జూన్
మన జీవితములో మనకు కలిగే అనారోగ్యముకానీ, అనేక ఇతర పరిస్ధితులు కానీ నాకు నా గురువు ఇచ్చిన పరిస్ధితులు, నా స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో తేవలసిన మార్పుకు అయన ఇచ్చిన చక్కటి పరిస్ధితి ఇది అనే అలోచనలను మీరు మీ సొంతం చేసుకోగలిగితే, జీవిత లక్ష్యం అర్ధం చేస్కొని పని చేస్తే అన్ని పరిస్ధితులలోను ఆనందంగానే ఉంటారు. నేను ఎల్లప్పుడూ ఇతరులను ఆనందంగా ఉంచాలి అన్న అలోచనను సాధకుడు ఎల్లప్పుడూ ఉంచుకోవచ్చు. నా వల్ల ఏ వ్యక్తికైనా ఆనందం కలుగుతుంది అనుకుంటే దానికి నేను ఎంత త్యాగం ఐనా చేస్తాను అనే మానసిక స్ధితి పంచకోశ జాగరణకు మొదటి మెట్టు. కోరికలకి స్థూల శరీరంతో సంబంధం ఉన్నట్టే ఆలోచనలకి - కారణ శరీరముతో మీరు సరైన సంబంధం పెట్టుకొనగలిగితే మీరు సాధనలో మొదటి మెట్టు ఎక్కినట్లే. ఆలోచనలు కోర్కె రూపం దాల్చటమే సంకల్పం, ఆలోచనలు రూపుదాల్చాలనే సంకల్పంతో పని చేస్తే తప్పక పరిస్ధితులు మారతాయి. కారణ జగత్తు నుండీ సూక్ష్మ జగత్తుకు తీసుకు వచ్చేందుకే మనకు కోశాలు ఉపయోగపడతాయి. భగీరథుడు గంగను భూమి మీదకు తేవటానికి తపస్సు చేసాడు. మీకు వచ్చిన మనస్సులో ఉన్న ఆలోచన భూమి మీద క్రియారూపం దాల్చేదాకా ఆ ఆలోచన మీ మనస్సులో ఉంచుకుంటే అది తప్పక జరుగుతుంది అనేదే తపస్సు, అదే సృష్టి నియమం. ఒక్క ఆలోచన ఆ మనస్సులో పూర్తిగా నాటుకుని, దానిమీదే సంకల్పం ఉండాలి. భౌతిక జగత్తు మొత్తము ఫలితమే, కారణము కాదు. కారణ జగత్తులో మార్పు వస్టే దాని ఫలితము భౌతిక జగత్తులో వస్తుంది, అదే గురువుగారి విచారక్రాంతి, ఆలోచనలలో మార్పు అని చెప్పారు అలోచనలు కలుగచేసే ఇంద్రియాలు 5 మనకు ఉన్నాయి, శబ్ధము,స్పర్శ,రూప, రసము, గంధముల ద్వారా మనకు వాటికి సంబంధించిన ఆలోచనలను మనలో కలుగచేస్తాయి. అన్నమయ కోశము - గంధము - మూలాధాల చక్రము ప్రాణమయ కోశము - రసము - స్వాధిష్ఠాన చక్రము మనోమయ కోశము - రూపము - మణిపూరక చక్రము విజ్ఞానమయ కోశము- స్పర్శ - అనాహత చక్రము ఆనందమయ కోశము - శబ్ధము - ఆజ్ఞా చక్రము విజ్ఞామయ ఆనందమయ కోశములను కలిపి కారణ శరీరము అంటారు. మనోమయ కోశము, ప్రాణమయ కోశము కలిపి సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది. భౌతిక శరీరము, అన్నమయ కోశము వలన స్థూల శరీరము ఏర్పడుతుంది. ఏ పని చెయ్యటానికైనా ఆనందమే కారణము కాబట్టి ఆనందమయ శరీరము - సున్నిండలు తింటె ఆనందము వస్తుంది, అది కారణము - కారణ శరీరము. ఆ వంటకమును ఎలా చెయ్యాలి అనే విజ్ఞానము మనకు ఉండాలి కదా ? అది విజ్ఞానమయ కోశము. ఈ రెండు కలిస్తేనే ఆనందము వస్తుంది. ఆనందమయం విజ్ఞానమయ కోశానికి సంబంధించిన జ్ఞానము ఇచ్చేది సామవేదము. కారణ శరీరములో సామవేదాన్ని మనం అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే వాటిని తేలికగా జగృతము చేసుకొనవచ్చు. ఆనందము పొందటానికి కావలసిన కారణము, జ్ఞానముతో పాటు వాటికి సంబంధించిన ఆలోచనలు కూడా కావాలి. అది మనోమయ కోశము, అలోచనతరంగాలు ఉన్న విజ్ఞానాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనేది మనోమనయ కోశము. ఆలోచనలకు నిర్ణయాత్మక శక్తి ఉన్నది. ఆలోచనలకు కార్య రొప్పము ఇవ్వటానికి శక్తి కావాలి, ప్రాణం కావాలి, అందుకనే మనోమయ ప్రాణమయ కోశాలు కలిపితే సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపందాల్చటానికి కావలసిన శక్తి ఉన్నది. ఇప్పుడు స్థూల శరీరం, అన్నమయ కోశము ఉంటేనే వాటికి కార్యరూపాన్ని ఇవ్వగలం, దానికి కావలసిన పనిముట్టు స్థూల శరీరమే. .
జులై
మనం పావకాగ్ని వంటకు ఉపయోగించుకుంటున్నాము. లోహాలని ఖనిజాలను ఉపయోగించగలిగే స్ధితికి తెచ్చుకుంటున్నాము. పావకాగ్నితో ఉపయోగించుకోలేని వస్తువులను ఉపయోగించుకోవటానికి వీలుగా చేసుకోవచ్చు.
హిమాలయాలలొ ఉన్న ఋషులకు అనంతమయిన శక్తి ఉన్నప్పటికీ కూడ వాళ్ళ కార్యక్రమాలకు ఆచరణ యోగ్యమయిన రూపు ఇవ్వలేక పోతున్నారు అంటే వాళ్ళకు స్థూల శరీరం లేదు కనుక. అందుకని వాళ్ళు స్థూల శరీర దారులతొ సంబంధం పెట్టుకుంటారు.వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మార్చకుండ ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగ మనుషులకు అవగాహన అయ్యే విధంగ చెప్పగలిగే వ్యక్తులను ఎన్నుకుంటారు. అలాంటి వారు వాళ్ళ ఇద్దరికి మధ్య వారధిగ పని చేస్తు గురువులాగ రూపొందుతూ ఉంటారు.
గురువుకి పూర్తిగ అత్మ సమర్పణ చేసేసుకోవాలి. గురువుకి అత్మ సమర్పణ చేసుకున్నాక మన ఇంటికి మిగత ప్రపంచానికీ కావాల్సిన వనరులు సమకూర్చే బాధ్యత ఆయనదే. గురువు భౌతికంగ శిష్యులు దగ్గర ఉండడు. గురువు ఎప్పుడు సూక్ష్మ జగత్తులొ మార్గదర్శనం చెయ్యగలడు తప్ప స్థూల జగత్తులొ మర్గదర్శనం చెయ్యడు.
" ప్రపంచంలో అపవిత్రం కాని వస్తువు అగ్ని. ఆ పవిత్రత అనే లక్షణాన్ని శుచి అనే లక్షణంతొ కూడ చెపుతాము. శుచి యొక్క పవిత్రత మీకు రావలంటే పసుపు రంగును ఎక్కువుగా ఉపయోగించుకోవాలి. పసుపు రంగు కల ఆలోచనలు మీకు రావాలి. పసుపు రంగు కల గుణాలు ఎక్కువ అయ్యాయొ లేదొ తెలియాలంటె మనలొ సూక్ష్మ దృష్టి ఎక్కువ అవ్వాలి. "
ఇప్పుడున్న ఆధ్యాత్మికత అధ్యాత్మికత కాదు. ఏ ధర్మము కూడ మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకు వెళ్ళటం లేదు. చనిపోయిన వాళ్ళను బతికించటం ఆధ్యాత్మికత కాదు. నీకు చావు లేదు అని చెప్పగలగటం ఆధ్యాత్మికత. శారీరకమయినటువంటి ఆసనాల ద్వార మీరు అధ్యాత్మికతను పొందలేరు.
పవమానాగ్ని స్థాయికి చేరిన వ్యక్థి తన శరీరాన్ని కొనసాగించేందుకు కావలసిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. పవమానాగ్ని ప్రజ్వరిల్లిన వ్యక్థికి ఆకలి తగ్గిపోతుంది. ఏ గురువైనా ఆహారాన్ని మల్టిప్లై చెయ్యగలుగుతారు, అది మనం చాల గురువుల వద్ద చూస్తాం, తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చెయ్యటానికి పవమానాగ్ని పనిచేస్తుంది.
గురువు ఎప్పుడు అర్ధం కాడు శిష్యుడుకి. గురువు యొక్క గొప్పతనం ఏ శిష్యుడు ఎప్పుడు అర్ధం చేసుకోలెడు. గురువే స్వయంగ శిష్యుడుని వెతుక్కుంటాడు తప్ప శిష్యుడు గురువును వెతుక్కునే ప్రక్రియ అసలు లేనె లేదు
"అగ్నిలో 3 రకాలు పావక, పవమాన, శుచి. పావక అగ్ని స్థూల జగత్తుకి సంబందించింది. పవమాన సూక్ష్మ జగత్తుకి సంబంధించినది, లేనిది మనం పొందటం పవమాన అగ్ని. శుచి లొ శిష్యుడు ప్రకృతి యొక్క నియమాలను ఉల్లఘించి గురువు యొక్క నియమాలలోకి వెళ్ళిపోతాడు."
గురువు శిష్యుడు ఏమి ఇచ్చాడు అని చూడడు ఏ భావంతొ ఇచ్చాడు అని చూస్తాడు. శిష్యుడు తన సర్వస్వం ఇచ్చేస్తే గురువు తన సర్వస్వం ఇచ్చేస్తాడు. శిష్యుడు ఒక అడుగు ముందుకు వేస్తె గురువు 100 అదుగులు ముందుకు వేస్తాడు. గురువు కి ఇచ్చే దక్షిణ చాలా ముఖ్యమైనది. శిష్యుడు ఇచ్చిన దక్షిణకు ప్రతిఫలంగా గురువు శిష్యుడుకు 100 రెట్లు ఇస్తాడు
మీ దగ్గర లేనిదాన్ని మీరు పొందే ప్రయత్నం చేస్తే అది మీ దగ్గర నిలవదు. కానీ మన అందరి దగ్గర ఉన్న జ్ఞానమును మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అది ఆత్మ జ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి.
"బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మీలొ ఉన్నా శాంతి చెదరకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. 3 సార్లు శాంతి మంత్రం చేస్తున్నపుడు భావ పూర్వకంగ చెయ్యండి. ఒకటి స్థూల జగత్తులో శాంతి. రెండు సూక్ష్మ జగత్తులో శాంతి. మూడు కారణ జగత్తులో శాంతి "
అక్టోబర్
యోగి కులములో పుట్టడం చాలా దుర్లభము. లక్ష్యము వైపుకి ఏకాగ్రతతో పని చెయ్యగలిగటము అనగా రుచి, నీతి కల్గి ఉండటము. ఉత్తాన పాదుడు నుండీ ధృవ నక్షత్రానికి వెళ్ళటానికి అంటే బుధ్ది మీద ఉన్న ధృవ సూర్య నక్షత్రాలను ఉపయోగించుకుని, ద్వాదశ రాశి చక్రాన్ని తనలో తాను చూసుకుని బయట ఉన్నదంతా తనలోనే ఉన్నది అని వాసుదేవ సర్వమితి అనే సాధనా స్ధితికి చేరుకోవాలంటె ధృవుని కధ అర్ధము చేసుకోవాలి, అందులోనే సూర్యుడి కధ కూడా ఉన్నది. సోమ రసాన్ని విశ్వకర్మ అని కూడా అనవచ్చు. సూర్యుడి యొక్క అనంత శక్తి ధారలను సూర్యగ్రహముగా మారినప్పుడు 7 శక్తి ధారలుగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వత్రయాచస్, సన్నద్ధ, సర్వావసు, స్వరాత్ అను 7 సూర్యుని యొక్క కిరణాలు. సూక్ష్మ జగత్తులో నాలుగు దిశలు, స్థూల జగత్తులో నాలుగు దిశలు 8 కలిపి అష్ఠాక్షరీ మంత్రము సూర్యుడిది, అది ఘృణి సూర్య ఆదిత్య ఓం
చంద్రుడు మన సౌరకుటంబములోనివాడు కాదు, చంద్రుని కిరణాలు సూర్యకిరణాల రిఫ్లెక్షన్ కాదు, కాస్మిక్ కాన్సియస్నెస్ లో ఏ యజ్ఞ విధానముద్వారా ఋషులు సోమరసాన్ని ప్రసరింపచెయ్యగలిగారో అది పృధ్విపైకి నెప్ట్యూన్ ద్వారా, చంద్రుడి ద్వారా వస్తాయి. చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు భౌతిక జీవితములోని సృష్టి కార్యక్రమాలకి ఉపయోగపడతాయి, ఆధ్యాత్మిక ద్విజత్వము నెప్ట్యూన్ ఇంద్రగ్రహము ద్వారా కల్గుతుంది. లలితా అమ్మవారి తలపై ఉండే చంద్రుడు ఆధ్యాత్మిక చంద్రుడు. మంగళవారమునాడు సూర్యోదయ కాలములో విశిష్టమైన కిరణాలు భూమి మీదకి ప్రసరింపబడతాయి, (సూర్యొదయానికి 10 నిమిషాలు ముందు తరువాత) ఆ సమయములో కుజగ్రహ దోషనివారణకు కాషాయరంగు వర్ణాన్ని ఊహించుకోగలిగితే 7 రోజులలో ఆ దోషము పోతుంది. కుజుడు శక్తిధారలు (యురేనస్) వరుణుడి శక్తిధారల్తో కలిసినప్పుడు శంబళ ఏర్పడుతుంది. శ ర వ ణ భ వ అను అక్షరాలను జపించటమువలన ధైర్య సాహసములు మనలో అభివృధ్ధి చెందుతాయి. మాట్లాడలేనివారికి బుధవారమునాడు మన ఆజ్ఞా చక్రమునుండి రోగి స్వరపేటికపైకి కాపర్ సల్ఫేట్ కలర్ ను ప్రసరింపచేస్తే వారికి చక్కటి వాక్కు వస్తుంది. కుజ గ్రహము ఋషి పేరు అగస్త్యుడు, బుధ గ్రహము ఋషి నారదుడు.
జగత్తును అంతా నడిపించే శక్తి ఒక్కటే ఉంది. ఆ శక్తి మీకు బాధ్యతలను ఇచ్చింది. ఆ బాధ్యతలను చాల ఆనందంగా స్వీకరించండి. శరీరానికి లొంగి పోకండి. కోరికలకు లొంగి పోకండి. భాధ్యతలకు పూర్తిగ లొంగిపోండి. మౌనం గ ఉండండి.