జనవరి
గురువుల మార్గములో మనము నడవదలుచుకున్నపుడు మౌనమే శరణ్యము. శ్వాస ని సవరించుకుని ద్వాదశ రాశులలో వున్న మాలిన్యాలను తొలగించుకోవాలి. ఈ శ్వాస ఆ గురువు యొక్క రెండు పాదాలు, గురుపాదుకాస్తవము భరతుడు రాముడి పాదుకలు పూజించినప్పటి నుంచి మొదలయింది. నా యొక్క ఉపిరి నీ పని చేయడానికి మాత్రమే వున్నది అనేటటువంటి భావన వుండాలి
010198 గురుసత్తా పూజా విధానము
గురునామ స్మరణ చెయ్యటమువల్ల భుక్తి ముక్తి రెండూ కలుగుతాయి, ఆ గురువు యొక్క అభయ వరదాన ముద్రలను మానసికంగా దర్శించాలి, ఆ అనుభవము ఆ శాంత మూర్తి ని మీరు దర్శించి అదే శాంత స్ధితి మీకు కలగాలి. ఆ భావన చాలా ముఖ్యము.
సూర్యుడి యొక్క దివ్యత్వం మనలో ప్రవేశించడంవల్ల మనము బ్రతికి ఉన్నాము. దాన్ని దర్శించడం, ప్రతి వాళ్ళలో అది చూసేటటువంటి శక్తిని ఇచ్చేదే సంధ్యావందన ప్రక్రియ. మనము ఏ పేరుతో పిలిచినా పలికేది సూర్యుని యొక్క శక్తే. ఆ సూర్యుని యొక్క మూడు లెవల్స్ మీరు పట్టుకోవాలి అది దత్తాత్రేయుడి యొక్క శక్తి
140198 కార్యవర్గ సమావేశము
ఏదన్నా ఒక మంచి పాట వింటే లయ బధ్ధంగా మీరు శరీరాన్ని కదిలిస్తే దాని ప్రభావము మీ సూక్ష్మ శరీరము మీద పడుతుంది. సర్వ సమర్ధుడు, సర్వ వ్యాపకుడూ, సర్వాంతర్యామి గురువు వద్దకు వెళ్ళి ఏమి అడగాలో తెలియని నీచ స్ధితిలో భారతీయులు ఉండటము దుర్భాగ్యము. మీ భావాలను సరిచేసుకోండి.
కాకివాయి ఆశ్రమము ఆరతి పాట
కాకివాయి ఆశ్రమము ఆరతి పాట
అనుగ్రహ మాలా మంత్ర దీక్ష - మాష్టర్ అర్. కె
శ్రీ మహా యోగేశ్వరీ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు చేసే మంత్రము అనుగ్రహ మాలా మంత్రము. ఓం శ్రీ రామ శర్మ ఆచార్య సద్గురు పాదుకాభ్యాం నమ: అను గురు మంత్రదీక్ష మరియు అనుగ్రహమాలా మంత్ర దీక్ష.
ద్వాదశరాశి మహాకాల యజ్ఞము
ద్వాదశరాశి మహాకాల యజ్ఞము యొక్క విధి విధానము, పూర్తి యజ్ఞ క్రమము.
అనుగ్రహ మాలా మంత్ర దీక్ష - కాకివాయి ఆశ్రమము
సూర్య కిరణాలను ఎలా ఉపయోగించుకోవాలో గాయత్రీ మంత్రము నేర్పుతుంది, విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఈ మంత్రాన్ని అత్యధ్భుతంగా ఉపయోగించుకున్నారు. ఈ మధ్య కాలములో దయానంద సరస్వతి, పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులు ఈ మంత్రాన్ని ఉపయోగించుకున్నారు, మనము కూడా ఆ స్థాయి చేరే విధముగా మంత్ర సాధన చెయ్యాలి.
అంతర్ యాత్ర ధ్యానము
గాయత్రీ మంత్రము దివ్య దృష్టిని ఇస్తుంది, షోడశీ మంత్రము దివ్య శ్రవణాన్ని ఇస్తుంది. మనలో ఉన్న మౌనాన్ని పట్టుకోవటానికే ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ ఉపయోగపడతాయి.
గురు స్థాపన అంతర్ముఖ యాత్ర -1
గురువు యొక్క దివ్య మంగళ స్వరూపము హృదయములో ప్రతిష్ఠించుకునే విధానము వివరణ మరియు సాధన 1
గురు స్థాపన అంతర్ముఖ యాత్ర - 2
గురువు యొక్క దివ్య మంగళ స్వరూపము హృదయములో ప్రతిష్ఠించుకునే విధానము వివరణ మరియు సాధన 2
మహాకాల చక్రవర్తీ యంత్ర దీక్ష
హిమాలయాలలో నుండి వస్తున్న కొన్ని కొత్త శక్తిధారలకు అనుగుణముగా శ్రీ యంత్రాన్ని మార్చి మహాకాల చక్రవర్తీ యంత్రమును చేసాను, దానికి ప్రేరణ సనత్కుమారులు నలుగురు. మళ్ళీ భారతదేశానికి శ్రీ తత్వాన్ని తీసుకొని రావటానికి శ్రీ మహాకల చక్రవర్తీ యంత్రముగా మార్పుచెయ్యవలసి వచ్చింది. మీ శరీరాన్ని మీరు ఉపయోగించుకోవాలి, ఈ యంత్రము మీ చక్రములలో తిరుగుతూ ఉండే చక్రము. సూర్యుడు, చంద్రుడు అగ్ని అనే ఈ మూడు శక్తులు ప్రకృతిలో ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాయి. గాయత్రీ మంత్రము సూర్యుడితో సంబంధాన్ని బలంగా చేస్తుంది. షోడశీ మంత్రము చంద్రుడితోను, హ్రీం శ్రీం క్లీం బీజాక్షరాలు అగ్నితోనూ సంబంధము ఏర్పరుచుతాయి.
ఫిబ్రవరి
ఆ యోగమాయా శక్తి పంచభూతాలు పంచాతత్వాలు రూపం లో మనల్ని ఆవరించుకొని వుంటుంది. ఆ యోగ శక్తి యొక్క జాగరణ కొరకు ఈ సాధన చేస్తున్నాము. ఆ యోగమాయ యొక్క అభయాన్ని స్వీకరించండి. ఆమె యొక్క చరణాల యొక్క పిల్లలము మనము అనేటటువంటి భావన తెచ్చుకోండి. మణిపూరక చక్రం నుంచి ఆజ్ఞ వరకు వున్నఒకొక్క దళము యొక్క ధ్యానము
మార్చి
ఆకాశమునకు శబ్ధ తన్మాత్ర - వాక్కు, అహంకారమును ఆకాశ శబ్ధముతో మాత్రమే కొలవగలము. ఎలా ఐతే స్పర్శను వేడి చల్లన వాటితో కొలవగలుగుతున్నారో, నాలుకతో రుచిని కొలవగలుగుతున్నారో, అలా వాక్శక్తి ద్వారా ఆకాశాన్ని మీరు కొలవగిలిగితే మీరు దేవతలు ఐపోతారు. వాసన, రుచి, దృష్ఠి, వినికిడి ఇలా ఇవన్నీ జంతువులు కూడా చెయ్యగలవు, కానీ ఒక్క వాక్కు అనేది మనిషికి మాత్రమే ఉన్నది. రాముడు అతి తక్కువగా మాట్లాడతాడు, రామో విగ్రహవాన్ ధర్మ:. మన శరీరములోని అన్ని తమ ధర్మాన్ని పాటిస్తున్నాయి, ఒక్క వాక్కు మాత్రమే మనము ధర్మాన్ని పాటించటంలేదు. “రాం” అనే శబ్ధాన్ని ఉచ్చరించినప్పుడు వాక్కు కొలిచే కొలతలు తెలుసుకోండి. మీలో ఉన్న అవలక్షణాలు వదలకుండా ఈ సాధన చేస్తే మీకు కష్టాలు వస్తాయి.
సాధకుడు ఏమి చెయ్యాలో తెలీని దుస్ధితిలో ఉండి కొట్టుమిట్టాడతాడో అక్కడ మార్గదర్శనము భగవద్గీతతో కానీ, ఆదిత్య హృదయమువలన కానీ సాధించవచ్చు. సాధకుడు చేసే సాధనలు ఆత్మసాక్షాత్కారముకోసము చేసుకోవాలి కానీ తన కోరికలు తీర్చుకునేందుకు కాకూడదు. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు, అలాంటి ఈ జీవితాన్ని గురుప్రణాళికకు అర్పించండి.
1950 వరకు మన మధ్యనే ఒక వ్యక్తి ఉన్నారు, 5వ క్లాసు వరకు మాత్రమే చదువుకున్నారు. ఆయన స్కూలుకి వెళ్ళేవారు, ఆయనకి గుర్తు ఉండేది కాదు. కానీ ఆయనకి పార్కులో ఆడుకోటానికి వెళ్తే అక్కడ ఆయనకి దేవతలు కనిపించేవారు. ఆయనకి వనదేవతలు కూడా కనిపించేవారు. ఆయన తరువాతి కాలంలో ఫొటోగ్రఫీ స్టూడియో పెట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు ఎడ్గార్ కేసీ.
300398 రామనామ ధ్యానము
As above so below అనే ఒక్క సిద్ధాంతము గుర్తుపెట్తుకుంటే మీరు ఆ వాక్శక్తిమీద మీరు మీ ధ్యానాన్ని పెట్టండి. రామ అని మనము ఉచ్చరించటముతో వాక్శక్తిని మీరు కొలవగలిగితే మీరు ఆకాశాన్ని కొలవగలరు. అంత శక్తి నామ జపముతో సాధించవచ్చు. రామో విగహవాన్ ధర్మ:
వాయు తత్వముతో మాట్లాడుతూ ఉంటే ఒక రాపిడి జరుగుతుంది, అక్షరాలను ఉపయోగించుకుని అక్షరాతీత స్ధితికి వెళ్ళాలి, శబ్ధమును ఉపయోగించుకొని శబ్ధాతీత స్ధితికి వెళ్ళాలి. వసంత నవరాత్రులను సద్వినియోగము చేసుకుంటే ఆ స్ధితికి మీరు తేలికగా చేరగలరు. శరీర నిర్మాణము తెలుసుకోకుండా మీరు అధ్యాత్మికతలోకి ప్రవేశీంచలేరు, అనాహత చక్రాన్ని ఉపయోగించుకుని శబ్ధాతీత స్ధితికి వెళ్ళాలి. రాం అనే నామముతో యోగులందరూ ఆకాశతత్వములో ఆనందతలంలోకి వెళ్ళారు.
ఋషి ప్రణాళికా అవతరణ కూటమి సాధనా శిబిరము -1
ఐనిస్టీన్ 40 సంవత్సరముల వయస్సునుండి 80 సంవత్సరముల వరకు బైబిల్ మీద పని చేసాడు, కానీ ఆ 40 సంవత్సరములలో ఆయన చేసిన పని బయటికి రానివ్వలేదు . ఆయన ఏమి చెప్పాడు? “ సూర్యుని కిరణాలను పట్టుకుంటె మీరు సమస్త జ్ఞానాన్ని పట్టుకోగలరు”.
ఋషి ప్రణాళికా అవతరణ కూటమి సాధనా శిబిరము -2
సంగతీకరణము, దేవ పూజనము ఈ రెండిటిని అర్ధము చేసుకుంటే కానీ మీరు యజ్ఞము నిర్వహించేందుకు అర్హత పొందలేరు. ఋషులు అందించిన జ్ఞాన సంపదను తిరిగి పునరుధ్ధరించటానికి ధనము మంచివారి చేతిలోకి రావటము అవసరము, అసుర వృత్తి కలిగిన వారినుండి మంచివారి వద్దకు ధనము వస్తే దేశ పురోభివృధ్ధికి ఉపయోగపడుతుంది.
ఋషి ప్రణాళికా అవతరణ కూటమి సాధనా శిబిరము -3
జ్ఞాన సముపార్జన సాధన చాలా అవసరము. గాయత్రీ కామధేనువు, కల్పవృక్షము అనేది అర్ధం కావాలి అంటే ముందు మీరు సాధకులుగా మారాలి.
ఋషి ప్రణాళికా అవతరణ కూటమి సాధనా శిబిరము -4
మన శరీరములోని జ్యోతి యొక్క నియమాలు ఎలా ఉన్నాయి అనేది, జ్యోతి శాస్త్రము మనకు చెప్తుంది. పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి, పిల్లలు, ఉద్యొగము గురుంచికాదు, ఆత్మ యొక్క స్ధితిని తెలుపుతుంది. బూధేవి మూలాధారము, శ్రీదేవి సహస్రార చక్రముయందు ఉంటుంది. 120 శ్వాసలలో మీరు మీ పరిణామ క్రమాన్ని పూర్తి చేసుకోగలిగే విద్యని అర్ధం చేసుకోండి. భౌతిక జగత్తులో మనము లేవటానికి ఒక ప్రత్యేక సూర్యకిరణము పని చేస్తుంది, ఖనిజము నుండి వృక్షజగత్తులోకి వెళ్ళటానికి ఒక కిరణము, జంతుజగత్తునుండి మానవ జగత్తుకి మారటానికి ఒక కిరణము ఉపయోగపడూతుంది, అలానే మన ఆత్మని జాగృతము చేసేందుకు కూడా ఒకసూర్యకిరణము పని చేస్తుంది. సాధన ద్వారా ఆ కిరణాన్ని పట్టుకోవాలి.
ఏప్రిల్
ఆధ్యాత్మికతలో రెండు మౌలికమైన సూత్రాలు ఉన్నాయు అవి 1. జన్మ 2. కర్మ. ఈ రెండూ ఎవరికి తెలుస్తాయో వారికి మాత్రమే నేను తెలుస్తాను అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. ఒక శ్వాస లోపలికి వెళ్ళింది, ఒక శ్వాస బయటికి వస్తోంది. వాటి మధ్య జరిగే క్రియని అర్ధం చేసుకోండి. ఇది ఒక అశ్వాభావికమైన ప్రక్రియ.
కాలం యొక్క వేగాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ప్రపంచం అంతా ఒక స్పీడ్ తో ముందుకు వెళ్తే మనము దానికంటే తక్కువ స్పీడ్ లో ఉంటే మనము వెనక పడ్డట్టే. కాలాన్ని సద్వినియోగం చేసుకోవటము అంటే ముందు ప్రతి ముఖ్యమైన పని తక్షణమే చెయ్యాలి. భగవంతుడు సత్య సంకల్పుడు. ఆయనకి ఆ పని తక్షణమే జరగాలి అనే సంకల్పము ఉన్నది. కొన్ని సంవత్సరాలు మీరు అలా చేస్తే మీకు వచ్చిన ప్రతి ఆలోచనా తక్షణం రూపు దాలుస్తుంది. ధర్మము ఆలోచనలు రూపు ఎలా దాల్చాలో చెప్తుంది. ఋషులు మీ జీవితాలలో ఉండాలంటే మీరు అనసూయా స్ధితికి వెళ్ళితీరాలి, అసూయ లేని స్ధితికి వెళ్ళాలి.
" మనము కాలాన్ని మార్చుకోవచ్చు.కాలం యొక్క వేగం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ధర్మము ఆలోచనలు ఎలా మార్చుకోవాలి అనేది చెప్తుంది. టైం యీస్ మనీ. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయాలి. ధర్మము శాశ్వతమైనటు వంటిది అయినప్పటికీ అది నిత్యనూతనమైనది."
సప్త ఋషులను మీరు భూమి మీదకి దింపటము అంటే ఆ సప్త కిరణాలను మీ చక్రములలోకి ధారణ చెయ్యటం
020498 ఋషి ప్రణాళికా అవతరణ కూటమి
యజ్ఞము అనేది చేసేది కాదు జరిగేది. మనము ఏం చేసాము అనేదే ధర్మం చూస్తుంది తప్ప నువ్వు ఏం కోరుకుంటున్నావో ధర్మం చూడదు. నువ్వు ఎంత కర్మ చేస్తావో అంత నీకు లభిస్తుంది. ఏ ధర్మానికి ఏ కర్మ చేస్తున్నామో దానికి తగిన లాభం వస్తుంది.
030498 సీక్రేట్ డాక్ట్రీన్
కాల చక్రాన్ని అవగాహన చేసుకుంటే ఏ జ్ఞానము కావాలంటే ఆ జ్ఞానాన్ని పొందవచ్చు. మనము కాలాన్ని మన శరీరములో శ్వాస ద్వారా తెలుసుకుంటాము. 21,600 సార్లు శ్వాస పీల్చటము ఎలా జరుగుతోంది, ఏ చక్రములో శ్వాస ఎంతసేపు ఉంటోంది అనేది మీరు తెలుసుకొవటానికి భగవద్గీతలోని ఒక శ్లోకములో వివరణ ఉంటుంది " సుఘోష మణిపుష్పకౌ".
ప్రకృతిలో నిరంతరమూ స్పందిస్తున్న రామ శబ్ధాన్ని పట్టుకోవాలి, అది అనాహత నాద శబ్ధము అంటారు. కేవలము భుక్తి కోసము చదివే చదువుకి మీరు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ మీ జీవిత లక్ష్యానికి చేరే సాధనలకి మీరు ఏమి ప్రాముఖ్యత ఇస్తున్నారు ? రోజుకి 10 నుండి 12 గంటలు కనీసం మీ పిల్లల చదువుకి వెచ్చించే మీరు మీ ఆధ్యాత్మిక సాధనలకి ఎంత సమయం ఇస్తున్నారు అర్ధం చేస్కోండి.
సూర్యుడు చంద్రుడు అగ్ని ఇవన్నీ మతాతీతమైన శాశ్వత సత్యాలు, వీటిని మతాలతో కలపటం మూర్ఖత్వము. ఎన్ని యుగాలు మారినా ఈ మూడు మారవు, ఇవే శాశ్వతమైన సత్యాలు, వీటి గుణాలు మారవు. చాలా పదార్ధాలలో దాగి ఉన్న అగ్నిని బయటికి తియ్యాలి అంటే వాటిని పవిత్రం చేసి బయటికి తియ్యాలి, మన శరీరము కూడా అంతే అందులో ఉన్న అగ్నిని బయటికి తియ్యాలి అంటే అగ్నితో సంపర్కము కలుగచేస్తే అది మండుతుంది. ఆ అగ్ని శక్తి మనకు గురువుల వద్దనుంండి లభిస్తుంది. మీ శరీరము ఎండాలి, శుష్కింప బడాలి, సూర్య కిరణాలతో సంబంధము కలిగి ఉండాలి. సూర్యుడు ఒక్కో నెల ఒక్కో రాశిలో ఉంటాడు, చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి మారతాడు.
050498 శ్రీ రామ నవమి
సూర్య చంద్ర అగ్ని విద్యలు అర్ధము అవుతే సమస్త ధర్మాలు అర్ధము అవుతాయి, ధర్మము ఒకటే కానీ భౌగోళిక పరిస్ధితులను బట్టి వేరు వేరు ధర్మాలు ఏర్పడ్డాయి.
కాలము యొక్క అవగాహన జాగృదావస్థలో మాత్రమే ఉంటుంది. స్వపాన్వస్థలో ఉన్న కాలము యొక్క స్కేల్ వేరు. భౌతిక జగత్తులో అందరికీ 24 గంటలు కాలము మాత్రమే ఉంటుంది. సమయము చేతనత్వము మీద ఆధారపడి ఉంటుంది, చేతనత్వము మారితే కాలము మార్చుకోవచ్చు. తక్షణమే పని చెయ్యటం వలన సంకల్ప సిధ్ధి కలుగుతుంది.
మొత్తం హ్యుమానిటీ ౩ జగత్తులో జీవిస్తూ వుంటుంది జాగృత, స్వప్న, సుషుప్థ . కాలము అనేది మనకి జాగ్రుతావస్థ లోనే వుంటుంది . స్వప్నా వస్థలో కాలము వుంది కానీ దాని స్కేల్ వేరు . భౌతిక జగత్తులో వున్న కాలము మాత్రము మనుషుల అందరిలో వున్నది.కాలము దాన్ని యొక్క ధర్మాలు తెలుసుకోవాలి.
అమావాస్య, పౌర్ణమికి మధ్య వుండే ఒకొక్క కోణాన్ని కళలు అంటాము. ఈ కళలన్నిటి లోను ముఖ్యమైనటువంటి కళ శ్రీం, శ్రీం అనేటటువంటి 15కళలు ఆ చంద్రుడి యొక్క 16 కళల యొక్క నిధి అదే శ్రీకళానిధి . ఔషధులలో రసాన్ని ప్రోదీకరించి ఆ ఔషధులలో రోగనివారణ శక్తిని ఆ చంద్రుడు ఇస్తున్నాడు. మనము మర్చిపోయినటువంటి చంద్ర విజ్ఞానాన్ని తిరిగి తెచ్చుకుందాము.
యుగసంధి అనేది ప్రకృతిలోని ఒక ధర్మము. విశ్వము అంతటి యొక్క అజ్ఞానాన్ని పోగోట్టేటటువంటి జ్ఞాన జ్యోతి ఈ యుగసంధి కాలంలో వెలుగుతూ వుంటుంది. ఈ దేహమే దేవాలయము. మీరు ఋషులలో ఏ గొప్పతనాన్ని అయితే చూస్తున్నారో ఆ గొప్పతనాన్ని ఈ శరీరం ద్వారానే ప్రకటించుకోవచ్చు.
250498 సిద్ధి రాజు వార్షికోత్సవము
శిరిడీ సాయి జీవిత చరిత్ర చదువుతే మనకు అక్బరు గురుంచిన విశేషమైన విషయాలు తెలుస్తాయి. భారత దేశము ముస్లింల పాలనలో ఉన్నప్పుడు ముకుంద బ్రహ్మచారి మహా యీగి 350 సంవత్సరాల పైన వయస్సు ఉన్న ఒక మహా యోగి భారతదేశములో మరి ఏ ఇతర మతాల రాజ్యము ఉండకూడదని ప్రయత్నము చేసాడు, అతనే శిరిడీ సాయి యొక్క అనుగ్రహముతో అక్బరుగా జన్మ ఎత్తాల్సి వచ్చింది. గురువుల జీవిత చరిత్రలు సరిగ్గా చదవటము నేర్చుకోండి.
మే
పరస్పరం కలిసి పనిచెయ్యాలి అనేది నేర్చుకోవాలి అందుకోసం ప్రేమతత్వము ధ్యానము చేయాలి. ఈ ధ్యానములో మనం నిరంతరం మట్లాడుకుంటూ వుంటాం. ప్రేమతత్వములో దు:ఖమే తప్ప సుఖం వుండదు కానీ ఆ దు:ఖమే సుఖం గా అనిపిస్తుంది. ప్రతి రోజు ప్రొద్దున్న సాయంత్రం ప్రేమ గురించి ఆలోచించుకుంటూవుండాలి.
130598 ప్రేమ ధ్యానము
మీరు ఏ ధర్మాన్నైనా పాటించండి తప్పులేదు, కానీ మీ 5 ఇంద్రియాల యొక్క శక్తిని ఉపయోగించుకోగలిగితే, వాటికి పైనున్న మనస్సును ప్రేమ తత్వముతో నింపుకోగలిగితే ఆ ధర్మము మాత్రమే నిజమైన ధర్మము, మిగతా అన్ని ధర్మాలు నటనే.
130598 గురు తత్వము
మన మనో భూమిలో సర్వ సమర్ధుడు, సర్వ వ్యాపకుడు, సర్వాంతర్యామి ఐన గురువు క్షేత్రములో నాటవలసినవి . మొదటి కర్మ - భూమి, రెండవ కర్మ - జలము , మూడవ కర్మ - సూర్య కిరణాలు. శ్రధ్ధ , ప్రజ్ఞ, విశ్వాసము అనేవి లోపిస్తే మీలో బీజరూపములో ఉన్న గురుతత్వము అంకురించలేదు. మనో భూమిలో సేవ అనే గుణము ఉంటేనే కానీ ఆ గురువుయొక్క అనుగ్రహము ప్రవహించదు.
నామ మహిమ
నామ మహిమ ఎంత చెప్పుకున్నా మీరు మారాలి అన్న సంకల్పాన్ని కలిగి ఉండి నామ జపము చెయ్యకపోతే ఎటువంటి లాభము ఉండదు. తీవ్రమైన సంవేగముతో నామజపాన్ని చేస్తే అసలు ఫలితము రాకపోవటము అనే సమస్యే లేదు.
నామ మహిమ
14 భువనాలనుండి వచ్చే శక్తిధారలను గుర్తించాలి. నవగ్రహాలనుండి, 12 రాశులనుండి వచ్చే శక్తిధారలను గుర్తించాలి. ఒకే ధర్మము ఎలా ఉండాలి ? 14 కోణాలతో 14 త్రిభుజాలతో ఏర్పడింది. అది మీ శరీరములో మొదలై మీ శరీరములో అంతం అవుతుంది. ఏ శరిరమే ధర్మము, మీరు తీస్కొనే శ్వాస 14 ముఖ్యమైన నాడులకు వెళ్తుంది, అక్కడీనుండి 14 భువనాలకి వెళ్తుంది. మన శరీరములోని 14 నాడులను ఉపయోగించుకోవటము తెలిస్తే 14 భువనాలతో మనము సంబంధము పెట్టుకోవచ్చు. దీనికి మీ 14 నాడులు మీవి శుధ్ధి చేస్కోవాలి. అనుగ్రహమాల మంత్రముతో పాటు దిక్కుల ప్రదక్షిణ, హృదయములో సూర్యుడిని సూర్యనమస్కారముద్వారా మేల్కొల్పాలి.
జూన్
260698 యోగ స్ధితి మౌనము
సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్ధ సంయమనము అను నాలుగు స్తంభాలపై సాధకుడి శిక్షణ ఆధారపడి ఉంటుంది, నిరంతరము మౌనంగా ఉండలేకపోతే స్వాధ్యాయముకానీ, మీకు ఇష్టమైన స్తోత్ర పఠనము కానీ చెయ్యాలి.
280698 నిరంతర గురుసాన్నిధ్య అనుభూతి సాధన
నిరంతర గురుసాన్నిధ్య అనుభూతి అంటే అది మొదటి సాధన, భగవద్గీత జగద్గురువు భారత జాతికి అందించిన మొదటి వరము, గురువుని ఏమీ అడగడు, ఆ గురువు యొక్క నిరంతర స్మరణ జరగాలి, మన హృదయాలలో ఉన్నసర్వ వ్యాపి, సర్వ సమర్ధుడు, సర్వాంతర్యామి గురువుతో మీరు అనుసంధానంగావించుకోవటమే మొదటి అడుగు.
280698 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము
ఏ దేవాలయానికి వెళ్ళినా ఒకే ఫలితము వస్తుంది అనే మూర్ఖత్వము నుండి మీరు బయటపడాలి, సాధారణ కోరికలు తీరటము, భుక్తి ముక్తి వంటివి అన్ని దేవాలయాల్లోనూ వస్తుంది, కానీ సాధకులుగా మీరు ఒక ప్రత్యేక విద్యను నేర్చుకోదలచుకున్నప్పుడు ప్రత్యేకమైన దేవాలయాలలో సాధన చెయ్యటము అనివార్యము అని తెలుసుకోండి.
జులై
ఆధ్యాత్మికతని అనేక రకాల టెక్నాలజీలతో డెవలప్ చేసాము. గురువు ఇచ్చేటటువంటి ప్రతిఫలము ఎప్పుడు మనము ఇచ్చిన దానికన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా వుంటుంది.మనము చేస్తున ప్రతి పని గురువు చూస్తున్నాడు అనేటటువంటి మానసిక స్థితి వుండాలి
020798 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము
నిరంతర గురువు యొక్క అనుభూతి. అది పొందాలి అంటే ఆవిధమైన అలవాటు రావాలి. ఆ జగద్గురువు అందరి హృదయాలలోనూ వున్నాడు దాన్నే అఖండమండలాకారము అంటాము. ఆ చేతనత్వము మనలో లేకపోతే మనము ఉండము. నిరంతరము నా హృదయములో గురువు వున్నాడు అనేటటువంటి అనుభూతి చెందాలి ,ఇది మొదటి మెట్టు
ఆలోచనలు వదిలెయ్యటము అంటే మిమ్మల్ని మీరు వదులుకోవటము. అలా మౌనం లోకి వెళ్ళండి. మీరు నా సన్నిధిలో ఇలాంటి గురువుల మధ్య కూర్చొని ఈ సాధన చేస్తే ఫలితం తొందరగా వస్తుంది. మన అన్ని ఆశ్రమాలకి నా శక్తి ప్రసరింపబడుతూ ఉంటుంది, ఏ ఆశ్రమంలో చేసిన ఇదే ఫలితం వస్తుంది.
030798 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము
అనంతమైనటువంటి విశ్వంలో అక్కడ వాక్కు లేదు. భూమి మీద ఉన్నటువంటి 83 లక్షల జీవరాసులలో కూడా వాక్కు లేదు. ఈ సంపూర్ణ సృష్టి యొక్క రహస్యం తెలియాలి అంటే మౌనం గా వుండడం నేర్చుకోవాలి. ప్రకృతికి మనల్ని మనం వదిలేసుకోవాలి మౌనంగా జరిగేది గమనిస్తూ వుండాలి.
040798 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము
యోగ విద్య సాధకులు నిరంతము యోగ విద్య సాధకులే. అంటే యోగము తప్ప ఇంకేమి మాట్లాడం అని కాదు, అది బేసిస్ అని అర్ధం. దాని మీద మిగతావన్నీ నిర్మాణం అవుతాయి. నిరంతరము ఆ గురువు యొక్క స్పర్శ అనుభూతి చెందాలి.
050798 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము
మానవ జీవితం యొక్క అసలైన లక్ష్యము ఏంటి అనేది తెలుసుకోవాలి. దానికి మనము శరీర నిర్మాణము గురించి క్లుప్తం గా కొంచము తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరం యొక్క అవసరాలు మీ అవసరాలు అనుకుంటున్నారు. ఈ శరీరాలన్నీ కూడా మనము యంత్రాలలాగానే ఉపయోగించుకునే మెళుకువలు నేర్చుకోవాలి.
గాయత్రి రామాయణము
మౌనాన్ని స్వీకరించండి, మాటల్ని కాదు. మాటల మధ్య ఉన్న మౌనాన్ని కూడా స్వీకరించారు కాబట్టి మీకు మాటలు అర్ధం అవుతున్నాయి. ఆ మౌనములోకి వెళ్ళటం నేర్చుకోండి.
బాధ్యతల్ని సక్రియంగా నిర్వహిస్తూ మౌనంగా ఉండగలిగిన 1000 మంది వ్యక్తుల్ని ఐనా తయారు చెయ్యాలని నా కోరిక. మీ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొంది దీనిని అందరికీ అందచేసే మునులు కావాలి. మౌనంగా ఉండగలిగేవాళ్ళే మునులు. మీలో ఎవరన్నా నేను అనుకున్న స్థాయికి చేరగలిగితే మిమ్మల్ని ఖచ్చితంగా నేను బుధగ్రహానికి తీస్కొని వెళ్తాను.
గ్రహించేటటువంటి మానసిక స్థితి దాన్నే ధారణ అంటాము. చెవుల మీద ఏకాగ్రత తెచ్చుకోండి. ప్రతి మానవుడు యోగిగా మారాలి. ఆలోచనా రహిత క్షణాలన్నిటిలో కూడా ఆ విశ్వరూపుడైన వాసుదేవుడు వున్నాడు. ఏది ఆశించకుండా అసలు ఆలోచనలు లేనటువంటి స్థితి లో యోగము యొక్క స్తార్తింగ్ పాయింట్.
090798 మౌనం ద్వారా గురుసన్నిధి
మనం కనుక నిరంతరము గురు సాన్నిధ్యము పొందితే మనం యోగులము అవుతాము. మీ వాక్కు ద్వారా ఎదుటివారిని జడ్జ్ మెంట్ చేయకూడదు. రాత్రి పడుకునప్పుడు మనము సవ్యమైనటువంటి ఆలోచనలు చేస్తే లేచిన వ్యక్తీ పడుకున్న వ్యక్తి ఒక్కటి కాడు.
గ్రహించేటటువంటి మానసిక స్థితి దానినే ధారణ అంటాము. చెవుల మీద ఏకాగ్రత. యోగులుగా మారాలి ప్రతి మానవుడు. ఆలోచనా రహితక్షణాలన్నింటిలో కూడా ఆ విశ్వరుపుడైన వాసుదేవుడు వున్నాడు. ఏది ఆశించకుండా అసలు ఆలోచనలు లేనటువంటి స్థితి లో యోగము యొక్క స్టార్టింగ్ పాయింట్.
ఈ విశాల విశ్వాన్ని సృష్టించినటువంటి ఒక అద్భుతమైన శక్తిని మనము అర్ధము చేసుకోగలిగితే ఆ సృష్టికర్తను మనము ఎలాంటి కోరికలు కోరాలో తెలుస్తుంది. ఒక చిన్న పరమాణువునుండి, విశాల అంతరిక్షములో ఇన్ని సౌరకుటుంబాలతో ఏర్పడిన విశ్వములో మనము ఎంత అనేది అర్ధము చేసుకోవాలి. దేవుడికి చిన్న బెల్లముక్క పెట్టి మన కోరికలు తీర్చమని అడగటము ఎంత భావ్యము? ఈ చిన్న పిల్లల మనస్ధితినుండి మీరు ఎదగండి, వేరేవాళ్ళ గురుంచి వాళ్ళ పూజల గురుంచి మాట్లాడకండి.
గాలి లేని చోట దీపము కదలకుండా ఎలా ఉంటుందో అలా ఉండంట అనేది సాధకుడీ స్ధితి. అన్ని కోరికలు వదిలెయ్యండి, మౌనములోకి వెళ్ళండి. మీ జీవితానికి కారణమైన అత్యంత ముఖ్యమైన శ్వాసపై మీకు అదుపురాకపోతే ఇక మీ జీవితముపై మీకు ఏదో అదుపు ఉంది అని అనుకోవటము మూర్ఖత్వము. అర్జున స్ధితి తెచ్చుకోండి.
110798 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము
మౌనం గా వున్నవాళ్ళు తపస్సు చేయడం నేర్చుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మప్రభువుని గుర్తుచేసుకోవడానికి మీరు ఆ ఆవేదనలో వుండి మౌనం లో ఉండగలిగితే అది తపస్సు యొక్క మొదట్టి స్థితి. మౌనంలో వుండి ఆ ఆర్తిని బయటికి రానివ్వండి.
110798 నిరంతర గురుసాన్నిద్యము 1
బౌతిక కోరికలని పూర్తిగా ఆపేయండి. పృద్వీ అంతా కూడా ఒక కుటుంబము అని అనుకోవాలి. ఈ విశేషమైనటువంటి స్థితి మౌనం ద్వారా వస్తుంది. వ్యక్తిగత జీవితం లో ప్రతి రోజు రాత్రి ఒక టైం టేబుల్ వేసుకోండి. అది ఆచరణలోకి తెచ్చుకోండి.
110798 నిరంతర గురు సాన్నిధ్యము 1
పృద్వీ గ్రహము సౌరకుటుంబం లో ఒక విచిత్రమైనటువంటి స్థితి లో వుంటుంది ఎందుకంటే మానవీయ చేతనత్వము ఇతర గ్రహాలలో ఈ విధంగా వుండదు. అలాంటి భూమి యొక్క వాతావరణం కొన్ని మైళ్ళ వరకు విస్తరించి వుంది. ఇలాంటి మానవుడు యోగిగా మారితే ఈ సంపూర్ణ సృష్టిని మార్చగలడు. ఇది భారతీయత ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన జ్ఞానము
సర్వలోక వశీకరాయా అనే మంత్రము మీరు బాహ్య పరిస్ధితులకు కాక మీ గురువుకు మీరు వశము అయ్యేట్టు చేస్తుంది. జీవన సాగరంలో ఒక ఆకు లాగా ప్రవహించండి, ఆ మౌనంలో ఉండండి.
130798 మౌనం ద్వారా గురుసన్నిధి
మీరు నిజంగా మౌనం గా వుంటే ఈ దుఖ:ము మిమల్ని బాధించదు. ఏ బాధలు వచ్చిన ఆ మౌనం లో ఆహుతి వేయండి. బాధ్యతలని పరిపూర్ణంగా చేస్తూ మౌనం గా వుండాలి. యోగి అవ్వదలచుకుంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని యోగిలా జీవించటానికి అర్పించాలి
130798 నిరంతర గురు సాన్నిధ్యము మౌనం
ఏ దేశం యొక్క గొప్పతనం అయినా ఆ దేశం లో ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి వుంటుంది. ప్రకృతి యొక్క సామర్ధ్యం ఏంటి అంటే ఎంత అవసరమో అంతే ఇస్తుంది. అలాగా మౌనాన్ని మీరు మీ లోపలికి తెసుకువెళ్ళండి అది ఎలా మార్చుకోవాలో అదే మార్చుకుంటుంది. ఎకడెక్కడ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవల్లసిన సమయం వస్తుందో అక్కడ మౌనం నుండి సమాధానము వస్తుంది
140798 నిరంతర సాన్నిధ్యము
యోగము అనే పదాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. నిరంతరం గురు సాన్నిధ్యం లో వున్నవాడే యోగి. సంచిత కర్మ నుంచి గురువు తొందరగా బయటకి తీసుకురాగలడు. మౌనం గా ఉండడానికి నిజంగా ప్రయత్నించాలి, ఎటువంటి కోరికలు ఉండకూడదు. ఎటువంటి పరిస్ధితిలో కూడా చలించము అనే మానసిక స్థితి వుండాలి
ఎన్నో జన్మల సంబంధము ఉంటేనే మీరు గురువుల కార్యక్రమాలలో పాలుపంచుగొనగలుగుతున్నారు. సాధనా రహస్యాలను తెలుసుకోవాలి, సాధన చెయ్యాలి అని అనుకునేవారికి నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, మిమ్మల్ని జన్మ జన్మలైన సరే యోగులుగా మార్చే బాధ్యత నాది.
నిరంత గురు సాన్నిధ్య సాధనా శిబిరము
150798 నిరంతర గురు సాన్నిధ్యము 1
భగవంతుడు అక్కడ వున్నాడు అనే భావన వుండాలి, ఉన్న భగవంతుడ్ని దర్శించాలి. మన స్ధాయి బట్టి వనరులు ఏర్పడుతాయి, కోరికల బట్టి ఏర్పడవు. గురువు దగ్గర వుంటే గురువు యొక్క వనరులు అన్ని మీ వనరులు అవుతాయి.
150798 నిరంతర గురు సాన్నిధ్యము 2
మానవ జన్మ ఎత్తాక ఋషుల ఒక్కసాధనా విధానము వారు చెప్పినట్టు చేస్తే యోగ విద్య కూడా మీకు అలానే ఫలితాలని ఇస్తుంది . మీరు మీలోపలికి వెళ్ళండి, చిత్తవృతుల్ని నివారించుకోవాలి.
160798 నిరంతర గురుసాన్నిద్యము
యోగ సాధనికి ఇది సరైన సమయము. శరీరమనేటటువంటి స్థలము ఆ సమయానికి వుండాలి. ఆలస్యము, బద్ధకము వదులుకోవాలి. బిందువు వరుకు వెళ్ళండి అంతకంటే ముందుకు వద్దు వెనకకు వద్దు .
మనస్సు, బుధ్ధి, చిత్తమును గురువుకి సమర్పించాము అని అంటూ మీ జీవిత విధానములో ఎటువంటి మార్పు రాకపోతే అది ఎంత అబధ్ధపు జీవితమో అర్ధము చేసుకోండి, సమర్పణ చేసాకా అంతా గురువు చేతిలో ఉంటుంది. మీ జీవితములో కొంత కాలాన్ని మాత్రమే గురువుకి ఇవ్వండి, ఇంత అమూల్యమైన మానవ జీవితాన్ని సార్ధకం చేసుకోండి.
190798 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము
దుర్వాస మహర్షి మీరు చేసిన సాధనకు మెచ్చుకున్నారు, మీరు మీ బాధ్యతలను మరింత జాగురూకతతో చెయ్యవలసిన సమయము ఆసన్నమైనది. యుగసంధి సమయములో మీ సాధనకు తగ్గ సమయాన్ని జాగ్రత్తగా కేటాయించుకోండి, నిరంతరము మౌన స్ధితిలో ఉండండి. మీకు సప్త ఋషులు వచ్చి మార్గదర్శనము అందిస్తున్నారు, వారు ఏ రూపాలలో వచ్చారో మీరు పూర్తి జాగురూకతతో ఉండి గమనించుకోండి, గురుచరిత్రల పారాయణ వలన ఆ గురువు జీవితంలోని సంఘఠనలు సాధకులగా మీ జీవితాలల్లో కూడా జరుగుతే అప్పుడు మీరు ఎలా ప్రవర్తింఛాలో దానికి తగిన శ్క్షణ లభిస్తుంది.
మీకు యోగ విద్య కావాలంటే నా వద్దకు రండి, మిమ్మల్ని ఒక శిరిడీ సాయిలాగా, ఒక అరవిందో లాగా తయారు చెయ్యటానికి నేను రెడీ. మౌనముగా ఉండి మీలో ఉండే యూనివెర్సల్ కాన్షియస్నెస్ ని పట్టుకోవటమే యోగము. దీని ద్వారానే సర్వాంతర్యామిత్వము, సర్వ వ్యాపకత్వము, సర్వ సమర్ధత వస్తాయి. మౌనమును పట్టుకోండి. గురుచరిత్ర మౌన స్ధితికి యొక్క బాహ్య స్వరూపము, అందుకని గురుచరిత్ర పారాయణ చేస్కుని మౌనంలోకి వెళ్ళిపోవచ్చు. నిరంతర గురుసాన్నిధ్య అనుభూతి మీకు ఇక్కడ లభించాలి.
మీ జీవితాలలో సంబంధ బాంధవ్యాలలో నటన, జీవితమే నటనగా జీవిస్తున్నారు అందరూ, గురువుల దగ్గరకి వచ్చి కోరికలు తీర్చుకునేందుకు నటించకండి. గురువుల దగ్గరకి వాళ్ళలాగా ఎదిగేందుకు వెళ్ళండి. అలా అని మీ బాధ్యతల్ని వదిలి పన్లు మానేసి సాధన చేస్కుంటే తప్పు. ఎవరి కర్మ వారిది, మీరు ఎలా జీవించాలో మీరు నేర్చుకోండి.
సాధన అనేది ఒక మానసిక స్ధితి. సాధనలో ఎమీ చెయ్యరు, నిరంతరం గురువుతో కలిసి యోగ స్ధితిలో ఉండటమే సాధన. వైరాగ్యము, నిత్యా నిత్యా వివేకము అనే రెండు లక్షణాలు ఉన్నవాళ్ళే యోగులు. శరీరానికి లొంగకుండా, బంధుత్వాలకి లొంగకుండా బాధ్యతలకి మాత్రమే లొంగి జీవించండి.
ఏ తీర్ధ క్షేత్రానికి వెళ్ళినా అధ్యాత్మిక ఉన్నతి, తుష్ఠి, పుష్టి, శాంతి లభిస్తాయి, కానీ ప్రతి క్షేత్రానికి దాని ప్రత్యేకత ఉంది. ఒక డాక్టర్ దగ్గరకి వెళ్తే 5,6 రకాల మందులు రాస్తారు, ఎదో ఒకటి పని చేస్తుందేమో అన్నట్టు. అలానే మనం దేవతల్ని కూడా ఎవ్వర్నీ వదలం, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళూ అన్నా పలుకుతారు అన్నట్టు. మన అలోచనలు మనకు అర్ధం ఐతే తప్పులు సరిదిద్దుకోవచ్చు. అంతర్ ముఖ యాత్ర శ్వాస ద్వారా చేస్తాము, శ్వాస లోపలికి వెళ్తోంది, బయటికి వెస్తోంది. మౌనంగా స్ధిరంగా ఉండి శ్వాసను గమనిస్తే గురువు వద్దకు చేరతారు.
దుర్వాస మహర్షి మీరు చేసిన సాధనకు మెచ్చుకున్నారు, మీరు మీ బాధ్యతలను మరింత జాగురూకతతో చెయ్యవలసిన సమయము ఆసన్నమైనది. యుగసంధి సమయములో మీ సాధనకు తగ్గ సమయాన్ని జాగ్రత్తగా కేటాయించుకోండి, నిరంతరము మౌన స్ధితిలో ఉండండి. మీకు సప్త ఋషులు వచ్చి మార్గదర్శనము అందిస్తున్నారు, వారు ఏ రూపాలలో వచ్చారో మీరు పూర్తి జాగురూకతతో ఉండి గమనించుకోండి, గురుచరిత్రల పారాయణ వలన ఆ గురువు జీవితంలోని సంఘఠనలు సాధకులగా మీ జీవితాలల్లో కూడా జరుగుతే అప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలో దానికి తగిన శక్తి మార్గదర్శనం లభిస్తాయి.
250798 శరీర నిర్మాణము
ప్రపంచములో ద్వాదశరాసులు ప్రతి వ్యక్తిపై ప్రభవాన్ని చూపిస్తాయి, సూర్యనమస్కారములు చెయ్యటంవలన సర్వ సమర్ధత పెంచుకునేందుకు కావలసిన మార్పులు మన శరీరములో జరగటానికి అనువుగా మన శరీరము మార్పు చెందుతుంది. డాక్టరు ఇచ్చిన మందు ప్రభావము మన శరీర శక్తి పై ఆధారపడి పని చేస్తుంది, అంంటే జరిగేమార్పు మన శరీరములోనే జరుగుతుంది. ఎన్నో అద్భుత వనరులున్న ఈ భౌతిక శరీరమును ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి.
పావక, పవమాన, శుచి అగ్నులను అనగా శ్రీ అరవిందులవారు ఇచ్చిన మైండ్, ఓవర్ మైండ్, సూపర్ మైండ్ ఈ మూడు అగ్నుల వివరణే. గురువుగారు ఇచ్చిన యుగ యజ్ఞము మనము ఈ స్ధితులు పొందటానికి అత్యంత సులువైన మార్గము. బ్రహ్మ దీక్షలో మనము శుచి అనే అగ్నిని వాడతాము, పసుపు రంగు మానసిక స్ధితి దీనికి చాలా అవసరము, పసుపు రంగు కాదు, ఆ మానసిక స్ధితి చాలా అవసరం.
ప్రపంచంలో జరిగే చాలా సంఘటనలు శాంతం గా జరుగుతాయి, సూర్యోదయము, సూర్యాస్తమయాలు చాలా ప్రశాంతం గా జరుగుతాయి. మనిషి ప్రతి రోజు పెరుగుతాడు, ఎంత నిశబ్దం గా జరుగుతోంది? అలానే ప్రపంచంలో ఎక్కడ చూసినా పెరగటం అనేది ఒక అద్బుతమైనటువంటి రహస్యము. భగవంతుడు గురించి మీరు తెలుసుకోవాలి అంటే వినటం నేర్చుకోవాలి. ఏకాగ్రమైనటు వంటి వినగలిగేటటువంటి శబ్దాన్ని మీరు ఎక్కడ విన్నా భగవంతుడు కనిపిస్తాడు.మంత్రమైనా, ప్రాణాయామము చేసినా అది వినాలి.
290798 గురువుని గుర్తించటం
ఆధ్యాత్మికత మీద రుచిని కల్పించుకోవాలి. దేవాలయాలలో మనము కళ్ళుమూసుకుని దణ్ణం పెట్టుకుంటాం అంటే దేవుడు బైట లేడు మనలో వున్నాడు అని. వచ్చేప్పుడు శఠకోపం పెట్టుకుని వస్తాము అంటే సర్వజ్ఞుడైన ఆ చరణాలను మనం తెసుకుని వస్తాము ఆ ఆచరణ మీకు రావాలి.
280798 యోగ సాధన
"మౌనం గా వుండి సర్వాంతర్యామి అయినటువంటి గురువు యొక్క స్పర్శ పట్టుకోవాలి. మనలో గురువు వుంటే ఆ సర్వసమర్ధతత, సర్వవ్యాపకత్వము మనలో కూడా వస్తుంది. మీరు ఎవరి దగ్గరకు వెళ్ళనక్కరలేదు. ఆ గురువు మీలోనే వున్నాడు కానీ కోరికలతో కట్టేసి ఉంచారు గురువుని. అవి కనుక ఒక క్షణం పక్కన పెడితే మీ జీవితం లోనే కాక కొన్ని వేల మంది జీవితాలలో మార్పు తీసుకొస్తారు."
280798 దేవాలయాలు - విద్య- నామ మహిమ
ఋణాను బంధాలను పూర్తిగా అవగాహన చేస్కునే విద్య మనము శివుని వద్ధనుండి నేర్చుకుంటాము. మన జీవితములో భార్య, భర్త పిల్లలు ఇవన్నీ ఋణానుబంధమువలన ఏర్పడిన బంధములే, ఋణము తీరిన తరువాత వారితో మీరు కలిసి ఉండాలన్న ఉండలేరు. అందువలన మనము మోహము పెంచుకోకుండా ప్రేమతో మన బాధ్యతలను నిర్వహించాలి.
280798 వానప్రస్ధ ఆశ్రమము - ఓంకార సాధన
“అ కార ఉ కార మ కారములను” ఉచ్చరించినప్పుడు మీరు ఆ శబ్ధాలను జాగ్రత్తగా వినాలి. ఆ శబ్ధముపై కాసేపు మీ దృష్ఠిని ఉంచాలి. ఈ సాధన ద్వారా క్యాన్సర్వంటీ రోగాలు కూడా పోతాయి
ఆగస్ట్
భారతీయ ఆధ్యాత్మిక యొక్క ఆధార నియమాలు మనము తెలుసుకోబోతున్నాము. శరీరాన్ని ఉపయోగించుకోవటం ఎలా, శరీరం అంటే స్థూల శరీరం ఒక్కటే కాదు, కోరికల శరీరము, మనోమయ శరీరము వుంటాయి. ఏ విద్య నేర్చుకోవాలన్న మనోమయ శరీరము ముఖ్యము. మనస్సును నియంత్రణ చేసుకోవాలి. ఏ స్థితిలో వున్నా యోగ విద్య నేర్చుకోవచ్చు. మనస్సు సరైన స్థితిలో వుంటే మీరు ఏది చేసినా యోగమే.
"ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానము.సైంటిస్ట్ ఒకలా జీవిస్తాడు ఇంజనీర్ ఒకలా జీవిస్తాడు. యోగ సాధన ఇవ్వడానికి నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయలు వచ్చాయి యోగవిద్య ద్వారా మీరు సాధించాల్సింది ఏంటి అంటే ఈ మొత్తం సృష్టిని నడిపించే శక్తి యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకోవచ్చు "
మీరు శారీరకంగా మానసికంగా పూర్తిగా అలసిపోయినప్పుడు మాత్రమే గురువు అనుగ్రహము, ప్రకృతి అనుగ్రహము లభిస్తుది. ఈ లోఫు మీరు ఎన్ని స్తోత్రాలు చేసినా ఎన్ని అష్టోత్తరాలు చేసినా ప్రయోజనం లేదు. యోగ విద్య లక్ష్యమును చేరటానికి మౌనమే శరణ్యము
జ్ఞాతుం దృష్టిం ప్రవేష్టుం - త్రిపదా గాయత్రీ మంత్రము. ఒక్కొక్క గాయత్రీ మంత్రమునకు ఒక్కో ప్రత్యేక శక్తి ఉన్నది, గాయత్రీ మంత్రముతోపాటు అనుష్టానము చేసేటప్పుడు మీకు కావలసిన శక్తికి సంబంధించిన గాయత్రీ మంత్రాన్ని కూడ చేస్కొంటే మీకు కావల్సిన ఫలితాన్ని సునాయాసంగా పొందవచ్చు. "
జన్మ జన్మలుగా మీకు ఆ గురువు మార్గదర్శనము చేస్తున్నాడు అని ముందు నమ్మాలి, అది నమ్మాక గురువు అనుగ్రహము మీ యందు ఎంత ఉందో అర్ధము చేసుకోండి. మీ బధ్యతలనుండి పారిపోకండి, ప్రకృతిలో ఏది జరిగినా అది గురు అనుగ్రహమే, నిరంతరము నవ్వుతూ ఉండాలి.
యుగసంధి - యోగవిద్యలో వచ్చే మార్పులు అర్ధము చేసుకోవటానికి భౌతిక పరిస్ధితులు గమనించండి. యోగుల యొక్క మానసిక స్ధితి ఏమిటి అంటే భౌతిక జగత్తులో ఎదైన జరిగితే అది జరగటానికి వెనకాల సూక్ష్మ జగత్తులో జరిగేదానికి 100 వంతు మాత్రమే భౌతిక జగత్తుకి వస్తుంది, మానసిక జగత్తులో జరిగే 1000వంతు మాత్రమే సూక్ష్మజగత్తులోకి వస్తుంది. మనకు ఇప్పుడు ఇంత టెక్నాలజీ అభివృధ్ధి చెందింది అంటే దానికి ఎన్నో రెట్లు పని సూక్ష్మ జగత్తులో జరిగింది అని తెలుసుకోండి.
వైరాగ్యము లోనే రాగము ఉంది, నిరంతరము లక్ష్యము కోసము పని చేసేవాళ్ళకి వైరాగ్యము గురుంచి చెప్పక్కర్లేదు, వాళ్ళ దృష్ఠి ఎటువైపు ఉందో అటు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళీపోతారు.
భర్గ: అను శబ్ధము పరిణామ క్రమములో మన విశిష్టత ఏమిటో తెలుసుకుని ఎలా చెయ్యాలో చెప్తుంది, నిర్ణయాత్మక శక్తి భర్గ్: అను మంత్రము తెలుపుతుంది. పరిణామ క్రమములో మన బాధ్యతను తెలుసుకునేందుకు మార్గదర్శనాన్ని దేవతలనుంచి తీస్కొమ్మని దేవస్య అనే శబ్ధము తెలుపుతుంది.
కృష్ణ తత్వము అంటే ప్రేమ తత్వము
గురువులు భూమి మీద సశరీర ధారులుగా ఉండటానికి కారణము వారికి మనపై ఉన్న అవ్యాజమైన ప్రేమ, మానవాజతి కనీసము దానిని పట్టించుకోవటములేదు, అది భారతీయులుగా మన ధౌర్భాగ్యము. గత 5000 సంవత్సరాలుగా వాళ్ళూ పడుతున్న బాధ మీకు నేను ఎలా చెప్పగలను? మీ చేత చేయించే ప్రతి సాధనా మీలో ఉన్న ప్రేమ తత్వాన్ని పెంచటానికే అని అర్ధము చేసుకోండి.
జన్మాష్ఠమి - 1
నీటీలో మట్టితో చేసిన కడవ దింపితే - కడవలోపల నీరు ఉంది, కడవ బయట నీరు ఉంది, ఆ కడవ పగలగొడితే నీరంతా ఒక్కటే, ఈ సాధనలో మీ శరీరము ఉండాలి, అది ఉంచుకుని మీ చేతనత్వాన్ని విశ్వ చేతనత్వముతో లీనము చెయ్యాలి.
జన్మాష్ఠమి - 2
మీ చేతనత్వాన్ని మార్చుకునేందుకు తీర్ధ యాత్రలు ఉపయోగపడాలి, చేతనత్వము మానవ స్థాయి నుండి దేవ మానవ స్థాయికి వెళ్ళాలి. ఆ geographical atmosphere లో మీ psychological changes జరుగుతాయి. జగద్గురువు ఐన శ్రీ కృష్ణుడుకి కొన్ని సంవత్సరాలు బద్రీనాధ్లో ఉండి తపస్సు చేస్తే తప్ప ఫలితాలు రాలేదు, మీరు బస్సులో ఇలా వెళ్ళి అలా వచ్చేసి తీ ర్ధ యాత్ర చేసాము అంటారు ????
జన్మ ప్రేరణ
నేను గురువుల అనుగ్రహముతో పృధ్వి తీసుకోబోయే దీక్షలో భాగస్వామ్యము వహిస్తాము అనువారికి నా అధ్యాత్మిక ప్రవచనాలు ఉపయోగపడతాయి. మానవ జాతి వ్యక్తిగత పరిణామ క్రమముతో పాటు విశ్వపరిణామ క్రమములో భాగస్వామ్యము పొందటానికి నా మార్గదర్శనము మీకు ఎప్పుడూ ఉంటుంది.
150898 విశ్వ కర్మా కిరణములు
శ్రీ అరబిందో ప్రజ్ఞా సంపదలో ఋషులకంటె ఇంకొక అడుగు ముందుకు వెళ్ళింది. నేను చెప్పే యోగ విద్య ప్రకృతిలో జరిగేది చెప్తున్నాను, పుస్తకాలలో చెప్పేది కాదు. అరవిందోను అర్ధము చేసుకోగలిగిన వ్యక్తిత్వాలు ఏర్పడితే 49 మంది ఋషుల గురుంచి మాట్లాడుకోవాలి, ఆయన రాసిన సావిత్రీ 49 ఋషులకు ప్రతీకలు అనే విషయాన్ని పట్టుకోవాలి.
1972లో జరిగిన ఇంటర్ గలాక్టిక్ వర్ల్డ్ ఒక అద్భుతమైన ప్రక్రియ తరువాత పృధ్వీ గ్రహముపై ఒక్క మానవుడు పృధ్వీ గ్రహమువల్ల నాశనము కాడు, పృధ్వికి కావలసిన రక్షణాకవచము వాళ్ళు ఏర్పరచారు, మానవుడు చనిపోతే వాడి కర్మ వల్ల పోవాలి కానీ పృధ్వి వల్ల కాదు. కానీ వాళ్ళు ఈ రక్షణా కవచాన్ని ఎలా అమర్చారో మీరు కూడా తెలుసుకోవచ్చు, మీరు కూడా ఆ ఋషుల వారసత్వాన్ని పొంది వాళ్ళల్లో ఒకళ్ళుగా పని చేస్తాము అంటే రోజుకి నాలుగు గంటలు గురువుల పన్లకి ఇవ్వండి.
150898 కృష్ణాష్ఠమి
శ్రీ అరవిందులవారు ఋషులు చెయ్యలేక ఎక్కడ ఆగిపోయారో అక్కడినుండి మొదలుపెట్టి దానిని సాధించి చూపించారు. బ్లావెట్స్ఖి రాసిన Secret Doctrine శ్రీ అరబిందో సావిత్రీ , ఇలా పరమ గురువులవద్దనుండి వచ్చిన అనేక పుస్తకాలు మీరు చదవాలి, అవి చదవటము ఎంత కొత్త యుగాన్ని తీసుకునిరావటానికి ప్రముఖపాత్రవహిస్తాయో అర్ధం చేసుకుని ప్రతి ప్రజ్ఞాపుత్రుడు పగలు రాత్రి కష్టపడాలి.
150898 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |ఉజ్జయిన్యాం మహాకాలమ్ ఓంకారేత్వమామలేశ్వరమ్ ||
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ |సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||
మీలోని ప్రతి ఇంద్రియానికి ముందు దివ్య అనే పదమును కలపటానికి అధ్యాత్మిక సాధనలు ఉపయోగపడాలి, లేకపోతే అది అధ్యాత్మికత కాదు, మీ ఇంద్రియాలన్నీ దివ్య ఇంద్రియాలుగా మరాలి, భారతీయ యోగులలో ఆ దివ్యత్వము ఉంది, ఆ స్ధితికి అందరూ చేరాలి కానీ ఆ యోగులకి బానిసలుగా బ్రతకటం కాదు. వాళ్ళకి ఎన్ని దండాలు పెట్టినా మీకు ఆ శక్తి రాదు, ఆ శక్తి మీకు మీరుగా సంపాదించుకోవాలి. గాయత్రీ మంత్రము మనకు ఉపయోగపడకపోవటానికి కారణము మన శరీరములో ఆ మంత్రము ఎలా స్పందిస్తోందో మనము పట్టుకోలేకపోవటమే, ఆ అవేర్నెస్ తెచ్చుకోవాలి మీరు.
180898 ఆధ్యాత్మిక ప్రాకృతిక నియమాలు
ప్రకృతి మనకి అద్భుతమైనటువంటి శరీరం ఇచ్చింది. ఒక్క మనిషి తప్ప సృష్టి లో ఒక్క చిన్న కణం దగ్గర నుంచి ఈ విశాలమైన అంతరిక్షం లో వున్న తోకచుక్కతో సహా అన్ని సరైన క్రమమం లో వస్తున్నాయి, కాని ఒక్క మనిషి మాత్రం ప్రకృతికి అనుగుణమైన జీవితం జీవించలేకపోతున్నాడు.
190898 సృష్ఠికి ఆధారమైన శ్వాస
వేద విజ్ఞానము లేకుండా ఈ పృధ్విమీద శాంతి రాదు, మానవ జాతికి శాంతి లభించాలి అంటే వేద విజ్ఞానము వచ్చి తీరాలి.
210898 యోగ విద్య - శ్వాస ధ్యానము
స్వర యోగము ద్వారా 6 నెలల ముందే ఏమి జరుగుతోందో చెప్పవచ్చు, మీరు పడుకునేముందు, లేచే ముందు మీ శ్వాసలో జరిగే మార్పును పట్టుకోవాలి. ప్రతి వ్యక్తి శ్వాస ఇంకొకరి శ్వాస కంటే వేరు అనేది అర్ధము చేసుకోవాలి.
మొత్తము యోగ విద్య 14 మౌలికమైన విషయాల మీద ఆధారపడి ఉన్నది. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఐనా వీటిలో మార్పులేదు. షట్చక్రాల పై మీకు పూర్తి అవగాహన రావాలి. మూలాధార చక్రములో ఒక్కొక్క దళానికి సంబంధించిన గుణాలను మీరు అలవరచుకోవాలి. మీకు ఎవరిలోనూ ఎంత ఘోరమైన తప్పులు ఉన్నా ఆ తప్పులు మీకు కనిపించకూడదు, ఎవరి జీవితాలు వాళ్ళవి, గురువులు సరిదిద్దుతారు, మీరు కాదు. క్షమా ప్రేమ అనే రెండు లక్షణాలు రావాలి మీకు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ క్షమ ఉంటుంది. క్షమించే గుణము ఉంటే శాంతి వస్తుంది.
యోగ విద్య అనగా మీ ఇంద్రియాలకు ముందు దివ్యత్వము అనేది చేరాలి, అది నిజమైన యోగ విద్య. మీ దృష్ఠి దివ్య దృష్ఠిగా మారాలి, మీ శ్రవణము దివ్య శ్రవణముగా మారాలి ...అలా ప్రతి ఇంద్రియము దివ్యత్వాన్ని సాధించాలి. 4 సంవత్సరాల, 8 నెలల 6 రోజులలో ఈ స్ధితికి మీరు చేరుకొనవచ్చు.
230898 యోగ విద్య - శ్వాస ధ్యానము
101 మంది ఋషుల ప్రణాళికను తన నెత్తిన పెట్టుకుని పని చేసిన శ్రీ వెంకయ్యస్వామిని పిచ్చి వెంకయ్య అన్నది సమాజము, ఆయన న దగ్గర కొండంత ఉంది దానిని ఎవ్వరూ తీస్కోవట్లెదు అని బాధపడ్డారు, ప్రతి గురువు జీవిత చరిత్రా ఇదే చెప్తోంది మనకి. యోగ విద్య కోసము గురువుల వద్దకు వెళ్ళండి, మీ సమస్యలు తీర్చుకునేందుకు కాదు.
240898 యోగ విద్య - శ్వాస ధ్యానము
యోగ విద్య ద్వారా మనిషి దేవ మానవుడుగా మారాలి, ఈ యుగసంధి సమయములో మనము ఇక్కడ చేసే సాధనలవలన ఎన్నో ఉన్నతమైన మార్పులు ప్రకృతిలో జరుగుతున్నాయి. వాటిని మీరు గమనించుకోవాలి. గాయత్రీశాయ విద్మహే అని మీరు యజ్ఞములో వేసే ఆహుతులు ఉదయము సూర్యుడు బ్రహ్మగా సృజిస్తాడు, మధ్యాహ్నపు సూర్యుడు పోషిస్తాడు, రాత్రికి శివుడిగా తనలోకి అంతా లీనము చేసుకుంటాడు, ఈ మూడింటికి మూలమైన గురు తత్వాన్ని మీరు పట్టుకునే ప్రయత్నము చెయ్యాలి.
మీ ఆనందానికి కారణము ఏ భౌతికమైన వస్తువులోకానీ వ్యక్తులతో కానీ సంబంధములేదు, కేవలము మీకు కలిగే గురు స్పర్శ మీద సంబంధము ఉంది, కేవలము నందనవనములో హిమాలయాలలో చెప్పే విషయాలు నేను ఈ నాడు మీకు తెలియచేస్తున్నాను. నిరంతరము ఆ గురుస్పర్శకోసం తపించండి, మీ బాధలకి కారణము గురువు ఉన్నాడూ అని నమ్మి ఆయనపై భారము వెయ్యటానికే.
సాధకులకు ఇది పరీక్షా సమయము, ఈ యుగసంధికాలము మీకే కాదు, ఈ భూమికి కూడా. ఈ పృధ్వీ గ్రహానికి కూడా ఇది సంధి సమయము. అత్యంత గొప్ప జీవితము గొప్ప సమయములో మీకు దక్కింది, భగవంతుని కొరకే నేను పూజ చేస్తున్నాను అనే మానసిక స్ధితి మీకు రావాలి, అది మీ పరీక్ష రాసే తీవ్రత వంటిది.
250898 వినాయక చవితి - గణపతి మంత్ర దీక్ష
“గం” అనే శబ్ధము అనేక రకాల విఘ్నాలను తొలగిస్తుంది. భండాసురుడు సేనానాయకుడ్ని చంపటానికి అమ్మవారు “గం” అనే శబ్ధాన్ని వాడీ చంపేసింది.” ఓం గం గణపతయే నమ” మన శరీరంలో ఉన్న జెనెటిక్ కోడ్ ను మారుస్తుంది. మన శరీరంలోని గణములను జెనెటిక్ ఇంజనీరింగ్ చేసే కణములను ఈ శబ్ధము మారుస్తుంది. త్రిపురాసుర సంహారానికి శివుడుకూడా ఈ మంత్రాన్నే వాడుకున్నాడు. గణపతి మంత్ర దీక్షాను ప్రదానం చేసారు.
ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి దాని గురించి చర్చించుకుంటున్నాము జెనెటిక్ కోడ్ మార్చటం వలన మనం శరీరంలోనే కాక మన బాహ్యపరిస్థితులు కూడా మార్చవచు అని చెప్తున్నారు. అలా చెప్పటానికి ఆధారభూతమైనటువంటి ఆలోచనా విధానాన్ని మనం మూల మంత్రం తో నేర్చుకుంటున్నాం .
250898 వినాయక చవితి
యోగ సాధకుల ముఖ్య లక్షణము మీ జీవితాన్ని మీ కాలాన్ని ప్రణాళికాబధ్ధంగా జీవించుట- ప్లాండ్ అటాక్ ఉండాలి. నేటి సమాజములో గుడికి వెళ్ళటము, గాయత్రీ యజ్ఞము చెయ్యటము ఇవాన్నీ ఫాషన్ గా మారాయి, మరి మనము ఈ పన్లు ఎందుకు చేస్తున్నాము ? ఆశ్రమాల కార్యకర్తలకు, సాధకులకు అతి ముఖ్య సూచనలు. ఆశ్రమాలకు కావల్సిన వనరులు మనుషులు వస్తే వాటంతట అవే వస్తాయి. యజ్ఞాలలో పాల్గొనేవారికి యజ్ఞము మీద అవగాహన కల్పించకుండా మనము కూర్చో పెట్టకూడదు. ప్రతి సామూహిక యజ్ఞానికి తగిన శ్రమ చేసి వీలైనంత మంది వ్యక్తులకు అవగాహన కల్పించి వారితోనే కలిసి యజ్ఞానికి కావలసిన వనరులు సమకూర్చుకోవాలి. గురుదేవుల పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి, స్వాధ్యాయము లేకుండా సాధకులు కాలేరు. పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ప్రాణ ముద్ర అపాన ముద్ర 15, 15 నిమిషాలు తప్పక చెయ్యండి, ఇది యోగ విద్య నిష్ణాణతకు సులువైన మార్గము.
ప్రేమ, ఓర్పు, క్షమ, శాంతి మీలో వృధ్ధి చేసుకోగలిగితే మీ మూలాధార చక్రము జాగృతము ఐనట్టే. మీ బాధ్యతలని మీరు సక్రమంగా నిర్వహించండి. ఎల్లప్పుడూ మీరు శ్వాసని గమనించుకోండి.
270898 శ్వాస ధ్యానము- సూర్యుడు
శ్వాస ధ్యానము- సూర్యకిరణాలు మన శరీరముపై ఎలాంటి ప్రభావాన్ని తెస్తాయి అనేది గమనించండి, మీ శ్వాస సహజముగా ఉండాలి.
270898 శ్వాస ధ్యానము - వేదములు
శ్వాస ధ్యానము - వేదములు - శ్వాసను అర్ధము చేసుకొనగలిగితే అగ్ని విద్య, సూర్య విద్య, చంద్ర విద్య మొత్తము మూడు విద్యలు మీకు అర్ధం అవుతాయి.
280898 యోగ సాధనా సూత్రములు
యోగ సాధనా సూత్రములో మొదటిది మీ బాధ్యత. మీ బాధ్యతను విస్మరించినవారు యోగ సాధనకు పనికి రారు, మీ బాధ్యతలు మీరు నిర్మించినవి కావు, ప్రకృతి మీకు ఇచ్చినవి కాబట్టి మీకు ఎటువంటి పరిస్ధితులు ఉంటే మీరు ఉన్నతంగా ఎదుగుతారో ప్రకృతి మిమ్మల్ని అలాంటి పరిస్ధితిలోనే ఉంచుతుంది
290898 యోగ విద్య సూత్రములు
యోగ విద్యలో ముందుకు వెళ్ళాలంటే ఏ పనినైనా తక్షణమే చెయ్యాలి. పిల్లలకు చిన్నప్పటినుండి పని చెయ్యటము, బాధ్యతలను స్వీకరించటము నేర్పిస్తే వారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు.
290898 భగవద్గీత - 3వ అధ్యాయము - కర్మయోగము
భూతములు - ఈ సృష్టి అన్నము వల్ల ఏర్పడుతుంది, అన్నము పర్జ్యన్యము వల్ల ఏర్పడుతుంది, పర్జన్యము యజ్ఞము వల్ల ఏర్పడుతుంది - ఈ చక్రము ప్రకృతివల్ల ఏర్పడుతోంది. ఎవరు ఈ ప్రకృతి చక్రమును ఉల్లంఘిస్తాడో వాడు రాక్షసుడు. మీ కోసము మీరు సాధనలు చేస్కోవద్దు, చక్ర భ్రమణములో ఒక భాగముగా చెయ్యండి. నేను ఎప్పుడూ ఇచ్చే దేవాలయమువద్ద పని చేసే నలుగురు కూలీల మానసిక స్ధిథి కధ గుర్తు పెట్టుకోండి. మీరు చేసే సాధనలు, పని మీ బాధ్యతగా చెయ్యండి.
12 జ్ఞాన పక్షానికి చెందిన శక్తుల జ్ఞానము ఆచరణలోకి రావాలి. ప్రకృతిలో వున్నటు వంటి 24 శక్తులు సరిగ్గా ఉపయోగించుకుంటే మానవ జన్మ సార్ధకమవుతుంది
310898 గాయత్రి స్మృతి
అపరిగ్రహము, ప్రకృతినుంచి ఏది నాది, అని వేలాడే భావం ఉండకూడదు కామన్ సెన్స్ తో వుండాలి . అయాచక వ్రతము - ఏది అడగకుండా ఉండటము . విచక్షణ తో వున్నా జ్ఞానాన్ని పట్టుకోవాలి.
310898 గాయత్రీ స్మృతి
కౌశలము అనేది ప్రతి సాధకుడికి అత్యవసరము, దేవతలు ఎప్పుడు ఎప్పుడు ఓడిపోయారో దానికి కారణము వాళ్ళు సామూహికత్వాన్ని కోల్పోవటమే. సాధకుడు అందరితో కలిసి పని చెయ్యటము అనే కౌశలత్వము పెంచుకోవాలి.
గాయత్రి మంత్ర జపం ధ్యానం
మంత్ర జపం అయిన తర్వాత ధ్యానము చేయాలి. అద్భుతమైన శక్తి కేంద్రాలని జాగృతం చేసేటటువంటి ఈ మంత్రము జపించటానికి చాలా జన్మల పుణ్య ఫలం కావాలి. ఎంతో మంది ఋషులు జపం చేసినటువంటి మంత్రము ఇది అనే ఆర్తి భావంతో జపం చేయాలి.
గాయత్రి స్మృతి
ఎదుటివాడి మానసిక స్థితిని బట్టి సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి. అది గాయత్రీ లో “గో” అనేటటువంటి పదము చెప్తుంది. ఇంద్రియాలు నీ వశం లో వుండాలి తప్ప ఇంద్రియాలకి నువ్వు వశం కాకూడదు ఇది “దే” అనే పదము చెప్తుంది.
310898 గాయత్రి శక్తి ధారలు 1
బ్రాహ్మీ శక్తి అంటే ప్రకృతి యొక్క నియమాలు. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దానికి బేసిస్ కూడా ఈ బ్రాహ్మీ శక్తే . ఈ స్థితిలో వున్నవాడు బ్రాహ్మణుడు . భూమి మీద నడిచేటటువంటి దేవతలకు ఈ బ్రాహ్మీ శక్తి గాయత్రీ మంత్రము ద్వారా మీకు లభిస్తుంది. సరస్వతి అనేది బ్రాహ్మీ శక్తి యొక్క టెక్నాలజీ
310898 గాయత్రి శక్తి ధారలు 2
కేవలం విజ్ఞానం మాత్రమే సరిపోదు. దానికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలి. కాబట్టి గాయత్రీ కి సంబంధించిన 24శక్తులు ఇవి టెక్నాలజీ అవుతాయి. జ్ఞాన పక్షానికి సంబందించినటువంటి శక్తులు వేదమాత, బ్రాహ్మీ, వైష్ణవి, శాంభవి. ఈ 24 శక్తులు దుర్గలో ఎలా ప్రవేశిస్తాయి అనేది తెలుసుకుంటున్నాము.
310898 గాయత్రి శక్తి ధారలు 2 (1)
మూలాధారము నుంచి సహస్రారము వరుకు శ్వాస ఎలా వెళ్తుంది అనేది ప్రాణాగ్ని విద్య. ప్రకృతి లో ఉన్నటువంటి ఆ 24 శక్తులని గుర్తుంచుకోవడానికి “తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి” అని కూర్చారు. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ వుంటే మన శరీరం లో ఉన్నటువంటి 24 శక్తి కేంద్రాలు స్పందిస్తాయి. ఇప్పుడు మనము 24 శక్తులలో విజ్ఞాన పక్ష మార్గము ఇంకొకట్టి వామ మార్గము నేర్చుకుంటున్నాము
310898 గాయత్రి శక్తి ధారలు 2 (2)
భువనేశ్వరి సాధనని నారదుడు చేసాడు. ఈ వామ మార్గ పద్దతిలో నాభి వద్ద ఏకాగ్రతతో సంయమనం చేయగలిగిన వ్యక్తి తన శరీరం యొక్క నిర్మాణాని పూర్తిగా అర్ధం చేసుకోగలడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి జ్ఞానము నాభి నుంచి వస్తుంది
310898 గాయత్రి శక్తి ధారలు 2 (3)
ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానము. సైంటిస్ట్ ఒకలా జీవిస్తాడు ఇంజనీర్ ఒకలా జీవిస్తాడు. యోగ సాధన ఇవ్వడానికి నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయలు వచ్చాయి యోగవిద్య ద్వారా మీరు సాధించాల్సింది ఏంటి అంటే ఈ మొత్తం సృష్టిని నడిపించే శక్తి యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకోవచ్చు.
310898 శ్వాస ధ్యానము
ప్రకృతి మీకు మార్గదర్శనము చేస్తూ ఉంటుంది, మీరు దాన్ని గమనించుకోండి. ఆధ్యాత్మికత అంటేనే ఐశ్వర్యము, సిద్ధులు. మీరు యోగుకుగా మారాలి, యోగ సాధనకు తాళంచెవి శ్వాస.
310898 యోగసిద్ధికి సోపానములు
యోగము అంటే జపము, తపము కాదు. అనేక జన్మల పట్టి పుట్టుక చావు అనేది చూసిన మనము ఈ జన్మలో అన్నా అసలు మన జీవిత లక్ష్యము ఏమిటి? అన్న ఆవేదన తెచ్చుకోకపోతే యోగ విద్యలోకి మనము ప్రవేశించలేము.
310898 గాయత్రీ శక్తి ధ్యానము
గాయత్రీ శక్తి ధ్యానము - గాయత్రీ మంత్రములోని ఒక్కో అక్షరము ఒక్కొక్క శరీభాగాన్ని రక్షిస్తున్న భావనతో ధ్యాన విధానము
310898 ఒకే విశ్వము - ఒకే భాష - ఒకే ధర్మము
ఇప్పుడు జరుగుతున్న యుధ్ధాలు ఎక్కువభాగము మానసిక తలములో ఎక్కువగా జరుగుతున్నాయి. మనము మన మానసిక స్ధితిని జంతు స్థాయినుండి మానవ స్థాయికి అచ్చటినుండి దేవమానవ స్థాయికి తీస్కొని వెళ్ళాలి.
"సూర్యుడు ఎప్పుడు అయితే ఉద్భవిస్తాడొ దిక్కులు ఏర్పడతాయి. దిక్కులు ఎప్పుడు అయితే ఏర్పడతాయో ఆ దిక్కుకు సంభందించినటువంటి గ్రహాలు ఏర్పడతాయి. ఈశాన్య దిశకి అదిపతి బుధుడు. గురువు ద్వారా లభించే జ్ఞానం అఖండమయినటువంటి జ్ఞానం. ఆ అఖండమయినటువంటి జ్ఞానం మనకి బుధుడు దగ్గర నుండి వస్తుంది"
310899 గాయత్రీ స్మృతి
గురువు నుండి వస్తున్న గాయత్రీ మంత్ర శబ్ధము మీ అంతరంగములో ప్రవేశంచటాన్ని గమనిస్తూ గాయత్రీ మంత్రము చెయ్యాలి. ఏ మంత్రముకైన సాఫల్యము కలగాలంటే మంత్రానికి మీ భావనలు కలుపుకోవాలి.
140898 కృష్ణాష్టమి సందేశము - యోగ విద్యా నియమాలు
యోగ విద్యకు ఆధారభూతమైన నియమాలను తెలియచేసారు. భగవద్గీత యొక్క ప్రతి అధ్యాయాన్ని మీరు అర్ధము చేసుకుని దానికి తగిన విధముగా మీ జీవితాలను మలుచుకుంటే మీరు శ్రీ కృష్ణస్థాయికి చేరగలుగుతారు.
1998 కృష్ణాష్ఠమి
కృష్ణుని స్పర్శతో కుబ్జ అందవిహీనంగా ఉన్నది కూడా ఎంతో అందంగా తయారయ్యిందో అలా గురు స్పర్శద్వారా మీరు మీలో ఉన్న చెడు అంతా పోగొట్టుకోవాలి.
1998 కృష్ణాష్ఠమి
సుపర్ణా కిరణములు - వీటిని ఉపయోగించుకోవటము నేర్చుకోవాలి. మీలో ప్రేమతత్వము ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ కృష్ణతత్వాన్ని అర్ధము చేసుకునే శక్తి పెరుగుతుంది.
1998 కృష్ణాష్ఠమి
నాటుకోవటం నేర్చుకోండి, మంచి మాటలు నాటుకోండి, మంచి కర్మలు నాటుకోండి. మీ ఆలోచనలు ఏ దిశలో ఉంటాయో అదే దిశలో మీ పరిస్ధితులు ఉంటాయి అని తెలుసుకోండి. ఈ పృధ్విపై ఉన్న వనరులన్నీ మానవుల కోసమే ఉన్నాయి అనే రాక్షస ఆలోచనల నుండి బయటికి రండి.
సెప్టెంబర్
010998 24 గాయత్రి శక్తి ధారలు 2
"ఆచరణలోకి రాని జ్ఞానం ఎందుకు ఉపయోగబడదు. ప్రకృతిలొ ఉన్న 24 శక్తులు మన శరీరంలొ కూడ ఉన్నాయి. మనిషికి కుడి చెయ్యి, ఎడమ చెయ్యి ఎలా ఉంటుదొ ఆధ్యాత్మిక జగత్తులొ కూడ దక్షిణ మార్గము, వామ మార్గము ఉంటాయి . బ్రాహ్మి శక్తి సృజనాత్మకమయిన శక్తి. ఈ సృజనాత్మకమయిన శక్తి మొట్ట మొదట భూమిలొ కనిపిస్తుంది "
030998 గాయత్రీ సంహిత - గాయత్రీ గీత
గాయత్రీ సంహిత, గాయత్రీ గీత శ్లోకము, అర్ధము, వివరణ.
030998 గాయత్రీ సంహిత
గాయత్రీ గీత వివరణ, పారాయణ. భూర్ భువ: స్వహ వివరణ
030998 గాయత్రీ గీత గాయత్రీ స్మృతి
గాయత్రీ గీత గాయత్రీ స్మృతి స్త్రీల యొక్క శక్తిని అర్ధం చేసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వవలెను. స్త్రీకి మానవ జన్మని ఇవ్వగలిగిన శక్తి ఉంది, అంటె సృష్టి చెయ్యగల శక్తి పురుషునిలో కంటె అత్యధికంగా స్త్రీకి ఉంది. స్త్రీ సంయోగకాలములో ఎలాంటి ఆలోచనలతో ఉంటే అలాంటి పిల్లలు పుడతారు అనటానికి మహా భరతంలోని ధృతరాష్ట్రుడు, పాండురాజు మొదలగువారి జననాన్ని అర్ధం చేసుకోవాలి . ఈ విజ్ఞానాన్ని మనము ఆడపిల్లలకి అందించగలిగితే అత్యంత ఉన్నత మానసిక స్ధితి కల్గిన పిల్లలకి జన్మని ఇవ్వగలిగేట్లుగా వారిని మనము తయారు చెయ్యగలము. స్త్రీ పురుషులు సమానము అనే మాట అబధ్ధము, స్త్రీ పురుషుడికంటె అత్యంత శక్తివంతురాలు అనేది అర్ధం కావాలి, కానీ ఎప్పుడు అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని నేర్చుకున్న స్త్రీ మాత్రమే అనేది తెలుసుకోండి.
030998 గాయత్రీ గీత గాయత్రీ స్మృతి
గాయత్రీ స్మృతి జాగృదస్త్వ స్వదా భవ- నిరంతర జాగృత స్ధితిలో ఉండటం చాలా అవసరము . ఉదారత- ఇది అధ్యాత్మిక జగత్తులో అనంతమైన ఎత్తులకు తీస్కొని వెళ్తుంది.
030998 గాయత్రీ గీత
జీవితాన్ని ఒక పాటలాగా జీవించటం, ఏ రోజుకారోజు జీవించటం, ఆ రోజుకి ఆ క్షణానికి ఏమి కావాలో అది లభిస్తుంది అనే గాయత్రీ మంత్రములోని యోన: అనే మంత్రము మనకు నేర్పిస్తుంది.
040998 గాయత్రీ ఉపనిషత్
చాలా మంది వ్యక్తులు ఇంట్లో కూర్చుని టివీలో వచ్చే అధ్యాత్మిక గురువుల ప్రవచనాలు చూస్తూ ఆ వ్యక్తుల యొక్క ప్రావీణ్యతను గురుంచి పిచ్చా పాటీ మాట్లాడుతూ ఉంటారు. అంతే కాదు ఆ గురువుని గురుంచి అతి నీచంగా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వారిని అత్యంత కరుణ కల్గిన గురువు ఏమీ అనడు. కానీ ప్రకృతిలో మనము మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది, అందువలన ప్రకృతి వాళ్ళను కొంత సమయములో శిక్షిస్తుంది, అందువలన మీ వాక్కుని జాగ్రత్తగా వాడుకోండి, మాకు ఏందుకు ఇన్ని కష్ఠాలు ఉన్నాయో తెలీదు అనేవారు ఇలాంటి పాపము చేసినవారై ఉంటారు.
080998 గాయత్రీ రామాయణము
గాయత్రీ స్మృతి మనకు ప్రతి క్షణము గాయత్రీ శక్తిని ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్తుంది, గాయత్రీ సంహిత ఎలాంటి పధ్ధతులు అనుసరించాలో చెప్తుంది, గాయత్రీ గీత జీవితాన్ని ఎలా జీవించాలో చెప్తుంది, గాయత్రీ రామాయణము కుండలినీ జాగరణ గురుంచి చెప్తుంది.
110998 గాయత్రీ రామాయణము
భరతుడు జటాధారి ఐన రాముడిని కావాలనుకున్నాడు, జటాధారి అంటే ఋషి వలె జీవిస్తున్న రాముడిని కావాలనుకున్నాడు, రాజు ఐన రాముడు కాదు. కుటీరములో ఉన్న రాముడు కావాలనుకున్నాడు, ఇలాంటి రాముడ్ని కోరుకోండి సాధకులు . వర్ణాశ్రమ వ్యవస్థ స్థూల సూక్ష్మ కారణ శరీరాల పై ఆధారప్డి ఏర్పడింది అని తెలుసుకోండి.
దీక్షలు- మౌనము
మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకొనకపోతే గురువు ప్రవేశించలేడు, కాబాట్టి మౌనముగా ఉండటము అలవాటు చేసుకోండి. రకరకాల దీక్షల ప్రాముఖ్యతను వివరించాను అర్ధం చేసుకుని ఆచరించండి.
గాయత్రీ మంత్రాక్షర వివరణ
గాయత్రీ మంత్రము ద్వరా మీ కోరికలు తీరతాయి అనేది సత్యము, కానీ గాయత్రీ మంత్రము చెయ్యటంద్వారా మీరు బ్రహ్మ స్థాయికి చేరగలరు, అది మీరు నేర్చుకోవలసిన విషయము. గాయత్రీ మంత్రాక్షర వివరణ , ఒక్కొక్క అక్షరాన్ని అర్ధము చేస్కొని గాయత్రీ మంత్రాన్ని తన్మయత్వముతో ఎలా చెయ్యాలో వివరించారు.
సమస్యల నివారణకు గాయత్రీ
రకరకాల గాయత్రీ మంత్రజప విధానము వలన కలిగే ఫలితాల వివరణ, సమస్యల నివారణకు గాయత్రీ మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.? మనో నిగ్రహమునకు స్త్రీలకు : వృషభారూఢురాలైన, తెల్లని వస్త్రాలు ధరించిన నాలుగు భుజములు కల్గిన ఒక చేతిలో మాల, రెండవ చేతిలొ కమండలము, మూడవ చేతిలొ పుష్పము నాల్గవ చేతిలో పుస్తకము ఉన్న, ప్రసన్న ముద్రలో అమ్మవారిని ధ్యానము చెయ్యటమువలన మనో నిగ్రహము ప్రాప్తిస్తుంది.
110998 ధ్యానస్ధితిని పొందటం ఎలా ? క్లీం బీజసాధన
గాయత్రీ స్మృతి మనకు ప్రతి క్షణము గాయత్రీ శక్తిని ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్తుంది, గాయత్రీ సంహిత ఎలాంటి పధ్ధతులు అనుసరించాలో చెప్తుంది, గాయత్రీ గీత జీవితాన్ని ఎలా జీవించాలో చెప్తుంది, గాయత్రీ రామాయణము కుండలినీ జాగరణ గురుంచి చెప్తుంది.
030998 గాయత్రీ మాత యొక్క 24 శక్తి ధారలు
గాయత్రీ మాత యొక్క 24 శక్తి ధారలను సాధకుడు తప్పనిసరిగా అర్ధము చేసుకోవాలి, 12 దక్షిణ మార్గ శక్తులు, 12 వామ మార్గ శక్తులు ఉన్నాయి. జ్ఞాన పక్షానికి ఇచ్చిన ప్రాముఖ్యత మనము ప్రాక్టికల్స్ కు కూడా ఇవ్వాలి. దేవతా ఆరాధనలో మనము హనుమంతుడి దగ్గరకి వెళ్తే అరటిపండు నైవేద్యము పెడతాము, ఏ పండైనా పెట్టాచ్చా అంటే కాదు, మీరు ప్రాక్టికల్స్ చేస్తున్నాప్పుడు ఆ దేవత యొక్క గుణగణాలను క్షుణ్ణంగా తెలుసుకుని చెయ్యాలి. ఆలోచనలు, భావనలు & క్రియలు కలిపితేనే మీరు మీకు కావల్సిన దేవతానుగ్రహాన్ని పొందగలరు.
060998 గాయత్రీ ఋషులు - చందస్సు - దేవతలు
గాయత్రీ మంత్రమును ఎంత జపించినా ఆ శక్తిని ఉపయోగించుకోవటము మీకు రానప్పుడు అది దుర్వినియోగమవుతుంది. గాయత్రీ ఋషులు, చందస్సు, దేవతలు వీటిని సంపూర్ణంగా అర్ధము చేసుకోవాలి. సంధ్యాకాలము యొక్క సరైన అర్ధాన్ని పట్టుకోవాలి. పొద్దున బాలగా, మధ్యాహ్నము యవ్వనవతిగా, సాయంత్రము వృధ్ధగా అనే గాయత్రీ వర్ణన శారీరక స్ధితి గురుంచి కాదు మాట్లాడెది సాధకుడి యొక్క స్ధితి లో పరిణతలో రావలసిన మార్పులు గురుంచి మాట్లాడుతున్నారు.
గాయత్రీ మంత్రమునులోని భూర్ భువ:స్వహ: వివరణ
గాయత్రీ మంత్రమునులోని భూర్, భువ: స్వహ: అన్నా పావక , పవమాన & శుచి అన్నా, అ, ఉ, మా అన్నా ఒక్కటే. ఇవి స్థూల, సూక్ష్మ మరియు కారణ చేతనత్వముల యొక్క విస్తరణను గురించి మాట్లాడుతున్నాయి. మూలాధారము నుండి పైకి ఎరుపు రంగు కుడివైపునుండి, ఎడమవైపునుండి పసుపు వర్ణము, మధ్య నుండి నీలము వర్ణము పైకి వస్తున్నాయి. ఈ బ్రహ్మాండమునుండి వచ్చే పసుపు, ఎరుపు నీలము రంగులతో కలుస్తునాయి, దీనిని శిఖా బంధనము అంటారు. శిఖలోనుండి బ్రహ్మాండమునుండి వచ్చే ఎరుపు పసుపు నీలము రంగులు మన మూలాధారమును వైపు క్రిందకి వస్తున్నాయి, మూలాధారమునుండి పైకి వస్తున్న రంగులు రెండూ కలుస్తున్నాయి. ఈ సాధనలో వర్ణములు చాలా ప్రాముఖ్యము అని గుర్తుంచుకోండి.
020998 24 గాయత్రి శక్తి ధారలు 3
"విశ్వమాత అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబము. విశ్వమాత శక్తిని భౌతిక జగత్తులొ దింపేటటువంటి శక్తిని భవాని అంటాము. భవాని అంటే విశ్వమంతా ఒకటే అనే ఆలోచనలకు అడ్డు తగిలె పరిస్థితులను రూపుమాపాలి. "
030998 24 గాయత్రి శక్తి ధారలు 4
"వేదమంత్రాలను అర్ధం చేసుకోవడానికి, ఋతుంభర ప్రజ్ఞ జరగడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ప్రకృతి ఎప్పుడు ఏది చేసినా అది మన మంచికే. శ్వాస మీద దృష్టి. ఋతుంభర ప్రజ్ఞ యొక్క స్థూల జగత్తులొ పనిచేసె శక్తి భువనేశ్వరీ, భువనేశ్వరీ సాధన అంటె 14 భువనాలలొ ఎక్కడ ఈ విధమయినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు తగినట్లు ఆచరించగలగటం భువనేశ్వరి సాధన. "
040998 24 గాయత్రి శక్తి ధారలు 5
"అణువుల యొక్క కదలికే వాయువు. వాయువుకి స్వయంగ ఏ ఉనికి లేదు. అణువులు మన శరీరానికి తగిలే వేగాన్ని వాయువు అంటున్నాము . వాయువు వలన విజ్ఞానమయ కోసం ఉద్భవిస్తుంది. ఆనందమయ కోశానికి కారణ మయినటువంటి జలతత్వము, విజ్ఞాన మయకోశానికి కావలసినటువంటి వాయు తత్వము, మనోమయ కోశానికి కావాల్సిన నటువంటి అగ్నితత్వము ఏర్పడ్డాయి "
040998 గాయత్రీ వర్ణ ధ్యానము
గాయత్రీ వర్ణ ధ్యానములో గాయత్రీ మంత్రములోని ఒక్కొక్క అక్షరముపై ధ్యానము ఎలా చెయ్యాలి? దానివలన కలిగే ఫలితములు ఏమిటి అనే వివరణ
080998 గాయత్రీ రామాయణము 1
సుగ్రీవుడు - వాక్కు - రెండు స్వరపేటికలు గాలికి కంపిస్తూ ఉంంటాయి, ఆ రెండింటి వల్లే శబ్ధాలు అనంతముగా ఏర్పడుతున్నాయి, విశుధ్ధి చక్రము వల్ల ఇది జరుగుతోంది. మన శభ్దాలకు, మిగతా ప్రాణుల శబ్ధాలు మన వలె రక రకాల భావ పరంపరలను తెలుపలేవు. అది మానవుడికి మాత్రమే సాధ్యము.
080998 గాయత్రీ రామాయణము 2
రాక్షసుడు అనగా - యజ్ఞఘ్నాన్ - యజ్ఞములను ధ్వంసము చేసేవాళ్ళు రాక్షసులు. యజ్ఞము అనగా ప్రకృతియొక్క చక్రీయ క్రమము , దీన్ని భంగపరిచేవారు రాక్షసులు. ముందు రాక్షసత్వము అంంటే ఏమితో సరిగ్గా అర్ధము ఐతే అప్పుడూ మనము ఏ స్థాయిలో ఉన్నామో మనకే అర్ధం అవుతుంది.
గాయత్రి సాధనకి ద్వాదశ రాశులకి వున్న సంబంధం చేపుకున్తున్నాం. ప్రారబ్ద కర్మ మాత్రమే తెలుసు ఇప్పుడు మనకి సంచిత కర్మ గురించి తెలియదు. ఆగామి కర్మ ఎలా ఏర్పడుతుంది సంచిత కర్మ ప్లస్ ఇప్పుడు చేసుకున్నటువంటి కర్మ. జ్యోతిశాస్త్రం నిజంగా అధ్యయనం చేసుకుంటే ఈ ప్రారబ్ద కర్మ యొక్క స్పష్టమైన అవగాహన వస్తుంది. గాయత్రి మంత్రం అందరూ చేసుకుంటే సంచిత కర్మ తగ్గుతుంది. ప్రతి రోజు ఆత్మవలె జీవించాలి
ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవతా లక్షణాలు మీకు వస్తేనే మీరు ఉపాసన చేసినట్టు. భగవంతుడి ముందు కూర్చుని ఆ దివ్యత్వముతో, ప్రేమతో కరుణతో దైవ శక్తితో మనము ఓతప్రోతమవ్వాలి. జీవితాన్ని చూసే దృష్ఠికోణాన్ని మార్చుకోవాలి మీరు. ఒకే ఒక పరమాత్మ తనదైన ఒక రీతిలో ఒక నిర్ణీతమైన లక్ష్యమువైపుకు ఈ ప్రపంచాన్ని ముందుకు తీస్కొని వెళ్తున్నాడు.
110998 జన్మ కర్మ తపస్సు
గాయత్రీ మంత్రము అందరూ చేస్కొండి అని 1875 సంవత్సరమునుండి గురువులు గాయత్రీ మంత్రము చేస్కొండి, దానివలన మీ సామూహిక కర్మలు మారతాయి అని చెప్తే మీరు అది తప్ప అన్నీ చేస్తారు. ఏ వ్యక్తి ఐనా 5 రకాల కర్మలను పూర్తి చేసుకునేందుకు పుడతారు - 1.మృత్యువు యొక్క రహస్యాన్న్ని చేదింఛాలి ( ఆత్మ బోధ- తత్వబోధ)మిగిలిన అయిదింటిని ప్రవచనములో వినగలరు.
" నిరంతరం గురు సాన్నిధ్యంలో ఉండాలి. ఈ శరీరం నాది కాదు గురువుకి ఇచ్చెసాను అనే భావన ఉండాలి. ఏ పని చేసినా గురువే నా ద్వార ఈ పని చేయిస్తున్నాడు అనే భావన ఉండాలి, నేను చేస్తునాను అనే భావన ఉండకూడదు. "
040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 1
మీకు నచ్చని వాళ్ళు మీకు శత్రువు అయినటువంటి వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంటే కఛ్చితంగ వాళ్ళ దగ్గరకి తగినటువంటి శ్రద్ధతో తగినటువంటి భక్తితో వెళ్ళాలి. మీ లోపల ఉన్న అహంకారాన్ని గురువు మాత్రమె గుర్తించగలడు. గురువు యొక్క సమక్షంలొ గురువు యొక్క జ్ఞానంతొ శిష్యుడు కూడ గురువు లాగ మారాలి
040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 2
కష్టపడి పని చెయ్యండి. అది ఒకటే గాయత్రి మంత్రంలొ ఉన్న మూలం. కష్టపడి పని చేస్తె శ్రద్ధ విశ్వాసాలతొ మీరు ఎలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారొ అలాంటి పరిస్థితులు దాని అంతట అవే ఏర్పడతాయి. మనకి కావాల్సిన గాయత్రి సాధన మనం చేస్తుంటాము. జంతువులకు కావలసిన గాయత్రి సాధన జంతువులు చేస్తు ఉంటాయి. గరుడుడు విష్ణువుకి వాహనం కాగలిగాడు. సింహము దుర్గకి వాహనము కాగలిగింది.
040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 3
"నిరంతరము ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రము లక్ష్యం మీద ఉండాలి దానినె శ్రద్ధ అంటారు. నిరంతరం లక్ష్యాన్ని పొందటానికి ఎలా చెయ్యగలిగితె అలా చెయ్యాలి. సాధన అంటూ మొదలు పెడితే ఎప్పుడొ ఒక్కప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటారు. గాయత్రి సాధన ద్వార శ్రీని, ప్రతిష్టని, జ్ఞానాన్ని ని పొందగలరు"
040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 4
" ప్రకృతి నుండి శక్తులను ప్రతిష్టించుకొని ఆ శక్తులను ఎప్పుడు ఏది కావలొ ఉపయోగించుకునే విధానము యజుర్వేదము. యజుర్వేదము యజ్ఞము ద్వారా మనం అంతరిక్షంలొ ఉన్న శక్తులను కిందకు దింపుకోవచ్చు అని చెప్తుంది. మనకు ఏది కావాలంటే అది అంతరిక్షంలొ ఉంది. ఋగ్వేదము సూర్య కిరణాలు పదార్ధంగ మారడం. సూర్యుడు యొక్క అన్ని కిరణాలు ఎక్కడికి వెళుతున్నాయో సామ వేదం తెలుపుతుంది. "
040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 5
" గాయత్రీ సాధకుడు పూర్వ జన్మ సంస్కారాల వలన ఏ విధమయినటువంటి పరిస్థితి లబిస్తుందో అక్కడ ఆనందమయంగ జీవిస్తాడు, ఏదీ కోరుకోడు. యోగపరమయినటువంటి అలోచనా విధానము, శాస్త్ర పరమయినటువంటి జీవిత విధానము. అయాచక వ్రతము, అపరిగ్రహ వ్రతము పాటిస్తూ ఉంటాడు. "
090998 దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రము - వివరణ
దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రముయొక్క వివరణ అర్ధము చేసుకుంటు గంట సేపు గాయత్రీ మంత్ర జపము చేసుకున్న తరువాత ఈ శ్లోకాలు చదువుకుని 5 నిమిషములపాటు అజ్ఞా చక్రములో తెల్లని చల్లని జ్యోతిని ధ్యానించండి. ఇది కుండలినీ సాధన. ఈ సాధనను ఆ గురువు యొక్క అనుగ్రహముతో చేస్తున్నాము అనే భావనతో చేసుకోండి.
090998 దేవాలయములలో జపము యొక్క వైజ్ఞానికత
మంత్ర జపము చేసినప్పుడు జపము యొక్క శక్తి ఆకాశములోని ఉచ్చ లోకాలకు వెళ్ళి అది ఘనీభవించి మళ్ళీ తిరిగి వర్షిస్తుంది, ఇది దేవాలయాల వెనుక ఉన్న విజ్ఞానము. దేవాలయాలలో ఒకే చోట కూర్చుని నిత్యము సామూహికముగా ఏ దేవత ఆ గుడీలో ఉన్నదో ఆ దేవత యొక్క మంత్రాన్ని ఉచ్చరించటమువలన ఆ దేవాలయము యొక్క ఉచ్చ లోకాలలో పైన ఆకాశములో అంతా ఆ శక్తి ఆవరించి ఉండి ఆ గుడికి వెళ్ళిన అందరి మీద ఆ దేవత యొక్క అనుగ్రహము ఎల్ల వేళలా వర్షిస్తూ ఉంటుంది. ఒక నిర్ణీతమైన ప్రాకృతిక శక్తులు భూమికి, జలానికి, అగ్నికి, వాయువుకి సంబంధించిన దేవతలు ఒకొక్క స్థలముపై వాటీ అధికారము ఉంటుంది, అదే స్థలములో మీరు ఒకే సమయములో కూర్చుంటే ఆ తత్వములయొక్క కణాల యొక్క అధిదేవతలు మన చుట్టూతా చేరి మన శరీరములోని ఆ తత్వాధిదేవత యొక్క అనుగ్రహమువలన మన శరీరములో ఆ తత్వమును బ్యాలెన్స్ చేస్తాయి.
080998 గాయత్రీ మహా విజ్ఞాన్ వేదములు
" మనకు ఏది మంచిదో మనకంటే ప్రకృతికే బాగా తెలుసు అన్న విశ్వాసము, శ్రద్ధ ఉండాలి. సామర్ధ్యము ఉపయోగించకుండా, తెలివి తేటలు ఉపయోగించకుండా ఎదుటి వాడిని మోసం చేసి సంపాదించిన ఏ డబ్బు కూడ నిలవదు. కల్యాణ కరమయిన ఆలొచనలు ఎక్కడ ఉన్నా అది ఋగ్వేదము. "
060998 గాయత్రీ శాప విమోచనము గాయత్రీ రామాయణము
శాపం అంటె అవరోధాలు. కొన్ని శక్తులు కొన్ని చోట్ల అనవసరం. అందుచేత వాటికి అవరోధం కలిగించటానికి శాపం. శాపం గాయత్రికి లేదు. గాయత్రి యొక్క ఉపయోగాన్ని అవసరం ఐనప్పుడు ఉపయోగించు కోవటం అవసరం లేనప్పుడు మూసివేయటం.
070998 గాయత్రీ రామాయణము
నిద్రలేచిన దగ్గర నుండి పడుకునేవరకు కూడ ఒక వ్యవస్థగ నిర్ణీతమయిన లక్ష్యాన్ని పొందటానికి ఉపయోగించు కోవాలి. మంచి పని అయితే తక్షణమే చెయ్యాలి.
080998 గాయత్రీ రామాయణము
"ఆధ్యాత్మిక జగత్తులొ మీరు ముందుకు వెళ్ళాలంటె దేవతలవలె మీ వద్ద ఉన్నదాన్ని ప్రపంచంకోసం ఉపయోగించండి. ఆధ్యాత్మిక సాధకులకు, గాయత్రి సాధకులకు ఒకటె కులం."
090998 కుండలినీ సాధన దేవాలయములు పండగల విశిష్టత
మానవ శరీరధారి ఎవరయినా సరే సంచిత ప్రారబ్ధ కర్మను పూర్తి చేసుకోవడానికే పుడతాడు. ఎవరి ప్రారబ్ధ కర్మను బట్టి వారికి అలాంటి శరీరం వస్తుంది. మానవునికి ఒక లక్ష్యం మృత్యువు యొక్క రహస్యాన్ని చేధించుట. అది చేధించటానికి ప్రతి రోజు రాత్రి నిద్ర పోయెటప్పుడు మృత్యువు , ప్రతి రోజు పొద్దున్న నిద్ర లేచిన తరువాత కొత్త జన్మ అని అనుభూతి చెందుతూ ఉండటమే. ఒక ఆత్మలాగ జీవించగలగటం .
సర్వము మరిచి జ్యోతి మీదదృష్ఠి భృకుటి దగ్గర జ్యోతి దర్శనం, చాలా రిలాక్స్డ్ గా జ్యోతిని దర్శించండి. శరీరము ఏ స్థితి లో వున్నా పర్వాలేదు ఆ మానసిక స్థితి లో వుండాలి. ప్రతి రోజు మంత్ర జపం అయ్యాక ఈ సాధన చేసుకోవాలి.
090998 ఋషి మహర్షి
"బుద్దిని ఉపయోగించుకొనే శక్తి మనిషికి ప్రకృతి నుండి వస్తుంది. ప్రకృతి యొక్క శక్తులను తన అవసరాలకు ఉపయోగించు కొనేవాడు బలవంతుడు. బుద్ది బలం ఉన్నవాడు తను సాధించ వలసిన కార్యక్రమాలని సాదించగలుగుతాడు. "
నవరాత్రి సాధనా విధానము- పరిణామ క్రమము
గాయత్రీ అనుష్ఠానము చేసేటప్పుడు శక్తి కావాలనుకున్నవారు ఎరుపు రంగు , సమృధ్ధి కావాలనుకున్నవారు పసుపు రంగు & ప్రేమ ఆకర్షణ, కుటుంబములో శాంతి కోరుకున్నవాళ్ళు నీలము, తెలుపు వాడాలి. ఈ ప్రవచనములో చెప్పిన విధముగా చేస్తే ఏ సాధన ఐనా 100% ఫలితాని ఇస్తుంది.
110998 సూక్ష్మ జగత్
గాయత్రి అమ్మని చూస్తూ వుండండి, ఈ చిత్రము అతిచేతనత్వ స్థాయిని కూడా దాటినటువంటి ఋషులు నిర్మించినది మనము నిజం గా ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క చిత్రము కూడా ఇక్కడ ప్రతిబింబిస్తుంది. మిమల్ని బ్రహ్మ స్థాయిలోకి తెసుకువెళ్ళడానికి ఆవిడ వస్తుంది. గాయత్రి మంత్రము యొక్క అర్ధాని ౩ యోగాలుగా తెలుసుకుంటాము ( కర్మ, భక్తి, జ్ఞాన ). భగవత్ శక్తిని మనం ఓం అని పిలుస్తాము
110998 తపస్సు కర్మ
పుస్తకాలు చదవడం మాత్రమే కాదు వాటిని ఆచరణలోకి పెట్టాలి. యోగి అనేటటువంటి వాడు నిరంతరము స్మరణ లో వుండాలి. ఋషిమయ జీవితం అలవరచుకోకుండా కుండలిని జాగరణ మీకు రాదు. 6 చక్రాలు మరియు వాటి దళాలు బాగా అధ్యనం చేసుకోవాలి. మనసు నుంచి మొదలెట్టాలి. ఆజ్ఞ లో వుంది అంచేత కుండలిని జాగరణ మొత్తం ఆజ్ఞ చక్రం నుంచి మొదలవుతుంది.
ప్రారబ్ధ కర్మను మనం అందరం అర్ధము చేస్కునేందుకు జ్యోతిశాస్త్రాన్ని అందించారు. కానీ దానిని చాలా లోతుగా అర్ధం చేస్కొంటేనే ఇది సాధ్యము.
110998 ప్రారభ్ద సంచిత కర్మలు - తపస్సు
సంచిత కర్మ - అనేక జన్మలనుండి మూటలు మోస్తున్నాము. 12 రకాల తపస్సులనుగురుంచి వివరణ
దుర్గాష్టమి
రక్త బీజుడు అనగ్గా మన కోరికలు, ఒక కోరిక తరువాత ఇంకొక కోరిక పుట్టినట్ట్లుగా రక్త బీజుడు పుడుతూ ఉంటాడు. దుర్గా సప్త శతిలోని మొదటి అధ్యాయము కాళీ శక్తిని గురుంచి తరువాతి 8 అధ్యాయములు లక్ష్మీ శక్తిని గురుంచి తరువాత 13 అధ్యాయాలు సరస్వతీ శక్తినిగూర్చి తెలుపుతాయి.
300998 ఆస్ట్రాలజీ & వాస్తు
ఆస్ట్రాలజీ & వాస్తు - 12 రాశులలో 6 రాశులు ఇచ్చే రాశులు, 6 తీస్కొనే రాశులు, స్థిర స్వభావ రాశులు, చర స్వభావ రాశులు, ద్వి స్వభావ రాశులు . మొదట స్ధిర రాశి - మేషము.
సంపూర్ణ సృష్టిలోని మానవులు అంతా ఒకే చేతనత్వ స్థాయికి చేరుకున్నారు. వీరి పంచ కోశాలను ఇప్పుడూ అతి త్వరగా వికసింపచేసుకోవచ్చు.మన వద్ద ఉన్న 14 ఉపకరణాలను ఉపయోగించుకోవటమె మనము నేర్పవల్సిన విద్య, నేర్చుకోవలసిన విద్య. అన్నమయ, ప్రాణమయ కోశములను పూర్తిగా వివరించారు.
వ్యక్తి ముందుగా తన ప్రణాళిక, విశ్వ ప్రణాళికలోని తన భాగము రెండు అర్ధము చేసుకోవాలి, ఇది అర్ధం కావాలి అంటె మొదట తెలియవలసిన - నేచర్ ఈస్ ఆల్వేస్ రైట్. గాయత్రీ మంత్రము వల బలము, బుధ్ధి కౌశలము యశస్సు, ప్రతిష్ఠ అను 5 పొందటానికి గాయత్రీ మంత్రము మనకు ఉపయోగ పడుతుంది. Read Atlas Shrugged by Ayn Rand.
ప్రాణమయ కోశములోని పది వాయువులు, లేదా 10 ప్రాణాలే గాయత్రీ మాత యొక్క 10 భుజములు. హవ్యవాహ - మొండెములో శిరస్సులో, కవ్యవాహ - రెండు చేతులు రెండు కాళ్ళల్లో ఉంటుంది. ఆసనాలకి ఈ హవ్యవాహ కవ్యవాహ విద్యుత్తుకు సంబంధము ఉన్నది. కలియుగము పృధ్వీ తత్వ యుగము. మనిషి ప్రకృతినుండి ఏది తీసుకుంటున్నాడో అది తిరిగి ఇచ్చివెయ్యగలిగే శక్తి ఉండాలి, దానికే మనము యజ్ఞవిద్యను ఉపయోగించుకోవాలి. ప్రకృతిని సంతులనంగా ఉంచటం మనము తక్షణమే యజ్ఞముద్వారా చెయ్యవచ్చు.
బాహ్య ఆకాశము, అంతరాకాశము లేదా దహరాకాశము యొక్క లింక్ సోహం సాధనలో పట్టుకోగలిగితే కానీ విజ్ఞానమయ కోశ అనుభూతి రాదు.గాయత్రి మంత్ర సాధనలో పూర్తి ఏకాగ్రత, తన్మయత్వముతో ఆ అమ్మ రూపాన్ని మీరు దర్శీస్తూ చేసుకొనగలిగితే ఆ బ్రహ్మీ చేతనత్వములో పూర్తిగా ఐక్యము కావచ్చు.
గాంధీగారు అనీబిసెంట్ కలిసి థెయొసఫీలో కలిసి పని చేసారు, కానీ కర్మ సిధ్ధంతము వద్ద వాళ్ళిద్దరికీ కొంచెము తేడా వచ్చింది. అస్పృశ్యత నివారణ ఎలా జరగాలి? భౌతికమైన ఆందోళనద్వరా జరగాలి అని గాంధీగారు, అధ్యాత్మిక సాధనలద్వారా అందరిలోనూ ఒకే ఆత్మ ఉన్నది అని తెలియచెప్పటంద్వారా సాధించచ్చు అని అనిబిసెంట్ చెప్పారు. నిరంతరము ఆనందముగా ఉండటము అనగా ఆనందమయ కోశములో ఉన్నట్ట్లే
చేతనత్వ మనస్సులోని 10 ఇంద్రియాలు, సూక్ష్మ శరీరంలోని 10 ఇంద్రియాలను మనో బుధ్ధి చిత్త అహంకారములతో అనుసంధానము గాయత్రీ మంత్రము ద్వారా జరుగుతుది. హంసవాహిని గాయత్రీ మీద ధ్యానము చెయ్యవలెను.
270998 సూర్య కిరణ విజ్ఞానమే యోగ విజ్ఞానము
మానవ శరీరము మీద సూర్య కిరణాలు పడి శ్వాసగా మరినప్పుడూ జరిగే మార్పులను ఎలా లయబధ్ధముగా చేసుకోవాలో ఎలా లయబధ్ధము చేసుకోవాలో వేద విజ్ఞానము మనకు నేర్పుతుంది. యోగ విద్య అంటే సూర్య కిరణాల. మన శరీరము శ్వాసకు అనుగుణముగా మార్చటమే యోగ విద్య. ఈ విద్యను తెలుసుకునేందుకు గాయత్రీ మంత్రము అద్భుతంగా ఉపయోగపడుతుంది, సూర్యుడితో ఉన్న సంబంధాన్ని ఈ మంత్రముద్వారానే పట్టుకోవచ్చు.
అక్టోబర్
ఋషులయొక్క వాక్కులోని వరాలిచ్చే శక్తి, శపించే శక్తి మీరు తెలుసుకోవాలి అంటే ప్రకృతి నియమాలు అర్ధము చేసుకోవాలి. ప్రకృతి నియమాలకు లొంగిపోతే కానీ మీరు పంచతత్వాలపైన ఆధిపత్యాన్ని సంపాదించలేరు.
దుర్గా సప్తశతీ పారాయణ ఫలించాలంటే రామకృష్ణ పరమహంసవలె తన వద్ద ఉన్నదంతా ఆ అమ్మకు సమర్పించి, ఆవిడ ఎలాంటి జీవితాన్ని పరిస్ధితుల్ని ప్రసాదించినా పూర్తిగా సమర్పణా భావంతో స్వీకరించటం ద్వారానే సాధ్యము. దుర్గా సప్తశతీ కీలితమును బేధించటం అంటే అదే. శ్వాస ద్వారా గురువుని మనలోకి ఆవాహన చేసుకోవాలి.
ఈ నవరాత్రి సాధనవలన మానవజాతి మొత్తము అధ్యాత్మిక జగత్తులో మొదటి మెట్టు ఎక్కింది. మానవ శరీరమే వేద స్వరూపము, 4 వేదాలు నిరంతరము తమ వేద నాదాన్ని శరీరమునుండి ప్రసరింపచేస్తుంది. శ్రీ శైలమునుండి తిరుపతివరకు హాస్పిటల్స్ నిర్మాణము,భూమిలో దీక్ష ప్రవేశము తద్వారా సంపూర్ణ మానవజాతి దీక్షలో ప్రవేశము. వికాస క్రమమలో ముందు వెనక కోట్ల సంవత్సరాలు ఉన్న వ్యక్తులతో సంబంధము ఏర్పడుట.
ఋషులయొక్క వాక్కులోని వరాలిచ్చే శక్తి, శపించే శక్తి మీరు తెలుసుకోవాలి అంటే ప్రకృతి నియమాలు అర్ధము చేసుకోవాలి. ప్రకృతి నియమాలకు లొంగిపోతే కానీ మీరు పంచతత్వాలపైన ఆధిపత్యాన్ని సంపాదించలేరు.
శ్రీ అరవిందులువారు రాసిన సావిత్రీ అనే మహా గ్రంధాన్ని అంతా చదివితీరాలి. భారతీయులు సాధన చేస్తే ఏ స్ధితికి వెళ్ళగలరో రాసారు. ఫ్రాన్స్ మరియు జర్మనీ మధ్య జరిగిన యుధ్ధములో ఫ్రాన్స్ ఓడిపోవలసింది, కాని సావిత్రీ లొ ఒక స్టాంజా రాసి ఆయన ఫ్రాన్స్ గెలిచేలా చేసారు. దేశాలను గెలిపించింది, హిట్లర్ ను చంపించింది, జపాన్ దేశంలో వర్ల్డ్వార్ అయ్యాక ఒక గుర్తు తెలియని వ్యాధి వ్యాపించింది, సావిత్రీ లో రెండూ స్టాంజాస్ రాసి ఆ రోగాన్ని మాయం చేసారు. అఖండ గురుసత్తాలో నేను ఇచ్చిన గురుపరంపరను మీరు అర్ధం చేస్కోవాలి. వారి జీవిత చరిత్రలే మీకు మార్గదర్శకాలు.
1971 జూన్ 18th , 4 గంటల 15 నిమిషాలకు నాలో వచ్చిన మార్పు ఏంటి అనేది నాకు తెలుసు. 5 లక్షల మందిలో నేను ఒక్కడిని, 3 రోజలలో నా జీవితం మారిపోయింది. గురుదేవుల సాన్నిధ్యము అలాంటిది. ఆ సాన్నిధ్యాన్ని మీరు నిరంతరం అనుభూతిలో ఉంచుకోవటమే సాధన.
051098 మృత్యురహిత జీవితము జీవించడం ఎలా ?
ప్రతి దినము కొత్త జన్మ ప్రతి రాత్రి మృత్యువు అనే ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఎలా జీవిస్తే మృత్యురహిత స్ధితికి మానవుడు ఎదగగలడో వివరించారు. ఇది మళ్ళి మళ్ళీ వింటె కానీ అర్ధము కాని ప్రవచనము. మనము ఒక స్కూటర్ ను ఒక లక్ష్యానికి చేరటానికి ఎలా వాడతామో అలా మన శరీరాన్ని మన లక్ష్యమును సాధించటానికి ప్రతిరోజూ జాగ్రత్తగా ఎలా వాడాలి? కల ప్రపంచములో మునిగి పోకుండా పై స్థాయికి వెళ్ళటం ఎలా?
071098 యోగస్ధితి
నిద్రా స్ధితిలో జరిగే మార్పులను అర్ధం చేసుకోండి. పగలు మీరే చేసే కార్యక్రమాల యొక్క ప్రభావము రాత్రి మీ నిద్రాస్ధితిపై ఉంటుంది అని తెలుసుకుని చెయ్యండి.
141098 పృధ్వీ దీక్ష
ధరణీ మాత దీక్ష తీసుకున్నది, దానికి సహకరించిన ప్రతి వ్యక్తి యొక్క పాత్ర చాలా ప్రముఖమైనదే. శ్రీశైలం యొక్క నాలుగు ద్వారాలను సాధకులకు అనువుగా మర్చాలి. త్రిపురాంతకం, ఉమామహేశ్వరం, సిధ్ధ హఠం ఆలంపురం .
సుపర్ణ సూక్తము పారాయణ చేస్కోవాలి. పుట్టినరోజునాడు మనకు వేదాలు అర్ధం అయ్యేందుకు కావలసిన సహజ పరిస్ధితులు ఉంటాయి, ఇది ఏ జ్యోతిష్యవేత్త ఐనా చెప్పగలడు. ఆ రోజున అర్ధం ఐన వేదాలను సంవత్సరం అంతా నేర్చుకోవాలి. 100 మంది ఒకే రోజు పుట్టినవాళ్ళు కలిస్తే చేసే సాధన ఫలితం ఊహించలేరు. మనము నిద్రలేచినప్పుడు ఏ సూర్య కిరణము ఉంటుందో అదే ఆ రోజు మనం పుట్టిన సూర్య కిరణము. పడుకునేప్పుడు ఉండే సూర్య కిరణము ఏమి ఉందో కూడా తెలుసుకోండి.
నిత్య తృప్తో నిరాశ్రయ: అను స్ధితిని ఎలా సాధించాలో వివరించారు. సాధకుడు సాధన మొదలుపెట్టగానే మైనాకుడూ వస్తాడు. మొత్తము హనుమంతుడు సీతను వెతికేటప్పుడు ఉన్న వర్ణన అంతా సాధకుని సాధానా ప్రయాణమే. రాహు కేతువులను సరిగ్గ అర్ధము చేసుకొంటే సాధన యొక్క రహస్యాలు మీకు అర్ధము అవుతాయి.
గీత యొక్క జీవిత విధానాన్ని అర్ధం చేసుకుంటూ ఒక అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఏమిటది, ప్రకృతి లో మానవ శరీరము పొందినటువంటి మనము ఖచితంగా భగవంతుడి యొక్క అంశ మనలో వుంది.
211098 యోగ సాధకుల ఆవశ్యకత
గురువులు కూడా చాలా భలే మంచి చౌక బేరము అన్నట్టు చాలా మంచి అవకాశాన్ని అతి తక్కువ సాధన సమయములో అత్యంత విలైన అధ్యాత్మిక శక్తిని పొందే కాలము ఇది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను చెప్పే విషయాలను వీలైనంత ఎక్కువమందికి అందించండి, మీ బాధ్యతలు మీకు సక్రమంగా నిర్వహించండి, ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ సంతోషంగా ఉండండి. సర్వజ్ఞత్వం రావాలంటే మీ చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను గమనించుకోండి. అమెరికాలో 52,000 సంవత్సరాల బట్టి జీవించి ఉన్న వ్యక్తులు నాకు కొన్ని విషయాల్లొ మార్గదర్శనం అందించారు.
సనాతనముగా సృష్ఠి ఆది నుండి సృష్ఠి ఎన్ని సార్లు వచ్చి లయము అయినా అది అంతా సూర్యుడిలో ఉండే యోగ శక్తితోనే సాధ్యము. మన వైజ్ఞానికులు కూడా భూమిపై జీవనము అంతా సూర్యుడిపైనే ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. సూర్య విజ్ఞానము అనేది విశ్వజనీనమైనది, సూర్యుడినుండి అనేక కిరణాలు వస్తాయి, అందులోనుండీ మనము పట్టుకోవలసినది పట్టుకోవటానికి మనము చేసే సాధనలు ఉపయోగపడతాయి, మన అందరిదీ ఒకటే ధర్మము, ఇన్ని ధర్మాలు లేవు.
231098 భగవద్గీత - రెండవ అధ్యాయము
నిరంతరము గురు సన్నిధానములో ఉండటమే గురు స్పర్శ. గురువులు అలాంటి కర్మ నుండి మనల్ని బయటికి లాగేందుకు కావలసిన మార్గదర్శనం ఇవ్వగలరు. యోగికి మమకార అహంకారముల వల్ల సుఖ దు:ఖములు ఏర్పడకూడదు. ఏది జరిగిన ఓ కె అనుకోగలగాలి, కానీ పని చేసుకుంటూ పోవాలి. రాత్రి నిద్రపోయేముందు బ్రాహ్మీ స్ధితి గురుంచి అలోచిస్తూ పడూకుంటే మనకు కొన్ని రోజులకి ఆ స్ధితి మనది అవుతుంది. భగవద్గీత రెండవ అధ్యాయమును వివరించారు.
శ్రీ రామ కృష్ణ పరమహంస ఒక్క దేవతా శక్తులనే కాదు, గురువులను కూడా శక్తివంతము చేసారు. ఆయన సకల దేవతలను భూమిపైకి దింపి అందుబాటులోకి తెచ్చారు, అసలు అలాంటి గురువులకి ఏమిచ్చి ఋణము తీర్చుకోగలము? లాహిరీ మాహాశయ ఒక్కో శ్వాసతో పరిణామ క్రమములో ఎలా పురోగతి సాధించచ్చో చెప్పారు, శ్వాస అంటే కేవలము గాలి కాదు, దానితో ప్రాణశక్తిని ఎలా పీల్చుకోవాలో తెలియచేసారు. ప్రతి గురువు యొక్క సాధనా విధానము వారి జీవిత చరిత్రల ద్వారా తెలుసుకోవచ్చు.
మీరు శ్వాసని గమనిస్తూ ఉంటే ఏమి జరుగుతుంది అంటే మీ అంతరంగంలో మార్పు వస్తుంది, ఆ మానసిక స్ధితే యోగ స్ధితి. ఇది చాల తేలిక, మనము సినిమా చూస్తున్నపుడు, క్లాస్ లో ఉన్నప్పుడు శ్వాస ద్వారా ఈ మానసిక స్ధితికి వెళ్తున్నాం. శ్వాస ( కేవలం ముక్కు ద్వారా మాత్రమే కాదు) విభిన్న మార్గాల ద్వారా మన లోపలికి ప్రవేశించటం మీరు యోగ స్ధితిలో తెలుసుకుంటారు.
గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మన శరీరములోని అన్ని ఆర్గాన్స్ వాటి పని అవి చేస్తూ ఉంటాయి. మనము ఎక్కడ ఉంటామో అక్కడి దేశ కాల పరిస్ధులకు అనుగుణంగా మన శరీరము పని చేసేస్తుంది. దీనిలో మన ప్రమేయము ఏమీ లేదు. చేతనత్వము తన పని తను చేస్తుంది. 18 అధ్యాలలో ప్రతి అధ్యాయము ఒక్కో యోగాన్ని గురుంచి తెలుపుతుంది.
ఆహారము తీసుకునేప్పుడు వేసుకునే 5 ఆహుతులను మనం మర్చిపోయాం, ప్రకృతికి కృతజ్ఞత చెప్పటం మర్చిపోతున్నాము. ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా....అని 5 ఆహుతులు మీలో ఉన్న ప్రాణ దేవతలకు వేస్తున్నాము అనే భావనతో చెస్తేనే ఫలితాలు వస్తాయి, అడ్రస్ లేకుండా లెటెర్ పోస్టుచేస్తే ఎవరికి వెళ్తుంది.
291098 కర్మ యోగము
మానవ జీవితం లో రెండు విధాలైనటువంటి విద్యలు అని భారతీయ ఋషి సాంప్రదాయము మనకు చెప్తుంది అవి పరావిద్య, అపరావిద్య పరావిద్య ప్రకృతి యొక్క విద్య మనము కూడా ప్రకృతి యొక్క భాగమే కనుక ప్రకృతి యొక్క శక్తులతో తదాత్మ్యత చెంది తనను తాను మర్చిపోవటము పరావిద్య.
ఏ అవతారము వచ్చినా విష్ణువు నుండే వస్తుంది, ఏ గురువు వచ్చినా దత్తుడునుండే రావాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులయొక్క శక్తులు ఈ జగత్తులో ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోవాలి. గయత్రీ మంత్రము సూర్య విద్యనుగురుంచి తెలియచేస్తుంది, షోడశీ మంత్రము చంద్ర విద్యనుగురుంచి, యోగ విద్య అగ్ని విద్యను గుంచి తెలియచేస్తుంది. యోగ మాయా శక్తి అవతరణ రహస్యము.
అర్జున విషాద యోగ
అర్జున విషాద యోగములో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కు వచ్చిన విషాదమే మొత్తము మానవజాతి విషాదము. ఏది ధర్మము, ఏది అధర్మము అనే ప్రశ్న మనకు వచ్చింది అంటే మనము సాధకులము, రాలేదు అంటే అసలు మనము సాధకులము కాదు, రాలేదు అంటే మనము యోగ విద్యకు పనికిరాము అని గుర్తు పెట్టుకోండి.
ఆత్మబోధా విజ్ఞానము
గురువుకి కానీ భగవంతునికి కానీ నమస్కరించటము అంటే మన జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు నీకు సమర్పణ చేస్తున్నాను అని అర్ధము. మన మనో బుధ్ధి చిత్త అహంకారములపై పూర్తి ఆధిపత్యము సాధకుడికి రావాలి. నిద్ర లేవగానే నేను రోజంతా చేతనత్వముపై అవేర్నెస్ కలిగి ఉంటాను అని అనుకోవాలి.
సాంఖ్యయోగము
సాంఖ్యయోగము - నువ్వు నిల్చుని ఉంటే నేను నీ పని చేస్తాను, కానీ గురు ప్రణాళిక కోసము నిలబడటము మనకు రావాలి, నిలబడ్డాకే గురువు ఏది అన్న చెయ్యగలడు. యోగ విద్యనేర్చుకుంటాము అనే ప్రయత్నము మనము చేస్తే చాలు, ఆయన మనకు కావలసిన మార్గదర్శనము ఇచ్చేస్తాడు. సుఖముగా ఉన్నా, దు:ఖముగా ఉన్నా రెండింటిలో ఏదీ ఎక్కువకాలము ఉండదు అనే జ్ఞానముతో సాధకులు మెలగాలి - నిర్ద్వంద స్ధితి.
శ్రద్ధతో అసూయారహిత స్ధితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏది చేసినా అది కరెక్ట్ అవుతుంది . ఎందుకు జన్మ ఎత్తాము ఎందుకు నాకు మరణము వస్తోంది అనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ భగవత్ గీత సాధన అర్ధం చేసుకుంటే మీకు ఆ విషయం తెలుస్తుంది
నవంబర్
జాగృతావస్థకి స్వప్నావస్థకి మధ్య ఉండే సంధి సమయములో జరిగే ప్రక్రియ ఆత్మబోధ. మనం ఊహించినట్టు జరిగితే దానిని సంకల్ప స్ధితి అంటాము. ఈ ఎవేర్నెస్ పెంచుకోవటమే సాధన. స్థూల జగత్తుకి సూక్ష్మ జగత్తుకి మధ్య ఉన్న స్ధితిని మీరు అర్ధం చేసుకుని జీవించటమే యోగ స్ధితి. నిద్ర లేవగానే మంచం మీద పడుకుని ఓంకారము చెయ్యాలి. స్ధిత ప్రజ్ఞత్వ స్ధితి మనకి అందరికీ కావలి. అ-ఉ-మ అనే ఓంకారము ఆ భగవంతుని నామము.తస్య వాచకహ ప్రణవహ, అనేది మన అందరి లక్ష్యము. అ-ఉ-మ అనే ఉచ్చారణ చేస్తున్నప్పుడు వాటి మధ్య స్ధితిని పట్టుకుని చెయ్యాలి. మొత్తం 7 సార్లు ఉచ్ఛరించాలి. అక్కడ అశ్వనీ దేవతలు మనకు ప్రత్యక్షం అవుతారు
చావు అనేది ఒక పోస్ట్ హిప్నటిక్ స్తేట్ లాంటిది, ఇది జ్యోతిష్యం బాగ వచ్చినవాడికి తెలుస్తుంది. లాహిరీ మహాశయ యొక్క శిష్యుడు పరమహంస యోగానంద గ్రహ స్ధితిని దాటవచ్చు అని నిరూపించాడూ. పరణామ క్రమములో కోట్లాది సంవత్సరాలు జరిగిపోతుంటాయి, కలి ప్రధమ చరణంలో ఉన్న మనము సత్య యుగం వస్తోంది అంటె చాలా మందికి పొంతన కనిపించట్లేదు. చేతనత్వ పరిణామ క్రమములో కాలము యొక్క గణనకి పెద్ద స్థానం లేదు. సమయము అన్నది మనకి స్థూల లోకంలోనే.
041198 భగవద్గీత - కర్మయోగము
జన్మ జన్మల భవితవ్యత తెలిస్తే అన్ని జన్మలలోనూ తెలిసేది అడుగుతాము. కానీ మనకు తెలియదు కదా, అందుకని మనకి ఏది సరైనదో అదే గురువు ఇస్తాడు అనే నమ్మకము మనము మన గురువుమీద కలిగి ఉండాలి. భగవద్గీత కర్మయోగములో - అందరూ కర్మయోగమును ఆచరించే మోక్షమును పొందిరి. మీరు నమ్మిన సిధ్ధాంతాన్ని మీరు ప్రమాణంగా స్వీకరిస్తారా ? స్వీకరిస్తే భగవంతుడూ అన్ని చోట్లాఉన్నాడు అని నమ్మినప్పుడూ మన ప్రవర్తన ఇలానే ఉంటుందా ?
మన శరీరములో అన్ని పనులు ఒక పధ్ధతి ప్రకారము మన ప్రమేయము లేకుండా అత్యంత సహజముగా ఎలా జరుగుతుందో అలా మీ నిత్య నైమత్తిక కర్మలు కూడా అంతే సహజముగా జరగాలి, కర్మ యోగము చేసేటప్పుడు ప్రకృతే మనచేత అంతా చేయిస్తోంది అనే అవగాహన మనము కలిగి ఉండి అన్ని పన్లు సహజముగా చెయ్యగల స్థాయికి ఎదగాలి. మన శ్వాస మన ప్రమేయము లేకుండానే జరుగుతోంది, మన హృదయము మన ప్రమేయములెకుండానే కొట్టుకుంటోంది, ఇవన్నీ సహజముగా జరుగుతున్నాయి. స్ధిత ప్రజ్ఞత్వము లేనివాళ్ళు భగవద్గీతమీద కామెంటరీ చెయ్యకూడదు, చేసినా మీరు చదవకూడదు.
బాహ్య ఇంద్రియాల సంపర్కము పోయి అంతర్లీనులు ఐనప్పుడే అది ధ్యాన స్ధితిలోకి వెళ్ళినట్ట్లు, ఎలాంటి శబ్ధములు, చలనము, శరీరములో జరిగే మార్పులు మీకు తెలియదు. యోగము అనేది ఒక మానసిక స్ధితి, 18 రకాల మానసిక స్ధితులు మాత్రమే ఉన్నాయి. యోగ స్ధితిలోకి వెళ్ళిన వ్యక్తి యోగ స్ధితిలో ఉంటూనే పన్లు చేస్కోవాలి. ధ్యాన స్ధితికి,, యోగ స్ధితికి తేడా తెలిసుకోవాలి. నిద్రా స్ధితిని పోలిన స్ధితి ధ్యాన స్ధితి, నిత్య జీవితములో వచ్చే పరిస్ధితులను తట్టుకునే స్ధితి మనకు ధ్యానస్ధితిలో వస్తుంది. యోగ స్ధితిలో పరిస్దితులను చూసే దృష్టి కోణము మారుతుంది. బాహ్య జగత్తులో పరిస్ధితులు మారవు కానీ దృష్టికోణము మారగానే ఆ పరిస్ధితులను అధిగమించే శక్తి మీకు వస్తుంది..
081198 కర్మ యోగము
ప్రతి పనిని శ్రధ్ఢతో ఆచరించాలి, భగవత్ గీత సాధన అర్ధం చేసుకుంటే మీకు ఆ విషయం తెలుస్తుంది.
201198 సావిత్రీ
వ్యక్తి ఎవరి మీద ఆధారపడకుండా కేవలము ప్రకృతిపై అధారపడి జీవించటము అనేది సావిత్రీ విద్యలో మనము నేర్చుకోవలసిన ముఖ్య విషయము. బిడ్డ తల్లి గర్భములో ఉండగా జరిగే మోత్తము సమయాన్ని ఈ గ్రంధములో వివరించారు శ్రీ అరవిందులవారు. ద్యూమత్సేనుడూ ధృతరాష్ట్రుడు అన్నా ఇద్దరూ ఒకే లక్షణాలు కలిగినవారు.
డిసెంబర్
ఆ యోగమాయా శక్తి పంచాతత్వాల రూపములో పంచ భూతాల రూపం లో వుంటుంది. ఆ చరణాల యొక్క పిల్లలము మనము అనేటటువంటి భావన తో వుండాలి. ఏ కోరికలు లేనటువంటి స్థితిలో వుండాలి. నా శరీరాన్ని నా మనస్సుని నీకు సమర్పిస్తున్నాను.
భారతదేశముపై ఆ మహాయోగేశ్వరీ దేవి పాదముల నుండి మొదలుకొని ఆవిడ సప్త వర్ణములతో ఉండే ముఖమువరకు ఉన్న వర్ణనపై ధ్యానము.
1998 గాయత్రీ1
ప్రతి వ్యక్తి ఎప్పుడైతే స్థూల శరీరము ధరిస్తాడో ఆ క్షణములో చుట్టురా ఉన్నటువంటి ౩ పరిస్థితులకు బధ్ధుడైవుంటాడు, వాటినే ౩ గ్రంధులు లేక ౩ బంధాలు అంటాము. కుండలిని ప్రక్రియలో కుటుంభ పరిస్థితులు విష్ణుగ్రంధి ,పెద్దవాడై సమాజంలోకి వచ్చినపుడు పరిస్థితులు రుద్రగ్రంధి, మనిషి మీద ప్రకృతి యొక్క ప్రభావము బ్రహ్మగ్రంధి.
1998 గాయత్రీ2
గాయత్రీ బ్రాహ్మి యొక్క ప్రిన్సిపల్ ఒకటే సాముహికమైనటువంటి జీవనము జీవించటము. ఎప్పుడైతే సాముహిక కోరికలు కోరతారో అప్పుడు విష్ణు గ్రంధి నుంచి శివ గ్రంధికి శివ గ్రంధి నుంచి బ్రహ్మ గ్రంధి కి వస్తాము. సత్సంకల్పాలు బ్రహ్మ గ్రంధి యొక్క జాగరణ కొరకు పెట్టినది. సేవ అంటే ఎదుటివాడికి కావలసినది ఇవ్వటము, మనకు నచ్చినది చేయటము కాదు. స్వాధ్యాయ సత్సంగాలలో సహజంగానే సాముహికత వుంటుంది కనుక బ్రాహ్మి గ్రంధి ఆక్టివేట్ అవుతుంది.
1998 చక్రములు
స్థూల జగత్తులో ఈ 6 చక్రాలు వుంటాయి. మనిషి 6 గుణాలు కనుక అలవరుచుకుంటే షట్చక్ర జాగరణ జరిగిపోతుంది. మనము ఏ పని చేస్తున్నా ఈ 6 చక్రాలు ఉపయోగించుకుంటాము. సహనము కనుక అలవరుచుకుంటే మూలాధారము యొక్క జాగరణ జరిగిపోతుంది.ఈ మూలాధారము యొక్క జాగరణ జరిగినప్పుడు నాడి మండలం లో వచ్చేటటువంటి శబ్దము లం అని వస్తుంది.
1998 కుండలిని 1
శరీరమే ఒక ప్రయోగశాల. ఈ శరీరము నేను కాదు, ఈ బాధలన్నీ శరీరపరమైనవి తప్ప ఆత్మవి కాదు. ఏదైతే మనలో ద్రష్ట గా వుందో అది నేను. పునర్జన్మ ఏదైతే ఎత్తుతోందో ఆ నేను అనేటటువంటిది 7తలాలని దాటుతుంది ఆ తర్వాత అది పనిచేయటం మొదలుపెడుతుంది.
1998 కుండలిని 2
గాయత్రీ ని విశ్వమాత , వేదమాతా , దేవమాతా అనే మూడు రకాలైన శక్తులుగా కొలుస్తాము
1998 కుండలిని 3
గాయత్రిమంత్రానికి కధ ఏంటి అంటే యోగనిద్రలో వున్నటువంటి విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ వస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మని సృష్టి చేయమని చెప్తాడు. ఆ తర్వాత బ్రహ్మ గాయత్రిని జపిస్తాడు అప్పుడు గాయత్రి యొక్క శక్తి నుంచి సృష్టి ప్రారంభమవుతుంది. ఏకముఖి గాయత్రి,ఏకముఖి లో మనిషి యొక్క చేతనత్వము వికసిస్తుంది,
1998 కుండలిని 4
ప్రపంచం మొత్తం సుఖంగా వుండాలి అని ప్రార్ధన చెస్తునాము అదే సహస్రార చక్ర జాగృతం అంటే. 7చక్రాలు వున్నాయి, అంటే ప్రతి శరీరంలో 7 ఫోర్సు సెంటర్ వున్నాయి. ఒక్కొక ఫోర్సు సెంటర్ ఒక్కొక రకమైనటువంటి శారీరక గతివిధులని కంట్రోల్ చేస్తుంది. సృష్టి మొత్తం కూడా మణిపూరక చక్రం నుంచి మొదలవుతుంది.
1998 కుండలినిబ్రహ్మ గ్రంధి
ప్రతి వ్యక్తి ఎప్పుడైతే స్థూల శరీరము ధరిస్తాడో ఆ క్షణములో చుట్టురా ఉన్నటువంటి ౩ పరిస్థితులకు బధ్ధుడైవుంటాడు, వాటినే ౩ గ్రంధులు లేక ౩ బంధాలు అంటాము. కుండలిని ప్రక్రియలో కుటుంభ పరిస్థితులు విష్ణుగ్రంధి ,పెద్దవాడై సమాజంలోకి వచ్చినపుడు పరిస్థితులు రుద్రగ్రంధి, మనిషి మీద ప్రకృతి యొక్క ప్రభావము బ్రహ్మగ్రంధి.
మనము ఏ విషయాన్నైనా ప్రకృతి నుంచే నేర్చుకుంటాము. కుండలిని జాగరణలో స్థూల సుక్ష్మ కారణ శరీరాల జాగరణ మరియు పంచకోశ జాగరణ కూడా ఏక కాలంలో ఈ మూడు సాధనాల ద్వారా పొందొచ్చు, అవి మౌనము, ధ్యానము, జపము.
ఋషి మహర్షి రాజర్షి దేవర్షి బ్రహ్మర్షి స్ధితుల వివరణ. ఋషిత్వము అనగా ఋజుత్వము.