - 7

సంవత్సరములో జరిగే ప్రతీ మార్పు మన ఒక శ్వాసలో మార్చుకోవచ్చు, వాయువులో ఉండే ప్రాణ శక్తి మన శరీరములో శ్వాసగా క్రిందకి వెళ్తే కృష్ణ పక్షము, పైకి వెళ్తే శుక్ల పక్షము. ఈ శరీరము వదులుతున్న శ్వాస ఎప్పుడూ పైకి లేస్తుందో అప్పుడు ఓం అనే శబ్ధము సహజముగా మూలాధారమునుండి పైకి లేస్తుందో,సూర్యకిరణ విజ్ఞనములో చెప్పబడిన ఆ యోగ శక్తి ఆజ్ఞా చక్రము నుండి సహస్రారమువరకు వెలుగుగా వెళ్ళినప్పుడు, శరీరములోని నవ ద్వారాలు మూసివెయ్యగలిగితే అది ఓం, శ్రీం, క్లీం సాధన ఫలితము.

140499 ప్రశ్నలు - సమాధానములు

లక్ష్యమునకు చేరటానికి కష్టపడటం రావాలి. లక్ష్యము, వ్యవస్థ అనే రెండూ మీ భౌతిక అధ్యాత్మిక జీవితాల ఉన్నతికి అత్యంత అవసరం. మీరు బాధ్యతలు స్వీకరించటం బాగా నేర్చుకోవాలి.

220599 మానవజాతికి సవాల్

గురువు చెప్పింది చేస్తాము అనేవాళ్ళకే దేవాలయాలలోకి ప్రవేశం వుంటుంది,దేవాలయమంటే వెలుతురు వున్నవాళ్ళకి.మానసిక స్థితిలో మార్పు తెచ్చుకోవాలి.

230599 సాధకులకు సూచనలు

ఆధ్యాత్మికత యొక్క సుస్పష్టమైన రూపాన్ని అర్ధం చేసుకున్న రూపాన్నిఇతరులకు అందించేటటువంటి ప్రక్రియ. మృత్యువు తర్వాత మన జీవితాలు ఏమవుతాయి అనేటటువంటి అవగాహనా తో జీవించే వ్యక్తి ధర్మానికి దగ్గరవుతాడు. అనుభూతిలోకి రానంతవరకు అది తెలిసినవాళ్ళు ఏం చెప్తే అది చేస్తాము.

250498 సిధ్ధిరాజు వార్షికోత్సవము

"భారతదేశము ముస్లిం పాలనలొ ఉన్నప్పుడు ముకుంద బ్రహ్మచారి అనే ఒక మహా యోగి భారత దేశములొ ఇతర మతముల యొక్క రాజ్యము ఉండకూడదు అని ప్రయత్నం చేసాడు. అతనే తిరిగి అక్బర్ గ పుట్టవలసి వచ్చింది. గురువుల ప్రణాళికను మనం అర్ధం చేసుకొని జీవించాలి. రెండవ ప్రపంచ యుద్దం ఆపే ప్రయత్నాలు భారతదేశంలోని కొన్ని ఆశ్రమాలలొ జరిపించబడినవి, కాని దాని యొక్క శుభ ఫలితాలు ప్రపంచం అంతా అనుభవించింది. "

మే

020599 మహా యోగేశ్వరీ దేవి అవతరణ - మంత్ర, యంత్ర & స్వరూపము

మహా యోగేశ్వరీ దేవి మనకు ఏడు యోగాలను నేర్పిస్తుంది. మొదటి యోగము - స్థూలము - సూక్ష్మము, రెండవది - కామము , మనస్సు, మూడవది - సరూప మనస్సు, అరూపా మనస్సు, నాల్గవది - స్థూల, కామ, మనస్సు బుధ్ధితో యోగముచెయ్యాలి. దానికి గాయత్రీ మంత్రము కావాలి, ఇవన్నీ మనము హ్రీం , శ్రీం, క్లీం తో చేస్తున్నాము. హ్రీం శ్రీం క్లీం సరూపా మనస్సులోనే ఉన్నాయి, క్లీం - కాలాన్ని సద్వినియోగము చేసుకుంటున్నాము, శ్రీం - వనరులను సద్వినియోగము చేసుకుంటున్నాము, హ్రీం - పరిణామ క్రమములో మనం ఉన్న స్ధితిని అర్ధంచేసుకునే ప్రయత్నము చేస్తున్నాము. ఇది అంతా దాటి బుధ్ధి లోకి అంటె ధియోయోనహ: ప్రచోదయాత్. ఆత్మ, అనుపాదక ఆది యోగాలలోకి ప్రవేశించటానికి మహాయోగేశ్వరీదేవి ఆయుధాలు, ముఖములు , శక్తులు ఉపయోగపడతాయి. అనుగ్రహమాలా మంత్రము ఆ మహాయోగేశ్వరీ స్వరూపముగా గుర్తించి జపించండి. ముందుగా ఋషులు ఏ దేవతనైనా దర్శించటానికి ఆత్మతలములోనుండి దర్శించి అందిస్తారు, అక్కడ విశుధ్ధి చక్రాన్ని ( అనగా ఆత్మతలము - సత్యము - వాక్కు సత్యము) వాడుకుంటారు. వాక్కు రూపములో మంత్రాన్ని అందిస్తారు. ఆ యోగ స్వరూపము సరూపా మనస్సులో మహాకాల చక్రవర్తీ యంత్రముగా రూపొందింది. అనుగ్రహ మాలా మంత్రము, మహాయోగ్వ్శ్వరీ దేవతను, మహాకాల చక్రవర్తీ యంత్రాన్ని కలిపి మీరు చేసుకుంటే స్థూల తలమునుండి ఆత్మ తలానికి మనము అతి తేలికగా చేరుకుంటాము. మంత్రము, యంత్రము స్వరూపము మూడూ గుర్తుంచుకోవాలి. ఆత్మ తలములో మంత్రము,

110599 ఐశ్వర్యము యొక్క మానసిక స్ధితి

కష్టాలు మీకు కొత్త సుఖానికి దారి తీస్తాయి అన్నది సత్యం. మనం ఏమి నాటామో అదే కోసుకుంటాము, మామిడి చెట్టుకి మామిడిపళ్ళే వస్తాయి, వేప చెట్టు నాటి మీరు దాన్ని బ్రతిమలాడితే అది మామిడిపళ్ళు ఇవ్వదు. మీకు ఉన్న కష్టాలు కానీ సుఖాలు కానీ దు:ఖాలు కానీ అశాశ్వతము అనే మానసిక స్ధితి చాల ముఖ్యము. ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్టే. మీరు సమాజాన్ని ఉధ్ధరించే ప్రయత్నము చెయ్యవద్దు. మిమ్మల్ని మీరు ఉధ్ధరించుకోండి. మీ లక్ష్యము సామాజ సేవ కాకూడదు, మీరు మారటమే మీ లక్ష్యము.

110599 ఐశ్వర్యము యొక్క మానసిక స్ధితి

మీ మాటలు కానీ మీ చేతలు కానీ పెద్ద పెద్ద ప్రణాళికలు వేసేందుకు తయారుగా ఉండాలి. తీసిన వస్తువులు తీసిన చోట పెట్టటం అనేది మీకు చిన్న పనిలా అనిపించినా అది జీవితానికి మొదటి మెట్టు. వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, వస్తువులను వ్యవస్థితంగా ఉంచటం, బాధ్యతలను స్వీకరించట ఇవన్నీ ఐశ్వర్యవంతులుగా కాదలచుకున్నవారు తప్పక పాటించాలి.

120599 ఐశ్వర్యము యొక్క మానసిక స్ధితి

అపవిత్ర పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా అంటె నేను ఏ పనిని చెయ్యబోతున్నామో దానిని పూర్తి శ్రధ్ధతో చెయ్యటమే. పంచోపచార పూజా విధానము మీకు అలోచనా విధానాన్ని నేర్పిస్తుంది. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే పూర్తి తన్మయతతో చెయ్యటం చాలా ముఖ్యము. మీకు ఏది కావాలి అనేది అతి చిన్న వస్తువుల వద్దనుండి, పెద్ద వస్తువుల వరకు నిర్ణయించే శక్తి సరిగ్గా అలవాటు చేసుకోవాలి. మీకు కాఫీ కావాలా, టీ కావాలా అనేదే సరిగ్గా నిర్ణయించుకోకపోతే ఇంక పెద్ద పెద్ద విషయాలను మీరు ఏమి నిర్ణయించగలరు? ఆచమనం అనగా నిర్ణయాత్మక శక్తి. శిఖా బంధనము - మనస్సు వాక్కు ఆచరణ ఒకే విధముగా ఉంటే ఇంట్యూషన్ పని చేస్తుంది. ప్రాణాయామము - ప్రాణశక్తి కావాలనుకున్నవాళ్ళకి ప్రాణాయామము తప్పకుండా చెయ్యాలి.

130599 ఐశ్వర్యము యొక్క మానసిక స్ధితి (Group discussion followed by speech)

వన మూలిక కానటువంటి గడ్డి లేదు, పనికి రాని వ్యక్తి లేడు, యోజకహ తత్ర దుర్లభం, వీళ్ళని ఉపయోగించుకునే వ్యక్తి దొరకటమే కష్టం. ఐశ్వర్యము యొక్క మానసిక స్ధితి అంటే మీ వద్ద ఉన్న వనరులను వ్యక్తులను మీరు ఎలా ఉపయోగించుకోగలరు అనేదే ముఖ్యము. దీనికి ముందు కావలసినది పరస్పర సహకారము.

150599 కాకివాయి ఆశ్రమ కార్యక్రమాలు - మహాకాల చక్రవర్తీ యంత్రము

మహాకాల చక్రవర్తీ యంత్రము - ఆత్మ రాజ్యస్థాపన అనే లక్ష్యముకొరకు ఆశ్రమవాసులు పనిచెయ్యాలి. మీరు ఆ మహాకలచక్రవర్తీ ప్రతినిధులు.

150599 నా లక్ష్యము నా సందేశము

నేను ఏ ఆశ్రమానికి కట్టుబడి ఉండను, నాకు అంటూ కొన్ని ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయి, నేను వాటికోసము పనిచేస్తాను. మీరు నన్ను కాదు మీ లక్ష్యాలను పట్టుకోండి. నన్ను గుర్తించగలను అనే అపోహలో ఉండవద్దు, మీరు నన్ను గుర్తించలేరు, కానీ నా లక్ష్యాలను గుర్తించి పని చేస్తే నేను సంతోషిస్తాము

150599 కాకివాయి ఆశ్రమ నిర్మాణము

ఒక ఉడుత రామ కార్యానికి ఉపయోగపడినట్టు మనము గురు ప్రణాళికలో భాగస్వామ్యము వహించాలి. మౌనము యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. కాకివాయి ఆశ్రమనిర్మాణవివరములు కార్యకర్తలతో చర్చ.

150599 కాకివాయి - స్మర్తుగామి సిధ్ధక్షేత్రము

కాకివాయి - స్మర్తుగామి సిధ్ధక్షేత్రములో . అగ్ని దూతంపురోధధే - మన కోరికలను దేవతలకు అందచేసే అగ్నిని ఇక్కడ స్థాపించాను. మీరు ఏ దేవతకి , ఏ గురువుకి ఏమి చెప్పుకోవాలనుకున్నా ఈ శ్రీ హంసరామ ఆశ్రమములో , స్మర్తుగామి సిధ్ధక్షేత్రములో ఉన్న అగ్నికి చెప్పుకోండి. ఆయన తక్షణమే మీ కోరికను ఎవరికి తెలియచేయదలుచుకున్నరో వారికి చెప్పి దాని ఫలితాన్ని మరల మీకు అందేలా చేస్తాడు.

జూన్

030699 పురుష సూక్తము - ఆహారము

తైత్తరీయ ఉపనిషత్ ఆనందవల్లీలో 7 వ శ్లోకము - "అన్నం న నింద్యాత్" - అన్నాన్ని మనము నిందించకూడదు. యదన్నేనా తిరోహతి. ఆ అన్నమే మనల్ని అమరత్వము వైపుకు తీసుకొని వెళ్తోంది. అన్నము ఎవరు అప్పుడు ఎక్కడ పెట్టినా కాదనకూడదు. ఆహారము వడ్డించటానికి ముందుగానే వచ్చి భోజనానికి కూర్చోవాలి.

040699 పురుష సూక్తము

పురుష సూక్తముతో పురుషుడి యొక్క ఆవాహన చేస్తున్నాము, ఆవాహన చేసినప్పుడూ మనలో ఉన్న పురుషుడ్ని ఆవాహన చేసుకోవాలి కానీ బయట మీరు ఏమి చేసినా ఉపయోగములేదు. మనలో ఉన్న 6 చక్రములను అధిగమించి ఉన్న ఆ సహస్రార చక్రములోనికి నేను ప్రవేసించాలి. ఆ దేవతా శక్తి ఎప్పుడూ సహస్రార చక్రముకంటె కిందకి దిగదు, మనము ఆ స్ధితికి చేరాలి.

050699 పురుష సూక్తము

పురుష ఏ వేదగుం సర్వం - అన్నిటా ఉన్న ఆ చేతనత్వము, యద్భూతం యచ్చ భవ్యం- ఈ పురుషుడు భూత, భవిష్యత్ వర్తమానాలలో కూడా ఉన్నవాడు, ఉదామృతత్వశ్యేసానహ్ - అతను అమృతమూర్తిగనుక, చావుపుట్టుకలు లేనివాడు అంతటా వ్యాపించిఉన్నవాడుగనుక, యదన్నేనా తిరోహతి - ఆ అమృతత్వాన్ని మనము అన్నముద్వారా సాధిస్తాము అనే సత్యమును మనము జాగ్రత్తగా అర్ధము చేసుకోవాలి.

060699 పురుష సూక్తము

ఈ సృష్టి అంతా ఒక చక్రీయ గమనముపై ఆధారపడి నడుస్తోంది. ఈ చక్రీయ గమనాన్ని మనము యజ్ఞము అంటాము. పురుషేణ హవిషా - ఆ పురుషుడ్నే హవిస్సుగా దేవతలు సమర్పించారు. మన శరీరములో ఆద్యమునకు దగ్గరగా అనగా నెయ్యి గా పని చేసేవి మన ఆలోచనలు. మనయొక ఆలోచనలే రూపుదాలుస్తాయి. అదే ఆద్యము.

070699 పురుష సూక్తము

ప్రతి దేవాలయానికి ఒక స్థాన దేవత ఉంటుంది, సప్తర్షి ఆశ్రమానికి వచ్చేవారు వేణుగోపాల స్వామి వద్ద పెర్మిషన్ తీస్కొని రావాలి. అది చాలా ముఖ్యము. తిరుపతికి వెళ్ళినవారు ముందుగా వరదరాజస్వామిని దర్శించుకున్నట్టే సప్తర్షి ఆశ్రమము గుంటూరుకు వచ్చేవారు వేణుగోపాల స్వామిని దర్శించుకోవాలి.

080699 పురుష సూక్తము

పృధ్వీ అనే విశ్వవిద్యాలయములో నీలి రంగు ఉంటే అది ఆ విద్య ఏమిటి అనేది కృష్ణచేతనత్వము నేర్పింది. మానవులు ఎరుపు, కాషాయము, పసుపు మాత్రమే వాడుకోవటం వచ్చు. కాషాయ రంగును భారతీయులు స్పెషలైజ్ చేసారు. కాషాయరంగు అంటె యజ్ఞమయ జీవనము.

090699 పురుష సూక్తము

త్రయీ విద్య - ఋగ్వేదములోనుండి యజుర్వేదము, యజుర్వేదములో నుండి సామవేదము, మళ్ళీ సామవేదములో నుండీ ఋగ్వేదము ఈ చక్రీయగమనమును అర్ధము చేసుకోవాలి.

170699 మంత్ర పుష్పము

సకలైశ్వర్యాలతో భారతదేశము తులతూగడానికి కారణము ఓంకారము. జాగృత, స్వప్న సుషుప్తావస్థలకి అతీతం గా ఉన్నటువంటి దాన్ని మీరు పిలుస్తున్నారు ఆ ఆర్తి తెచ్చుకోవాలి .అదే సంపూర్ణ సృష్టిని నడిపిస్తోంది. మంత్ర పుష్పము మన యొక్క షట్చక్రాల గురించి చెప్తుంది. అందుకే దేవాలయాలలో అది చేస్తాము

170699 మంత్ర పుష్పము

ఓంకారము మొత్తము ప్రపంచానికి సిలబస్, ఆ మూడు అక్షరాలు మీరు అర్ధం చేసుకుంటే చాలు మీరు సర్వజ్ఞత్వము, సర్వ వ్యాపకత్వము సర్వాంతర్యామిత్వము వస్తుంది.

180699 మంత్ర పుష్పము

ఈ విద్యను మీరు నేర్చుకోవటానికి ౩ పదాలని బాగా అవగాహన చేసుకోవాలి ఉపాసన, సాధన, ఆరాధన. ఉపాసన అంటే ఏం నేర్చుకోబోతున్నామో దాన్ని గురించి అవగాహన వుండాలి. ఉపాసన చేయటానికి నువ్వు దగ్గరిగా నిశ్చింతగా కూర్చోవాలి. మన శరీరాన్ని మన మనస్సుని ఆ అఖండ గురుసత్తాకి సమర్పణ చేసుకోవాలి. ఈ ఓం కారము మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది

190699 మంత్ర పుష్పము

మంత్రజపాన్ని పెంచుకోవాలి, యజ్ఞ విధానంలో ఆఅగ్నిని ఉపాసించుకోవాలి ఓంకారం చెప్పగానే ఎలా అయితే మార్పు గమనిస్తారో అలానే యజ్ఞము దగ్గర కూర్చోగానే మీ యొక్క చేతనత్వములో మార్పు రావాలి.

200699 మంత్ర పుష్పము

ఆకాశం ఎక్కడ వుంది లోపల వుంది బయట వుంది."అనతమవ్యగుం మాకులం.." ఆకాశాతత్వము మనలో ఒకబింధువు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది మన హృదయంలో దానే పేస్మేకర్ అంటాము. అది సంపూర్ణ జీవిత విధానాన్ని శాశిస్తుంది ఎంత అధ్బుతంగా మంత్రపుష్పం లో ఈ శ్లోకం లో మన శరీరం లో హృదయం గురించి చెప్తున్నారో చూడండి

220699 మంత్ర పుష్పము

పుష్పము లో మొట్టమొదట వుండేది సువాసన - ములధారము, పుష్పం లో మధువు వుంటుంది - స్వాదిష్టానము , దళాలు, రంగులు, ఆకారము - మణిపూరకము, ప్రతి పుష్పము కూడా చాలా మృదుత్వము వుంటుంది ఆ స్పర్శ - అనాహతము. ప్రతి పుష్పానికి పేరు వుంటుంది - విశుద్ధి. ప్రతి ప్రుష్పము ఏదో ఒక ఆనందాన్ని కలుగ చేస్తుంది - ఆజ్ఞ . పుష్పాల యొక్క ఈ లక్షణాలనిటిని తీసుకుని మంత్ర పుష్పము అంటాము.

జూలై

180799 కార్యకర్తలకు పిలుపు

గురుప్రణాళీకలో భాగస్వామ్యానికి అందరికీ ఇదే అహ్వానము. ఆ ఆత్మరాజ్య స్థాపన మనలో జరిగి మనము దేవ మానవులుగా మరి పృధ్విని స్వర్గంగా మార్చే ప్రాణాళిక, నియమాలు వివరించారు

ఆగస్ట్

020899నిరంతర గురు ధ్యానము

ఆధ్యాత్మికత సత్యాల గురుంచి చెప్పే విద్య, మతాల గురుంచి కాదు. ఋణానుబంధ రూపేణా పశు పత్నీ శుతాలయ అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఏ గురువు కూడా అర్హతకు మించిన ఫలితాలు ఇవ్వలేడు. అర్హత, పాత్రత పెంచుకోవటము మన చేతిలో ఉంది.ఆధ్యాత్మీక విద్య అంతా ఒక చిన్న ట్రిఖ్ మీద ఆధారపడి ఉంది, అది అహంకారము లేని స్ధితి .

050899 గాయత్రీ హృదయము - మౌనము

గాయత్రీ హృదయము - మౌనము

060899 మహా కాల చక్రవర్తీ యంత్రము

24 గంటలలో మన శ్వాస 21,600 సార్లు మన శరీరములో ఉన్న చక్రాలలో, గ్రహాలలో తిరుగుతూ ఉంటుంది. మహా కాల చక్రవర్తీ యంత్రములో మధ్య బిందువు లొ సూర్యుడు ఉంటాడు, దాని బయట ఉన్న అష్ట దళ పద్మములో 8 గ్రహాలు, మధ్యలొ ఉన్న సూర్యుడితో కలిపి 9 గ్రహాలు ఉన్నాయి, మన శరీరములో కూడా ఈ గ్రహాలు ఉన్నాయి, రాహువు కేతువు కూడా ఉన్నాయి. రాహువు కేతువులలో కూడా మన శ్వాస స్పందనలు గమనించగలిగితే మనము అమృతత్వాన్ని పొందుతాము. రాక్షసులు అయినప్పటికీ రాహు కేతువులు అమృతత్వాన్ని పొందారు. మహాకాల యంత్రాన్ని మీరు ధ్యానించండి.

080899 మహా కాల చక్రవర్తీ యంత్ర ధ్యానము

కాలము యొక్క చక్రీయగమనముపై ఎవరికి కమాండ్ ఉందో వాళ్ళు మహా కాల చక్రవర్తులు. 432 అనే అంకెలు చాలా ముఖ్యము, ఈ అంకెలు మీరు ఉపయోగించుకోవటము నేర్చుకుంటారో వాళ్ళూ స్వరాజ్యము యొక్క అధినేతలు అవుతారు. ఒక మనిషికి తప్ప ఇక ఏ ప్రాణీకి కూడా అడ్మినిస్టేషన్ అవసరము లేదు, చతుర్దశ భువనాలు చక్రవర్తిత్వము పొందుతున్నాయి - అ చక్రములో వర్తిస్తున్నాయి.

110899 సూర్య గ్రహణ సాధన

మన శరీరమే దేవాలయము, దాంట్లో ఆ అఖండ గురుసత్తా యొక్క అద్భుత విన్యాసము యోగమాయ శక్తి తో జరుగుతూవుంటుంది.నిరంతరము నేను ఆత్మని అనేది గ్రహించాలి.

130899 వేదాలు ప్రకృతి నియమాలు

సృష్ఠి స్ధితి లయ - మూడింటిని తెలిసిన వ్యక్తినే మనము గురువు అంటాము. మానవ శరీరములో లేనటువంటిది ఏదీ ప్రకృతిలో ఉండదు.

150899 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

ఆత్మరాజ్య స్థాపన అన్నా రామ రాజ్య స్థాపన అన్నా, ట్రాంసెండంటల్ మెడిటేషన్ అన్నా, సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము అన్నా, స్వ ఆత్మ రాజ్య స్థాపన అన్నా ఒక్కటే. ఇవన్ని ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కి ముందు జరగాలి. 2000 సంవత్సరంలోపు ఈ కార్యక్రమాలన్నీ చెయ్యటానికి గురువులకు ఒక కారణం ఉంది. మౌనములో ఉంటే అద్భుతమైన ఆర్గనైసింగ్ పవర్ మీకు ఈ ధ్యానము చేసినప్పుడు తెలుస్తుంది.

150899 సకల సమర్ధ సద్గురు స్పర్శ -1

మహాకాల యొక్క అగ్నిని తెలుసుకుంటూ ప్రకృతికి అనుగుణ్యం గా జీవించటం.మౌనం లో ఎపుడైతే ఆ సమర్ధ సద్గురువుని తలుచుకుంటారో ఆ స్పర్శని అనుభూతి చెందాలి. ఆ స్పర్శ మన జీవితాలని వ్యవస్తీకరణ చేస్తుంది.

150899 సకల సమర్ధ సద్గురు స్పర్శ -II

మన శరీరములోని కణ కణములో అనుభూతి చెందగలిగితే ఆ గురువు యొక్క స్పర్శ మనకు లభించినట్లే.గురువు యొక్క స్పర్శను మౌనంలోనే పట్టుకోగలము

160899 ధ్యానము - పరిణామ క్రమము

ఈ సూర్య గ్రహణము తరువాత మానవీయ చేతనత్వము 24 కోట్ల సంవత్సరాల తరువాత మొట్ట మొదటిసారి జరగబోతున్న మానవీయ ఆత్మ సామూహికంగా పైవేపుకు వెళ్ళటానికి కావలసిన దీక్ష తీసుకోబోతున్నది. జగత్ జనని ఆలయాల తలుపులు మనము చూస్తే 49 గంటలు ఉన్నాయి. కుడివేపు 24, ఎడంవేపు 24 మధ్యలో ఒక గంట ఇది ఏంటో అర్దము చేస్కోండి.

180899 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

మంత్ర దీక్ష నుండి అగ్ని దీక్షకు వెళ్ళటానికి యజ్ఞము ఉపయోగించుకుంటాము, పూర్తి ట్రాన్స్ ఫార్మేషన్ కి ఇదే దారి, వేరే దారి లేదు. ఓరియన్, సిరీస్ నక్షత్రాల నుండి వచ్చిన ఋషులు మన భూమి చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించారు, మనం వాటికి అనుగుణంగా జీవిస్తేనే ఈ పృధ్విమీద ఉంటాం, లేదంటే ఇక్కడినుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. మనుషుల హ్యబిట్స్ నాచురల్ లా కి దూరంగా ఉన్నాయి, అందుకు చాలా కష్టాలు పడుతున్నారు. ఓంకారము ద్వారా పిలవబడుతున్న చేతనత్వము మీకు ప్రకృతికి అనుగుణంగా మారేందుకు కావలసిన శక్తిని ఇస్తుంది. ఎప్పుడు ఆత్మ శక్తి ధారలు మనం లొంగిపోతామో అప్పుడూ దానిని ముద్రా స్ధితి అంటాం.

230899 ఆత్మ రాజ్య స్థాపన

"సమస్త శక్తులు మానవ శరీరంలొ ఉన్నాయి. విత్తనాలలొ ప్రతి విత్తనము చెట్టు కాగలదు. మనం సర్వ శక్తి వంతులమె. మనం కృషి చేసి ఆ శక్తులను బయటకి తీసుకురావాలి. ప్రయత్నిస్తె ఏ విద్య అయిన వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక విద్య కోసం ప్రయత్నం చేస్తె తప్పకుండ వస్తుంది. "

250899 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

శరీరములో 7 గ్రహాల ప్రవర్తనను తెలుసుకోవాలి, శ్వాస మూలధారంలో 600 సార్లు తిరుగుతుంది, మొత్తం అన్ని చక్రాలలో 24000 సార్లు తిరుగుతుంది, శ్వాస ఎప్పుడు ఎలా ఎక్కడ చక్రీయగమనములో తిరుగుతోందో తెలుసుకోవటమే వర్తిత్వము, అది తెలుసుకుని చేస్తే మహాకాల చక్రవర్తిత్వము. ఆత్మరాజ్య స్థాపన చేస్కోవటం , మహాకాల చక్రవర్తీ పట్టాభిషేకం చేస్కోవటమే మన ధ్యేయము.

300899 ఎస్ ఎస్ ఎస్ సాధన

భువి పై స్వర్గావతరణ అంటే మనుషులు దేవతలుగా మారాలి.మనల్ని మనం అర్ధం చేసుకోవడానికి ఈ ఓం –సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము ఉపయోగపడుతుంది.జ్ఞానము అదే టెక్నిక్ కూడా అదే.

310899 గాయత్రీ స్మృతి

" స్త్రీకి అద్భుతమయిన నిర్మాణాత్మక శక్తి ఉంది. ఎలా కావాలంటె అలా బిడ్డను గర్భంలోనె నిర్మించగలదు. కాని స్త్రీకి అటువంటి మానసిక స్థితి ఉండాలి. ప్రహ్లాదుడు, అభిమన్యుడు తల్లి గర్బంలోనె అంతా నేర్చుకున్నారు. . గాయత్రి మంత్రంలొ 'వ' అనె అక్షరం ఇది చెపుతుంది. పురుషలలొ ఆలోచనల నిర్మాణము జరుగుతుంది. "

310899 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

భూమి మీద స్వర్గావతరణకి మొదటి మెట్టు ముందు మీలో ఉన్న దైవీ లక్షణాలు అభివృధ్ధి చెందాలి. యతీనాం బ్రహ్మ భవతి సారధి. ఆ రధ సార్దధి పర్యవేక్షణలో మనము మన జీవితాలు కొనసాగించాలి. యోగస్థ కురు కర్మాణి - యోగ స్ధితిలో ఉండి కర్మలు చెయ్యి, స్వలాభాపేక్ష లేకుండా కర్మ చెయ్యలి. ఇంద్రియాలకు సుఖమునకు సంబంధించిన కోరిక ఉన్నది మనకి అంటె మనము యోగ మార్గములో లేము అని అర్ధము చేసుకోండి.

సెప్టెంబర్

010999 భూమిపై స్వర్గావతరణ

భూమిపై స్వర్గావతరణ వేద సంస్కృతి పునర్జాగరణ శాంతి, సుఖము అష్ట ఐశ్వర్యములతో కూడిన జీవితము ప్రతిమనిషికి అది లక్ష్యము. స్వ ఆత్మ రాజ్య స్థాపన - మారవలిసినది నువ్వు ఈ గవర్నమెంట్ నిన్ను మార్చలేదు కేవలము నియమాలు ఏర్పరచుకోవడం వల్లే జరుగుతుంది అనుకుంటే అసలు బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించేది కాదు. ఆ అనంత జ్ఞానాన్ని మనము మర్చిపోయాము.

010999 "సాయి వేంకటేశ శ్రీ రాం" ప్రాముఖ్యత

యతీనాం బ్రహ్మా భవతి సారధి - ఎవరైతే చిత్త వృత్తులను నిరోధిస్తారో వారికి ఈ స్ధితి వస్తుంది. బ్రహ్మ విష్ణు స్వరూపుడైన గురువు, దత్తత్రేయుడే. ఆయన వద్ద 4 కుక్కలు ఉన్నాయి, వేదాలు. ఆయన స్మరణ మాత్ర సంతుష్టుడు.

010999 భూమిపై స్వర్గావతరణ

మానవజాతి భవితవ్యతకు చేయవలిసిన అతి సింపుల్ టెక్నిక్ ఓం కారము 21 సార్లు చేయాలి, ఎందుకు మన షట్చక్రాలలో వున్న మాలిన్యాలు పోవడం కోసం . భువిపైస్వర్గావతరణ అంటే మనం అమరులుగా మారటము. మన శరీరము ఓం కారానికి అనుగుణ్యంగా మారాలి

030998 గాయత్రీ గీత మరియు స్మృతి

వామ పక్షానికి సంబంధిచిన తాంత్రిక శక్తి సావిత్రీ, జ్ఞాన పక్షానికి సంబంధిచిన శక్తి గాయత్రీ. మొదటి 8 అక్షరాలు స్థూల జగత్తులో మన జీవితము ఏ విధముగా ఉండాలి అనేది వివరిస్తుంది.

050998 సంధ్యా వందన విధానము

సంధ్యా వందన విధానమును వివరిస్తూ, విధి విధానాన్ని చేయించారు.

090999 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

గత 5000 సంవత్సరాలుగా భూమిపై స్వర్గీయ వాతావరణాన్ని తయారుచెయ్యటానికి మనం పని చేస్తున్నాము. మృత్యువు యొక్క విష వలయమునుండి మనము బయటపడాలి. ఈ రోజు 090999 నవావర్ణ రోజు అనవచ్చు. ఎక్కడ ఎక్కడ ఖాళీ జాగా ఉందో అక్కడ అక్కడ దేవతలు ఉంటారు - రిచో అక్షరే పరమే వ్యోమన్. 21సార్లు ఓంకారం చెయ్యటం ద్వారా అమృతత్వాన్ని పొందవచ్చు. సూర్యుడి నుండి వచ్చే ఒక విశేష కిరణము వలన వారము ఏర్పడుతుంది, సూర్య చంద్ర కిరణాల ఆంగిల్ మీద అధారపడి తిధి ఏర్పడుతుంది. ఒక వ్యక్తి అతను తనలా ప్రవర్తించటానికి కారణం తనకి నక్షత్రాల నుండి వచ్చే ధర్మమయ కిరణాలే. మహా విష్ణువు ఆజ్ఞతో మనము చేసే సాధనను చేస్తున్నాము అనే ధ్యాస మీకు ఉండాలి.

120999 వినాయక నవరాత్రులు ఉపాసన

మనకి ఉన్న పరిస్ధితులు పరమాత్మయొక్క వరదానమే, ప్రతి పరిస్ధితి సంతోషమే, గమ్యము తెలిసిన వ్యక్తికి ఎప్పుడూ ఉత్సహము ఉంటుంది, నిరంతరము ఆశ, ప్రకృతి యొక్క నియమాల మీద ఆశ, ఈ పరిస్ధితులు సంతోషంగా భావిస్తే, ఈ పరిస్ధితిలో నేను ఉత్సాహముగా ఉంటే, . సాధన చేస్తున్న సమయములో కాదు ప్రతి క్షణం సాధకుడు ఈ నాలుగు మానసిక స్ధితిలను కలిగి ఉండాలి.

130999 వినాయక చవితి

మన మణిపూరక చక్రము నుంచి అగ్ని దీక్ష తీసుకోవాలి. ఒక చిన్న కణము నుంచి ఈ సంపూర్ణ సృష్టి సెకండ్ కి 18 కిలోమీటర్లు విప్పారుతుంది. శబ్ద బ్రహ్మకి నువ్వు లొంగితే వేదము యొక్క శబ్దానికి నువ్వు లొంగితే, ది ఫైనల్ వర్డ్. దృష్టి అక్కడ వుంటే చాలు.

150999 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

సూర్యోదయం సూర్యాస్తమయాల సమయంలో మీతో పాటు పిల్లల్ని కూడా మౌనంలో కూర్చోపెడితే యోగుల కులాన్ని మీరు అభివృధ్ధి చేసినట్లే. మీరు యోగులే, మీ పిల్లలు కూడా చిన్నప్పటినుండి ఇలాంటి సంస్కారాలలో పెరిగితే అదే యోగుల కులాభివృధ్ధి. సూర్యోదయ సూర్యాస్తమయాల సమయాలో పరమ శాంత స్ధితిలోకి మీరు చేరగలిగితే అదే 24 గంటలు ఉంటుంది. అక్కడ అవాంగ్మానసగోచరమైన పరిస్ధితి ఉంటుంది. దీనివలన అనంతమైన క్రియాశీలత వస్తుంది.

160999 దుర్గా సప్తశతి - మధుకైటభ వధ

లయ స్ధితి నుండి నిద్ర లేచినప్పుడు మన శరీరంలో కూడా అనేక మాలిన్యాలు బయటికి వస్తాయి, చెవిలో వచ్చే మాలిన్యము వలన ఏర్పడినవారు మధుకైటభులు. ఆ మధుకైటభ వధ చెయ్యటానికి యోగమాయా శక్తికి 5000 సంవత్సరాలపైన పట్టింది. మధుకైటభులు అనగా వేద విజ్ఞానాన్ని అభివృధ్ధి చెందకుండా ఆపేవారు. మనం ఆందరిలో ఉన్న మధుకైటభులు ఏమి చేస్తారు ? మనల్ని వేవిజ్ఞాన్ని వినకుండా అపుతారు. వేద విజ్ఞాన్ని నేర్చుకోవాలన్న మక్కువ మనం ఏర్పరుచుకుని దాని ప్రకారం మనం నేర్చుకుంటేనే మనలోని మధుకైటభ వధ జరిగినట్టు

170999 దుర్గా సప్తశతి - కీలకం వివరణ

దధామి ప్రతి గృహ్ణామి అని మనల్ని మనం ఆ మహా శూన్యానికి అర్పించుకున్నాక తిరిగి మనం ఉద్భవిస్తాం. ఒక్కసారి ఓంకారంలోకి వెళ్ళి తిరిగి వస్తే అది నువ్వు కాదు అని భగవద్గీతలో చెప్పబడిఉంది. మనం అమ్మకి నైవేద్యంగా ఆహారం పెడతాం, అది ఆహరమే, కానీ అమ్మ వద్దనుండీ తిరిగి మనం స్వీకరించేటప్పుడు అదే ఆహారం ప్రాసదంగా మారుతుంది. ఈ జీవితము ఆ అమ్మయొక్క అనుగ్రహము అనుకుని జీవించటం మొదలుపెట్టాలి, ఈ సమర్పణ తరువాత.

180999 పతంజలి యోగసూత్రములు

తత్ర స్ధితే యత్నో అభ్యాసహ: - ఏది నేర్చుకోవాలన్నా ప్రాక్టీస్ కావాలి, తత్వమసి tనేను అది అనేదాన్ని మాటి మాటికి గుర్తుచేసుకోవలను.క్లేశ కర్మ విపాకాశియైర అపరామృష్ట: పురుషవిశేషహ: ఈశ్వరహ: కు వివరణ.

180999 పతంజలి యోగ సూత్రములు

క్లేశ కర్మ విపాక ఆశయి అపరామృష్ఠ: పురుష విశేషహ: ఈశ్వర:
క్లేశములు - సత్వగుణముతో అధిగమించాలి, కర్మ విపాకము - పూర్వ జన్మలల్లో చేసినవో ఇప్పుడు చేసినవో అన్నీ కర్మలు వస్తూ ఉంటాయి, వాటిని అంటకుండా జీవించటమే యోగవిద్య మనకు నేర్పిస్తుంది.

190999 సమర్ధసద్గురు స్పర్శ ధ్యానము &సౌందర్య లహరి

సాధకుడు నిరంతరము అచ్యుత స్ధితిలో ఉండాలి, బాహ్యజగత్తుళొ మీకు ఉన్న భయంకరమైన పరిస్ధితులు అన్నీ మీ నమ్మకాన్ని మరింత పటిష్ఠము చేసేందుకే అని గుర్తించండి.

190999 పతంజలి యోగసూత్రములు

పూర్వేషామపి గురు: కాలేనాచక: అనవచ్హేదాత్, తస్య వాచక: ప్రణవ: ,

190999 సౌందర్య లహరి

అఖండ మండలాకారములో కంటిన్యుయాస్ కనెక్షన్ వుంటుంది. ఈ విధమైనటువంటి జ్ఞానము ఓంకారము ఆ స్థితిలోనే వుంటూ పనులన్నీ చేసుకునేటటువంటి టెక్నిక్ తెలుసుకోవాలి

260999 పతంజలి యోగసూత్రములు

వితర్క, విచార ఆనంద అస్మిత, అసంప్రజ్ఞాత:. అభావ, ప్రత్యయ ఆలంబనా వృత్తి నిద్రా.

అక్టోబరు

131099 గురు చేతనత్వము

ఓంకారములో ఉన్నది గురువే, అది అద్వైత స్ధితి. ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదు:, మీరంతా తమస్సులో ఉన్నారు. పరమే వ్యోమన్లో ఉన్న దేవతలతో సంబంధము పెట్టుకోవాలి. ఇదివరకు దేవతలతో కలిసి రాక్షసులతో యుధ్ధము చేసే వాళ్ళం, ఇప్పుడు వాళ్ళని అడుక్కుంటున్నాం. భ్రాంతి దర్శనము - వ్యాధి శ్త్యాన సంశయ ప్రమాద ఆలశ్య విరతి భ్రాంతి దర్శనాలబ్ధ్వాత్. భగవద్గీతలోని 16 లక్షణాలు మీరు నేర్చుకోవలసిందే.

141099 బర్త్ డే స్పీచ్

ఆ మౌన స్వరూపి అయిన గురువుకి నమస్కరిస్తూ ఆ శబ్ద స్వరూపాని గుర్తుచేసుకుందాం జగద్గురువుగా జగజ్జనన్నిగా. ఈ సంపూర్ణ సృష్టి ఉద్బవిస్తూవుంటుంది లయమవుతూ వుంటుంది.మ్ ఆ శాంత స్థితి . దీని నుంచి ప్రతి మానవుడు తనకు కావలిసినది తీసుకుంటూవుంటాడు. ఒక్క సంవత్సర కాలం లో భూమి మీద ఏ ప్రాణిగా పుట్టిన ఆ ప్రాణి యొక్క పరిణామక్రమము ఏంటి అనేది మానవుడు మాత్రమే తెలుసుకొనగలడు

151099 చండీ కవచము అమృతత్వ సాధన

ఓం కారము నుంచి ౩ భాగాలూ ఏర్పడతాయి హ్రీం శ్రీం క్లీం. క్లీం మహాకాళిగా శ్రీం మహలక్ష్మి గా హ్రీం మహా సరస్వతి గా భావిస్తాము. మహాసరస్వతి చరిత్ర దుర్గాసప్తశతి లో మన బ్రెయిన్ యొక్క వర్ణనే.

181099 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

మీరు మౌనములో లీనం అయితే మీ ద్వారా బయటికి వచ్చే వాక్కు గురువుదే, నీది కాదు. మౌనములో పరిస్ధులని సర్దుబాటు చేసి కష్ట నివారణ చేసే శక్తి ఉంది. మీ మనస్సు చేసే గొడవ వల్లే మీకు అన్ని సమస్యలు. సర్వజ్ఞత్వములోని బీజములోకి ప్రవేశించటానికి సమర్ధ సద్గురు సాధనని చెయ్యండి. ప్రపంచం అంతా నాది అని జీవించే జీవిత విధానము వలన ఎప్పుడూ దేనికీ లోటు ఉండదు. ఆంధ్ర ప్రదేశ్లో 300 మంది యోగుల జీవిత చరిత్రలు రాసినవి ఉన్నాయి, రాయనివి ఇంకెన్ని ఉన్నాయో !

201099 భగవద్గీత - స్వప్నములు

జాగృతావస్థలో మనము చేసే మంత్ర జపము ధ్యానములు మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది, అది స్వాప్నిక జగత్తులో పని చేస్తుంది. " యుక్తాహర విహారస్య యుక్త చేష్ఠశ్య కర్మసు, యుక్త స్వప్నావబోధశ్య , ముందుగా కనీసం 40 రోజులు సరైన ఆహారము తీసుకుంటే చాల మార్పు వస్తుంది. ఆహారమే ఒక మహా యజ్ఞముగా చేస్తేనే మీకు దానిలో ఉన్న రహస్యము అర్ధము అవుతుంది. యుక్త చేష్టశ్య - సరైన కర్మ చెయ్యటం అనేది సరైన ఆహారమునుండి వస్తుంది. మీరు చేసే పనిలో ఎదురుండదు.

201099 పదము పదార్ధముగా మారటము ఎలా ?

పదము పదార్ధముగా మారటము ఎలా ? జాగృతావస్థలో మనము ఏది కావాలన్నా ఏలా ఐతే వివరించి చెప్పి చెయ్యగలమో అలాగే స్వప్నావస్థలో కూడా చెయ్యగలగటమే యోగ విద్య.

221099 SSS-అగ్ని- విద్య పదము పదార్ధము

మానవ శరీరము అగ్నివలే పనిచెయ్యాలి. ఘన ద్రవ పదారధ్ములు తన గుండా ప్రవహింపచేస్తే అది వాయు స్ధితిలోకి వెళ్ళి ఆకాశ తత్వములోకి వెళ్తుంది, అందువలన అలాంటి చేతనత్వాన్ని డెవలెప్ చేస్కోండి. మానవ శరీరములో ఉన్న ప్రజ్ఞను అగ్నివలె అభివృధ్ధి చేస్కోవాలి. సూర్య చేతనత్వములో వేడి, వెలుతు ఉన్నాయి, చంద్రుడి యొక్క కిరణాలు చల్లగా ఉన్నాయి. వేడి, చల్ల స్ధితులు మీరు అనుభూతి చెందాలి.

241099 కాల చక్ర భ్రమణములో పదము పదార్ధముగా మారుట

కాల చక్ర భ్రమణములో పదము పదార్ధముగా మారుట - మంత్రజపములోని చక్రీయ భ్రమణాన్ని అర్ధము చేసుకుంటే ( జప మాల) ఆ మంత్రాధి దేవత మీకు సాక్షాత్కరిస్తుంది. మంత్రము యొక్క శబ్ధము పదార్ధముగా మారుతుంది. కాబట్టి మంత్రము ఆ దేవత యొక్క రూపమే. మీలో కూడా ప్రతి ఒక్కరికీ ఒక శబ్ధము ఉంది, ఉంటేనే మీకు రూపము ఏర్పడింది. అది లేకుండా మీకు రూపము ఏర్పడదు కదా! మంత దీక్షలో గురువులు ఆ శబ్ధాన్ని మీకు ఇస్తారు. సావర్ణిక మన్వంతరములో ఎడ్యుకేషన్ సిస్టం యొక్క ప్రధాని జ్వాలాకూల్ మహర్షి. ఈ శబ్ధ విజ్ఞానము నేను ఆయన రాసిన A Treatis On Cosmic Fire అనే పుస్తకాన్నుండి ఇస్తున్నాను.

251099 ధ్యాన విధానము

14 భువనాలలో ఉన్న గురువుని మీరు ఒక క్షేత్రములో ఉన్నాడు, ఒక శరీరంలో ఉన్నాడు అని అనుకుని ఆయన్ని బంధించే పిచ్చి పని చెయ్యకండి. గురువు సర్వాంతర్యామి, సర్వ వ్యాపి అయిన ఆయన్ని మీరు కుదించి ఉంచే ప్రయత్నం చెయ్యటం మీ మూర్ఖత్వం. పూర్వేషామపి గురుహు కాలేన అనవచ్చేదాత్. మౌనంలో ఉండి మీలో ఉన్న గురువుని పట్టుకోండి. 600 కోట్లకు మన భారతీయ సంస్కృతిలో శంఖము అని పేరు.

251099 గురువులు - ఋణానుబంధము

గురువుల వద్దకు వెళ్తే కొంతమందికి తమ రోగాలు తగ్గుతాయి, కొంతమందికి తగ్గవు. లెఖ్ఖలు సరిపెట్టటం నేర్చుకుంటె మీకు ఈ సమస్య ఉండదు. ఋణానుబంధము అంటే ఏ సంబంధములో ఉన్నా మీరు అప్పును మాత్రమే తీరుస్తున్నారు.

261099 సంకల్పము జ్ఞానము మహాకాల యంత్రము

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ జ్ఞానము ఉంటుంది. పిల్లలకి జన్మని ఇవ్వకముందు స్త్రీకి పిల్లల పెంపకముపై ఎటువంటి అవగాహనా ఉండదు, కానీ పుట్టంగానే అన్ని విషయాలు పెద్దవాళ్ళని అడిగి కానీ చదివి కానీ తెలుసుకుని మరీ తన పిల్లవాడి మీద ఉన్న ప్రేమతో వాళ్ళకి అత్యుత్తమైన సౌకర్యాలను ఇవ్వటం నేర్చుకుంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ జ్ఞానము దానంతట అదే వస్తుంది.

261099 గురువులు ఋణానుబంధము

సూర్యుడుకి చంద్రుడికి మద్య కోణాలే సృష్టికి కారణము. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఎవరైతే మౌనంగా కూర్చుంటారో వాళ్ళందరికీ గురువులతో ఋణానుబంధం పెరిగిపోతుంది, అప్పుడు రోగనివారన,ఋణానుబంధం,అన్ని దేవతల యొక్కవరదానం కూడా లభిస్తాయి.కాన్ని అక్కడ నుంచి వచ్చాక వాళ్ళు పనులు చేయడం మొదలుపెట్టాలి.

261099 మహా కాల చక్రవర్తీ సామ్రాజ్య స్థాపన

మీ శరీరాన్ని మీరు అర్ధము చేస్కొనగలిగితే , స్వ-అద్యయనము చేస్కొనగలిగితే కాల చక్రభ్రమణమును ఆపగలరు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి

261099 సంకల్పము జ్ఞానము మహాకాల యంత్రము

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ జ్ఞానము ఉంటుంది. పిల్లలకి జన్మని ఇవ్వకముందు స్త్రీకి పిల్లల పెంపకముపై ఎటువంటి అవగాహనా ఉండదు, కానీ పుట్టంగానే అన్ని విషయాలు పెద్దవాళ్ళని అడిగి కానీ చదివి కానీ తెలుసుకుని మరీ తన పిల్లవాడి మీద ఉన్న ప్రేమతో వాళ్ళకి అత్యుత్తమైన సౌకర్యాలను ఇవ్వటం నేర్చుకుంటుంది. ఎక్కడ ప్రేమ ఉంతూందో అక్కడ జ్ఞానము దానంతట అదే వస్తుంది.

261099 గురువుతో ఋణానుబంధము పెంచుకోవటం ఎలా ?

సంకల్పము, జ్ఞానము, క్రియ, సేవ మరియు అతి ముఖ్యమైన ప్రేమ అనేవాటితో మనము ఎక్కడ ఉన్నమో అక్కడ జీవించగలిగితే గురువుతో మనకు ఋణానిబంధము పెరుగుతుంది.

291099 పదము - పదార్ధము - శరీరము - వేదములు

ఒక వ్యక్తిని చూస్తే మనము వేదమును చూస్తున్నాము అని గుర్తుంచుకోవాలి, ఇది అక్షర సత్యము. మీ బ్రైన్ లో నాలుగు భాగాలు నాలుగు వేదాలుగా ఉన్నాయి. అన్ని నియమాలు ఉన్నాయి ప్రకృతిలో. వాటికి మీరు శబ్ధ రూపాన్ని ఇస్తున్నారు.

301099 దత్త స్వరూపము - ప్రాముఖ్యత

ఎదుటివాడిని చూసి మీలో అసహనం పెరిగితే మీకు కోపం వస్తే లోపం మీలో ఉంది, వాళ్ళల్లో కాదు. మీరు మౌనం లో ఉంటే మీకు ఈ సమస్య రాదు. ఈ జీవితం ఎందుకో తెలుసుకోవాలని లేదా ! తెలుసుకోవాలని లేకపోతే మీకూ జంతువులకీ మధ్య తేడా ఏమీ లేదు.

311099 గురు చేతనత్వము - వాహనములు 1

శిరిడీ సాయి యొక్క అవతార ప్రాకట్యము మొదట ఆయన బిజిలీ అనే గుర్రముతో మొదలుపెట్టారు,బిజిలీ - విద్యుత్ సౌదామినీ యాధా. నిరంతర గతిశీలత కలిగినది, శ్వ అంటే నిన్న రేపు అనే భావన లేకుండా జీవించగల్గుట, నిరంత గతిశీలత అనేది వర్తమానములోనే జరుగుతుంది. నిత్య నూతనమైన మనస్సు లభించాలంటే మీరు తాజా అహారాన్ని స్వీకరించటం అలవాటూ చేసుకోండి. ఆహారము నిత్య నూతనత్వము అనగా కూరలు కూడా తాజాగ తెచ్చుకుని వండుకుంటే బాగుంటుంది. అగ్ని సంపర్కములోకి రాని అపక్వ ఆహారము చాలా మంచిది. అగ్ని సంపర్కములోకి వచ్చిన ఆహారము 3 గంలలోపు తింటె మంచిది. మన సాహసము, తెలివి, మనస్సు మన కంట్రోల్ లో ఉండటమే ఇంద్రుడి వాహనము ఏనుగు. ఏనుగు తెలివి, ఇంటెలిజెన్స్, బలములకు ప్రతీక. ఏనుగు యొక్క ఘీంకారమునకు విఘ్నములు పోగొట్టే శక్తి ఉన్నది. అందువల్ల రాజులకి దగ్గరలో ఏనుగులు ఉంచుకునేవారు. ఏనుగు ఘీంకార శబ్ధమును విన్నా ( రికార్డెడ్) అవరోధాలు తొలగిపోతాయి, విఘ్నాలను పోగొడుతుంది. స్థల ప్రదక్షిణలో తూర్పున ఏనుగును పెట్టుకుంటాము, అది సమృధ్ధికి ప్రతీక. సత్య సాయి ఏనుగును ఉపయోగించుకున్నారు.

311099 గురు చేతనత్వము - వాహనములు 2

గోవు యొక్క చేతనత్వమును దత్తత్రేయుడు, కృష్ణుడు ఉపయోగించుకున్నారు. కృష్ణుడు గోవు వద్ద నిలబడే భంగిమ చాల ముఖ్యమైనది, మోచెయ్యి ఆవు మూపురమునకు ఆనించి త్రిభంగిమలో నిల్చుని ఉంటాడు. గోవు సేవ 52 వారములు అనగా సంవత్సరము పాటు చేస్తే ఇంద్ర స్థాయికి చేరవచ్చు, మన చేతనత్వమును ఆవు పవిత్రముగా మారుస్తుంది, మనము పూర్తి తన్మయత్వముతో సేవ చేస్తే లాభమును పూర్తిగా పొందవచ్చు.

నవంబర్

011199 పరివ్రాజకుల శిక్షణ - యజ్ఞ ప్రాముఖ్యత

మన అంత:కరణాలలో 4 రకాల కోరికలు ఏర్పడతాయి. మనస్సులో, బుధ్ధిలో,అహంకారములో & చిత్తములో. బుధ్ధిని ప్రచోదన చేసేందుకు గురువు ధుని ఉపయోగించుకుంటారు. గురుసత్తాను అర్ధంచేసుకోగలిగితే ప్రవ్రాజకుల సగం పని ఐనట్లే.

011199 పరివ్రాజకుల శిక్షణ -గురుసత్తా ప్రాముఖ్యత

పరివ్రాజకుల స్ధితి అంటే నిత్య నూతన శాశ్వత సనాతన ధర్మాలను ఆచరిస్తూ అందరికీ ఈ ధర్మాలను గురుంచి అందించే బాధ్యతను స్వయంగా స్వీకరించినవారు. ఋషుల అనుగ్రహము మనపై ప్రేమ అనిర్వచనీయమైనది, అందువల్ల యజ్ఞవిద్యను దాని రహస్యాలను మనకు అందించారు.

031199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

భౌతిక తలములో అత్యంత క్రిందికి దిగింది ఆత్మ. ఇంతకంటె క్రిందికి దిగే అవకాశము ఇంక లేదు, అందువలన ఇంకనుండి ఉన్నతి వేపు మాత్రమే ప్రయాణం చెయ్యగలం, అందుకనే మీకు అమృతత్వ విద్యను మర్చిపోయేలా చేసారు గురువులు, ఇంక ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవలసిన అవసరం వచ్చింది. భౌతిక తలమౌలో మాస్టరీ చెయ్యాలంటె మీకు అమృతత్వ స్ధితి ఏది కావాలంటె అది మనస్సు ద్వారా సాధించగలిగితే భౌతికమైన ఈ ఎదుగుదల సాధ్యము కాదు కదా. అందుకని మీరు మర్చిపోవలసి వచ్చింది, ఇప్పుడూ దాన్ని గుర్తు చేస్కునేందుకు ఏమి చెయ్యాలి, ఏమీ లేదు మౌనములోకి వెళ్ళటమే. అంత సింపుల్.

031199 ఋణానుబంధము గృహస్థాశ్రమము

గురువుల జీవితాలు చదివితే వారి సందేశము ఏమిటో మనకు అర్ధము అవుతుంది. మనుషులు ఎంత దిగజారారు అంటే గురువుల వద్దకు ఏ మంత్రులు ఏ సెలబ్రెటిశ్ వెళ్ళారూ అనేదాన్ని బట్టి ఆ గురువు స్థాయి నిర్ణయించే అతి నీచ మానసిక స్ధితికి దిగజారారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్ర్హ్మ తత్వం - మౌనంలోకి వెళ్తేనే నిజమైన గురువుని పట్టుకోగలము అనే సత్యాన్ని అర్ధము చేసుకోండి.

041199 మౌనము - స్పందన

మన శరీరములోని ప్రతి కణము మన ఆలోచనల యొక్క మూర్తీభవించిన రూపమే, వీటిని మర్చేది న్యాస విద్య. పదములు స్పందనల యొక్క కూర్పు, మన మనస్సు ఏదన్నా బాగా స్పందించినప్పుడు మనకు మాట రాదు, కానీ అలాంటి మౌనములో కూడా ఆ స్పందన ఉంటుంది. అన్ని స్పందనలకు మూలమైన మౌనము. అతిగా స్పందన కలిగినప్పుడు మౌనము సహజముగా వస్తుంది, ఎవ్వనిలో జనించు జగమెవ్వని లోపలనుండి....ఆ స్పందన, మౌనము రెండింటిని పట్టుకోవాలి. స్పందనలు, పదములు మధ్య తేడా పట్టుకోండి, గురు బ్రహ్మ అని మనం శ్లోకం చదువుతున్నప్పుడు మన స్పందన మన అదుపులో ఉంది, ఆ శ్లోకం వెనకాల ఉన్న భావనకి మనం స్పందిస్తే అప్పుడు మౌనంలోకి మనం వెళ్ళిపోతాం, ఇంక మాట్లాడలేని పరిస్ధితి.

051199 గురుచేతనత్వము

పదములు పదార్ధముగా మారటానికి కారణము గురుచేతనత్వమే, పదార్ధ విజ్ఞానము. ఆధునిక విజ్ఞానము మనిషి శరీరాన్ని మాత్రమే గుర్తిస్తోంది, దాని చేతనత్వాన్ని అర్ధము చేస్కోవట్లేదు. చేతనత్వముగురుంచి ఏ స్కూళ్ళలోనూ కాలేజీలోను నేర్పించటం లేదు. మనిషిని ప్రకృతిలో చేసే తప్పును ప్రశ్నించేందుకు మనకంటె గొపవాడు ఎవడూ లేడు, మనం వనరులను ఉపయోగించుకునేప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనిషి ఎన్ని సాధించినా ప్రకృతిని మాత్రము ఎదిరించలేడు అన్నది మీరు బాగా అర్ధము చేసుకుంటే ప్రకృతికి అనుగుణమైన జీవితాన్ని మీరు ఆటోమాటిక్ గా జీవిస్తారు. ఖనిజ, వృక్ష, జంతు సంపదలను ఉపయోగించుకోవటంలొ లీనమై మానవుడు కూడా ప్రకృతిలోని భాగమే అనేది మర్చిపోయాడు.

051199 సూర్యనమస్కారములు /h5>

నా వాక్కు నా ఆచరణ నా బుధ్ధి జీవత్మ యొక్కవే, అనగా గురువువే. సూర్య నమస్కారములను, గ్రహాలను కలిపి చేసిన న్యాస విధానము. దత్త ప్రద్క్షిణలు. వజ్రాసనములో కూర్చుని స్థూల కామ( కోరికలు) ఆలోచనలు ఎకీకృతము చేస్తే మీకు 10 లక్షల సంవతసరాలు పడుతుంది మీకు మీ జీవిత రహస్యాలను తెలుసుకునే జన్మకి. కానీ గురు అనుగ్రహముతో చేసే సాధనాలవల్ల అతి కొద్ది సంవత్సరాలలో మీరు మీ జీవిత లక్ష్యానికి చేరుకోవచ్చు.

061199 అగ్ని విద్య - ధుని - గురుచరిత్ర

మనుషుల ధర్మహీనమైన జీవితాలు ఆదర్శమయ్యాయో గురువుల చరిత్రలు మూలన పడ్డాయి. ఒక విశాల పరిణామ క్రమము ఉంది, దాని తరువాత అసలు జీవితము ఉన్నది. మన శరీరములోని అన్ని భగాలు నిరంతరం పని చేస్తున్నాయి, వాటిని మనం పని చెయ్యించట్లేదు, మన ప్రమేయమే లేదు, ఐనా మనుషులకు వాళ్ళ స్ధితి ఏంటో అర్ధము కావట్లేదు. గురువుల చరిత్రలు చదవండి, చదివించండి.

061199 అగ్ని విద్య - ధుని

గుంపులు గుంపులుగా మనుషులు ఒకే రకమైన ఋణానుబంధాలతో మీరు ఒక పరివారములో పుట్టారు. ఏ సంస్థ వారు వారికి సంబంధించిన గురువుల పనిని సరిగ్గా చెయ్యాలి. మనలోపల ఉన్న అగ్నిని వెలిగించేందుకు అగ్ని విద్య ఉపయోగపడుతుంది, ధుని మీకు దీనికి బాగా ఉపయోగపడుతుంది. మన చదువులు ఎందుకూ పనికిరాని చదువులు, తిండి పెట్టటానికి తప్ప ఇంక దేనికీ పనికిరావు. ఒక వస్తువుని అగ్నిలో పడితే అందులో పూర్తిగా కరిగిపోతుంది, మీరు కూడా అగ్ని వలె తయారవ్వలి.

071199 దీపావళి మెస్సేజ్

ఈ గురుచేతనత్వ పరంపర లో సులభమైన మార్గము అవగాహనా చేసుకోండి. నేను ఎక్కడ వున్నానో అక్కడ గురువు యొక్క అనుగ్రహము వలనే వున్నాను అనేటటువంటి భావాన్ని పటిష్టం చేసుకుని నిరంతర మౌనములో ఉండగలిగితే మీరు గురువులే, ఇదే సులభమైనటువంటి మార్గము. నిరంతరమూ మౌనము .శూన్యము , అమావాస్య చీకటి ఆ కంప్లీట్ డార్కనెస్ వచ్చినప్పుడు జ్యోతులు వెలుగుతాయి ఆ జ్యోతి ని వెలిగించటమే ఈ దీపావళి యొక్క ఉదేశ్యము

071199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము ***

7 సంవత్సరాలకి ఒకసారి మన శరీరములోని ప్రతి కణము మారిపోతుంది, ఎముకలు, చర్మము, అన్నీ మారిపోతాయి. కాలములోని భాగము మనం, కాల ప్రవాహంలో భాగము. ఆకాశమునుండి వర్షించిన నీరు రకరకాల నదులుగా మారుతోంది, ఎక్కడ నుండి వస్తోంది అది ఆకాశము నుండి. ఓంకారము అనే శబ్ధము, ఆకాశము ఒక్కటే. శబ్ధ ప్రధానమైన దానిని ఆకాశము అంటాము. మనకు రూపము ఉంది కాబట్టి మనం అగ్ని ప్రధానమైన వాళ్ళం, పేరు ఉంది కదా, శబ్ధము అంటె ఆకాశము. భగవంతుడు ఎక్కడో లేడు, మీలో వెతుక్కుంటేనే దొరుకుతాడు. ప్రతి పదార్ధమునకు ఒక స్పర్శ ఉంటుంది. నామము రూపము మధ్య ఉండేది స్పర్శ, వాయు తత్వానికి సంబంధించినది, అది రూపమునకు ముందే రావాలి. అందుకు సమర్ధ సద్గురు స్పర్శ రావాలి. మీకు కలలో వచ్చిన శబ్ధ స్పర్శను క్రిందకి దింపుకోవటానికి అగ్ని కావలసిందే.

081199 సర్వానందమయ చక్రము

అన్ని ఆనందాలకి కారణము శ్రీం ఆ బిందువు ఆ సర్వానందమయమే. ఆ బిందువు నాసికారంధ్రాలలోంచి కుండలిని శక్తి లోపలకి వెళ్ళింది, మనము ఏది చేయాలనుకున్న ఇది వుండాలి.నేను అనేటటువంటి బిందువు మనలో జాగృతమవ్వాలి .

081199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

సముద్ర మంధనము అంటె మనలో జరిగే శ్వాస. మీ శ్వాస ఎలా ఉంటే మీ రూపము అలా ఉంటుంది, మీ పరిస్ధితులు అలా ఊంటాయి. మీ వాక్కుని అదుపులో ఉంచుకోవటమే హాలా హలం శివుని గొంతులో ఉంచుకోవటం. మన శ్వాస వలన మనలో ముద్రలు ఏర్పడతాయి. గురు చరిత్ర పరాయణ ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళటానికి అతి సులువైన మార్గము. గురువు అచింత్యుడు, ఆయనని గురుంచి ఏమీ చెప్పలేము అందుకే ఏది చెప్పినా మనం మన చేతనత్వముతో చెప్తాము, నారదుడి వంటి స్థాయి వారు మాత్రమే ఆ భగవంతుడి చేతనత్వాన్ని గురుంచి మాట్లాడగలరు.

081199- SSS - మహా శూన్యం - దీపావళి

ఆలోచనా రహిత స్ధితి, ఇంద్రియాతీత స్ధితి, పరమే వ్యోమన్ స్ధితి, భావాతీత స్ధితిని గురుంచి ఏమి చెప్తాము, అది అనిర్వచనీయ స్ధితి. ఆ స్ధితిలో ఉండి తపస్సు చెయ్యాలి, అది టెక్నిక్. మన గుండె మనం బ్రతికి ఉన్నంత కాలం కొట్టూకుంటూనే ఉంటుంది, ఏ శక్తితో కొట్టుకుంటోంది ? ఆ శూన్య స్ధితిలోకి వెళ్తే మీకు ఇవన్నీ అర్ధము అవుతాయి. మీరు ధ్యానం చెయ్యాలి, నేను ధ్యానం చెయ్యాలి అనుకుంటే, నేను అనేది పోతే తప్పు ధ్యానంలోకి వెళ్ళలేవు. మీ గోళ్ళు పెరుగుతున్నాయి, జుట్తు పెరుగుతోంది, అవి ఒక పధతి ప్రకారం పెరుగుతున్నాయి, ఆ శక్తిని వదిలి మీ అంతట మీరే చేద్దాం అనుకునే పిచ్చి ఎందుకో అర్ధము కాదు.

091199 M.Sc Syllabus - ధుని ప్రాముఖ్యత

పురుష సూక్తము, శ్రీ సూక్తము, పంచ సూక్తము, పతంజలి యోగ సూత్రములు, హ్యూమన్ ఎనాటమీ, భూ సూక్తము, అన్న సూక్తము, పతంజలి యోగ సూత్రాలు....ఇలా మాస్టర్స్ ఇన్ సోలార్ కాన్షియస్ నెస్స్ డిగ్రీ పొందదలచినవారి సిలబస్ పూర్తి వివరణ.

111199 ఆహారము - విశ్వకర్మా సూక్తము

రోజూ మూడు పూటలా విశ్వకర్మా సూక్తము, ఆహారము తీస్కునేప్పుడు ప్రాణాగ్నిహోత్ర ఆహుతులు వేస్కొని తినాలి. దానివలన మన శరీరములు దేవతా శక్తులకు నిలయముగా మారుతాయి

121199 sss-ఆహారము చేతనత్వము

ఆహారము ద్వారా మన చేతనత్వాన్ని మార్చుకోవచ్చు. ఏ పని చేస్తున్నా గురు రూపాన్ని మన కళ్ళ ఎదురుగా ఉంచుకుంటే ఆ చేతనత్వ స్థాయికి మనం కూడా తేలికగా చేరుతాము. ఓంకారము యొక్క శబ్ధము మనల్ని ఆ స్ధితికి తీస్కొని వెళ్తుంది.

131199 గురుచేతనత్వముపై అవగాహన

ధ్యాన స్ధితిలోకి ప్రవేశించగలవు, కానీ ధ్యానము చెయ్యలేవు. యోగస్థ: కురు కర్మాణి, ఆ యోగ స్ధితిలో ఉంటూ ధ్యాన స్ధితిలో ఉంటూ పన్లు చెయ్యాలి. కారణ జగత్తు అనగా సంపూర్ణ సృష్టికి కారణము, దానిని ఓం అని పిలుస్తాము, సంపూర్ణ సృష్టికి కారణము. మీ చేతనత్వము వికసించటానికి సాధన చేస్కోవాలి తప్ప మీ కోరికలు తీర్చుకునేందుకు కాదు. మామూలు వ్యక్తులు అతి సహజముగా చేసే పన్లను ఆధ్యాత్మిక విద్యలో ఉన్నాము అనేవారు అతి కష్టపడి చేస్తున్నారు, అది తప్పు, యోగ: కర్మసు కౌశలం.

141199 అచ్యుతానంద గోవింద - Sloka explanation

గురువు ఆ దేశకాల పరిస్ధితులను బట్టి బ్రహ్మ వద్దనుండి వచ్చే సందేశాన్ని పట్టుకుని శిష్యులకు అందిస్తారు. జీవిత లక్ష్యాన్ని ఋషులు వేదములు దర్శించి పొందారు, మునులు పురాణాలను దర్శించి పొందారు. వేద వాంగ్మయము సప్తఋషుల ద్వారా దర్శింపబడింది, ఇది మునుల ద్వారా పురాణ సంహితగా అందింపబడింది. అందువల వేదము ఎలా ప్రమాణమో, పురాణము అంతే ప్రమాణము. మనం ఎన్నుకున్న జీవిత విధానానికి అగ్ని చాలా ముఖ్యమైనది, అగ్ని పురాణములో అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పబడింది. అగ్ని పురాణములో సర్వరక్షాకర స్తోత్రములో, ఉన్నది- అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజా, నశ్యంతీ సకలా రోగా: సత్యం సత్యం వధామ్యహం. అపామార్జన స్తోత్రములో దీని లాభాలను గురుంచి ఉంది. అచ్యుత స్ధితి - బాధ్యతలు తప్ప బంధములకు లొంగకుండా ఉండటం. Pole shifting plan at Saptarshi Ashram explained.

161199 ధ్యానము

ఈ గురుచేతనత్వము బ్రహ్మవిద్య భారతదేశము యొక్క ఆధ్యాత్మిక వారసత్వము అర్ధం చేసుకోవటానికి ఒకే ఒక్క పనిముట్టు వుంది . దానినే సమర్ధ సద్గురు స్పర్శ అంటాము. ఏదైనా ఒక్క విద్య మీరు ఉపయోగించుకోవాలి అంటే దానికి ఖచ్చితమైన పనిముట్లు కావాలి.

161199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము - మన లక్ష్యములు

మన ఇంద్రియాల సామర్ధ్యమునకు దివ్య అనే ఒక్క పదము జోడిచంటము కోసము పని చెయ్యాలి. మనము తీసుకున్న ఆహారానికి తగ్గ పని మనము చేసినట్లే ధ్యానము చేసినవాళ్ళ జీవితము దానికి తగిన విధముగా మన జీవితములో మార్పు తెచ్చుకుని తీరవలసిందే.

171199 బుధ గ్రహ యాత్ర

ప్రతి రోజు ఆహారం తీస్కునేప్పుడు తప్పనిసరిగా ఆ రోజు యంత్రాన్ని వేస్కోండి. దీనివల్ల మీకు ఆ గ్రహాలతో సంబంధము ఏర్పడుతుంది. భగవద్గీత 15వ అధ్యాయము వినటం, విశ్వకర్మా సూక్తము వినటం, అచ్యుతానంత గోవింద్ మంత్రము, ప్రాణాగ్నిహోత్ర ఆహుతులు తప్పనిసరిగా పాటించాలి. బుధవారంనాడు యంత్రము ద్వారా బుధ గ్రహానికి వెళ్ళవచ్చు, అంటే మీ చేతనత్వాన్ని బుధగ్రహ చేతనత్వముతో ట్యూన్ చేస్కోవచ్చు.

181199 తంత్ర విద్య

సర్వానందమయ చక్రములోని బిందువు అందరికీ అదే సెంటర్ పాయింట్ అదే, సర్వానందమయ చక్రము అనే పేరులోనే అన్ని ఆనందాలకి మూలము. నాలో ఉన్నట్టి నేను అనే బిందువు జాగృతము కాకపోతే ఏ ఆనందము పొందలేరు. ఆ బిందువు మీద ధ్యానముతో దానిని జాగృతము చేసుకోవాలి. శ్రీం అనే చైతన్య బిందువు, అది శ్రీ చక్రములోని కేంద్ర బిందువుగా చెప్పుకుంటాము. ఆ బిందువుకు ఇఛ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు ఉంటాయి కాబట్టి సృష్టి ఎక్స్ పాన్షన్ జరుగుతుంది.

181199 ధుని స్థాపన ఉద్దేశ్యం

అగ్ని విద్య గురుచేతనత్వము గురించి తెలియచేస్తుంది. వివేకానంద అరబిందో ఘోష్ జైలులో ఉన్నప్పుడు నువ్వు యోగ విద్య నేర్చుకో, స్వాతంత్రం గురుంచి మేము చూస్కొంటాము అని అంటే మీ వల్లే స్వాతంత్రం వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది అంటె దానికి జవాబుగా నీ పుట్టినరోజునాడు ఇప్పింస్తాంలే. అదే గుర్తు అన్నరట. కానీ భారతదేశ విభజన గురువుల సంకల్పం కాదు, అది వాళ్ళు కూడ ఊహించలేదు. వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగింది, కొన్ని కొన్ని వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతాయి. మనము గురువుల యొక్క నియమావళికి అనుగుణ్యంగా జీవించకపోతే. ఏ చేతనత్వము భారత దేశాన్ని బ్ర్టీష్ర్స్ చేతిలో పెట్టిందో అదే చేతనత్వము తిరిగి స్వాత్రంత్రము ఇప్పించింది. ఏ శక్తి సంపూర్ణ సృష్టిని నడిపిస్తోందో ఆ శక్తి గురుంచి మనము ధుని ద్వారా నేర్చుకుంటాము. శివ స్వరూపమైన అగ్ని విద్యను చాల స్పష్టంగా ప్రపంచానికి అందించింది శిరిడీ సాయి. ఆత్మ విద్య యొక్క తాళంచెవి దీని ద్వారా అందించాడు.

191199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము - వేంకటేశ్వర మహత్యము

వేంకట రాయలు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవలసినది సమర్పణ. ఆయన విషపు జంతువుల దగ్గరకి వెళ్తే అవే అడవిలోకి పారిపోయాయి, అలానే మీ వల్ల తోటి మనుషులలో ఉన్న క్రూరత్వము నశించాలి. తిరుపతి వేంకటేశ్వర స్వామికి ఈ నాటికి కోయ జాతులవారు ఇద్దరు ఒకరు కుడి కాలు చెప్పు, ఇంకొకరు ఎడమ కాలి చెప్పు తెచ్చి పెడతారు, అవి మళ్ళీ సంవత్సరానికి అరిగిపోయి ఉంటాయి. కపిల తీర్ధంలో మీరు దీన్ని దర్శించవచ్చు. సమర్పణా భావం ఉంటే ఈ నాటికీ అలాంటి అద్భుతాలు మీ జీవితాలలో జరుగుతాయి, దర్శించే కళ్ళు ఉంటే.

281199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

క్లేశ కర్మ విపాకశయైర పరామృష్ఠ: పురుష విశేష: ఈశ్వర: - ఇది ఈశ్వరునికి డెఫినిషన్

301199 వాక్శక్తి ఉపయోగము

వాక్శక్తి ఉపయోగము - పరనింద పనికిరాదు, సాధకుడు తనని తాను పొగుడుకోకూడదు. ఇది వాక్శక్తి సంపాదించేందుకు ప్రధమ మెట్టు.

301199 విశ్వ ప్రణాళిక

భగవద్గీత యొక్క మొత్తము సారము ముందు మీకు ఏది తెలుసో అది పరిపూర్ణముగా చెయ్యాలి. ఆధ్యత్మిక జగత్తులో చేస్తూ ఉంటే మార్గదర్శనము లభిస్తూ ఉంటుంది. నాకు పూర్తిగా జ్ఞానము వచ్చేవరకు పని మొదలుపెట్టము అనే మూర్ఖత్వాన్ని కార్యకర్తలు వదులుకోవాలి, గురువు చెప్పింది చేస్తే చాలు

డిసెంబర్

011299 సంధ్యావందనము

సంధ్యావందనము ద్వారా బ్రాహ్మీ, వైష్ణవీ శాంభవీ శక్తులను సాధకులు ఎలా ఉపయోగించుకోవాలి?

021299 Institution నుండి intuition కు

ఏ సాధన చెయ్యటానికైనా మీరు కళ్ళు మూసేస్తారు, నిజంగా ఈ జగత్తు కళ్ళు మూస్తే మీరు ఖచ్చితంగా ఇంకో జగత్తులో కళ్ళూ తెరవాలి. అది అర్ధము కానంతవరకు మీరు సాధన చేస్తూనే ఉంటారు, ఓపెన్ మైండెడ్ నెస్ - చెప్పే విషయాలను అర్ధము చేస్కొనే మానసిక స్ధితి తెచ్చుకుని వినాలి. కొన్ని శబ్ధముల యొక్క సమూహము మీ చెవులను తాకుతున్నప్పుడు మీకు కొన్ని విశెషమైన అనుభూతులు వస్తున్నాయి ఆ పదముల యొక్క అర్ధము మీకు ముందే తెలుసు. వాటి అర్ధము తెలియకపోతే మీకు అనుభూతులు రావు దేవతా శక్తుల గురుంచి మాట్లాడుకుంటున్నప్పుడు అవి ఏమిటో మీకు తెలియవు కాబట్టి అవి కంటిముందు ఉన్నా మీకు తెలియదు. ఆకాశతత్వ స్ధితికి మీరు చేరుకోగలిగితే అన్ని దేవతా శక్తుల మూలముకు చేరగలుగుతారు.

021299 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము - సూర్య సాధన

సాధన అనే ప్రక్రియ మీ ద్వారా జరుగుతోంది, మీ యొక్క ఆవిర్భావనికి కంప్యూటర్ యొక్క ఆవిర్భావానికి పెద్ద తేడా లేదు. కంప్యూటర్ లొ ఉన్న సాఫ్ట్వేర్ అంటే నింపబడిన విద్యలు , అలానే మనలో విద్యలు నింపేది గురువు, ఆ విద్యలు నింపినవాడు గొప్పవాడా మీరు గొప్పవారా? మీలో ఆ విద్యలు నింపబడ్డాయి, వాటిని నింపిన గురువుకి సర్వ సమర్పణ నేర్చుకోండి. మీరు తినే అన్నం అరిగించేది మీలొని సర్వ సర్ధత సర్వజ్ఞత్వం, సర్వాంతిర్యత్వము కలిగిన ఒక చేతనత్వము మీ ద్వారా అభివ్యక్తీకరింపబడుతోంది, ఆ చేతనత్వమే సూర్యుడు.

031299 Institution నుండి intuition కు

ప్రతి గురువు ఒక అలోచనా విధానమునకు మూర్తీభవించిన రూపము, ఏ గురువు దేనికి సంబంధించిన మూర్తి రూపము అనేది వాళ్ళ జీవిత చరిత్ర చదివితే మీకు అర్ధము అవుతుంది. స్కూళ్ళల్లో కాలేజీలలో మనము చదివే చదువు బయటినుండీ వస్తోంది, అధ్యాత్మిక సాధన వలన విద్య మీకు లోపలినుండీ వస్తుంది. విశ్వపరిణామ క్రమము చాలా స్పీడ్ తో ముందుకు వెడుతోంది, మీరు కూడా దానికి తగ్గ స్పీడ్ లో ముందుకు వెళ్తేనే మీరు ఈ పరిస్ధితులను తట్టుకోగలరు.

031299 ద్వాదశ రాశి - కాలము ప్రాముఖ్యత

అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు, అగ్ని విద్య, చంద్ర విద్య సూర్య విద్య మొత్తము ఈ యజ్ఞములో మనకు కవర్ అవుతాయి. ద్వాదశ రాశి అన్నా, ద్వాదశ ఆదిత్యులు అన్నా కూడా ఒక్కటే. మొత్తము మానవజాతి 12 రాశులుగా విభజింపబడుతుంది. మేషము నుంది మీనము వరకు 12. మనకు వచ్చిన గురువులు కానీ, గురు పరంపర కానీ వీళ్ళంతా ఏదో ఒక రాశి కి సంబంధిచినవారు అని తెలుస్తోంది. ఏ గురువు ఏ రాశికి సంబంధించినవాడు, ఆయన చేసిన పని ఏమిటి అనేది మీకు అర్ధం కావాలి. ప్రకృతిలో కనిపెట్టబడిన ఎలక్ట్రిసిటీ కేవాలం మానవులకే ఉపయోగపడుతుంది అని అనుకుంటే అది మన భ్రమ, మనషి తన స్వార్ధం లో ఎంత కూరుకుపోయాడు అంటే కరెంటు, పెట్రోల్ అన్ని వాడికే అనే కుంచిత స్వార్ధ భావనతో ఉన్నాడు. ద్వాదశ రాశీ అవగాహన లేకపోతే ఇలాంటి తప్పే చేస్తాం. ఏ పని చేసినా అది సంపూర్ణ మానవ జాతికి ఉపయోగ పడాలి అనేది అలవాటు చేసుకోవాలి, ప్రకృతికి సంబంధించిన శక్తులు మొత్తము ప్రకృతికి ఉపయోగపడాలి, బ్రహ్మ నుండి కీటకాలవరకు. ఆ రకమైన అలోచనను తెలియచేసే మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రము. ఇది కూడ మనిషి తన స్వార్ధానికి వాడుకుంటున్నాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లుభా: . భాగవత తత్వం ఈ మంత్రములో ఉంది. టైం సెన్స్ అంతా ఒకే లయబధ్ధతో ఉంటుంది, 12. సమయము, రాశులు, భాగవత స్కందములు 12. ద్వాదశ రాశికి ప్రతీకగా 12 మంది గురువుల గురుసత్తాను అందించాను ఒక్కో రాశి ఒక్కో తత్వానికి గుర్తు, దాని లింక్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ద్వాదశ రాశీ చక్రములో స్త్రీ తత్వానివి 6, పురుష తత్వానివి 6. ప్రకృతిలో 6 జంటల గమనం ఉ - షట్చక్రములు, గురుసత్తా, జ్యోతిశాస్త్రము. మేషరాశికి మొండితనము చాలా ఎక్కువ ఉంటుంది, దానిని బాలెన్స్ చెయ్యటానికి తులా రాశిలో మొండితనాన్ని తగ్గిస్తుంది. మేష రాశిలో సూర్యుడు ఉచ్చలో ఉంటాడు, తులా రాశిలో నీచలో ఉంటాడు. రాశీ చక్రానికి, గురుపరంపరకు ఉన్న లింక్ పట్టుకోండి. ప్రతి రోజూ మీరు మృత్యువు వేపుకు దొర్లుతున్నారు, జీవించిన కొద్దీ ఇంకా జీవించాలని ఉంటుంది. భాగవతము కూడా గురుచర్రిత్ర పారాయణే. పూతన వధ, శకటాసురుడు, తృనావర్తుడు కధల వెనకాల రహస్యాలను అర్ధము చేసుకోండి. కుబ్జ 3 వంపులతో ఉన్న శరీరము కలిగిన దాశి, సుగంధ ద్రవ్యాలను రాజకుమారికి అందిస్తుంది, మన శరీరములోని భగవత్ తత్వాన్ని గ్రహించకుండా శరీరాన్ని అలంకరించుకుంటున్నాము, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 మనవి కూడా 3 వంకర్లు తిరిగే ఉన్నాయి. ఏ నెలలో ఎలా జీవించాలో మనకు ఋషులు చెప్పారు, ఏ నెలెలో ఏ సాధనలు అనేది ద్వాదశ రాశులకు ఉన్న లింక్ అర్ధం చేసుకోవాలి.

061299 గురు గీత

ద్వాపరయుగములో అందరికీ ఇచ్చా మృత్యువు ఉండేది. మార్గశిరమాసము అన్ని మాసములకు శిరస్సు వంటిది, సాధకులకు కావ్లసిన మార్గదర్శనము లభిస్తుంది. గురువుకుకి కృతజ్ఞత ఎలా తెలపాలి అనేది గురుగీత తెలియచేస్తుంది.

061299 ఋణానుబంధము

ప్రపంచానికి ఆధునిక శాస్త్రవేత్తలు అందించినటువంటి అద్భుతమైన విజ్ఞానము వుంది. తల్లి తండ్రి గురువు మధ్య ఋణానుబంధం ఎలా పెంపొందించుకోవాలి,ఏ విధంగా గురువు తల్లి తండ్రి మరియు పిల్లల మధ్య సవ్యమైన ఋణానుబంధం పెంచుకుంటాడు?

061299 సమర్పణ

నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అనేటటువంటి వాగ్దానము మీ అంతరంగం లో వున్న వ్యక్తికి ఇవ్వాలి,గురువుతో ఋణానుబంధం పెంచుకున్న వ్యక్తులందరు గురువుల్ని మించిపోయారు. పరిపూర్ణ సమర్పనే గురువు యొక్క అనుగ్రహానికి సూత్రము.

071299 దత్త శ్లోక అగ్ని

నమస్తే యోగి రాజేంద్ర దత్తత్రేయ దయానిధే స్మృతి దేహిమాం రక్షా భక్తితే దేహిమే ధృడాం.

081299 కరిష్యే వచనం తవ

ఆధ్యాత్మిక జీవితము గురువుల జీవితము మనం ఎలా జీవించాలి అనేది ఈ మార్గశిర మాసం లొ నేర్చుకోవాలి. అలా చేస్తున్నప్పుడు కష్టాలే గురువుల అనుగ్రహము అని గుర్తించాలి.

081299 ధ్యానములో ఉండవలసిన భావన

బుధ్ధత్వం సాధించిన వారు తమ పనులను ఒక ముఖ్యమైన రోజు, ప్రతి సంవత్సరం అదే రోజున చేస్తారు. బుధ్ధుడు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమినాడు బుధ్ధుడిని సజీవంగా చూడవచ్చు, అలానే గురుదేవులు తమ ప్రతి ముఖ్యమైన పనిని వసంత పంచమి రోజు చేసేవారు. మీకు గురువులకు సమర్పణ చేతకావట్లేదు అన్న అవేదన ఉన్నా ఎప్పటికైనా మీకు అది చేతనవుతుంది.

091299 మాండ్యూకోపనిషత్ శాంతి మంత్రము

ఋషి చేతనత్వములోకి గురువుల చేతనత్వము లోకి తేలికగా ప్రవేశించే మార్గము ఉపనిషత్ . ఇది అధర్వణ వేదానికి సంబందించిన్నది.ఇది మండ్యూక అనే చేతనత్వానికి సంబంధించింది. 33 దేవతా శక్తులని మనము, మాకు ఏది జరిగినా అది మన మంచికే, ప్రతి పనికిరానిది పనికివచ్చేదానికి బలము అనేటటువంటి మానసిక స్థితిని ఇవ్వమని ప్రాదిస్తున్నాము.

101299 మాండ్యూకోపనిషత్- MASTERS & THEIR TIME PERIODS

కాలము అనేది ఎవరి పరిణామ క్రమాన్ని బట్టి వారికి ఉంటుంది అని తెలుసుకోండి. మన అఖండ గురుసత్తాలో ఉన్న గురు పరంపర అద్భుతమైన గురు పరంపర అని తెలుసుకోండి. మాస్టర్ సి వి వి అమరత్వముయొక్క సందేశాన్ని హెలీస్ తోక చుక్క నుంచి, ఇతర లోకాల నుంచి వచ్చిన సాధనా విశేషాలను మనకు అందించారు. లాహిరీ మాహాశయులుకు ఇది ద్వాపర యుగము, పండిత శ్రీ రామ శర్మ ఆచార్య - సత్య యుగము, ఇల్ల ఒక్కొక్క గురువు ఎక్కువ తక్కువ కాదు వారి సాధనను బట్టి వారు ఏ యుగములో జీవించారు అనేది మీరు అర్ధము చేసుకోవాలి. కాలాతీత స్ధితి నేర్చుకోండి.

111299 మాండ్యూకోపనిషత్ - 6TH SLOKA - 1

బహిర్ ప్రజ్ఞకు 7 అంగములు. సూర్యుని యొక్క 7 కిరణాల స్పష్టమైన వివేచన మీకు కావాలి, సంకల్పము, ప్రజ్ఞ, క్రియ, సంతులన, విజ్ఞానము, భక్తి, వ్యవస్థ అనే 7 మీకు కరతలామలకము అవ్వాలి. బహిర్ ప్రజ్ఞ అనగా కర్మేంద్రియము, అంత: ప్రజ్ఞా అనేది జ్ఞానేంద్రియము.

111299 మాండ్యూకోపనిషత్- 6TH SLOKA 2

అంత: ప్రజ్ఞ అనగా తేజసుడు, బహిర్ ప్రజ్ఞ అనగా వైశ్వానరుడు. హిరణ్య గర్భలోకములోకి మీరు నిద్రిచేప్పుడు అవలీలగా వెళ్ళిపోవచ్చు, అది అలా కూర్చుని కూడా వెళ్ళచ్చు. ఒక యోగి ఆత్మకధలో అది రాసి ఉంది. హిరణ్య గర్భ లోకములో ఏ ఆలోచనలు కావాలంటే ఆ ఆలోచనలను భూమిమీదకు దింపుకోవచ్చు. మీ అలోచనలకి ఆ తీవ్రత ఉండాలి.

111299 విశ్వప్రణాళికలో భాగస్వామ్యం

రోజూ నాలుగు గంటలు విశ్వప్రణాళికలో భాగస్వామ్యం పొందేందుకు మీకు నచ్చిన పనిని ఎన్నుకుని ఆ పనిని శ్రధ్ధగా చెయ్యండి. మీరు అఖండ గురుసత్తాలోని గురువుల అంత ఎదగలేకపోవచ్చు, కానీ కనీసం చిరుదివ్వెలలాగా అన్న మారండి. సాధన తప్పక చెయ్యాలి.

111299 మాండ్యూకోపనిషత్

శబ్దాని ఉపయోగించుకునేవాడే “అయం ఆత్మ బ్రహ్మ:”, ఎవడైతే ఈ అనుభూతులని తెలుసుకున్తున్నాడో వాడే బ్రహ్మ అంటున్నాము ఇది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం లో వివిధ డైమన్షన్స్ వున్నాయి అవి ఓంకారం యొక్క భిన్న రూపాలే “ఓంకారం సోయం ఆత్మ చతుశ్పాడ్” 4 భాగాలుగా వుంటుంది. మీరు కూడా త్రిలోకసంచారులు కావటానికి మాండ్యూకోపనిషత్ అర్ధము చేసుకోవాలి.

121299 మాండ్యూకోపనిషత్ - 7th Sloka

నాన్తఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞమ్ । అదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణం అచిన్త్యమవ్యపదేశ్యమేకాత్మప్రత్యయసారం ప్రపఞ్చోపశమం శాన్తం శివమద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా స విజ్ఞేయః ॥ ౭॥

121299 మాండ్యూకోపనిషత్ - 8th, 9th Sloka

"సోఽయమాత్మాధ్యక్షరమోఙ్కారోఽధిమాత్రం పాదా మాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి ॥ ౮॥ జాగరితస్థానో వైశ్వానరోఽకారః ప్రథమా మాత్రాఽఽప్తేరాదిమత్త్వాద్ వాఽఽప్నోతి హ వై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద ॥ ౯॥"

131299 మాండ్యూకోపనిషత్

మనము రంగు, రూపము మార్చటానికి ఈ జగత్తులో చాలా కష్ఠము, కానీ తేజసుడి ప్రజ్ఞతో ఏ పరిస్ధితిని ఐనా క్షణ క్షణానికి మార్చుకోవచ్చు.

131299 మాండ్యూకోపనిషత్

దైవీయ ప్రణాళిక వల్ల నాకు రావలసిన కష్టాలు నాకు రాకు కాక, బౌతికమైన కష్టాలు, ప్రాకృతిక కష్టాలు అన్నీ ఈ శాంతి పాఠము ద్వారా తొలగిపోతాయి.

141299 ఈశవాస్యొపనిషత్ - 18th Sloka

నా యొక్క అధ్యక్షతన ఈ ప్రకృతి నడుస్తోంది అని నమ్మేవాడు సన్యాసి. శిరిడీ సాయి భిక్ష తీస్కోవటానికి కారణం మనపై గల ప్రేమ. 18 వ శ్లోకము - అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విష్వాని దేవ వయునాని విద్వాన్ |యుయోధ్యస్మజ్జుహురాణమేనొ భూయిష్ఠం తే నమ ఉక్తిం విధేమ || 18 || అప్పుడు వాడు అగ్ని యొక్క అద్భుతమైన ఉపయోగాలు నేర్చూంటాడు, సన్యాసి ఆశ్రమములో ఉన్నవాడికి మాత్రమే కోరికలు తీర్చే శక్తిని ప్రసాదిస్తుంది. సమిష్టీ స్ధితిలో ఉన్న ఈశ్వరుడిని ప్రార్ధిస్తున్నాము, ఆ శూన్యములో ఉంటే ఆ ఈశ్వరుడు మీ అధీనములో ఉంటాడు.

221299 భవిష్య ప్రణాళిక 20000 నుండి

అంతరిక్షంలో 40 నియమాలు ఉన్నాయి, అవే వేదాల 40 అంగాలు. ప్రపంచము ఋగ్వేద నియమాల మీద ఆధారపడి నడుస్తోంది, మన శరీరము కూడా అవే నియమాల మీద ఆధారపడి నడుస్తోంది. మన శరీరములో ఏమి జరుగుతోందో తెలిస్తే ప్రపంచములో ఏమి నడుస్తోందో తెలుస్తుంది. 2000 సంవత్సరం శ్రీ కృష్ణ నిర్యాణ జరిగి ఇప్పటికి 5000 సంవత్సరాలు జరిగాయి. అందువల్ల అప్పటినుండి జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక గొప్ప మలుపుకు వచ్చాయి. మన శరీరములోని అణువులు, పరమాణువులు మధ్య ఒక ఖాలీ జగా ఉంది, ఆ జాగా ని పట్టుకోవటమే సాధన. సమస్త సృష్టి ఒక లయ బధ్ధముగా తిరుగుతోంది, దీనిని మీరు పట్టుకోవాలి సాధనలో. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఎలా ఒక లయబధ్ధముగా తిరుగుతాయో అలానే అన్ని ఒక లయ ప్రకారం తిరుగుతాయి.

251299 - గురువుల చరిత్రను చదవటం ఎలా ? - Audio poor quality

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బాధ్యత ఉంటుంది. తల్లికి పిల్లవాడిని కనక ముందు అతనిని ఎలా పెంచాలో తెలుస్తుందా ? తెలీదు, కానీ ప్రేమవలన అంత: ప్రేరణగా ఆ శక్తి వలన ప్రజ్ఞ వస్తుంది, ఎలా పెంచాలి అనే జ్ఞానము వస్తుంది. గురువులు మిమల్ని మీకు ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. శిరిడీ సాయి చరిత్ర చదివితే మీకు అర్ధము అవుతుంది, ఆయనని చంపటానికి వచ్చిన వ్యక్తిని కూడా ఆయన తన శిష్యుడిగా ఉంచుకున్నాడు.

281299 దేవతల ఆయుధాల - ఉపయోగము

దత్తాత్రేయుని ఆయుధాలు ఉపయోగించుకున్నప్పుడే సాధనమలో ముందుకు వెళ్ళగలము. దేవాలయములో దేవతలు పలకాలంటే మన శరీరము అనే దేవాలయము గురుంచి, దేవాలయమూలోని ఆయుధాలు ఎలా ఉపయోగించుకోవాలో ఆశ్రమాలలో తెలుసుకోవాలి.

281299 దేవాలయములు - అష్ఠవసువులు - శరీరము

దేవతా శక్తి ఒక్కటే, కానీ అది ఒకొక్క పరికరములో ఒకే కరెంటు ప్రవహిస్తున్నా ఒక్కో వస్తువులో విద్యుత్తు ఒక్కొక్కలా పని చేస్తుంది, భగవంతుడిలో మనలోను పని చేసే చేతనత్వము ఒక్కటే అని తెలుసుకుంటే మీరు తక్షణమే దేవతలుగా మారగలరు.

281299 దేవతల ఆయుధాల ఉపయోగము

ద్వాదశ రాసులలో 9 గ్రహాల యొక్క గమనము, 27 నక్షత్రాలు ఒక్కొక్కరాశిలో ఎలా ఉంటాయో, పంచాగము ఎలా ఉంటుందొ మీరు అర్ధము చేసుకుంటే 108 పూసల మాలను జపములో మీరు ఉపయోగించుకోగలుగుతారు.

281299 దేవాలయాలను ఎలా ఉపయోగించుకొవాలి?

అగ్ని అంటే సమ దృష్ఠి, నిజముగా పక్కడావాడు సుఖముగా ఉంటే ఆనందించే స్ధితి. పక్కవాడు ఆనందముగా ఉంటె మనము ఆనందముగా ఉండే స్ధితిని ఎప్పుడూ అలవరచుకోవాలి. కలశములో మనము జలము పెడతాము, జలము యొక్క తత్వము ఏది వేసినా అంకురింపచేస్తుంది. బీజాలు జలమువలననే అంకురిస్తాయి. మీలోని సుసంస్కారములు ప్రోదిచేసుకునేందుకు జల తత్వాన్ని ఉపయోగించుకోండి.