జనవరి
ప్రపంచము అంతా గురువు యొక్క అనుగ్రహం తో నిండాలి అనే భావనతో అనుగ్రహమాలా మంత్రం చెయ్యాలి. జన్మ భూమి కార్యక్రమం అనుగ్రహ మాలా మంత్రం వలనే పెట్టబడింది.మంత్ర తరంగాలు వింటున్నప్పుడు చెవుల ద్వారా లోపలికి ప్రవేశించి హృదాయంలోకి ప్రవేశించాలి. హిమాలాయలలోని గురువుల అనుగ్రహమౌ వలన మనకు అనుగ్రహ మాలామంత్రం లభించింది. ప్రకృతిలోని 24 భౌతిక శక్తులు, మనస్సులోని 16 మానసిక శక్తులు అనుగ్రహ మాలా మంత్రంలోని అక్షరాలు. ఓం మణి పద్మ హుం అనే మంత్రానికి ఉన్న భావనని అర్ధం చేసుకుంటే బుధ్ధుడు ఆ స్ధితికి ఎలా వెళ్ళాడు, ఆ స్ధితి ఎంటి అనేది అర్ధం అవుతుంది. ఈ మంత్రములో మణి పూరక చక్రములో భావనని మననం చేస్కోవాలి. దానికి మనం చేసే మంత్రం ఓం ద్రాం
గురు అష్టకము మాస్టారు చేయించిన సాధన. గురువు పాదాల మీద ఉండే భక్తి నిజమైన భక్తి తప్ప మిగతాది అంతా నాటకము.
నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయా నిధే స్మృతి దేహి మాం రక్షా భక్తితే దేహిమే ధృడాం అనే ఈ మంత్రము మిమ్మల్ని ఈ గురువు వద్దకు చేరుస్తుంది. దత్త ప్రదక్షిణలు 3 నెలలౌ చేస్తే మీ గురువు మీకు దర్శనం తప్పక ఇస్తాడు.
గురుసాన్నిధ్యమును వదిలి ఉండలేని పరిస్థితి వచ్చేవరకూ సాధన చెయ్యాలి. సాధకుడుకి ఎంత ఆవేదన ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆవేదన గురువుకి ఉంటుంది. సాధన చేసేటప్పుడు నాలోకి గురువు యొక్క సర్వజ్ఞత్వము ప్రవేశిస్తోంది అనే భావనతొ చెయ్యాలి.
060197 దత్త
మీ భాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే మీరు మాయలొ పడరు. భాధ్యతలను విస్మరించి సాధనలొ మునిగారొ మాయలొ పడిపోతారు.
070197 దత్తావతార సాధన
మహానుభావుల దర్శనము మీ సాధనలకు ఎప్పుడూ ఉపయోగం ఉంటుంది. దత్త గురు పరంపర మూడూ భాగాలుగా విభజించబడి ఉంది. దత్తాత్రేయ శ్లోకాల వివరణ అద్భుతమైన రీతిలో ఇవ్వబడింది.
గురువుకి మానసిక పూజా విధానములో మానస సరోవరము నుండి తెచ్చిన జలముతో ఆ గురువు పాదాలు కడిగినట్లుగా ఊహించుకోవాలి, ఆ పాదాలు కడిగిన నీరు మన బ్రహ్మ రంధ్రములోకి ప్రవేశించి మనలను తక్షణం పవిత్రులుగా చేసింది, మంగళకరముగా చేసింది అనే భావన. గురు చేతనత్వానికి అనాదిగా ప్రతీక ఆ దత్త ప్రభువుని మీలోకి ప్రవేశించనివ్వండి.
100197 ద్రాం మంత్ర సాధన - దత్త సాధన
వేద విజ్ఞానము తెలియనివారు అందరూ సోమకాసురులే. ఉ మ అనగా ప్రకృతి యొక్క సంపద. స, ఉ, మ కలిపితే సోమ అవుతుంది. స అనగా కలిపితే. ప్రకృతి సంపదే నాకు కావాలి మిగతాది ఏమీ నాకు వద్దు అనుకునేవాడూ సోమకాసురుడు. వేద విజ్ఞాన్ని నేర్చుకోవాలి.
170197 గురు అష్టకము - సూర్య కిరణ శోషణ విద్య
1.ఈశాన్యము - ఓం బుధాయ నమ: గణాధిపతయే నమహ:,2. తూర్పు ఓం శుక్రయనమహ: -ఓం దేవధిపతయే నమహ:,3. ఆగ్నేయము - ఓం చంద్రాయ నమహ: - ఓం తేజోధిపతయే నమహ:, 4. దక్షిణము ఓం కుజాయ నమహ - ఓం ప్రేతాధిపతయే నమహ:, 5.నైఋతి - ఓం రాహవే నమహ: - ఓం రక్షోధిపతయే నమహ:, 6. పశ్చిమము - ఓం శన్సైశ్చరాయ నమహ: - ఓం జలాధిపతయే నమహ:, 7. వాయువ్యము - ఓం కేతవే నమహ: - ఓం ప్రాణాధిపతయే నమహ:, 8. ఉత్తరము ఓం గురవేనమహ ఓం ధనాధిపతయే నమహ, పృధ్వి - " పృధ్విత్వయా ధృతాలోకా....పవితం కురుచాశనమ". "
170197 గురు తత్వము
సర్వ వ్యాపి, సర్వ సమర్ధుడు, సర్వాంతర్యామి గురువుకు సమర్పణ చేసుకోవటం నేర్చుకునేవరకు మీరు మీ సాధనలో ఉన్నతిని సాధించలేరు.
ఫిబ్రవరి
180297 దత్త ప్రదక్షిణలు
మాయా యుక్తావధూత, మాయా ముక్తావధూత స్ధితులు కృష్ణిడి అనుగ్రహముతో, దత్తుడి అనుగ్రహముతో సాధించవచ్చు.
180297 సాధనా రహస్యాలు
వైరాగ్యము అనేది ఒక మానసిక స్ధితి. మన కొన్ని అలోచనలు ఉడికించాలి - పావక అగ్ని. కొన్ని ఆలోచనలు నాటుకోవాలి - పవమాన అనే సూర్యకిరణముద్వారా నాటుకోవటమునేర్చుకోవాలి.
మార్చి
"ములాధార చక్రము క్రింద భాగములొ - రాహువు
ములాధార చక్రము - శని
స్వాధిష్ఠాన చక్రము- చంద్రుడు
మణిపూరక చక్రము - బుధుడు
అనాహత చక్రము- సూర్యుడు
విశుధ్ధి చక్రము - శుక్ర గ్రహము
ఆజ్ఞా చక్రము - బృహస్పతి - గురు గ్రహము
సహస్రార చక్రము - కుజ
సహస్రార చక్రము పై భాగములొ - కేతువు"
060397 శివరాత్రి ప్రారంభ ప్రవచనము
జ్ఞానేంద్రియములు తీస్కునేవి, కర్మేంద్రియాలు ఇచ్చేవి . శివ రాత్రి రాత్రి చేసే సాధన, రాత్రి అంతా జాగృత స్ధితిలో ఉండి శ్వాసపై ధ్యాసతో ఆ గురువుకు సమర్పణ చేసుకోవాలి
060397 భగవంతుని అనుగ్రహము పొందటము ఎలా
ప్రహ్లాదుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే నారాయణ అనే నామం ఇచ్చాడు, ఆ నారాయణ అనే పేరు పుట్టాక కూడా వదల్లేదు, ఆ సంకల్పము మీలో ఉండాలి, గురువు మిమ్మల్ని కొంతవరకే ముందుకు తీస్కెళ్ళగలడు, సాధన మీరు చెయ్యవలసిందే. దీపము వెలిగిస్తే చీకటిపోయినట్లే భగవంతుని నామముయొక్క జ్యోతి మీ హృదయములో వెలిగితే ఇంక కష్టాలు ఉండవు
అంతర్ముఖ యాత్ర
యుక్తాహార విహారస్య యుక్త చేష్టశ్య కర్మసు, యుక్త స్వపనావబోధస్య యోగో భవతి దుఖ: - పూర్తి వివరణ
గురువు చేసే పనులను ప్రశ్నించటము అనే దుర అలవాటు మానుకోవాలి. గురువులని ఏమి అడగాలి, ఏమి కోరుకోవాలి అనేది ప్రతి సాధకుడు తప్పనిసరిగా నేర్చుకొనవలెను
090397 సాయి తత్వం
పిల్లల్ని వాళ్ళు చదువుకోదలచిన చదువుల్ని చదవనివ్వాలి, పెద్దల కోరికలని తీర్చుకునేందుకు పిల్లల నెత్తిన మన అభిప్రాయాలని రుద్దకూడదు.
కాల సర్ప దోషాన్ని అధిగమించటము అనగా మనము చేసే ఏ పనిని వాయిదా వెయ్యకుండా తక్షణము చెయ్యటము. సూర్యుడి నుంచి వచ్చే కిరణములు వాటి పేర్లు, మన శరీరములోని చక్రములు మధ్య గల సంబంధము అధ్భుతంగా వివరించారు. Manipuraka chakra - 10 petals, 5 gyanendriyas, 5 karmendriyas- viswakarma rays.
పిండాండ బ్రహ్మాండ సమన్వయ సాధనా శిబిరములో గురుసత్తా అన్నా దత్తత్రేయుడు అన్నా ఒక్కటే. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము ఆ దత్తత్రేయుడు, ఆయనే గురువు. గురువు ఒక భౌతిక రూపం కాదు, గురువు అఖండంగా వ్యాపించి ఉన్న ఒక తత్వము. ఆ తత్వములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు 3 కలిసి ఉంటాయి. అందుకే ఆయన స్మర్తుగామి, తలచిన వెంటనే పలుకుతాడు, మన హృదయములో. ఆ దత్తుడికి మనల్ని మనం దత్తత చేస్కోవాలి.
గాయత్రీ మంత్రజపము వలన సత్యమును పొందవచ్చు. గాయత్రీ జపమువలన సర్వ సమర్ధత, సర్వ వ్యాపకత, సర్వాంతర్యామిత్వము లభిస్తుంది.
అనాహత చక్రములొని గురువుని పట్టుకోవటానికి ప్రయత్నించాలి. హృదయములోని ఆ స్పర్శని పట్టుకోవాలి.
మౌన సాధన ద్వారా మనము సర్వ సమర్ధుడు, సర్వాంతర్యామి, సర్వ వ్యాపి గురువును పట్టుకోగలము, అద్భుతమైన శక్తిని పొందగలుగుతాము.
ఏప్రిల్
12 ఇటుకలు ద్వారా షిరిడీ సాయి ఏమి సాధన చేసారో ఆ సాధనని ఈ ద్వాదశి యజ్ఞము ద్వారా సాధించవచ్చు. గురువుని భగవంతిడిని ఒక నౌకరులాగ చూడకండి.
మే
సి.వి.వి. ధ్యాన వివరణ, మరియు దాని ప్రాముఖ్యత వివరించారు. దీని ద్వారా సకల రోగములు నివారింపబడతాయి. సూర్య కిరణములు 7 మహా వ్యాధులు నివారింపబడతానికి సూర్యకిరణ విజ్ఞానము ఉపయోగింంచుకోవాచ్చు.
నమస్తే యోగి రాజేంద్రా దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్షా భక్తితే దేహిమే ధృఢాం
110597 దత్త ప్రదక్షిణలు శంకర జయంతి
గురువుకి సంపూర్ణ సమర్పణ ఎలా చేసుకోవచ్చు? మనస్సు, వాక్కు, కర్మలు గురువుకి సమర్పించే విధానాన్ని వివరించారు. ఆది శంకరాచార్యులవారు వ్రాసిన గురు అష్ఠకమునకు వివరణ. యజ్ఞోపవీతములోని 5 పోగులు - బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, యజ్ఞపురుషుడు మరియు సూర్యుడు.
120597 గురు పాదుకాస్థవము
గురుపాదుకాస్ఠవము యొక్క అధ్భుత వివరణ. మన శరీరంలోని రాశులకు, గ్రహాలకు, శ్లోకమునకు గల సంబంధమును విశదీకరించారు. భౌతిక అధ్యాత్మిక ఫలితాలను శంకర విరచిత శ్లోకాలవలన పొందవచ్చు అన్న ప్రతిపాదన చేసారు.
120597 సూర్య నమస్కారాలు
ఉదావశు, విశ్వవ్యచ, విశ్వకర్మ సూర్య కిరణాలు సూర్యనమస్కారములద్వారా ఒక్కొక్క చక్రములోనికి ప్రవేసిస్తున్నాయి. సుర్యనమస్కారములు చెయ్యదల్చుకున్న సాధకులు తప్పనిసరిగా ఈ ప్రవచనాన్ని వినవలెను.
వేదాలు
భారతీయ సాంప్రదాయములో గురువు అంటే మృత్యువుని శాసించగలిగినవాడు అని, ఈ బీజాలు మీలో కూడా ఉన్నాయి, ఆ స్థాయికి మీరు ఎదగాలి. బ్రహ్మమురారీ స్త్రిపురాంతకారీ - సృష్ఠి, స్ధితి లయము చేసే శక్తి మనకి కూడా ఉంది.
నిరంతర మౌన స్ధితిలో ఉండటమును సూచనలతో సాధన చేయించారు. ఆ మానసిక స్ధితిలోకి ఎలా ప్రవేశించాలి, ప్రతి ఆలోచనకి ద్రష్టగా మనము ఎలా ఉండాలో చెప్తూ చేయించిన సాధన. సమాధి స్ధితి - దత్తాత్రేయ వజ్ర కవచం
ఘనీభవించిన సూర్యకిరణాలు ఏ పదార్ధంగా మారుతుందో ఈ సాధన ద్వారా మీరు తెలుసుకోవచ్చు. హిమాలయాలలోని రంపా స్ధితికి చేరిన గురువులు ఇచ్చిన సాధన. రంపా స్ధితి అంటే వారి శరీర వేడితో అంత చలిలో 10 రగ్గులు నీళ్ళల్లో ముంచి వాటిని వారి శరీరముపై కప్పితే వారి శరీర వేడితో వాటిని 10 నిమిషాలలో ఎండపెట్టి ఇవ్వగలిగిన తపశక్తి కలిగిన వారు.
ఉపాసన - ఒక కుంపటి దగ్గర కొంచెంసేపు కూర్చున్నాక మీరు వేరే ప్రదేశానికి వెళ్ళి కూర్చుంటే మీ వళ్ళు వేడి ఎక్కినట్టు తెలుస్తుంది కదా! కాసేపు కుంపటీ దగ్గర కూర్చుంటే దాని లక్షణాలు మీకు వచ్చినట్టే మీరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో ఆ దేవత లక్షణాలు మీకు అబ్బటం ఉపాసన.
సాధకులు సాధనా సమయములో వచ్చిన అన్ని ఆకర్షణలను అధిగమించి లక్ష్యం మీదే దృష్ఠి పెట్టాలి.మన మనస్సులు, ఆచరణ, శ్రధ్ఢా నిర్మలంగా ఉంటే విష్ణు సహస్రనామముకానీ లలితా సహస్రనామ పారాయణ చేస్తే వాటి ఫలసృతిలో చెప్పబడిన ఫలితాలను చక్కగా పొందవచ్చు.
సూర్య నమస్కారములలోని ఒక్కొక్క నమస్కారము ఒక్కొక్క రాశికి సంబంధిచినది. ఈ నమస్కారములను సరిగ్గా ఉపయోగించుకొనగలిగితే అష్ఠసిధ్ధులు మీ సొంతము అవుతాయి.
140597 అఖండ గురుసత్తా కాన్సెప్ట్
గురుప్రణాళికలో అందరు గురువులూ కలిసి పని చేస్తున్నారు. కానీ వారి శిష్యుల అజ్ఞానం వలన ఆ గురుప్రణాళికకి ఎంత భగం కలుగుతోందో తెలుసుకుంటె మానవజతి ఎదుర్కోబోఏ కర్మకి గురువులు కూడా బాధ్యతవహింఛలేరు. దయచేసి అందరూ ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్ధము చేసుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి.
భగవంతుడికంటే గురువుకి ఎక్కువ విలువనిచ్చే దత్త సాంప్రదాయాన్ని మనము తిరిగి పునరుధ్ధరించాలి. గురువు అనుగ్రహము ఉంటే అన్ని దేవీ దేవతల అనుగ్రహము ఉన్నట్టే. కార్య కర్తలకు ఆశ్రమ నిర్మాణము గురుంచి ఇచ్చిన ప్రత్యేక సూచనలు.
140597 కార్యకర్తలకు స్పష్టమైన సూచనలు
నా జీవితానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నేను వాటికోసము నా సమయాన్ని ఉపయోగించుకుంటాను. మీరు కూడా నా లాగా ఆ లక్ష్యాల కోసం అంకితమయ్యి జీవించగలిగితే నాతో కలిసి నడవండి. నేను ఏ ట్రస్ట్ లోనూ, ఏ ఆశ్రమములోనూ సభ్యుడిని కాను, మీ కార్యక్రమాలకి కావలసిన మార్గదర్శనము చెయ్యటానికి మాత్రమే ఉన్నాను, కానీ ఇవి ఏవీ న సొంతము కాదు, వీటిల్లో నా వేళ్ళు పెట్టను. అన్ని ఆశ్రమాల కార్యకర్తలకు, అన్ని మాగజైన్స్ కార్యకర్తలకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి.
110597 గోవర్ధన ఉథ్థాన సాధనా శిబిరము - కాకివాయి
శిక్ష అనేది వేదాలకు ముక్కు వంటిది. మన ముక్కు మూలాధారమునకు సంబంధించినది. మూలాధార సాధన వేదాలాలో చెప్పిన 6 అంగాలలో శిక్ష అనేదానికి ఉపయోగపడుతుంది. వ్యాకరణము వేదాలకు ముఖము వంటిది. మనలో నాలిక ద్వారా ఉపయోగించే వాక్కు స్వాధిష్ఠాన చక్రముగా ఉపయోగించుకుంటాము. చందస్సు అనేది వేదాల యొక్క కాళ్ళు, మనము మన కాళ్ళతో లక్ష సాధనను సాధించటానికి గురువు కాళ్ళతో కలుపుతాము. గాయత్రీ చందస్సు మనకు అర్ధం అవుతే వశిష్ఠ విశ్వామిత్ర స్థాయికి చేరి వారి అడూగులలో అడూగులు కలిపి నడవవచ్చు. కాళ్ళకి సంబంధించిన చక్రము - మణిపూరకము, తేజస్సు, అగ్ని, అగ్ని జ్ఞానేంద్రియము కళ్ళు. నిరుక్తము - వేదపురుషుని చెవి. మన శరీరములో విశుధ్ధి చక్రము. జ్యోతిష్యము - వేదపురుషుని కన్ను - మణిపూరక చక్రము. కల్ప - వేదపురుషుని చెయ్యి, ఇది వాయు తత్వము మనలొ అనాహత చక్రము. దీనిని మేల్కొల్పటానికి గురువు యొక్క చెయ్యి మన తలపై పెట్టుకుంటాము.
110597 గోవర్ధన ఉథ్థాన సాధనా శిబిరము - కాకివాయి - మాస్టర్ సివివి
మాస్టర్ సి వి వి నమస్కారం అని మౌనంగా కూర్చుంటే చెయ్యవలసినది ఆ గురువే చేస్తాడు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఈ ధ్యానాన్ని చేసుకోవాలి.
130597 సూర్యకిరణ సోషణ సాధన - క్షమా ప్రార్ధనా విధానము
హ్రాం మిత్రాయ నమ: అను మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి మనము మనకు కావలసిన వ్యక్తులతో క్షమా ప్రార్ధన చేయవచ్చు, దీనివలన మన ఆధ్యాత్మిక పరిణామక్రమానికి కొత్త తలుపులు తెరుచుకుంతాయి, కర్మలను ఒక్కొక్కటి నివృత్తి చేసుకుంటూ సాధకుడు ముందుకు వెళ్ళాలి.
150597 ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్టే
ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్టే - ఎక్కడ ఏ మాహత్ముడుని గురుంచి విన్నా వాళ్ళని దగ్గరకి వెళ్ళి తప్పక దర్శించండి, అధ్యాత్మిక జ్ఞానము ఒక్క గురువు దగ్గర మాత్రమే దొరకదు, మన నిజ గురువు మనల్ని రకరకాల గురువుల దగ్గరకి రకరకాల విద్యలను నేర్చుకునేందుకు ప్రేరణనిచ్చి పంపుతాడు, అది అర్ధం చేసుకోండి, అది సకల సమర్ధ సద్గురువాణి.
జులై
ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నామ యజ్ఞము యొక్క వైజ్ఞానిక అధ్యాత్మిక రహస్యములను పూర్తిగా వివరించారు. ఒక అధ్భుతమైన సంఘటనకు ఈ యజ్ఞములో పాల్గొన్న పరిజనులు ప్రత్యక్ష సాక్షులు.
జులై
పూర్తి విశ్వాసముతో నన్ను ప్రేమించగలిగితే నేను మీ ఇళ్ళల్లో దొరుకుతాను, నాకోసం మీరు ఎక్కడికీ రానవసరంలేదు. నేను అనామికుడిని, ఏ పేరుతో ఐనా నన్ను పిలుచుకోవచ్చు. అతి తీవ్రమైన వేదనతో ఇచ్చిన సందేశము. త్రిముఖీ గాయత్రీ ధ్యాన విధానాన్ని ప్రపంచానికి అందించవలసిన బాధ్యత నాకు ఉంది. మీ మనస్సులో పరిపూర్ణమైన ప్రేమ ఉంటే ఆ గురువుల్ని నేను మీకు ఈ క్షణంలో ఇక్కడే ఆ 7 గురు ఋషులను అహ్వానిస్తాను. June 4th 1998 చాలా ప్రముఖమైన తేదీ.
ఆగస్ట్
త్రిపురాంతకములో జరిగిన సాధనా శిబిరములో శ్రీవిద్య మీద ప్రవచనము. శ్రీవిద్య బీజాక్షర మంత్రదీక్ష.
షోడశి కళలు చంద్రుడికి మాత్రమే ఉన్నాయి. లలితా సహస్రనామములోని మొదటి 16 శ్లోకములు చంద్రుడియొక్క 16 కళలకు సంబంధించినవి.
070897 త్రిపురాంతకము సాధనా శిబిరము - కార్యకరతలకు ఆచరణీయములు
త్రిపురాంతకములో నిర్వహించిన ఈ సాధనా శిబిరములో ఆ అమ్మవారు శ్రీ లలితా సహస్రనమములోని మొదటి 16 శ్లొఖమౌలతో విరాజిల్లుతున్న అమ్మవారనీ మౌనముగా ఈ స్థానములో సాధన చేయుటద్వారా అత్యంత ఉన్నతమైన శ్రీ విద్యను పొందవచ్చని తెలియచెప్పారు.
070897 త్రిపురాంతకము సాధనా శిబిరము - శ్రీ విద్య ఇంట్రడక్షన్
శ్రీ విద్యను నేర్చుకునేందుకు 3 సంవత్సరాల పాటూ గురువు పాదాల్ని వదలకుండా గట్టిగా పట్టుకుని ఏడిస్తే తప్ప ఆ విద్యని శిష్యునికి ప్రసాదించలేదు. అటువంటి విద్యను మనము ఈ త్రిపురాంతకములో తూర్పు ద్వారమైన కేంద్రములో అభ్యసించబోతున్నాము. శ్రీ శైలములో స్వయముగా అగస్త్యులవారు ప్రతిష్ఠచేసిన శ్రీ యంత్రము ఉన్నది. దానిని ఈ శీబిరము తరువాత తప్పక దర్శించే ప్రయత్నము చెయ్యండి.
అన్ని శస్త్రాలకు, వేదాలకు, భౌతిక జగత్తుకు, అన్ని మొత్తం సృష్ఠి అంతటికీ కారణము గాయత్రీ మంత్రము. గాయ త్రీ మంత్రాన్ని జపించటమేకాదు ఉపయోగించుకోవటము కూడా రావాలి. గాయత్రీ మంత్రముతో శ్రీ విద్యను కలుపుకుంటే జడజగత్తుని అధిగమించవచ్చు.
గాఢ నిద్రలో మనము సూక్ష్మలోకంలో ఉంటాం. భూర్భువ : స్వహ: అనే మూడు తలాలు దాటి మహర్ తలంలో మనము ప్రవేశించాలి. ఆ తలంలో ఉన్న ఆత్మలనే మహాత్ములు అంటాం. దాని ఎక్సిస్టెన్స్ మన బ్రైన్లో ఉంది, వీటిని ఏక్టీవ్ చేసే విద్య శ్రీ విద్య.
దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము సామూహిక పారయణ.
లోల్ల లక్ష్మీధర దేశికాచార్యులవారిని గురువుగా స్వీకరించి మనము శ్రీవిద్య సాధన చేస్కోవాలి. సర్వ సమర్ధత కలిగిన గురువు కాబట్టి ఆయన మనకి ఏ కాలంలో ఐనా ఈ విద్యని నేర్పుతాను అని అనగలిగారు అంటే శ్రీవిద్య ద్వారా సాధకుడు ఏ స్థాయికి వెళ్ళగలడు అనేది మీకు అర్ధం కావాలి.
090897 త్రిపురాంతకం
షోడశీ మంత్ర వివరణ . బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఆవిష్కరించింది సిధ్ధాశ్రమానికి చెందిన అన్నిబిసెంట్, గురుదేవులకు దీక్ష ఇచిన మదనమోహన మాలవ్యాగారికి సిధ్ధాశ్రమంతో సంబంధము కలవారు, ఈ విద్యాలయము ప్రపంచంఉలోని అతి విశాల విద్యాలయాల్లో మూడో స్థానంలో ఉంది. మరి ఈ నాటి విద్యాలయాలు దేవాలయాలు ఎంతగా దిగజారిపోయాయి? ఇందులో మన బాధ్యత ఏమిటి?
150897 కృష్ణాష్ఠమి మన లక్షము
ఏ సాధనలు చేసిన మన లక్షము ఏమిటి అని గుర్తు ఉంచుకోవాలి, ప్రేమ తత్వము పెంచుకోవటము ప్రతి సాధకుడికి తప్పనిసరి.
సెప్టెంబర్
బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున భగవద్గీతలోని ఈ శ్లోకమునకు సంపూర్ణ వివరణను ఇచ్చారు. ఎప్పుడెప్పుడు శిష్యుడు జన్మనెత్తితే అప్పుడు గురువుకూడా జన్మను తీసుకుంటాడు. సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని తెలియచెప్పారు
190997 థియోసఫి
మూడు లోకాలలో మీరు వెతికితే విష్ణువు కనిపించడు, మరి అలాంటప్పుడు బ్రహ్మ, మహేశ్వరులను ఎలా పట్టుకోగలరు? మూడు లోకాలను దాటిన మానసిక స్ధితికి వెళ్ళటేకాని సర్వవ్యాపు భగవంతుడ్ని పట్టుకోగలరు.
190997 థియోసఫి
సూర్య కిరణములు- గ్రహముల వివరణ: ఉదావసు- బృహస్పతి, విశ్వవ్యచ - శుక్రుడు, సన్నధ్ధ - సూర్యుడు, విశ్వకర్మ- బుధుడు, సుషుమ్న, సురాదన- చంద్రుడు, విశ్వవ్యచ- శని
190997 థియోసఫి
సూర్య కిరణాల నుంది వచ్చే హరీకేశ కిరణములద్వారా నక్షత్రములు ఏర్పడతాయి.అప్పక జాగ్రత్తగా విని అర్ధము చేసుకొనవలసిన " పాస్ నాట్" ను అత్యద్భుతముగా వివరించారు.
210997 థియోసాఫికల్ సొసైటీ - సీక్రేట్ డాక్త్రీన్ 1
పంచకోశముల వివరణ, ఆత్మ బుధ్ధి మనస్సుల వివరణ . సీక్రేట్ డాక్త్రీన్ కానీ ఆత్మవిద్య కానీ మనము సూర్యుడునుంచి ప్రపంచము ఎలా ఉద్భవించింది అనేది అత్యంత వివరంగా తెలుపుతుంది .
210997 థియోసాఫికల్ సొసైటీ - సీక్రేట్ డాక్త్రీన్ 2
రాత్రి పడుకునే ముందు పొద్దున లేచినప్పటినుండి, పడుకునేవరకు ఏమి చేసాము అనేది వెనక్కి వెళ్ళి రోజూ అలోచించి పడుకుంటే కొంతకాలానికి మనకి మన పూర్వజన్మలు అన్నీ గుర్తుకువస్తాయి.
అక్టోబర్
ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద గాయత్రీ మహా యజ్ఞము - వివరణ సహితముగా.
కాకివాయిలోని స్మర్తుగామీ సిధ్ధ క్షేత్ర ప్రాశస్థ్యమును వివరించారు. మీ సమస్యలను వ్రాసి అక్కడ ఉన్న ధునిలో వేస్తే తప్పక తీరుతాయి.
191097 ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యజ్ఞము
***ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద గాయత్రీ మహా యజ్ఞము - వివరణ సహితముగా.
061097 మహాష్టమి దీక్ష
కాకివాయిలో జరిగిన సాధనా శిబిరములో దీక్షను ఇచ్చారు. - Audio quality not good, but content is imp.
171097 దుర్గాష్ఠమి - అమరత్వ సిధ్ధి కీలకము
దుర్గా సప్తశతీ శ్లోకములతో మనము చేసిన హవనము వలన ఆ వాతావరణములో దుర్గా సప్తశతి యొక్క విద్యుత్ తరంగములు, అనుగ్రహ తరంగములు వ్యాపిస్తాయి. దధామి, ప్రతిఘృహ్ణామి అని అమ్మకి అన్నీ ఇచ్చి మరల స్వీకరిస్తున్నాము. మనము పెట్తిన అన్నము అమ్మకు పెట్టాక ప్రసాదముగా ఎలా మారుతుందో అలా మనల్ని మనము ఆ మహా శూన్యముకు మనల్ని మనము అర్పించుకోవాలి.
191097 యుగ సైనికులు
సూర్య విజ్ఞానము, చంద్ర విజ్ఞానము & అగ్ని విజ్ఞానముపై సాధకులు పూర్తి పట్టు సాధించాలి. మనము ఆదర్శవంతముగా జీవించాలి.
నవంబర్
నమస్తే యోగి రాజేంద్రా దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్షా భక్తితే దేహిమే ధృఢాం. స్మృతి దేహి అనగా ఆత్మ స్మృతిని కల్గించమని ఆ దత్తుడిని వేడుకుంటున్నాము. దానితోపాటు మార్గవిచలితులు కాకుండా రక్షించమని ప్రార్ధిస్తున్నాము. ఆర్తితో కోరిన ఏ కోరిక ఐన తప్పక నెరవేరుతుంది.
051197 దత్త ప్రదక్షిణలు 1
గురువుల్ని ఏమి కోరుకోవాలో తెలుసుకోండి. దత్త ప్రదక్షిణలు జన్మ జన్మలుగా చేసిన పాపాలను కడుగుకునేందుకు ఉపయోగపడుతుంది. సూర్యనమస్కారములు, దత్త ప్రదక్షిణలకు గల అధ్యాత్మిక వైజ్ఞానికతను వివరించారు.
051197 ద్వాదశ రాశులు
మీరు అధ్యాత్మికలో ఒక విశేష స్థాయికి చేరాలి అంటే అ-ఉ-మ అనే అక్షరాలకు వెనకాల ఉన్న జ్ఞానాన్ని పట్టుకోగలగాలి. ద్వాదశరాసి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద మహా యజ్ఞములో పెట్టే 12 ఇటుకల రహస్యలను తెలియచేసారు.
051197 షటక్ర సాధన - కుండలినీ జాగరణ
షటక్ర సాధనలో మీరు మూలాధార చక్రము నుండి ఆజ్ఞ వరకు మళ్ళీ ఆజ్ఞ నుండి మూలాధారము వరకు అల మీకు ఎన్ని సార్లు కావలంటే అన్ని సార్లు మనస్సుని కిందనుండి పైకి, పై నుండి కిందకి తిప్పుకోవతము ముఖ్యము. ఇది సహజముగా వాయువుతో జరుగుతుంది, కానీ మీరు మనస్సుతో చేసుకోవాలి. లోల లక్షీధర శాస్త్రిగారి నామముతో, అనుగ్రహ మాలా మంత్రముతో, సూర్య కిరణాల పేర్లను వాడీ ఒక్కో చక్రములో ఒక్కో కిరణాన్ని, వాటితో పాటూ రరకాల భావనలను ఈ చక్రాలలో ఆపాదించుకునే సాధనని అందించారు. భోజనము అయ్యాక కణీసము 2,3 గంటల తరువాత ఈ సాధన చెయ్యాలి, లేదు కాళీ కడుపున ఎప్పుడైన చేసుకోవచ్చు. అనుగ్రహ మాలా మంత్ర దీక్ష, గాయత్రీ మంత్ర దీక్ష, లోళ్ళ లస్ఖీధర దేశీకాచార్య మంత్ర దీక్షలను అందించారు.
మూలాధారమువద్దనుండి ప్రతి చక్రములో ఓం శ్రీం లోళ్ళ లక్ష్మీధర దేశికాచార్యయ నమ: అనే గురుమంత్రాన్ని చేయించారు. మళ్ళీ ఆజ్ఞా చక్రమునుండి మూలాధారము వరకు ఇదే విధముగా చెయ్యాలి. ఇదే విధముగా షోడశీ మంత్రాన్ని కూడా ఒక్కో చక్రములో చేసుకోవచ్చు. మనస్సుని మూలాధారమువద్ద నుండి ఆజ్ఞా వరకు మళ్ళీ అజ్ఞా నుండి మూలాధారము వరకు మనస్సుని తిప్పుకోవాలి.
091197 మహాకాల యజ్ణము-12 రాశుల, 7 గ్రహాల ప్రభావము
గాయత్రీ అష్టోత్తర శత నక్షత్ర పాద మహాకాల యజ్ణము. 12 రాశుల ప్రభావము మానవులందరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక టి వి లో బొమ్మలు అందంగా రావటానికి కారణము దానిలోని క్వాలిటి ఎలానో అలానే మన శరీరములో కూడా ఈ రాశూల ప్రభావము మనలోని క్వాలిటీని బట్టి ఉంటుంది. రాశీ చక్ర ప్రభావము అందరిపైన ఒకే విధముగా ఉంటూంది, కానీ దాని ప్రభావము మన శరీరము అనే ఆపరేట్స్ మీద ఆధారపడీ ఉంటుంది. మహా కాల యజ్ఞములొ గ్రహములను మన శరీరములోకి న్యాసము చేసే సరికొత్త విధనాన్ని ఈ యజ్ఞములో అందించారు. గురుపాదుకా స్తోత్రము, ఆహుతులు ఇచ్చే పధ్దతిని వివరించారు.
డిశంబర్
గురుదేవుల ఆత్మకధలోని అతి ముఖ్య విషయాలను సాధకులు పాటించి ఆయనంత ఎత్తుకు ఎదగటానికి కావలసిన మార్గదర్శక సూత్రాలు ఈ అష్టోత్తర శతనామవళిద్వారా అందించారు. దీనికు ముందు గురుపూజా విధానము వివరించారు.
మనము మన కుటుంబాలలో ప్రతి వ్యక్తికి భాద్యతలు నిర్వర్తించిన తరువాత మాత్రమే మనం మన సాధనలు చేసుకోవాలి.
మనం ఇపుడు యుగసంధి కాలంలో ఉన్నాము. శరీరానికి అమరత్వము ఉండదు. శాంత స్థితిలో ఉన్నటువంటి చేతనత్వము అద్వైత స్థితి.మన శరీరంలో సప్తాంగాలు ఉంటాయి. మనకు 5 పంచేద్రియాలు,5 కర్మేంద్రియాలు,5 పంచ ప్రాణాలు వీటితో పాటు మనస్సు, బుద్ది, అహంకారం, చిత్తము ఉంటాయి. ఇవి మొత్తము 19 ముఖాలుగా చెప్పబడుతాయి. మనకిలానే స్థూల జగత్తులో ఉన్న ప్రతి చిన్న కణముకి ఈ 19 ముఖాలు ఉన్నాయి.
దత్తాత్రేయ వజ్ర కవచము మరియు వివరణ
మానవజాతికి పనికివచ్చే ఒక అద్భుత శక్తిని భారతీయులు కనిపెట్టారు, అది భారతీయులది కాదు, దర్శించారు అంతమాత్రమే. భారతీయ ఋషులు ఈ అద్భుత శక్తిని వేదాలలో దాచారు. వారు దర్శీంచిన సత్యము ప్రకృతిలోనిదే, అందువల్ల అది మళ్ళీ ప్రకృతిలోనే ఉండాలి. మానవ శరీరము అనే కాప్సూల్ లో ఆ శక్తి నిక్షిప్తమై ఉంది. అందువలన వేదాలు మానవ శరీరంలోనే ఉన్నాయి. శరీరము ఏ శక్తిని ఉపయోగించుకోగలదో, ఏ శక్తిని నిక్షిప్తము చేసుకోగలదో ఆ శక్తిని వేదములు అంటారు.
కుండలినీ జాగరణ అనేది మన శరీరంలో ఉన్న గుప్తశక్తులను వెలికితీయటం.క్రియాశీలత,కుండలిని ద్వారా మన మనస్సు మన ఆధీనంలోకి వస్తుంది.
141297గురుసత్తా అనుగ్రహం 2
అంగన్యాస కరన్యాసాలు మనల్ని గురువుతో సంబంధం ఏర్పడేలా చేస్తాయి.
ఋషులు దర్శించిన అద్భుతమైన శక్తి వేదాలు. వేదాలులో శక్తిని దాచారు. ఏ మహనీయుడు అయినా సూర్యశక్తిని, చంద్రశక్తిని, అగ్నిశక్తిని ఉపయోగించుకోవాలి. ప్రేమ అంటే అవతలి వారికి కావల్సింది ఇవ్వటం.
గాయత్రీ తరువాత సావిత్రీ గమనములోకి వస్తుంది.సూర్యుడు చంద్రుడు గురుడు శుక్రుడు ఒక సంవత్సర కాలం పాటు ఆకాశంలో తిరిగితే ఒక సహస్రదళ పద్మము ఏర్పడుతుంది. అంటే సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసినప్పుడు ఈ పద్మము ఏర్పడుతుంది. మన శరీరంలో 20 సార్లు మూలాధారం నుంచి ఆజ్ఞా, ఆజ్ఞా నుండి మూలాధారం చేస్తారో పిండాండ బ్రహ్మాండ సమన్వయం జరుగుతుంది. దీన్ని అర్ధము చేసుకున్న వ్యక్తుల్ని బుధ్ధులు అంటాము.
మన చక్రాలలో ఉన్న బీజాక్షరాలు, దళాలపై ఉన్న అక్షరాలు మనము నేర్చుకోవాలి, ఋషులు మన శరీర విజ్ఞాముపై రిసెర్చ్ చేసి అందించిన విద్య ఇది.
మన చక్రాలలో ఉన్న బీజాక్షరాలు, దళాలపై ఉన్న అక్షరాలు మనము నేర్చుకోవాలి, ఋషులు మన శరీర విజ్ఞాముపై రిసెర్చ్ చేసి అందించిన విద్య ఇది. మన వేదాలు శబ్ధ శక్తిద్వారా పనిచేస్తాయి అనే రహస్యాన్ని మీరు అర్ధం చేసుకొనగలిగితే ఆ శబ్ధ బ్రహ్మ మీకు అన్నీ నేర్పుతుంది.
మీరు సాధన చేస్తున్నప్పుడూ చక్రములపై ధ్యానము చేస్తున్నప్పుడు వచ్చే ఆలోచనలను మీరు జాగ్రత్తగా గమనించండి, మీ మనస్సుని ఒక్కో చక్రముపైన దళములపై ఉంచాలి. ఒక దళము తరువాత ఒక దళముపై ధ్యాసను పెట్టాలి.
వెంకయ్య స్వామి, సొరకాయ స్వామి, షిర్డి సాయిబాబా వేరే లోకాల నుండి భూలోకానికి వచ్చినవారు.
031297మన లక్ష్యము 1
స్మర్తు గామి సిద్ధ క్షేత్రం సమస్యలను నివారిస్తుంది.ఇక్కడ సమస్యలను నివారించుకోలేకపోతే ఎక్కడా ఆ సమస్యలను నివారించుకోలేము.