About the Page

వేద మాత దేవ మాత విశ్వ మాత అయిన అమ్మ గాయత్రీ దేవి పై ప్రవచనములు. వేదమూర్తి, తపోనిష్ఠ, యుగద్రష్ఠ అయిన శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులు వ్రాసిన గాయత్రీ మహా విజ్ఞానముపై వైజ్ఞానికి ఆధ్యాత్మిక పధ్ధతిలో ఈ తరం వారికి అర్ధం అయ్యే విధముగా శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురుదేవులు అందించిన అపూర్వమైన జ్ఞాన సంపదను ఈ ప్రవచనములలో వినవచ్చు.

24 గాయత్రీ శక్తి ధారలు 24 Gayatri Shakthi Dharalu

24 గాయత్రీ శక్తి ధారలు 24 Gayatri Shakthi Dharalu - : 1 గాయత్రీ మాత యొక్క 24 శక్తి ధారలులో 12 జ్ఞానమార్గానికి సంబంధించినవి, 12 వామమార్గానికి సంబంధించినవి. ఆదిశక్తి మూడు లక్షణాలు కలిగి ఉంటుంది, అవి జాగృత, స్వప్న & సుషుప్తి. అపరిగ్రహ వ్రతాన్ని ఈ మూడు స్ధితులలోనూ పాటించాలి. అపరిగ్రహ వ్రతాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని పాటించాలి.గాయత్రీ యొక్క జ్ఞాన పక్షములోని 12 శక్తులు : 1.ఆదిశక్తి, 2. బ్రాహ్మీ శక్తి, 3. వైష్ణవీ శక్తి, 4. శాంభవీ శక్తి, 5. వేదమాతా శక్తి, 6. దేవమాతా శక్తి, 7. విశ్వమాత శక్తి,8. ఋతుంభరా శక్తి, 9. మందాకిని శక్తి, 10. అజపా శక్తి 11.రిధ్ధి శక్తి, 12. సిధ్ధి శక్తి. వామమార్గీ శక్తులు: 1.సావిత్రీ శక్తి, 2.సరస్వతి శక్తి, 3.లక్ష్మి శక్తి, 4.దుర్గా శక్తి, 5.కుండలిని శక్తి 6.ప్రాణాగ్ని శక్తి 7.భవాని శక్తి,8.భువనేశ్వరీ శక్తి, 9. అన్నపూర్ణ శక్తి, 10.మహామాయ శక్తి 11.పయశ్విని శక్తి, 12 త్రిపురా శక్తి.

24 గాయత్రీ శక్తి ధారలు 24 Gayatri Shakthi Dharalu

24 గాయత్రీ శక్తి ధారలు 24 Gayatri Shakthi Dharalu - 2: గాయత్రీ మాత యొక్క 24 శక్తి ధారలులో ఏ శక్తిని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనే కమాండ్ సరిగ్గా ఉండాలి.మనం మన ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోగలుగుతామో అలాగే ఈ శక్తులను ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకునే వాక్కు ఋషులు ఉపయోగించుకునే వాక్కు ఒక్కటే కదా, దానిని వాడే విధానమే తప్పు. మనం మన వాక్శక్తిని దురుపయోగం చేసుకుని ఋషి వాక్కులాగా పనిచెయ్యాలి అంటే చెయ్యదు. మనం మారితేనే మనకు ఈ దేవతా శక్తులు ఉపయోగపడతాయి.

24 గాయత్రీ శక్తి ధారలు 24 Gayatri Shakthi Dharalu

24 గాయత్రీ శక్తి ధారలు 24 Gayatri Shakthi Dharalu -3 : వేదమంత్రాలను అర్ధం చేసుకోవటానికి, మనలో ఆ ఋతుంభరా ప్రజ్ఞ అవతరణ జరగటానికి మనం మౌనాన్ని పాటిస్తూ శ్వాసని గమనించుకోవాలి. నారదులవారు భువనేశ్వరీ సాధనను చేసారని వినికిడి. మౌనంగా ఉండి అద్భుత ఫలితాలను పొందటమే మహామాయా శక్తి. రిద్ధి - సిధ్ధి ఇవి వినాయకుని యొక్క భార్యల పేర్లు. రిధ్ధి కి పయస్విని, సిధ్ధికి త్రిపురా శక్తి. మన మనస్సులలో మన భావనలలో ఎలాంటి మలినాలు లేకుండా చూస్కుంటే మనకు 14 భవనాలలో ఉన్న జ్ఞాన గంగను మనం ఈ శక్తులద్వారా పొందవచ్చు.

చతుర్వింశతి గాయత్రీ - Chaturvinshathi Gayatri

చతుర్వింశతి గాయత్రీ - Chaturvinshathi Gayatri: ప్రకృతిలో ఉన్న 24 దేవతా శక్తులకు కొన్ని పదార్ధాలకి, కొన్ని భావాలకి కొన్ని శక్తులు ఉంటాయి. వాటిని అర్ధం చేసుకుని ఉపాసన చెయ్యాలి. స్పందనలు, ఆలోచనల పరంపర ( భావాలు), క్రియలు ఈ మూడు కలిస్తేనే విద్మహే, ధీమహి, ప్రచోదయాత్ అవుతుంది - త్రిపదా గాయత్రీ. యద్భావం తద్భవతి. భౌతిక జగత్తులోని పదార్ధాన్ని పట్టుకోకుండా ఏ ఆలోచన ఐతే ఆ పదార్ధాన్ని ఇస్తోందో డైరెక్ట్ గా ఋషులు ఆలోచనా జగత్తులోకి వెళ్ళి ఆ మార్పు తెచ్చే శక్తులను పట్టుకోవటం ద్వారా తోదరగా ఫలితాలను పొందచ్చు. మానసిక తలంలో భావపరంపరను పట్టుకుంటే మీ శరీరాన్ని మీ మస్థిష్కాన్ని ఉపయోగించుకుని మీరు ఆ ఫలితాలను పొందవచ్చు. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా వుంటుంది. ఈ 24 గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రి అని పేరు. ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై వున్నాడు. 1. తత్ - విఘ్నేశ్వరుడు 2. స - నరసింహస్వామి 3. వి- శ్రీమహావిష్ణువు 4. తుః - శివుడు 5. వ- శ్రీకృష్ణుడు 6. రే - రాధాదేవి 7. ణ్యం - శ్రీమహాలక్ష్మి 8. భ- అగ్నిదేవుడు 9. ర్గః - ఇంద్రుడు 10. దే - సరస్వతీదేవి 11. వ - దుర్గాదేవి 12. స్య - ఆంజనేయ స్వామి 13. ధీ - భూదేవి 14. మ- సూర్యభగవానుడు 15. హి- శ్రీరాముడు 16- ధి- సీతాదేవి 17. యో - చంద్రుడు 18. యో- యముడు 19. నః - బ్రహ్మ 20. ప్ర - వరుణుడు 21. చో - శ్రీమన్నారాయణుడు 22. ద- హయగ్రీవుడు 23. యా - హంసదేవత 24. త్ - తులసీమాత ఈ 24 దేవతలకు మూలమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్తశుభాలు కలుగుతాయి.

గాయత్రీ ఛందస్సు - Gayatri Chandassu

గాయత్రీ ఛందస్సు - Gayatri Chandassu :గాయత్రీ ఋషి, ఛందస్సు, దేవతలు గురుంచి మనం తెలుసుకోవాలి అంటే ముందు మన ఋషి గురుంచి తెలుసుకోవాలి. బుధ్ధి, బలం, కౌశలం, యశస్సు, ప్రభావము అను ఈ 5 తత్వాలు ఉన్నవాళ్ళు ఋషులు. గాయత్రీ మంత్రముపై శ్రధ్ధ విశ్వాసము ఉన్న వ్యక్తి కృష్ణుడైపోతాడు. మూడు సంధ్యలు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చ్చి 3000 గాయత్రీ మంత్రం చేస్తే ఆ వ్యక్తి దేవతలకి కూడా పూజ్యుడు అవుతాడు. మీ యొక్క చేతనత్వము జాగృతావస్థలోంచి నిద్రావస్థలోకి వెళ్ళే సమయం మీ సంధ్యా సమయం. అర్ఘ్యం ఇచ్చే నీటిని చిన్న మొక్కల కుండీలో కానీ, ఉంటే తులసి మొక్కకు కానీ తప్పక సమర్పించండి. గయత్రీ మంత్రములోని ఒక్క అక్షరాన్ని అన్నా మీరు సిధ్ధింపచేసుకుంటె మీరు శివునితో, హరునితో, అగ్నితో..ఇలాంటివారితో పోటీపడతారు.

గాయత్రీ చిత్రావళి - Gayatri Chitravali    (click here to view images)

గాయత్రీ చిత్రావళి Gayatri Chitravali 1&2: గాయత్రీ చిత్రావళిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో మొదటి సాధన గాయత్రీ మంత్రాన్ని 5 సార్లు ఉఛ్చారణ చేస్తాము, చేసేప్పుడు ప్రతి అక్షరము మన మనోఫలకములో దర్శించటం అతి ముఖ్యమైన విషయం. ఇలా చేసాకా అమ్మ యొక్క ప్రతిస్పందన గురుంచి ఎదురుచూస్తూ కాసేపు మౌనంగా కూర్చోవాలి. భౌతిక శరీరము మనకు మన తల్లి తండ్రులదగ్గరనుండి లభిస్తుంది, అలానే మనకు ఆధ్యాత్మిక తల్లి గాయత్రీ మాత, తండ్రి గురువు. వారిద్దరినీ మనస్సులో చూస్తూ సాధన ఎలా చెయ్యాలో వివరించారు. గాయత్రీ మంత్రాక్షరాలను కారణజగత్తులో ఉచ్చలోకాలలో ఉన్న తల్లి వద్దకు వెళ్ళి మనకు అనుగ్రహాన్ని ప్రసాదించే సాధన వివరించారు.

గాయత్రీ చిత్రావళి - Gayatri Chitravali    (click here to view images)

గాయత్రీ చిత్రావళి Gayatri Chitravali 3 గాయత్రీ చిత్రావళినిలో పశ్యంతీ స్థాయిలో అంటే కారణ జగత్తులోని శక్తిధారలతో సంబంధం పెట్టుకునే విద్య. ట్రైయాంగిల్ మెడిటేషన్ వివరించారు. గురువు, గాయత్రీ మాత, సాధకుడు మధ్య ఏర్పడే త్రిభుజం పూర్తి వివరణ. ఈ సాధనలో అనేక కోట్ల శక్తి ధారలు మన వద్దకు వస్తాయి, మనం ఎంత భరించగలం అనేది గురువు చూసి మనకు తగినంత శక్తిని ప్రసాదిస్తారు. పంచముఖి, దశభుజి గాయాత్రీ మాత వివరణ, దర్శన విధానాన్ని వివరించారు.

గాయత్రీ చిత్రావళి - Gayatri Chitravali    (click here to view images)

గాయత్రీ చిత్రావళి Gayatri Chitravali: కల్పాంతం తరువాత కొత్త కల్పాన్ని సృష్టించేందుకు నారయణుడి నాభి నుంది వచ్చిన బ్రహ్మ మొత్తం సృష్ఠిని గాయత్రీ మంత్రముతోనే చేసారు. సృష్ఠి ఆదిలో ఉపయోగించుకున్న శక్తి బ్రాహ్మీ శక్తి. పరా, పశ్యంతి, మధ్యమా & వైఖరీ స్థితులలో మొత్తం సృష్టి ఈ శక్తిని ఉపయోగించుకునే జరిగింది. ఇదే శక్తిని మనం కూడా ఉపయోగించుకోవచ్చు. బ్రాహ్మీ శక్తి యొక్క నాలుగె వేదాలు, నాలుగు ధర్మాలు, నాలుగు పురుషార్ధాలు బ్రాహ్మీ శక్తి యొక్క అభివ్యక్తీకరణ. బ్రహ్మీ, వైష్ణవీ శక్తుల చిత్ర వివరణ, ఉపయోగాలు వివరించారు.

గాయత్రీ చిత్రావళి - Gayatri Chitravali    (click here to view images)

గాయత్రీ చిత్రావళి Gayatri Chitravali 6: గాయత్రీ మాత బ్రహ్మీ శక్తి అంటే జ్ఞానము, వైష్ణవీ శక్తి అంటే పరిపాలన, శాంభవీ యొక్క శక్తి అంటె లయకారము. వృషభవాహనములో ఎద్దు మీద కూర్చుని ఉన్న గాయత్రీ మాత, మెడలో పాములు, శివునివలె మూడవ కన్ను. త్రిశూలం, డమరులతో ఉన్న అమ్మను దర్శించాలి. పశ్యంతీ స్థాయిలో మీరు కళ్ళు మూసుకుని, ఒక విశెషమైన మానసిక స్థితిలో చెయ్యాలి. శాంభవీ శక్తి జీర్ణం అయ్యి నాశనము అయ్యి ఉన్న దానిని నూతన నిర్మాణ చెయ్యాలి అన్నప్పుడు శాంభవీ శక్తి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమాజంలో అలాంటి పరిస్థితి ఉన్నది. నూతన సమజాన్ని నిర్మించేందుకు ఈ శక్తి ఉపయోగపడుతుంది.

గాయత్రీ చిత్రావళి - Gayatri Chitravali    (click here to view images)

గాయత్రీ చిత్రావళి Gayatri Chitravali 7&8 ఉధ్ధారకర్తీ తల్లి, హంసవాహిని అమ్మ సముద్రం పై ఉన్నది. మనిషి మొసళ్ళ మధ్యలో సముద్రంలో ఉన్నాడు. ఆ తల్లి బిడ్డని వాటినుండి రక్షించి అక్కున చేర్చుకుంటుంది. బాధలలో మునిగి ఉన్న మనల్ని ఉధ్ధరించి వాటినుండి ప్రేమమయి, కరుణామయి అమ్మ బయటపడేసే చిత్రం. ఈ భావనతో ఈ సాధన చేసుకుంటాం. ఉధ్ధారకర్తీ తల్లి అంటే మనల్ని ఉధ్ధరించే అమ్మ అని.

గాయత్రీ చిత్రావళి - Gayatri Chitravali    (click here to view images)

గాయత్రీ చిత్రావళి Gayatri Chitravali 9 గాయత్రీ చిత్రావళిని ప్రతి రోజు ఒక్క నిమిషం దర్శించుకుంటె మనకున్న అన్ని బాధలనుండి నివారణ పొందవచ్చు, ప్రతి వ్యక్తి ఊహించగలిగిన చిత్రాలు. ఈ చిత్రాలను ప్రతిరొజూ ఒక్క నిమిషం దర్శించి భావనాత్మకంగా ఊహించుకుంటె అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అనిష్ఠల నివారణను చేసే అమ్మ దర్శనం వివరణ. మన ఆలోచనలనే అస్త్రములుగా మార్చి ఉపయోగించే విధానమును పూర్తిగా వివరించారు.

గాయత్రీ చిత్రావళి - Gayatri Chitravali    (click here to view images)

గాయత్రీ చిత్రావళి Gayatri Chitravali10 to 24 గాయత్రీ చిత్రావళి మనకి ఎన్నో రకాలుగా సహాయకారి కాగలదు. సద్గురు ప్రాప్తి అనే చిత్రం పై మీరు ఎక్కువ శ్రధ్ధ పెట్టండి. ఇది భారతీయులుగా మనకు చాలా అవసరం, సద్గురువుని మనం పొందుతాం. అనుక్షణమూ మీకు గురువు యొక్క మార్గదర్శనము గాయత్రీ మంత్రం ద్వారానే లభిస్తుంది, అందుకనే చిన్నప్పుడు 5 ఏటనే పిల్లలకి గాయత్రీ మంత్రాన్ని ఇవ్వటం ద్వారా వాళ్ళకి యుక్త వయస్సు వచ్చేప్పటికి చక్కటి గురువు లభించి జీవితానికి సరైన మార్గదర్శనం లభిస్తుంది.

గాయత్రీ గీత - Gayatri Gita

గాయత్రీ గీత - Gayatri Gita 1 గాయత్రీ గీత : ఓంకార స్వరూపమైన పరబ్రహ్మను నేను అంతటా గుర్తిస్తాను అనేది మొదటి గాయత్రీ గీత శ్లోకం. భూర్ అనే అక్షరం అణువు నుండి జగత్తు అంతా నిండి ఉన్న ప్రాణాన్ని దర్శించాలి అని చెప్తుంది. భువహ అనే పదము ఫలాపేక్షలేని కర్మ చెయ్యండి అని చెప్తుంది. కర్మయోగం చేస్తున్నప్పుడు మనం ఇంద్రియాలకు లొంగిపోతే మనం ఏమీ సాధించలేము. ఆరోగ్యాన్ని రక్షించుకో, ప్రకృతి నియమాలను తెలుసుకో అని స్వహ అను పదం చెప్తుంది. ఈ ప్రవచనములో ఓం, భూర్, భువహ & స్వహ అను పదముల అర్ధాన్ని వివరించారు.

గాయత్రీ గీత - Gayatri Gita

గాయత్రీ గీత - Gayatri Gita 2 గాయత్రీ గీత : ఓంకారంలో లోకేశం, సమదర్శినం, నియమితం అను మూడు లక్షణాలు ఉన్నాయి. భువహ ప్రాణ శక్తిని ఇస్తుంది. స్వహ కర్మ చేసేప్పుడు ఫలితాన్ని ఆశించకుండా, స్థిరత్వంతో, ఆరోగ్యం కాపాడుకుంటు చెయ్యటం నేర్పిస్తుంది. "తత్" మృత్యువుని చూసి భయపడకు అని చెప్తుంది. తత్, సవితు: వరేణ్యం యొక్క వివరణ చెప్పారు. చనిపోవటం తెలిస్తే కానీ ప్రాణాగ్ని విద్యలోకి ప్రవేశించలేం. మృత్యువుకు భయపడకుండా జీవిత విధానాన్ని అర్ధం చేసుకుని సరిగ్గ జీవించటం వస్తే మరణ యొక్క రహస్యం అర్ధం అవుతుంది. తత్ ఆ శక్తిని ఇస్తుంది.

గాయత్రీ గీత - Gayatri Gita

గాయత్రీ గీత - Gayatri Gita 3 గాయత్రీ మంత్రము 13 వజ్రాల హారము. ఇవి 13 మానసిక స్ధితులు, ఇవి వస్తే ప్రకృతి తనంతట తనే తన రహస్యాలను విప్పి చెప్తుంది. దీనికి ముందు మీరు మీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. సవితుహు అంటే సూర్యుడువలె శక్తివంతుడు అయి, కుటుంబానికి సమాజానికి మీరు ఉపయోగపడండి.

గాయత్రీ గీత - Gayatri Gita

గాయత్రీ గీత - Gayatri Gita 4 గాయత్రీ మంత్రములోని ధియోయోనహ ప్రచోదయాత్ తెలుస్కోవటానికి ముందు ఓం = సర్వవ్యాపి ఐన పరమేశ్వరుడు, భూర్ = ప్రపంచం అంతా ప్రాణసక్తిగా విస్తరించియున్న, ప్రతి పరమాణువులో ఉన్న, భువహ్ = ఫలాపేక్ష రహితంగా ఆనందంగా సంపూర్ణంగా పని చెయ్యటం, స్వహ = ఆరోగ్యాన్ని చక్కగా పరిరక్షించుకుంటూ, తత్ = మృత్యువుని చూసి భయపడకుండా, మృత్యువుని నిరంతరం గుర్తుంచుకుంటూ, సవితుహు = ఉత్సాహంగా సూర్యునివలె శక్తివంతులుగా ఉంటూ, వరేణ్యం = ప్రతిచోట మంచిని దర్శిస్తూ, భర్గో = నిష్పాప రహిత జీవితం, పరిణామక్రమం గురుంచి తెలుసుకోవాలి, భువనేశ్వరీ విద్య తెలుసుకుని, దేవశ్య = దేవతలవలె జీవించాలి, భూమి మీద నడిచే దేవతలవలె జీవించాలి, ఇవ్వటం నెర్చుకోవాలి, ధీమహి = దైవీ సంపత్తిని పెంచుకోవాలి.

గాయత్రీ హృదయము - Gayatri Hrudayam

గాయత్రీ హృదయము - Gayatri Hrudayam 1

వేడి , వెలుగు అని రెండు అగ్ని లక్షణాలు అర్ధం చేసుకోవాలి. వెలుగు చూడగలుగుతాం, వేడి అప్రత్యక్షముగా ఉన్న వస్తువులు ప్రత్యక్షంగా మార్చవచ్చు. మనోమయకోశములోకి మీరు అగ్నిని తీస్కొని వెళ్ళగలిగితే మీరు ప్రకృతిలో ఏది కావాలంటే అది సృష్టించగలరు.పద - అర్ధాన్ని తెలుసుకోవాలంటె ఆ పదం యొక్క తరంగాలు మీరు వాయురూపంలో అనుభూతి చెందాలి. ఆనందమయ కోశానికి కావలసిన జల తత్వము, విజ్ఞానమయ కోశానికి కావలసిన వాయు తత్వము, మనోమయ కోశానికి కావలసిన అగ్ని తత్వము ముందు ఏర్పడ్డాయి ప్రకృతిలో. గాయత్రీ మంత్రము ఎర్పడానికి ముందు ఏర్పడినవి ఇవి అన్నీ మనం ఆ అమ్మ గర్భంలో ఉన్నాము అని తెలుసుకోవాలి. >
గాయత్రీ హృదయము - Gayatri Hrudayam

గాయత్రీ హృదయము - Gayatri Hrudayam 2

గాయత్రీ మంత్ర గోత్రము సాంఖ్యము. ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఒక జ్యోతివలె, తను ఎక్కడ ఉంటే అక్కడ వెలుగుతూ ఇతరులకు వెలుగును ఇస్తాడు. ప్రాపంచిక పదార్ధములను ఉత్సాహపూర్వకముగా కూడపెట్టి కావలసిన వనరూలను ఏకత్రితం చేసుకుని సన్మార్గములో గమనము చేయటము సాంఖ్యాయనము. యోగమైన ఆలోచనా విధానము, సాంఖ్యపరమైన జీవిత విధానము గాయత్రీ మంత్రములోని మిధునము. అయాచిక, అపరిగ్రహ వ్రతములను పాటిస్తూ అన్నింటిని సన్మార్గంలో ఉపయోగిస్తూ ఉత్సాహంగా జీవించాలి. గాయత్రీ మంత్రములో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని యాజ్ఞవల్కుడు అడిగాడు. అక్షరము అనగా నాశరహితమైనవి, 24 అక్షరాలు, 24 గాయత్రీ శక్తులు ఉన్నాయి.
గాయత్రీ హృదయము - Gayatri Hrudayam

గాయత్రీ హృదయము - Gayatri Hrudayam Bhavatheetha Dhyanam: గాయత్రీ హృదయాన్ని మీరంతా హృదయంగమం చెయ్యాలి. ఇవి మంత్రాలు కాదు, వాటి వెనకాల ఉన్న భావనలు పట్టుకోండి. విశ్వామిత్రత్వము, వశిష్ఠత్వము మీలోకి తెచ్చుకోవాలి. ప్రపంచానికి మిత్రత్వము వహించగలిగే మానసిక స్థితి తెచ్చుకోవాలి, అది దర్శించాలి. గాయత్రీ హృదయము అంటే ఆ విశ్వామిత్రత్వములోకి మిమ్మల్ని తీస్కొనివెళ్తుంది. అనంతమైన శక్తికి మీరు అధికారులు అవుతారు. భావాతీత ధ్యానాన్ని చెయ్యండి. మౌనంలోకి వెళ్ళండి - మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం.....అర్ధం చేస్కోండి.

గాయత్రీ కవచము - Gayatri Kavacham

గాయత్రీ అక్షర కవచము - Gayatri Akshara Kavacham - గాయత్రీ మంత్రాక్షర కవచము: ముందుగా అమ్మ రూపాన్ని వర్ణించిన శ్లోకాన్ని వింటూ ఆ రూపాన్ని నఖ శిఖ పర్యంతము ధ్యానించండి. ఈ ధ్యానాన్ని మీరు ఎల్లప్పుడూ చేసుకోవచ్చు. నిన్నటి వీడియోలో అమ్మ రూపాన్ని పంచముఖిగా ధ్యానించాము కదా, అదే రూపాన్ని ధ్యానించాలి. ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం I గాయత్రీం వరదాభయాంకుశ కశా: శుభ్రం కపాలంగదాం శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే II గాయత్రీ మంత్ర శక్తి మన చుట్టూ ఆవరిస్తోంది అనే భావనతో పఠించాలి. అక్షర శక్తి కవచము. ఒక్కో అక్షరము మన శరీరములోని ఒక్కో భాగాన్ని రక్షిస్తోంది అన్న భావనతో శ్లోక వివరణ ఆధారంగా చేసుకోవాలి. అందరికీ గురు అనుగ్రహ ప్రాప్తిరస్తు.

గాయత్రీ దేవతా న్యాస శ్లొకము - Gayatri Devata Nyasa Slokam

గాయత్రీ దేవతా న్యాస శ్లొకము - Gayatri Devata Nyasa Slokam - సావిత్రీ మే శిరః పాతు శిఖాయామమృతేశ్వరీ । లలాటం బ్రహ్మదేవీ చ భ్రువౌ మే పాతు వైష్ణవీ ॥ భావము : సావిత్రి శిరస్సును, అమృతేశ్వరి శిఖను, బ్రహ్మదేవి లలాటమును, వైష్ణవి కనుబొమలను రక్షించుగాక ! కర్ణౌ మే పాతు రుద్రాణీ సూర్యా సావిత్ర్యంబకే । గాయత్రీ వదనం పాతు శారదా దశనచ్చదమ్ ॥ భావము : రుద్రాణి చెవులను, గాయత్రి ముఖమును, శారద పెదవులను రక్షించుగాక ! ద్విజాన్ యజ్ఞప్రియా పాతు రసనాం సరస్వతీ । సంఖ్యాయినీ నాసికాం మే కపాలం చంద్రహాసినీ ॥ భావము : యజ్ఞప్రియ ద్విజులను, సరస్వతి నాలుకను, సంఖ్యాయని నాసికను, చంద్రహాసిని కపాలమును రక్షించుగాక ! చిబుకం వేదగర్భా చ కంఠం పాత్వఘనాశినీ । స్తనౌ మే పాతు ఇంద్రాణీ హృదయం బ్రహ్మవాదినీ ॥ గడ్డమును వేదగర్భ, కంఠమును అఘనాశిని, స్తనములను ఇంద్రాణి, హృదయమును బ్రహ్మవాదిని రక్షించుగాక ! ఉదరం విశ్వభోక్త్రీ చ నాభిం పాతు సురప్రియా । జఘనం నారసింహాచ పృష్ఠం బ్రహ్మాండధారిణీ ॥ ఉదరమును విశ్వభోక్ర్తి, నాభిని సురప్రియ, జఘనమును నారసింహ, పీఠమును బ్రహ్మాండధారిణి రక్షించుగాక ! పార్శ్వౌ మే పాతు పద్మాక్షీ గుహ్యం మే గోత్రికావతు । ఊర్వోరోంకారరూపాచ జాన్వోః సంధ్యాత్మి కావతు ॥ పార్శ్వ భాగములను పద్మాక్షి, గుహ్యమును గోత్రిక, ఊరువులను ఓంకారరూపిణి, జానువులను సంధ్యాత్మిక రక్షించుగాక ! జఘనే పాతు అక్షోభ్యో గుల్పౌచ బ్రహ్మశీర్షకా । సూర్యా పదద్వయం పాతు చంద్రా పాదాంగులీంశ్చవై ॥ తొడలను అక్షోభ్య, చీలమండలను బ్రహ్మశీర్షక, రెండు పాదములను సూర్య, రెండు కాళ్ళవ్రేళ్ళను చంద్ర రక్షించుగాక ! సర్వాంగం వేదజననీ పాతు మే సర్వదానఘా । ఇత్యేతత్కవచం బ్రహ్మగాయత్ర్యాః సర్వపావనమ్ । పుణ్యం పవిత్రం పాపఘ్నం సర్వరోగనివారణమ్ ॥ అనఘ అగు వేదజనని నా శరీరమును అంతటిని ఎల్లప్పుడు రక్షించుగాక ! సర్వపావనమగు ఈ బ్రహ్మ గాయత్రీ కవచము పుణ్యకరము, పవిత్రకరము, పాపనాశకము, సర్వరోగనివారకము. త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ సర్వాన్ కామానవాప్నుయాత్ । సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞః స భవేద్వేదవిత్తమః ॥ మూడు సంధ్యలయందు పఠించిన విద్వాంసుని అన్ని కోరికలు తీరును. సర్వశాస్త్రములను తెలిసిన వేదజ్ఞుడు అగును. సర్వయజ్ఞఫల ప్రాప్తిః బ్రహ్మాన్తే సమవాప్నుయాత్ । ప్రాప్నోతి జపమాత్రేణ పురుషార్థాంశ్చతుర్విధాన్ ॥ సర్వయజ్ఞ ఫలమును అతడు పొందును. చివరకు బ్రహ్మమును పొందును. జప మాత్రము వలననే అతను నాలుగు పురుషార్థములను పొందును. ఫలం : ప్రార్థనతో స్తుతితో శక్తి యొక్క మహత్తుపై సాధకుని ధ్యానము కేంద్రికరించడం వలన మహిమలో ఏ శక్తి వర్ణింపబడినదో అవి సాధకునిలో లేనప్పుడు న్యాసము వలన సాధకుని మనస్సు ఆ వైపు ఆకర్షింపపబడును. స్త్రోత్ర పఠనము వలన సాధకునిలో శ్రద్ధ, భక్తి జాగృతమగును.

గాయత్రీ శక్తి ధ్యానము - Gayatri Shakti Dhyanam

గాయత్రీ శక్తి ధ్యానము - Gayatri Shakti Dhyanam: పంచ వక్త్రాం దశభుజాం సూర్యకోటి సమప్రభాం I సావిత్రీం బ్రహ్మవరదాం చంద్రకోటి సుశీతలాం II త్రినేత్రాం సిత వక్త్రాంచ ముక్తాహార విరాజితాం I వరాభయాంకుశకశాం హేమ పాత్రాక్ష మాలికాం II శంఖచక్రాబ్జయుగలం కలాభ్యాం దధతీం పరాం I సితపంకజ సంస్థాం చ హంసారూఢాం సుఖస్మితాం II ధ్యాత్వైవం మానసాంభోజే గాయత్రీ కవచం పఠేత్ II ఐదు ముఖములు, పది చేతులు గలదియు, కోట్లకొలది సూర్యుల కాంతిగలదియు, బ్రహ్మవరదయు, కోట్లకొలది చంద్రులవలె చల్లనైనదియు, మూడు నేత్రములుగలదియు, శీతలవాక్కుగలదియు, ముత్యాలహారములను ధరించినదియు, వరము, అభయము, అంకుశము, సువర్ణపాత్ర, అక్షమాల, శంఖ చక్రములు చేతులయందుగలదియు, శ్వేతకమలమునందు ఉన్నదియు, హంసారూఢయు, మందహాసము ముఖమునందుగలదియునగు గాయత్రిని హృదయకమలములో ధ్యానించి గాయత్రీ కవచమును పఠించవలెను.

గాయత్రీ శక్తి ధ్యానము - Gayatri Shakti Dhyana Sloka

గాయత్రీ శక్తి ధ్యానము - Gayatri Shakti Dyana Slokam brief explanation: గాయత్రీ శక్తి ధ్యానము: వర్ణాస్త్ర కుండిక హస్తాం శుధ్ధ నిర్మల జ్యోతిషీంI పరాతత్త్వ మమీం వందే గాయత్రీం వేదమాతరం II వర్ణాస్త్రకుండికా హస్తములు కలది, శుధ్ధ నిర్మల జ్యోతి స్వరూపిణియు, తత్త్వములన్నింటితో కూడినదు అగు గాయత్రికి నమస్కరించుచున్నాను. ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం I గాయత్రీం వరదాభయాంకుశ కశా: శుభ్రం కపాలంగదాం శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే II ముత్యము, పగడము, బంగారము, నీలము, శ్వేతము వంటి కాంతులు కలిగినది, మూడు నేత్రములు గలదియు, చంద్రకాంతమణులు కూర్చిన ముకుటమును ధరించినదియు, తత్త్వార్ఠమును వెల్లడించునదియు, అభయమును, వరములను ఇచ్చునట్టిదియు, త్రిశూలమును, కపాలమును, అంకుశమును, చెండ్రకోలును, శంఖమును, చక్రమును, రెండు పద్మములును ధరించునదియునగు గాయత్రీ దేవిని ధ్యానించుచున్నాను. వంటి కాంతులు కలిగినది, మూడు నేత్రములు గలదియు, చంద్రకాంతమణులు కూర్చిన ముకుటమును ధరించినదియు, తత్త్వార్ఠమును వెల్లడించునదియు, అభయమును, వరములను ఇచ్చునట్టిదియు, త్రిశూలమును, కపాలమును, అంకుశమును, చెండ్రకోలును, శంఖమును, చక్రమును, రెండు పద్మములును ధరించునదియునగు గాయత్రీ దేవిని ధ్యానించుచున్నాను.

గాయత్రీ శక్తి కవచ శ్లోకము - Gayatri Shakti Kavacha Slokam

గాయత్రీ శక్తి కవచ శ్లోకము - Gayatri Shakti Kavacha Slokam : అక్షర శక్తి కవచము : 1. తత్పదం పాతు మే పాదౌ జంఘే చ సవితు: పదం I వరేణ్యం కటిదేశస్తు నాభిం భర్గ స్తదైవచ II "తత్" అనునది నా పాదములను రక్షించుగాక. "సవితు:" అనునది నా తొడలను రక్షించుగాక. "వరేణ్యం" అను పదము నా కటి ప్రదేశమును రక్షించుగాక. భర్గ: అను పదము నా నాభిని రక్షించుగాక. 2. దేవస్య మేతు హృదయం ధీమహీతి గలం తధా I ధియోమే పాతు జిహ్వాయాం య: పదం పాతు లోచనే II "దేవస్య" అను పదము హృదయమును, "ధీమహి" అను పదము నా కంఠమును, "ధియో:" అను పదము నా జిహ్వను, "య:" అను పదము నా రెండు నేత్రములను రక్షించుగాక. 3. లలాటే న: పదం పాతు మూర్ధానాం మే ప్రచోదయాత్ I తద్వర్ణ: పాతు మూర్ధానం సకార: పాతు భాలకం II "న:" పదము నా లలాటమును ( నుదురును), "ప్రచోదయాత్" అను పదము నా శిరస్సును రక్షించుగాక. "తత్" పదము తలను, "స"కారమును నుదురును రక్షించుగాక. 4. చక్షుషీ మే వికారస్తు శ్రోత్రే రక్షేత్తు కారక: I నాసాపుటే వకారోమే రేకారస్తు కపాలకం II "వి" నా నేత్రములను, "తు"కారము చెవులను, "వ"కారము ముక్కు పుటలను, "రే"కారము కపాలమును రక్షించుగాక. 5. ణికారస్త్వధరోష్ఠే చ యకార స్తూర్ధ్వ ఓష్ఠకే I ఆస్య మధ్యే మకారస్తు గోకారస్తు కపోలయో: II "ణి"కారము క్రింద పెదవిని, "య"కారము పై పెదవిని, నోటిని "భ"కారము, "గో"కారము రెండు కపోలములను రక్షించుగాక. 6. దేకార: కంఠ దేశేచ వకార: స్కంధ దేశయో: I స్యాకరో దక్షిణంహస్తం ధీకారో వామహస్తకం II "దే"కారము కంఠమును, "వ"కారము రెండు భుజములును, "స్య"కారము కుడి చేతిని, "ధీ"కారము ఎడమచేతిని రక్షించుగాక. 7. మకారో హృదయం రక్షేధ్ధికారో జఠరం తధా I ధికారో నాభిదేశం తు, యోకారస్తు కటి ద్వయం II "మ"కారము హృదయమును, "హి"కారము ఉదరమును, "ధి"కారము నాభిని, "యో"కారము కటీద్వయమును రక్షించుగాక. 8. గుహ్యం రక్షతు యోకార ఊరూమే న: పదాక్షరం I ప్రకారోజానునీ రక్షే చ్చో కారో జంఘదేశయో: II "యో"కారము గుహ్య ప్రదేశమును, "న:" పదము రెండు తొడలను, "ప్ర"కారము రెండు మోకాళ్ళను, "చో"కారము పిక్కలను రక్షించుగాక. 9. దకారో గుల్ఫ దేశేతు యాత్కార: పాదయుగ్మకం I జాత వేదేతి గాయత్రీ త్రయంబకేతి దశాక్షర II "ద"కారము చీలమండలను, యత్"కారము రెండు పాదములను రక్షించుగాక. జాతవేద త్రయంబక గాయత్రీ పది అక్షరములు కలది.

గాయత్రీ వర్ణ ధ్యానం - Gayatri Varna Dhayanam

గాయత్రీ వర్ణ ధ్యానం - Gayatri Varna Dhayanam: గాయత్రీ మంత్రములోని ఒక్కొక్క అక్షరముపై ధ్యానము. వీటిని ఆచరణలోకి తెచ్చుకొనుట వల్ల మనము ఇందులో వివరించిన విధముగా అన్ని లాభాలను పొందవచ్చు. తత్కారం చంపకాపీతం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ శతపత్రాసనారూఢం ధ్యాయేత్ సుస్థాన సంస్థితమ్ || 1 || భావం : సంపెంగపూవువలె పచ్చనిరంగు కలది,బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది, కమలాసనమందు ఉన్న “ తత్ ” కారమును ధ్యానించవలెను. గాయత్రీ వర్ణ ధ్యాన ఫలశృతి న భవేత్సూతకం తస్య మృతకశ్చ న విద్యతే యస్వ్తేకం న విజానాతి గాయత్రీంచ తథావిధమ్ || 25 || ఇట్లు గాయత్రిని యథావిధిగా ఎరిగిన వానికి సూతకము కలుగదు. మృత్యువు కలుగదు. కథితం సూతకం తస్య మృతం చ మయానఘ న చ తీర్థఫలం ప్రోక్తం తథైవ సూతకే సతి || 26 || పాపరహితుడా ! నేను వాని సూతకమును, మరణమును గూర్చి చెప్పితిని. అవి ఉన్నప్పుడు దాని ఫలము లభింపదు. తీర్థయాత్రకు వెళ్ళిన ఫలము లభింపదు.

గాయత్రీ మంత్ర జప ధ్యానం - Gayatri Mantra Japa Dhyanam

గాయత్రీ మంత్ర జప ధ్యానం - Gayatri Mantra Japa Dhyanam : గాయత్రీ మంత్రాన్ని జపం చెయ్యటం ఎన్ని జన్మల పుణ్యమో అనే పులకింత తెచ్చుకుని జపం చెయ్యండి. ఇది మీ యోగ్యత, ఎంతో మంది ఋషులు, మహానుభావులు, దేవతాశక్తులను తమలోకి దింపుకోగలిగిన ఈ మంత్రము మనం జపం చెయ్యాలన్న కోరిక కలుగుతుంది, ఎంత అదృష్టం ఉంటే ఈ మంత్రం లభిస్తుంది అన్న ఆనందం తెచ్చుకుని చెయ్యండి. ఒక్కసారి ఆ మంత్రాన్ని వినటానికి కూడా చాలా కష్టపడేవారు, మనకు దానిని జపించే శక్తి లభించటం మన పూర్వ జన్మ సుకృతం అని తెలుసుకుని ఆ మంత్రములోని ఒక్కొక్క అక్షరాన్ని జపించేటప్పుడు ఆ మంత్ర రుచిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ చెయ్యండి.

గాయత్రీ మంత్ర సర్వ శ్రేష్ఠమైన ధ్యానము - Gayatri Mantra Dhyanam

గాయత్రీ మంత్ర సర్వ శ్రేష్ఠమైన ధ్యానము Simple Gayatri Roopa Dhyanam: గాయత్రీ మాత యొక్క అలౌకికమైన పట్టుచీర, అలౌకికమైఅన హంస, అమ్మ కట్టుకున్న అందమైన చీర, ఆభరణాలు...వీటిని మీరు దర్శిస్తూ ఉంటే...అతి చేతనత్వ స్థాయిని దాటిన ఋషులు ఏర్పరచిన చిత్రం, మీరు ప్రయత్నం చేస్తే ఆ చిత్రం సూపర్ ఇంపోస్ అవుతుంది. అప్పుడు ఆవిడలో కదలికలు ఏర్పడతాయి. అమ్మ మిమ్మల్ని బ్రహ్మ స్థాయికి తీస్కొని వెళ్తుంది, మీ చిన్న చిన్న కోరికలను పక్కన పెట్టి సాధన చెయ్యండి. ఏ స్థితిలో ఐనా ఈ సాధనను చెయ్యవచ్చు, నెమ్మదిగా మీరు ఆ భావజగత్తులోకి ప్రవేశిస్తారు.

గాయత్రీ రూప ధ్యానము - Gayatri Roopa Dhyanam

గాయత్రీ మంత్ర సర్వ శ్రేష్ఠమైన రూప ధ్యానము - Gayatri Roopa Dhyanam Simple Gayatri Roopa Dhyanam: గాయత్రీ మాత యొక్క రూపధ్యానముపై వివరణాత్మక ప్రవచనము. గాయత్రీ మంత్రము చేసేవారికి వచ్చే కలలు చాలా ముఖ్యమైనవి. స్వప్నాలు గాయత్రీ మంత్ర సాధకుడి యొక్క స్థాయిని తెలుపుతాయి. మొదటిరకమైన కలలు కుసంస్కారాలు వదిలి వెళ్ళినట్లు వస్తాయి. రెండవ స్ధితిలో సుసంస్కారాలు, శ్రేష్ఠమైన భావనలు మీ మనో భూమిలో నాటబడుతున్నాయి. 3 వ స్థాయికి చేరాక అంటె స్వప్నాలలో మీకు జరగబోయే విషయాలు, భవిష్యత్తును సూచించే కలలు వస్తున్నాయి అంటే మీరు గాయత్రీ మంత్ర సిధ్ధి కి చాలా దగ్గరలో ఉన్నారని అర్ధం చేసుకోండి. స్వగురు దర్శనము జరిగితే ఇంక అది అద్భుతమే, సాధకుడు ఇంక చెయ్యవలసింది ఏమీ లేదు, ఇంక అంతా గురువే చూస్కొంటాడు.

గాయత్రీ ట్రై యాంగిల్ మెడిటేషన్ - Gayatri Triangle Meditation 1

గాయత్రీ ట్రై యాంగిల్ మెడిటేషన్ - Gayatri Triangle Meditation method 1 గాయత్రీ చిత్రావళి పశ్యంతీ స్థాయిలో గాయత్రీ మంత్రన్ని కారణ జగత్తులో నాటుకోవటం నేర్పిస్తుంది. అక్కడ మీవాక్కు, మీ ఆచరణ కాదు, మీ చిత్రీకరణ ముఖ్యం. పశ్యంతీ వాక్కు చాల స్పీడ్ గా ఉంతుంది. గాయత్రీ మంత్రం ఉచ్చరించేప్పుడు ఏర్పడే అక్షర సముదాయాన్ని గమనించటం ముఖ్యం. గాయత్రీ మంత్రము బట్టలమీద ప్రింట్ చేస్తాం, అలా ముందుకు వెళ్తుంది. అలా ఆ అక్షరాలన్నే గాయత్రీ మాత వైపుకి వెళ్తున్నాయి అన్న చిత్రీకరణ ముఖ్యం. గురువును నఖ శిఖ పర్యంతం కూరోపెట్టి ధ్యానం దానిమీద చెయ్యాలి. గురువు గాయత్రీ మంత్రం మనలో నాటుతున్నాడు, తల్లి దానిని ఎదిగేట్టు చేస్తోంది.

గాయత్రీ ట్రై యాంగిల్ మెడిటేషన్ - Gayatri Triangle Meditation2

గాయత్రీ ట్రై యాంగిల్ మెడిటేషన్ - Gayatri Triangle Meditation method 2 గాయత్రీ గురువు, గురువు నుండి మన అంతరాళము మళ్ళీ అదే ప్రోసెస్స్. ఇలా ట్రై యాంగిల్ మెడిటేషన్ చెయ్యాలి. గురువుకి మనకి ఎంత శక్తిని ఇవ్వాలో తెలుసు. ఆయన ద్వారా ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల గురువు, గాయత్రీ మాత, సాధకుడు మధ్య ఏర్పడే ఈ ట్రై యాంగిల్ ను త్రయీ విద్యగా చెప్పవచ్చు. సాధనలో స్పష్టమైన చిత్రీకరణ ముఖ్యము. అతి చిన్న చిన్న మార్పులుగా కనిపిస్తున్నా, నేను నేర్పించే ఈ ధ్యానము దేనికదే చాలా వినూత్నమైనది అని మరిచిపోకండి.

గాయత్రీ ట్రై యాంగిల్ మెడిటేషన్ - Gayatri Triangle Meditation3

గాయత్రీ ట్రై యాంగిల్ మెడిటేషన్ - Gayatri Triangle Meditation method 3 అనంత శక్తి యొక్క అంతరాళాలలో ఆ గాయత్రీ శక్తి ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో మీకు తెలియక్కర్లేదు. గాయత్రీ మంత్రాక్షర సముదాయాన్ని దర్శించండి. ఆ అక్షరాలు అమ్మవైపుకి వెళ్తున్నాయి అని భానాత్మక దర్శనం ముఖ్యము. పశ్యంతీ వాక్కు లో మనం అంతా జీవించి ఉంటాము, మీకు ఇష్టమైన గురువుని ఎన్నుకోండి. గురువు ప్రాణవంతమైన గాయత్రీ దీక్ష ఇస్తాడు. ప్రాణ శక్తి ఉన్న వ్యక్తిని మాత్రమే మీరు గురువుగా స్వీకరించాలి. గాయత్రీ మంత్ర సాధకులు అమరులౌతారు.

గాయత్రీ మంత్రార్ధ సహిత వివరణ - Gayatri Mantra word by word meaning 1

గాయత్రీ మంత్రార్ధ సహిత వివరణ - Gayatri Mantra word by word meaning 1 : ఋషుల స్థాయికి మనము కూడా ఎదిగేందుకు గాయత్రీ మంత్రార్ధాన్ని మననము, ధ్యానము చేయుట. మమూలు వ్యక్తి నుండి ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి చివరకు దేవర్షి స్థాయి వరకు తీసుకుని వెళ్ళగలిగే అతి సులభమైన ధ్యానము ఇది. జ్ఞానయోగము, భక్తి యోగము మరియు కర్మ యోగము అను మూడు యోగముల ధారలుగా గాయత్రీ మంత్రాన్ని మనం ధ్యానిస్తాము. ఓం భగవత్శక్తి అంతటినీ మనము ఈ ఒక్క అక్షరముతో పిలుస్తాము. ఓం అనే అక్షరము ఉంటే భారతీయత మిగిలి ఉంటుంది. తశ్య వాచకహ ప్రణవహ : ఓం అనే అక్షరముతో మనము మొత్తము భగవత్ తత్వాన్ని పిలుస్తాము. ఆ ఓం, “భూ: “ అనే ప్రాణ స్వరూపామును మన వద్దకు తెస్తుంది. జడ స్వరూపము - ప్రాణ స్వరూపమునకు తేడా మనకు తెలుసు కదా. కదలికలేని స్ధిరమైన స్వరూపము జడ స్వరూపము ( రాళ్ళు). కదలిక కలిగినది ప్రాణ స్వరూపము. రాళ్ళల్లో కదలిక ఏర్పడినప్పుడు వృక్షముగా పరిణితి చెందుతాయి, వృక్షముగా కదలిక వచ్చాక జంతువుగా, తరువాత మనిషిగా ఎదుగుతుంది. ప్రాణమయ శక్తి పరమాణవులను పరమాణువులుగా ఉంచుతూ, వృక్షాలను, జంతువులను, మనుషులను అవి వాటీగా ఉండె శక్తిని ఇస్తూ మనషిని దైవంగా మార్చగలిగే ప్రాణ శక్తిని ఇచ్చే వ్యాహృతి "భూర్" , ప్రాణమయ శక్తిని ఇచ్చే వ్యాహృతి ఇది. ప్రాణ శక్తిని సర్వత్రా మనం గమనించగలుగుతే " భువ:" దు:ఖాలు పోతాయి. భువహ్ అనగా దు:ఖ నాశకమైన. "స్వహ: - సుఖ స్వరూపమైన, దు:ఖాలు మనకు పోయినప్పుడు ఉండె సుఖస్ధితిని ప్రసాదించేది. ఓం, భూర్ భువ: స్వహ: - ఆ పరబ్రహ్మ స్వరూపుడైన శక్తి, ప్రాణ స్వరూపుడుగా, దు:ఖ నాశకుడుగా, సుఖ:స్వరూపుడుగా ధ్యానిస్తున్నాము. "తత్" అనగా ఆ , "సవితు:" - ప్రకాశవంతుడు, "వరేణ్యం" - శ్రేష్టుడు, "భర్గో" పాపనాశకుడు, "దేవశ్య" - ఇవ్వటమే గుణముగలవాడైన, " ధీమహి" ఆ భగవత్ స్వరూపాన్ని నా బుధ్ధిలో ధారణ చేయుచున్నాను. "ధియో" - బుధ్ధిని, "యో" ఎదైతే 'న:" మా యొక్క (సంపూర్ణ మానవజాతియొక్క) "ప్రచోదయాత్" సన్మార్గమువేపు ప్రేరణనిచ్చుగాక. మానవజాతి మొత్తము ఒకే పరిణామ క్రమానికి సంబంధించినది, అందుకే గాయత్రీ మంత్రమును యూనివర్సల్ ప్రేయర్ అంటాము. ఆ ప్రాణ స్వరూపుడైన, దుఖ: నాశకుడైన, సుఖ: స్వరూపుడైన పరమాత్మను నా అంతరాత్మలో ధారణ చేయుచున్నాను. ఆయన మమ్ములను సన్మార్గమువేపు నడిపించుగాక. ప్రాణ శక్తివలననే మానవుని చేతనత్వము దైవీ చేతనత్వముగా పరిణితి చెందుతుంది. ఆ ప్రాణశక్తిని మనకు ఇచ్చి మనలను సన్మార్గములో నడిపించే మంత్రము గాయత్రీ మంత్రము.

గాయత్రీ మంత్రార్ధ సహిత వివరణ - Gayatri Mantra word by word meaning 2

గాయత్రీ మంత్రార్ధ సహిత వివరణ - Gayatri Mantra word by word meaning 2 : గాయత్రీ మంత్రార్ధ ధ్యానము : ఆ పరమాత్మ, ప్రాణ స్వరూపుడు దుఖ: నాశకుడు, సుఖ స్వరూపుడు ఐనటువంటి అతను ప్రకాశ వంతుడు, శ్రేష్టుడు, పాపాలను నాశనము చేసి, ఇచ్చే లక్షణములు కలిగినవాడు ఐనటువంటి అతని తేజస్సును నేను ధారణ చేస్తున్నాను. ఈ ధారణ చేసినటువంటి శక్తి మమ్ములను సంపూర్ణ మానవజాతిని సన్మార్గమువేపు ప్రేరేపించుగాక. గాయత్రీ మంత్రార్ధములో జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగము 3 ఉన్నాయి. ఓం భూర్ భువ: స్వహ, తత్సవితుర్వరేణ్యం వరకు ఆ భగవంతుని లక్షణాలను అలోచిస్తూ జ్ఞాన మార్గములో ఉన్నారు. భర్గో దేవశ్య ధీమహి - సర్వ వ్యాపకుడైన ఆ పరమాత్మను ఊహించుకుంటూ పాపాలను నాశనము చేసే ఆ తేజస్సును నా హృదయములోకి దింపుకుంటున్నాను. హృదయములో పరమాత్మను పెట్టుకుని తప్పు పనులు చెయ్యలేము కదా - అది భక్తి యోగము. ధియోయోనహ ప్రచోదయాత్ - కర్మ యోగము - మన యొక్క కర్మలు, మనయొక్క ఆచరణ మిగతావాళ్ళకు ఆదర్శమవుతుంది.

గాయత్రీ మంత్రము మన జీన్స్ ను మారుస్తుంది - Gayatri Mantra can changes genes

గాయత్రీ మంత్రము మన జీన్స్ ను మారుస్తుంది - Gayatri Mantra can changes genes brief audio clip : మన శరీరంలో ఇరవైమూడున్నర జీన్స్ ఉంటాయి, గాయత్రీ మంత్రములో కూడా ఇరవైమూడున్నర అక్షరాలు ఉంటాయి. గాయ్త్రీ మంత్రము 7 రకాలైన వరాలను ఇస్తుంది. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడుకి ఏమి చెప్తాడు అంటే నువ్వు 3 లోకాలు గెలిచానంటావు తండ్రీ ముందు నీ ఇంద్రియాలను గెలువు అని. ఇంద్రియాలను గెలవటం చాలా కష్టం, అలాంటి ఇంద్రియాలను గాయత్రీ మంత్రముతో తేలికగా గెలవచ్చు. మీరు 5 ఏళ్ళు గాయత్రీ మంత్రాన్ని ఒక పధ్ధతి ప్రకారం చేస్తే గాయత్రీ మంత్రం సిధ్ధిస్తుంది.

గాయత్రీ శాప విమోచనము - Gayatri Sapavimochanam

గాయత్రీ శాప విమోచనము - Gayatri Sapavimochanam : ఓం అస్య శ్రీ గాయత్రీ శాపవిమోచన మంత్రస్య, బ్రహ్మ ఋషి, గాయత్రీ ఛంద:, వరుణో దేవతా, బ్రహ్మ శాపవిమోచనే వినియోగ:. ఈ గాయత్రీ శాపవిమోచన మంత్రమునకు బ్రహ్మ ఋషి, గాయత్రీ ఛందస్సు, వరుణుడు దేవత, బ్రహ్మ శాప విమోచనమునందు ఇది ప్రయోగింపబడును. ఓ గాయత్రీ ! బ్రహ్మ దేవతలు దేనిని బ్రహ్మ నామముతో చెప్పుచున్నరో, ధీర పురుషులు తమ అంత:కరణమున నిన్ను ఆ రూపముతోనే చూచుచున్నారు. నీవు బ్రహ్మ శాపమునుండి విముక్తి పొందెదవుగాక ! ఇలాగే వశిష్ట విశ్వామిత్ర శాపవిమోచన మంత్రములు ఉన్నాయి.

గాయత్రీ రామాయణము 1- Gayatri Ramayanam

గాయత్రీ రామాయణము - Gayatri Ramayanam 1: తపః స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ | నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ || 1 || బాలకాండ 1/1 భావము : తపస్సు స్వాధ్యాయం చేసే సర్వమునులలో ప్రధముడైన నారదుని, తపస్వి వాల్మీకి అడిగినాడు. 1. వాల్మీకి రామాయణానికి మూలాధారము గాయత్రీ మంత్రము. గాయత్రీ మంత్రానికి వ్యాఖ్య రూపమే రామాయణము. వాల్మీకి రామాయణములోని 24000 శ్లోకములువ్రాయబడ్డాయి. గాయత్రీ మంత్రములోని ఒక్కొక్క అక్షరానికి వ్యాఖ్యగా ఒకొక్క 1000 శ్లోకాలు వ్రాయబడ్డాయి. ఒకొక్క 1000 శ్లోకాలపై ఒకొక్క అక్షరం యొక్క సంపుటీకరణ చేయబడింది. ఈ 24 అక్షరాల ముందున్న 24 శ్లోకాలను గాయత్రీ రామాయణము అంటారు. 2. శ్లోకము 1 explanation  శాస్త్రం యొక్క అర్ధముపై, ఆదేశముపై, మర్మముపై గంభీరతతో మననం చేయడం, ఆత్మాధ్యయనం చేయడం, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే స్వాధ్యాయం యొక్క అర్ధము. ఈ రకముగా శాస్త్రాలకు సేవ చేసినవాడే సర్వశ్రేష్ట విద్వాంసుడు. మననం చేసే వాడినే ముని అంటారు. ఎవనిలో ఆదర్శం కోసం ఎన్ని పెద్ద కష్టాలనైనా ఎదుర్కోగల సాహసం ఉందో, ఆ తపస్వినే మునులలో శ్రేష్ఠుడు అంటారు. నారదుడు ఒక్క క్షణమైనా విశ్రాంతి లేకుండా తన ఉద్దేశ్య పూర్వకముగా లోకసేవ కోసం తన జీవితమంతటినీ అంకితం చేశాడు. అందువల్లే నారదుడు విద్వాంసులలో,మునులలో సర్వ శ్రేష్ఠుడు.

గాయత్రీ రామాయణము 2- Gayatri Ramayanam

గాయత్రీ రామాయణము - Gayatri Ramayanam 2: తుష్టావాస్య తదా వంశం ప్రవిష్య చ విశాంపతేః | శయనీయమ్ నరేంద్రస్య తదాసాద్య వ్యతిష్ఠత || 4||అయోధ్య కాండ 25/6 భావము :రాజుగారి శయనాగారం వరకు ఆ సుమంతుడు నడచి వెళ్ళాడు. అక్కడ వారి వంశాన్ని ప్రశంసించాడు. వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ | భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దధౌ || 5 ||అయోధ్య కాండ 40/25 భావము : వనవాసం చేసే దినాలను లెక్కించుకొని పతితో వెళ్ళే సీతకు దశరధుడు వస్త్రములు, ఆభరణములు ఇచ్చెను. కిరీటధారి అయిన రాముని అందరు చూడగలరు కానీ జటాధారి అయిన రాముని ఇల్లు కుటీరం మాత్రమే. కుటీరం నిరాడంబరత, అపరిగ్రహము, త్యాగవృత్తి మొదలైన వాటి గురించి తెలుపుతుంది. ఎక్కడ ఈ గుణాలు ఉంటాయో అక్కడ జటాధారి అయిన రాముని యొక్క బ్రహ్మ దర్శనం కలుగుతుంది. భరతునివలే సరళమైన, నిర్మలమైన అంతఃకరణ కలవారికి రాముని యొక్క దర్శనం కలుగుతుంది.

గాయత్రీ రామాయణము 3- Gayatri Ramayanam

గాయత్రీ రామాయణము - Gayatri Ramayanam 3: నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుమ్ | ఉటజే రామమాసీనం జటామండలధారిణమ్ || 7||అయోధ్య కాండ 66/25 భావము :భరతుడు ఆ క్షణములోనే జటాధారి అగు రాముని, ఆ కుటీరములో కూర్చుని ఉండగా చూశాడు. యది బుద్ధిః కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిమ్ | అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశాః || 8||అరణ్యకాండ 11/43 భావము :ఓ బుద్ధిమతి! నీకు అగస్త్యుని దర్శించాలి అనే కోరిక ఉంటే, ఈ రోజే వెళ్ళు.  గడిచిపోయిన సమయం తిరిగిరాదు. దానికోసం చింతించి, శోకించి లాభంలేదు. అగస్యుడు కళ్యాణము గురించి చెప్తాడు. బుద్ధిమంతుడైన వాడు కళ్యాణాన్ని దర్శించాలంటే, ఈశ్వరుని పొందాలంటే, ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే, భౌతిక సఫలత కావాలంటే ఈ రోజే ప్రయత్నించవలసి ఉంటుంది. వర్తమానం అన్నింటికంటే విలువైన సమయం. వర్తమాన సమయాన్ని అత్యుత్తమ పనికి ఉపయోగించడమే సమయం యొక్క సదుపయోగము. ఆలస్యం చేయక, సమయాన్ని నాశనం చేయక అనుకున్న పనికి ప్రయత్నం ఆరంభించడమే ఈ శ్లోకములోని భావము.

గాయత్రీ రామాయణము 4 -Gayatri Ramayanam

గాయత్రీ రామాయణము - Gayatri Ramayanam 4 : భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో | మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి || 9 ||అరణ్యకాండ 53/21 భావము : భరతునికి, మీకు, మా అత్తగార్లకు దివ్యమృగ రూపములో ఉన్న బొమ్మ విస్మయం కలగజేస్తుంది. దానిని సజీవంగా పట్టుకోలేకపోయినా, ఏదో విధంగా సంపాదించండి. దాని చర్మము చాలా సుందరమైనది. గచ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలమ్ | వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాఽద్య రాఘవ || 10||అరణ్యకాండ 72/17 భావము : ఓ రాఘవా! నీవు ఇక్కడ నుంచి వెంటనే సుగ్రీవుని వద్దకు వెళ్ళి త్వరగా అతనిని మిత్రునిగా చేసుకో.

గాయత్రీ రామాయణము 5 -Gayatri Ramayanam

గాయత్రీ రామాయణము - Gayatri Ramayanam 5 : వంద్యాస్తే తు తపస్సిద్ధాః తాపసా వీతకల్మషాః | ప్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితైః || 12 ||కిష్కింధ కాండ 43/31 భావము : నిష్పాపులకు సిద్ధులకు తపస్వులకు నమస్కరించి,వారిని వినయపూర్వకముగా సీతను గురించి అడగాలి. స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీమ్ | విక్రమేణ మహతేజాః హనుమాన్మారుతాత్మజః || 13 ||సుందరకాండ 41 భావము :కపికుల శ్రేష్ఠుడు, మహాతేజస్వి అయిన హనుమంతుడు పరాక్రమంతో కామరూపిణి అగు లంకను ఓడించాడు.

గాయత్రీ రామాయణము 6-Gayatri Ramayanam

గాయత్రీ రామాయణము - Gayatri Ramayanam 6: ధన్యా దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః | మమ పశ్యన్తి యే నాథం రామం రాజీవలోచనమ్ || 14 ||సుందరకాండ 26/37 భావము : నా రాజీవలోచనుడైన రాముని చూడగలిగినందుకు దేవతలు, గంధర్వులు,సిద్ధులు, ఋషిగణాలు ధన్యులు. మంగళాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపేః | ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనమ్ || 15||సుందరకాండ 53/27 భావము : అప్పుడా సతీదేవి ఆ హనుమంతునకు శుభము చేకూర్చదలచినది. విశాలాక్షి అయిన సీత అగ్నిదేవుని స్తుతించినది.

గాయత్రీ సంహిత - Gayatri Samhitha Explanation

గాయత్రీ సంహిత - Gayatri Samhitha Explanation : ఆది శక్తిరితి విష్ణోస్తామహం ప్రణమామి హి । సర్గః స్థితిర్వినాశశ్చ జాయన్తే జగతోఽనయా ॥ 1॥ అర్ధము : గాయత్రి పరమాత్మ యొక్క ఆదిశక్తి, ఆమెకు నమస్కరించుచున్నాను. ఈ శక్తి చేతనే విశ్వము యొక్క నిర్మాణము, పాలనము, వినాశము కూడా జరుగుతున్నది. నాభి పద్మభువా విష్ణోర్బ్రహ్మణా నిర్మితం జగత్ । స్థావరం జగమం మం శక్త్యా గాయత్ర్యా ఏవత్ వైధ్రువమ్ ॥ 2॥ అర్ధము : విష్ణువు యొక్క నాభికమలము నందు పుట్టిన బ్రహ్మ గాయత్రి శక్తి చేత జడచేతన రూపమైన విశ్వమును సృజించెను. చంద్రశేఖర కేశేభ్యో నిర్గతాహి సురాపగా । భగీరథం తతారైవ పరివార సమం యథా ॥ 3॥ జగద్ధాత్రీ సముద్భూత్య యా హృన్మానసరోవరే । గాయత్రీ సకులంపారం తథా నయతి సాధకమ్ ॥ 4॥ సాస్తి గంగైవ జ్ఞానాఖ్య సునీరేణ సమాకులా । జ్ఞాన గంగా తు తాం భక్త్యా వారం వారం నమామ్యహమ్ ॥ 5॥ అర్ధము : శివకేశముల నుండి వెలువడిన గంగ కుటుంబ సంహితముగా భగీరధుని తరింపజేసినట్లు ప్రపంచమును పాలనచేయు గాయత్రి హృదయ ప్రకటమై నేడు మానస సరోవరమున సపరివారముగా గాయత్రీ సాధకుని భవసాగరము నుండి తరింపజేయును. ఆ గాయత్రియే జ్ఞానమును జలముచే పరిపూర్ణమైన గంగ. ఆ గంగకు భక్తితో పదేపదే నమస్కరించుచున్నాను.

గాయత్రీ సంహిత - Gayatri Samhitha Sloka Chanting by Master R K

గాయత్రీ సంహిత - Gayatri Samhitha Sloka Chanting by Master R K : ఏతాదృశ్యస్తు వార్తా భాసంతేల్పప్రయాసతః । యాస్తు సాధారణో లోకో జ్ఞాతుమర్హతి నైవ హి ॥ 90॥ అర్ధము : కొద్ది ప్యాసముననే గొప్ప విషయములు అవగతమగును. ఈ విషయములను సామాన్య మానవులు అర్ధము చేసికొనజాలరు. ఏతాదృశ్యస్తు జాయంతే తన్మనస్యనుభూతయః । యాదృశ్యో న హి దృశ్యన్తే మానవేషు కదాచన ॥ 91॥ అర్ధము : అతని మనమందు ఇట్టి అనుభవములు కలుగుట అనునది ఇతరులు ఊహింపశక్యము కానిది. ప్రసాదం బ్రహ్మజ్ఞానస్య యేన్యేభ్యో వితరంత్యపి । ఆసాదయంతి తే నూనం మానవాః పుణ్యమక్షయమ్ ॥ 92॥ అర్ధము : బ్రహ్మజ్ఞానము యొక్క ప్రసాదము అతడు ఇతరులకు కూడా పంచగలడు. అతనికి అక్షయమగు పుణ్యము లభించుట నిశ్చయము. గాయత్రీ సంహితా హ్యేషా పరమానందదాయినీ । సర్వేషామేవ కష్టానాం వారణాయాస్త్యలం భువి ॥ 93॥ అర్ధము : ఈ గాయత్రీ సంహిత పరమానందదాయిని. సమస్త కష్టములను నివారించునది. జగమున సాటిలేనిది. శ్రద్ధయా యే పఠంత్యేనాం చిన్తయన్తి చ చేతసా । ఆచరన్త్యానుకూల్యేన భవబాధాం తరంతి తే ॥ 94॥ అర్ధము : ఎవరు ఈ గాయత్రీ సంహితను శ్రద్ధతో పఠింతురో ధ్యానపూర్వకముగా మాననము చేయుదురో ఎవరు అనుసరించి జీవన సరళిని సరిదిద్దుకుంటారో వారు భవబాధల నుండి విముక్తులు ఆగుట తథ్యము.

గాయత్రీ స్మృతి - Gayatri Smruthi

గాయత్రీ స్మృతి - Gayatri Smruthi: పరమాత్మ యొక్క వైదిక సంజ్ఞ “ఓం”. బ్రహ్మ స్పురణము యొక్క దెబ్బ సూక్ష్మ ప్రకృతిపై నిరంతరము తగులుచుండును. ఈ దెబ్బల వలన సృష్టిలో గతిశీలత (గమనము) ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందువలన ఓంకారము పరమేశ్వరుని స్వయం ప్రకటితనామముగా వ్యవహరింపబడుతూ ఉన్నది. ఓంకారము మూడు లోకములందు వ్యాపించి ఉన్నది. భూః అనగా పృథ్వి, భువః అనగా పాతాళము, స్వః అనగా స్వర్గము. ఈ మూడు లోకములు పరమాత్మచే పరిపూర్ణములు. భూః అనగా శరీరము, భువః అనగా సంసారము - ప్రపంచము, స్వః అనగా ఆత్మ. ఈ మూడు పరమాత్మ యొక్క క్రీడా స్థలములు. ఈ మూడు ప్రదేశములను, నిఖిల బ్రహ్మాండమును భగవంతుని విరాడ్రూపముగా తెలిసికొని ఆధ్యాత్మిక ఉన్నత భూమిక ప్రాప్తించుకొనుటకు ప్రయత్నము చెయ్యవలెను. పరమాత్మ సర్వత్రా సర్వవ్యాపకునిగా, సర్వేశ్వరునిగా, సర్వాత్మగా తిలకించిన మానవుడు మాయ, మోహము, చెడు సంస్కారములను అగ్ని యందు భస్మీపటలము చేసి, నిరంతరము పరమాత్మ యొక్క దర్శనము చేయుట వలన పరమానంద సుఖమున ఓలలాడుచుండును. “ ఓం భూర్భువః స్వః ” అను అక్షరముల యందలి తత్వజ్ఞానమును ఎరిగినవాడు బ్రహ్మజ్ఞానియై జీవన్ముక్తుడు కాగలడు.

గాయత్రీ మంత్ర ప్రయోజనములు - Benefits of Gayatri Mantra

గాయత్రీ మంత్రము బీజ మంత్రము - Gayatri Beeja Mantra : జీవేమ శరదాం శతం, వందేళ్ళు ఆనందంగా హాయిగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. వేద మంత్రాలకు బీజము, సంగీతానికి బీజం, దృశ్యమాన జగత్తుకు అన్నిటికీ గాయత్రీ మంత్రమే మూలము.

గాయత్రీ మంత్ర ప్రయోజనములు - Benefits of Gayatri Mantra

జీవేమ శరదాం శతం - Jeevema Sharadam Shatam : జీవేమ శరదాం శతం, వందేళ్ళు ఆనందంగా హాయిగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. వేద మంత్రాలకు బీజము, సంగీతానికి బీజం, దృశ్యమాన జగత్తుకు అన్నిటికీ గాయత్రీ మంత్రమే మూలము.

గాయత్రీ మంత్ర ప్రయోజనములు - Benefits of Gayatri Mantra

సకల విద్యలను ప్రసాదించే గాయత్రీ మంత్రము - Gayatri Wisdom : సూర్యునియొక్క కిరణాలు అన్ని చోట్ల ఒకేలాగా వస్తాయి, ప్రతి వ్యక్తితోనూ సమానమైన దృష్టి తెచ్చుకోగలిగితే, అంటె సన్మార్గమువైపు నువ్వు ప్రేరేపించు అని మనం గాయత్రీ మంత్రము చేసినప్పుడల్లా అడగాలి. గాయత్రీ మంత్రము చాలా సులభమైన మంత్రము, ప్రత్యక్షంగా సూర్య భగవానుడు మనకు దేవుడుగా ప్రత్యక్షమవుతున్నాడు, అన్నే ఆ గురువే చేస్తాడు. మనం చెయ్యాలి అంతే. బుధ్ధి కూడా మనది ఆయనే పారుస్తాడు, ఇది అత్యంత సులభంగా మీకు ఫలితాలను ఇస్తుంది.

గాయత్రీ మంత్ర ప్రయోజనములు - Benefits of Gayatri Mantra

గాయత్రీ మంత్ర తరంగములు - Gayatri Mantra Vibrations : దేవరాహ్ బాబా పరమ పూజ్య గురుదేవులు శ్రీ రామ శర్మ ఆచార్య సశరీరంగా ఉన్నంత కాలం ఆయన తన అర్ఘ్యాన్ని ఆయన వేపు తిరిగి ఇచ్చేవారు. తూర్పు వేపు కాదు, ప్రత్యక్షంగా భూమి మీద సూర్యుడు ఉండగా ఆకాశంలో ఉన్న సూర్యుడి అవసరం ఏంటి అనేవారట. గాయత్రీ మంత్రముతో సాక్షాత్ సవితగా మారిన పూజ్య గురుదేవుల జీవితాన్ని ప్రేరణగా తీస్కొని జీవించాలి.

గాయత్రీ మంత్ర ప్రయోజనములు - Benefits of Gayatri Mantra

గాయత్రీ మంత్ర శాపం అంటే ఏమిటి ? - Gayatri Mantra ShapaVimochana : శాప గ్రస్తము అంటే లిమిటెషన్, దానిని సరిగ్గ అర్ధం చేసుకోండి. మన అందరికీ ఒక లిమిటెషన్ ఉంది, సర్వ వ్యాప్తమైన గాయత్రీ మంత్రం యూక శాపం ఏంటొ సరిగ్గ అర్ధం చేసుకోవాలి. లిమిటెషన్స్ లేకపోతే శాపగ్రస్తం కాదు, ఉంటె శాపం. మనం బంధితులం కనుక, మనం ఈ శరీరం యొక్క అవధిని దాటి వెళ్ళటం రాదు కనుక గాయత్రీ మనలోకి రావటం వల్ల ఒక లిమిటేషన్ ఏర్పడుతుంది. గాయత్రిని శపించగలగటం, మనం చిన్న గ్లాసులోకి నీళ్ళు తీసుకొని దానిని శాపవిమోచనం చెయ్యగలగటం అనేది మూర్ఖత్వం.

గాయత్రీ మంత్ర ప్రయోజనములు - Benefits of Gayatri Mantra

సమశ్యా నివారణకు గాయత్రీ మంత్రము - How to use Gayatri Mantra to solve problems : మనలో ఉన్న జీవాత్మ ఒక మహా శక్తిగా ఎదగాలి, దీనికి మంత్ర జపము లక్షల సంఖ్యలో జరగాలి. మీ చిత్తాన్ని లొంగదీయండి, గంటలు గంటలు జపం చెయ్యటానికి లొంగదియ్యల్సిందే. మీ కంటి యొక్క కామము రకరకాల సినెమాలు చూడటం, చెవులకి కామము మీకు నచ్చిన పాటలు పాడటం, నాలికకి మంచె రుచులతొ ఉన్న ఆహారం తింటాను అనేవి మీకు ఉన్న వీక్ నెస్ లు, ఇవి ఎలాగో గురుదేవులు ఒక గంట జపం చేస్తే మంచిదని చెప్పారు అది అలాగే అలవాటు చేసుకుంటే జరుగుతుంది. ఒక్క గంట మీకు నచ్చిన నచ్చకపోయినా మంచి పని అనే ఉద్దేశ్యంతో ముందు అలవాటు చేసుకొని బలవంతంగా అయినా కూర్చుని గంట జపం చెయ్యండి. అది నెమ్మదిగా చిత్తంలోకి వెళ్ళిపోతే ఇంక మీ జీవితం ధన్యమే. : < ఒక పురుషుడ్ని మారిస్తే అతను ఒక్కడే మారతాడు, స్త్రీ మారితే మొత్తం కుటుంబం మారుతుంది, అందుకే గురుదేవులు స్తీ శక్తిని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్త్రీలు గాయత్రీ మంత్రాన్ని ఉపయోగించుకోగలిగితే నూతన సమాజ ఆవిష్కరణ జరుగుతుంది. స్త్రీలకు ఎక్కువ మనో నిగ్రహం అవసరం అవుతుంది. దీనికోసం వృషాభారూఢ స్వేతవస్త్ర ధారి, చతుర్భుజి అయిన గాయత్రిని మీరు ధ్యానం చెయ్యండి. ఒక చేతిలో మాల, ఒక చేతిలో కమండలము, ఒక చేతిలో పుస్తకము, ఒక చేతిలో కమలము, ఇవి ఆయుధాలు. వీటిని సరిగ్గ ధ్యానం చెయ్యటం నేర్చుకోండి. P>

గాయత్రీ మంత్ర జప విధానము – How to do Gayatri Mantra Japa ?

గాయత్రీ మంత్ర జప విధానము – How to do Gayatri Mantra Japa ? : మనలో ఉన్న జీవాత్మ ఒక మహా శక్తిగా ఎదగాలి, దీనికి మంత్ర జపము లక్షల సంఖ్యలో జరగాలి. మీ చిత్తాన్ని లొంగదీయండి, గంటలు గంటలు జపం చెయ్యటానికి లొంగదియ్యల్సిందే. మీ కంటి యొక్క కామము రకరకాల సినెమాలు చూడటం, చెవులకి కామము మీకు నచ్చిన పాటలు పాడటం, నాలికకి మంచె రుచులతొ ఉన్న ఆహారం తింటాను అనేవి మీకు ఉన్న వీక్ నెస్ లు, ఇవి ఎలాగో గురుదేవులు ఒక గంట జపం చేస్తే మంచిదని చెప్పారు అది అలాగే అలవాటు చేసుకుంటే జరుగుతుంది. ఒక్క గంట మీకు నచ్చిన నచ్చకపోయినా మంచి పని అనే ఉద్దేశ్యంతో ముందు అలవాటు చేసుకొని బలవంతంగా అయినా కూర్చుని గంట జపం చెయ్యండి. అది నెమ్మదిగా చిత్తంలోకి వెళ్ళిపోతే ఇంక మీ జీవితం ధన్యమే.

గాయత్రీ – నాదసాధన – Gayatri – Nada Sadhana

గాయత్రీ – నాదసాధన – Gayatri – Nada Sadhana : విశాలమైన సృష్ఠి యొక్క విశాలత్వాన్ని అర్ధం చేసుకోండి. సూర్యుడు కృత్తికా నక్షత్రం చుట్టూ 27 కోట్ల సంవత్సరాలు తిరుగుతాడు, అందులో మన జీవితం ఎంత? మన కోరికలు ఎంత? మన సామర్ధ్యం ఎంత? మన శరీరంలోని ప్రతి అణువు దేవతా శక్తే అని తెలుసుకోండి. మీ ఆలోచనలు ఒక పటీష్ఠమైన బిందువుగా మరాలి. ఒక్కో సాధన ఒక్కో బిందువుగా మరాలి. మహాలక్ష్మీ సాధన చేస్తే మహాలక్ష్మీ అనే బిందువు ఒక మహా శక్తిగా విస్ఫోటనం చెందుతుంది. మీ మస్థిష్కంలో ఆ సాధన యొక్క బిందువుని సాధన చెయ్యండి. భారతదేశం తిరిగి జగద్గురుపీఠం ఎక్కుతుంది, భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క కిరణాలు ఒక్క పృధ్వినే కాదు అంతర్ గ్రహ కూటమికి కూడా ఉపయోగపడతాయి.

గాయత్రీ మంత్ర సాధన ఎందుకు - ఎలా Why Gayatri Mantra Sadhana

గాయత్రీ మంత్ర సాధన ఎందుకు - ఎలా Why Gayatri Mantra Sadhana : ఆకాశమునుండి కావలసిన శక్తిని, పదార్ధాలను, ఆకాశ తత్వాన్ని ఆకర్షించుకునేందుకు శబ్ఢాన్ని ఉపయోగించుకుంటాము - శబ్ధ తన్మాత్ర. విష్ణువు చేతిలోని శంఖము దీనికి గుర్తు. వాయు తత్వాన్ని స్పర్శతో కొలుస్తాము, స్పర్శలో వేడిని ఉపయోగించుకోవాలి. స్పర్శ=అగ్ని. వేడి ఎక్కువైన కొద్దీ తేజస్సుగా, వెలుతురుగా మారుతుంది. వేడిని తగ్గిస్తే జల తత్వముగా మారుతుంది. శబ్ధ, స్పర్శ, రూప, రస గంధములను సమర్పించటము అంటే ఈ తత్వాలను ఉపయోగించుకుంటూ పంచోపచార పూజ చేస్తాము. ఇవే గాయత్రీ మాత యొక్క 5 ముఖములు. పూజ సమయములో మనము చేస్కొనే సంకల్పమును కిందకి దింపుకోవటమే గాయత్రీ మంత్రము మనకు చెప్తుంది. అవ్యక్తముగా ఉన్న వస్తువులను వ్యక్త స్ధితిలోకి తేవటానికి యజ్ఞమును ఉపయోగించుకుంటాము.

గాయత్రీ మంత్ర జప విధానము - Gayatri Mantra Sadhana

గాయత్రీ మంత్ర జప విధానము - Gayatri Mantra Sadhana : జపం చేస్తున్నప్పుడు మంత్రోచ్చరణ మీదే దృష్ఠి ఉంచండి, చక్రాలను జాగృతం చేసే ఈ మంత్రము ఎన్ని జన్మల పుణ్యవల్ల లభించిందో అనే పులకింత తెచ్చుకుని చెయ్యండి. ఎన్నో సుసంస్కారాలు ఉంటె మనకు ఈ మంత్రం లభించింది అనే ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు రావాలి, ఎంత గొప్ప పదవి మీకు లభించిందో, ఎంత గొప్ప మంత్రము చెసే అదృష్ఠం కలిగిందో అనే పులకింతతో చెయ్యండి. ధ్యానం చేసేప్పుడు చల్లటి తెల్లటి జ్యోతిని మీ అజ్ఞా చక్రంలో ధ్యానిస్తూ చెయ్యాలి.

అజపా గాయత్రీ – Ajapa Gayatri

అజపా గాయత్రీ – Ajapa Gayatri : గాయత్రీ మంత్రము మనలో ఉన్నటువంటి జీవనీ శక్తి గాయత్రీ. నేను గాలి పీలుస్తున్నాను అనే భావన, అనుభూతి, నిరంతర స్మరణ మీకు ఉండటమే అనన్య చింత. అనన్యా చింతయంతో మా యో జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్వాసను గమనించటమే గాయత్రీ మంత్ర ప్రముఖ సాధన, దీనినే అజపా గాయత్రీ అంటారు. రోగ రహిత, వృధ్ధ్ప్య రహిత మృత్యురహిత జీవితాన్ని కలిగిన సమాజాన్ని గాయత్రీ మంత్రము ద్వారా నిర్మించవచ్చు.

గాయత్రీ – Gayatri - Basics

గాయత్రీ – Gayatri - Basics : మీరు జీవితంలో ఏది సంపాదించాలనుకుంటే అది సంపాదించగలం. ఉదాహరణ ప్రహ్లాదుడు, 5 ఏళ్ళ పిల్లవాడు, తన తండ్రి అతి పరాక్రమవంతుడైన రాక్షసుడు. కానీ చంపగలిగాడా ? హిరణ్య కశ్యపుడు లాంటి మహా రాక్షసుడే 5 ఏళ్ళ పిల్లవాడీకి అడ్డుతగలలేకపోయాడు. ఆ విద్య నేర్చుకోండి. మనకి అడగటం చేతనవ్వాలి. భగవంతుడూ సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, అలాంటి భగవంతుడ్ని మనం ఎంత తుఛ్చమైన కోరికలు కోరుతున్నాం. మనం ఏది అడిగితే అది ఇవ్వగలిగిన శక్తిని మనకు సరిగ్గా ఉపయోగించుకోవటం రావాలి. సశ్యశ్యామలమైన భారతదేశం అడగండి, ఈ ఒక్క పంట పండితే చాలు అనే చిన్న కోరిక ఎందుకు ? కోరికలు ఎలా కోరుకోవాలో తెలుసుకోవాలి.

గాయత్రీ - పరిణామ క్రమము – Gayatri - Evolution

గాయత్రీ - పరిణామ క్రమము – Gayatri - Evolution : పరిణామ క్రమములో జంతువులు, వృక్షాలు, మానవేతర ప్రాణులు యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష ఇలా అనే కమైన ప్రాణులు ఉన్నాయి. దీనిలో మనిషి యొక్క పాత్ర ఏమిటి? మనిషి తాను ఫలానా కుటుంబములోనే ఎందుకు పుట్టాను? ఫాలనా తల్లి, తండ్రి, బంధు, మిత్రులు, నా జీవితం ఇలా ఎందుకు ఉంది అనే విషయాలను తెలుసుకునేందుకు గాయత్రీ మంత్రము బాగా ఉపయోగపాడుతుంది, దీనికి మనం ఉపాసన, సాధన, ఆరాధన చెయ్యాలి. సూర్యుని నుండి తెల్లని శక్తి ధారలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి, ఆ తెల్లని కిరణాలు నాలో ప్రవేశించి నన్ను సన్మార్గంలోకి తీస్కొని వెళ్తున్నాయి, నా శరీరం అంతా సూర్యకిరణాలతో ప్రకాశిస్తోంది. జపం అయ్యాక మన ప్రవర్తన గాయత్రీ మంత్ర సాధకునివలె ఉండాలి.

గాయత్రీ - రామాయణం అనుబంధము – Gayatri – Ramayana link

గాయత్రీ - రామాయణం అనుబంధము – Gayatri – Ramayana link

< : 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిపి నడిపే సారధి దశరధుడు. వీటిని ఉపయోగించుకుంటూ కౌశల్య్, సుమిత్రి, కైకేయి అనే మూడు నాడులను ఉపయోగించుకోవటం రావాలి. గాయత్రీ మంత్రములోని 24 అక్షరాలతో 24 శ్లోకాలను రాసి వాటికి వివరణగా 1000 శ్లోకాలు ఇచ్చారు వాల్మీకి. అవి చదవితే మీకు అర్ధం అవుతుంది. మొదటి 8 శ్లొకాలు జాగృదావస్థలో ఎలా జీవించాలో చెప్పారు, తరువాత 8 స్వప్నావస్థ, ఆ తరువాత సుషుప్తావస్థను గురించి చెప్పారు. తపస్సు, స్వాధ్యాయము నిరంతరం చెయ్యటమే గాయత్రీ మంత్ర సాధకుని లక్ష్యము. “రాక్షసులను చంపిన రాముడిని ఋషులు ఇంద్రుడిని ఎలాపూజించారో అలా పూజించారు. “/div>

గాయత్రీ - శ్వాస- రామాయణము – Gayatri – Breath & Ramayana

గాయత్రీ - శ్వాస- రామాయణము – Gayatri – Breath & Ramayana : ప్రపంచాన్ని శాసించే 5 గురు, 1. రాజనీతిజ్ఞులు - మూలాధారము 2. వ్యాపారవేత్తలు, ధనవంతులు- స్వాధిస్ఠనము 3. సైంటిస్ట్ లు - ంఅణిపూరకము 4. కళాకరులు ( ఆక్టర్స్) - అనాహతము & 5. ఉపధ్యాయులు( టీచర్స్) - విశుధ్ధి - ఈ 5 చక్రాలను తన వశంలొ చేసుకుని మొత్తము పృధ్విలో భారతదేశముయొక్క కుండలినీని, భారతదేశం యొక్క కుండలిని ని జాగృతం చేసిన ఏకైక గురువు పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులు. 5 చక్రాలను 5 వీరభద్రులుగా చేసి ప్రపంచంలో కావలసిన మార్పులను తెస్తున్నారు. “21600 శ్వాసలు రోజుకి తీసుకొనగలిగితే ఖచ్చితంగా మీరు 100 సంవత్సరములు జీవిస్తారు, అందుకని శ్వాసని లోతుకి తీస్కోవటం రావాలి. “

గాయత్రీ - శ్వాస- దేవమాత – Gayatri – Breath - Devamata

గాయత్రీ - శ్వాస- దేవమాత – Gayatri – Breath - Devamata : గాయత్రీ అంటే మన శరీరములో ప్రవహిస్తున్న ప్రాణ శక్తి, దానికి ఆధారం శ్వాస. ఓం అనే ఆధారభూతమైన శబ్ధ బ్రహ్మమును "అ-ఉ-మ" అనే అక్షరాలను భౌతిక, స్వాప్నిక, ఆత్మిక జగత్తులో ఉపయోగించుకోవటమే ఆధ్యాత్మిక విద్య. గాయత్రీ దేవమాత, ఎన్ని దేవాలయాలు ఉన్నా వాటి అన్నింటికి ప్రాణ శక్తి గాయత్రి నుండే వస్తుంది కాబట్టి విద్మహే, ధీమహి, ప్రవోదయాత్ అనే పదాలతో అన్ని దేవతలకి వాటి వాటి గాయత్రీ మంత్రాలు ఉన్నాయి.

గాయత్రీ - యజ్ఞము – గురువు – Gayatri – Yagnya – Guru

గాయత్రీ - యజ్ఞము – గురువు – Gayatri – Yagnya – Guru : గాయత్రీ మంత్రము - యజ్ఞము భారతీయ సంస్కృతికి ఆధారభూతమైనవి. రెండు పదాలకి అర్ధాలు చాలా విపరీత ధోరణిలో తీస్కొంటున్నాము, గాయత్రీ అనేది మన జీవనీ శక్తి, మన ఊపిరే గాయత్రి. దీనిని మనం జాగ్రత్తగా గమనిస్తే వదులుతున్నప్పుడు "హం" అను శబ్ధము, తీస్కొంటున్నప్పుడు "స" అనే శబ్ధము వినిపిస్తుంది, దీనిని ఉచ్చరించకూడదు. ఆ శబ్ధాన్ని అనుభవించటానికి ప్రయత్నం చెయ్యాలి. దీని ద్వారా లైఫ్ ప్రిన్సిపుల్ అర్ధం అవుతుంది.

గాయత్రీ ఉపనిషత్ - Gayatri Upanishat - 1

గాయత్రీ ఉపనిషత్ - Gayatri Upanishat - 1 : గాయత్రీ ఉపనిషత్ మైత్రేయులవారికి - మౌద్గల్యునికి మధ్య జరిగిన సంభాషణ ద్వారా గాయత్రీ మాత యొక్క మహత్వ పూర్ణ స్వరూపం తెలియచేయబడింది. ఏతధ్ధస్మ ఏతద్వింద్వాంసమేక దశాక్షం మౌద్గల్యం గ్లావో మైత్రే యో అభ్యాజగాం. సత్ స్మిన్ బ్రహ్మ చర్య వసతీతి విజ్ఞయో వాచ కిం మస్మి న్మర్యొ అధ తన్మౌద్గల్యో ధ్యేతి యదస్మిన్ బ్రహ్మచర్య వస తీతి. మౌద్గల్యుని, బ్రహ్మచారిని చూసి వాని మాటలు విని గ్లావుడు ( చిరునవ్వుతో) అన్నాడు. " మౌద్గల్యుడు ఈ బ్రహ్మచారికి ఏమి చదువు చెపుతున్నాడు ? ( అంటే ఏమీ చెప్పటం లేదు అని వ్యంగ్యంగా అన్నాడు. ఆ శిష్యుడు తన ఆచారి వద్దకు పోయి జరిగినది చెప్పగా మౌద్గల్యుడు మైత్రేయుడు ఆ మాటలు అన్న వ్యక్తిని తనవద్దకు తీసుకురమ్మని చెప్పారు. 1.వేదములు ఛందములు సవిత యొక్క వరేణ్యములు. 2. విద్వాంసులు అన్నమునే సవితయొక్క వరేణ్యముగా తెలుసుకున్నారు. 3. కర్మయే ఆ "ధీ" తత్వము. దాని ద్వారానే అందరికి ప్రేరణ నిచ్చు సవిత వివరణ చేయును. విద్యను పొందటానికి విశేషంగా ఆధ్యాత్మ విద్యను పొందటానికి విద్యార్ధి తన అధ్యాపకుని వద్దకు వెళ్ళేటప్పుడు నమ్రతతో, శ్రధ్ధ మనస్సున నింపుకొని వెళ్ళటం పధ్ధతి.

గాయత్రీ ఉపనిషత్ - Gayatri Upanishat -2

గాయత్రీ ఉపనిషత్ - Gayatri Upanishat - 2 : విద్వాంసులు అన్నమునే సవితయొక్క వరేణ్యముగా తెలుసుకున్నారు. దేవుని భర్గము అన్నము. శ్రేష్టుడు కావటానికి బలవంతుడు కావాలి. అందుకు అన్నం కావాలి. దానికి సాధన చెయ్యాలి. సాధన, సామాగ్రి, లక్ష్మి కలిసి ఒక శక్తి. ఈ శక్తి అసురుల చేతిలో పడితే అసురత పెరుగుతుంది. దేవతల చేతిలో పడితే దైవత్వం పెరుగుతుంది. దేవతలు బలవంతులవుతారు. శాసన శక్తి కౄరుల, దుష్టుల చేతికి చిక్కితే దుర్మార్గం అంతటా విస్తరిస్తుంది అనేది అందరికీ తెలిసినదే కదా. అదే రాజశక్తి మంచివారిచేతిలో పడితే మన దేశం కూడా అమెరికాతో సమానంగా ఎంతో ఉన్నత స్ధితికి రాగలుగుతుంది. లక్ష్మిపై శ్రేష్ఠ జనుల ఆధిపత్యం ఉండాలి. అందువల్ల ప్రపంచంలో సుఖ శాంతులు పెరుగుతాయి.

గాయత్రీ ఉపనిషత్ - Gayatri Upanishat -3

గాయత్రీ ఉపనిషత్ - Gayatri Upanishat - 3 : ఆధ్యాత్మిక జగత్తులో ఒక్కొక్క ఋషి ఒక్కో శక్తిని ఉపయోగించుకుంటారు. ఘనీభవించిన సవితా శక్తి సూర్యుడు, ఆయన నుంచి వచ్చే కిరణాలు శక్తి కిరణాలు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా చెట్ల మీద పడ్డ ఆ భర్గ శక్తి పదార్ధంగా మారి మనలో శక్తిని పెంచుతున్నాయి. ఇవి మిధునములు, శక్తి - పదార్ధము అనేది అతి ముఖ్యమైన మిధునము. నాట్యమును, నాట్యం చేసేవారినుండి విడదీయలేము అనే ఉదాహరణ మీకు పదార్ధమును శక్తిని ఒకదానితో ఒకటి వేరు చెయ్యలేము అనేది అర్ధం చేస్కునేందుకు ఉపయోగపడుతుంది. శ్రీ, ప్రతిష్ఠ, సత్జ్ఞానము ఉపయోగించుకునేవాడు మాత్రమే బ్రాహ్మణుడు. అలా సావిత్రీ శక్తిని ఉపయోగించుకునేవాడే శ్రేష్టుడు.

గాయత్రీ ఉపనిషత్ - Gayatri Upanishat -4

గాయత్రీ ఉపనిషత్ - Gayatri Upanishat - 4: శ్రీ అంటే లక్షణాలు కలిగిన పదార్ధము. ఆ పదార్ధాలు అగ్నితో వస్తున్నాయి. యజ్ఞం వలన మనం పదార్ధాలను పొందవచ్చు. అగ్నికి శ్రీ తొను, శ్రీ కి స్త్రీ శక్తి తోను లింక్ ఉంది. స్త్రీ అంటె అమ్మ తత్వముయొక్క ఒక అభివ్యక్తి. స్త్రీ మిధునముతో అంటే స్త్రీ స్వయంగా తనే ఒక జంటగా మారుతుంది, తననుండి తను ఒక సృష్టిని చెయ్యగలదు. అంత అద్భుతమైన మిధునాన్ని మీరు అర్ధం చేస్కోవటానికి ..మిధునముతో , సంతానమునకు, సంతానముతో తపమునకు, తపముతో సత్యమునకు ఉన్న లింక్ అర్ధం చేసుకోవాలి. సత్యముతో బ్రహ్మ, బ్రహ్మతో బ్రాహ్మణునికి ఉన్న లింక్. శ్రీ, ప్రతిష్ఠ, ఆయతనం ఉన్నవాడు బ్రాహ్మణుడు.

సంధ్యావందనము Sandhya Vandanamu Practical Explanation

సంధ్యావందనము Sandhya Vandanamu Practical Explanation :

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-1

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -1 2003 Gayatri Mahavigyan Work shop lectures: భారతీయ ఆధ్యాత్మికత ఒక విశుధ్ధమైన విజ్ఞానముగా రూపొందించబడినది. ఇప్పుడూ ఉన్న రేడియోలు కానీ, న్యూస్ పేపర్లు కానీ, రవాణా సౌకర్యాలు కానీ లేనటువంటి కాలంలో భారతదేశం ఇంత గొప్పది అని ఎలా తెలిసింది ? తెలిస్తే చుట్టూరా మూడువైపులా సముద్రం, ఇంకొకవేపు హిమాలయాలు ఛేదించుకుని భారతదేశాన్ని చూసి వెళదాము అని వచ్చేటటువంటి వ్యక్తులు ఏమి ఆశించి వచ్చారు ? ఏమి పొందారు ? అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ భారతీయ సంస్కృతి దేశ విదేశాలకు ఎలా వెళ్ళగలిగింది ? ప్రపంచంలో ఎక్కడ చూసిన భారతీయ సంస్కృతి చిహ్నాలు కనిపించటానికి కారణం ఏమిటి ?

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-2

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -2 : కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ? చేతత్వన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అన్నది తెలుసుకోవాలి. జీవితం అంటే ఏమిటి ? పబ్లిక్ ఒపీనీన్ ఈజ్ రూలింగ్ అజ్, ఈనాడూ ప్రజాభిప్రాయం మనల్ని కంట్రోల్ చేస్తోంది. మన అభిప్రాయాలు మనల్ని కంట్రోల్ చెయ్యడం అనేది ఫ్రీడం, అది ముక్తి. నేను నా జీవితాన్ని నాకు కావల్సిన పధ్ధతిలో తీర్చిదిద్దుకుంటాను అనేది ద్విజత్వం. జియోపాలిటిక్స్ అర్ధం చేసుకోండి.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-3

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -3 : గాయత్రీ అంటే ఒక మంత్రము గురుంచి మనం మాట్లాడటం లేదు, ఒక జీవిత విధానం గురుంచి మాట్లాడుతున్నాం. ప్రాణ శక్తి గురుంచి, లైఫ్ పోర్స్ గురుంచి, చేతనత్వం గురుంచి మనం మాట్లాడుతున్నాం. కాలము, ప్రాణ శక్తి, లైఫ్ ఫోర్స్ అనే త్రిపుటినిగురుంచి మాట్లాడుతున్నను. త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచంలో సత్వ, రజ, తమో గుణాలతో ఉన్న ఈ ప్రపంచాన్ని సైంటిస్ట్లు కూడా త్రీ డైమన్షనల్ వర్ల్డ్ అని పిలుస్తారు. కాలానికి 3 ఆయామాలు ఉన్నాయి, భూత, భవిష్యత్, వర్తమానములు. జరిగినది, జరుగుచున్నది, జరగబోయేది. చేతనత్వములో దానిని జాగృత, స్వప్న సుషుప్థావస్థలు అంటారు.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-4

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-4: పూజ అది అయ్యాక అందరూ చేతులు రుద్దుకుని కళ్ళ మీద పెట్టుకుంటారు ఎందుకు ? పావక అనే అగ్ని ద్వారా వచ్చే వేడి మన శరీరాలలో 5 రకాలుగా పని చేస్తుంది. మన చేతికున్న 5 వేళ్ళు ఆ 5 ప్రాణాలకి సంకేతాలు. ఈ 5 ప్రాణాలను మనం కావలసిన చోటికి తీస్కొని వెళ్ళీ వాడుకోవటం రావాలి. దానికొరకు మనం మన దృష్టి కోణం మార్చుకోవాలి. గాయత్రీ మంత్రం ద్వారా మీ అజ్ఞా చక్రం నుండి ప్రవేశించిన చల్లని తెల్లని జ్యోతి వేడి, వెలుతురుతో ఉన్న జ్యోతి మీ సరీరం అంతా వ్యాపించి అంతా జ్యోతిర్మయం అవుతుంది. గాయత్రీ మంత్రం యొక్క హ్రీం శక్తి ( లివర్ వద్ద), క్లీం శక్తి ( హార్ట్ వద్ద), శ్రీ శక్తి ( ఆజ్ఞా చక్రం) ఈ మూడింటి సమన్వయంతోనే ఓంకారం ఏర్పడుతుంది.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-5

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -5: బయోకెమిస్ట్రీ గా చెప్పబడుతున్న, జెనెటిక్ ఇంజనీరింగ్ గా ఈ విద్య ఇప్పటికే యూనివెర్సిటీ లలో వచ్చింది. గాయత్రీ మహా విజ్ఞాన్ అంటే జీవనీ విద్య. ఈ జీవనీ విద్యని మారు జాగరత్తగా నేర్చుకోవాలి. పృధ్విని, అగ్నిని, జలాన్ని, వాయువుని ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటున్నామో అలా రాబోయే కాలంలో ఆకాశాన్ని ఉపయోగించుకునే విద్యలో మీరు నిష్ణాతులు కావాలి. గాయత్రీ మంత్రం ద్వారా మీరు దీనిని సాధించగలరు.ఆకాశాన్ని శబ్ధంతో కొలొస్తాము, ద్వనిని మీరు పట్టుకోగిల్గితే మీరు ఆకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ఒక పదార్ధాన్ని వాడుకున్నట్లే మీరు ఆకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-6-1

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -6-1 సృష్టి ఆదికి విష్ణువు యొక్క నాభినుండి ఒక కమలము ఉద్భవించుట, నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ జ్ఞాము నాలుగు రకాలుగా ఉంటుంది. నాలుగు దిశలలోనే ఈ జ్ఞానము పని చేస్తుంది. నాలుగు రకాలు 1. వేడి, 2. వెలుతురు, 3 ధ్వని & 4. ఆదర్శము. మొత్తము ఆధ్యాత్మిక విద్య మనైషి నాభిచక్రము అనగా మణిప్పొరక చక్రము మీద ఆధారపడి ఉంటుంది. అదే మన శరీరములో ఉన్న అగ్నితత్వము. కళ్ళు, కాళ్ళు దీని జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము. మన మణిప్పొరక చక్రము ఆదర్శ దృశ్యాలను అనుసరించాలి, గురు చరణాలను అనుసరించాలి.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-6-2

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -6-2: మన భారతీయులు ఏ విద్యనైతే బోధించారో అదే " ద పవర్ ఆఫ్ థాట్" గా మనస్సు యొక్క శక్తిగా నేడు సైకాలజిస్ట్ లు మెల్లిగా అర్ధం చేసుకుంటున్నారు. మనో విజ్ఞాన శాస్త్రములో మన మనస్సుని మూడుగా విభజిస్తారు. 1. కాన్షియస్, 2. సబ్ కాన్షియస్, 3. సూపర్ కాన్షియస్ అంటే చేతన, అచేతన & దివ్య చేతన. మానవ జీవితములో మనకు కనిపిస్తున్న మ్యాజిక్ లు అన్నీ కూడా కాన్షియస్ మైండ్ యొక్క మ్యాజిక్కులు. సబ్ కాన్షియస్ ను మనం చిత్తం అంటాం. సూపర్ కాన్షియస్ ను అహంకారము అంటాము. ఆ దివ్య చేతనకు సమర్పణ చేసుకునే విద్య యోగ విద్య. " అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ:" అనేటువంటి పదంలో " అహం" అనేది అహంకారపూరితమైనది అని కాదు, మనలో ఉన్న దివ్య చేతనకు ప్రతీక. ఏ దివ్య చేతనత్వమైఅతే " అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరా చరం ..." గా జన చేతనత్వములో ఉంటుందో ఆ దివ్య చేతనత్వానికి యోగ పరిభాషలో అహం అని పేరు. ఇది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, సర్వత్రా వ్యాపించబడి ఉన్నటువంటి చేతనత్వానికి ప్రతీక.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-7 -1

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -7-1: భూర్, భువహ్, స్వహ, మహ:, జన:, తప:, సత్యం అనేవి వ్యాహృతులు. ఎందుకు వీటిని వ్యాహృతులు అంటామంటే వ్యాపించి ఉంటాయి కనుక. చెట్టులోను ఈ ఏడు సెంటర్స్ ఉన్నాయి, జంతువులలోను, మనుషులలోను, ఋషులలోను, దేవతలలోను కూడా ఈ ఏడు సెంటర్స్ ఉన్నాయి. అందువల్ల మొత్తము ప్రపంచము కూడా 7 శక్తి ధారలలోనే జీవిస్తూ ఉంటుంది కనుక మానవుడిగా మన జీవితము 7 గ్రహాలలతోనే కవర్ అయ్యింది. అంచేత మన జీవితము ఎప్పుడూ కూడా 7 రోజుల్లోనే కంప్లీట్ అవుతూ ఉంటుంది.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-7 -2

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -7-2 కోరికలు తీరడానికే సాయి చరిత్ర చదవకండి, చదివితే తీరుతుంది అది వేరే విషయం. కానీ ఇవన్నీ చదవటానికి అర్ధం చేసుకోవటానికి చదవండి, మానవుడిగా నీ ముందు ఉన్న ప్రమాదాన్ని అర్ధం చేసుకోవటానికి చదవండి. ఈ మానవశరీరాన్ని ఎందుకు ధరించావో అందుకు ఉపయోగించుకోకపోవడం వల్ల నువ్వు ఎంత ఐందా కిందకి దిగజారిపోవచ్చు. అది అర్ధం చేసుకోండి. ఈ షిరిడీ సాయి, సత్య సాయి వాళ్ళు ఆధ్యాత్మిక శక్తిని ఈ చాతకాని దద్దమ్మల పెళ్ళిళ్ళకి, ఉద్యోగాలకి, తిండి సంపాదించడానికి వచ్చారనా ? మీ ఉద్దేశ్యం. వాళ్ళు కేవలం మీ తుచ్చమైన కోరికలు తీర్చటానికి రాలేదు, అది అర్ధం చేసుకోండి. మీకు చాక్లెట్లు ఇచ్హినట్లు ఇవన్నీ ఇచ్చి మీకు పరిణామక్రమం గురుంచి తెలియచేసేందుకు వచ్చారు, పరిణామ క్రమ గతిని పెంచడానికి వచ్చారు వాళ్ళు. ఇవల్యూషన్ స్పీడ్ పెంచటానికి వచ్చారు, ఈ స్పీడప్ ఎప్పుడెప్పుడు స్పీడ్ అప్ అవుతుందో కూడా అర్ధం చేసుకోండి.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-8

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -8 సాధనా నియమాలలో మొదటిది పరిశుభ్రత, దీనిని అనేకమంది గురువులు చెప్పిన మాటని, ఔట్ ఆఫ్ కాంటెస్ట్ ఉపయోగించుకుని చెప్తున్నాను. ఖచ్చితంగా మీ జపములో ఆవిర్భవించే శక్తిని 90% కోల్పోతున్నారు. పరిశుభ్రత లేకపోవడం వల్ల, స్నానం చెయ్యకుండా పరిశుభ్రంగా లేకుండా, సరైన బట్టలు వేసుకోకుండా, సరైనచోట కూర్చోకుండా మీరు గాయత్రీ మంత్ర జపము కానీ ఏ సాధన కానీ చేసినా, ఏ భజనలు చేసినా 90శాతం పోతుంది. అది అర్ధం చేసుకోండి. మీరు వేసుకునే ఆసనం చాలా శుభ్రంగా ఉండాలి. ధ్యానిని కూర్చున్నప్పుడు గీతలు ఉన్న బట్టలు వేసుకోకండి. మీరు జపం చేసుకునేటప్పుడు చెక్స్, గీతలు, గడులు ఉన్న బట్టలు వేసుకోకండి.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-9

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -9: జన్మ జన్మాంతారలలో కూడా నేను ఈ సాధనలు చేస్తాను అనే దమ్మున్నవాళ్ళే ఆధ్యాత్మిక జగత్తులోకి రావాలి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో అర్ధం చేసుకోండి. ఇది కంటిన్యుటీ అఫ్ఫ్ కాన్షియస్ నెస్, నిరవధిక చేతనత్వము. మధ్యలో అంతం అయ్యేది కాదు, జన్మ జన్మాంతరాలకి కొనసాగుతుంది. యదా యదాహి ధర్మశ్య గ్లానిర్భవతి భారత: అభ్యుథ్థానం అధర్మశ్య తదాత్మానం సృజామ్యహం - పవిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే" ఈ శ్లోకం మీరు శ్వాస తీస్కునేప్పుడు బాగా గుర్తు పెట్టుకుంటే దాని ఫలితాలు మీ శరీరాలలో కనిపిస్తాయి.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-10

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -10 ఉత్తరాన ఉన్న హిమాలయాలు, దక్షిణాన ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కలిపి ధ్యానం చేయడం మొదలుపెడతారో మీ యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు సంగమం జరుగుతుంది. మీ యొక్క సహస్రారం ఉత్తర ధృవం, మీ యొక్క మూలాధారం దక్షిణ ధృవం. ఆ పోల్ షిఫ్ట్ అనేది మీలో జరగాలి. దాని తరువాత కొండని చూడండి. భారతదేశంలో కొండలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది, గురువుగారు హిమాలయాలని నా తండ్రి అనేవారు.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-11

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -11 : మీకు అసలైన జన్మదినము అంటే ఏమిటో తెలుసా? మీలో శ్వాస ఎందుకు ఆడుతున్నదో తెలిసిన రోజు మీకు నిజమైన జన్మదినము. శ్వాస నిరంతరము మీలోకి వెళోతోంది, దానిమీద మీక కంట్రోల్ లేదు. ఏ ముక్కులోంచి ఎప్పుడూ ఏ రకమైన శ్వాస వెళుతోందో కూడా మనకు తెలీదు. ఇప్పుడూ ఉన్న విజ్ఞానమంతా ఏకమైన ఒక సారి శ్వాస మనిషిలోనుండి బయటికి వెళ్ళక మళ్ళె వెనక్కి తేలేదు. అది పట్తుకోవటమే జన్మదిన సంస్కారము. మీరు ఊపిరి ఎంఉద్కు పీల్చుకుంటున్నారో తెలిసిన రోజు నిజమైన పుట్టినరోజు. శ్వాసలో సత్ర్పవృత్తులు లోపలికి వెళ్తున్నాయి, దుష్ప్రవృత్తులు, అహంకారము బయటీకి పోతోంది అని భావన చేస్కోండి. నేను చేస్తున్నాను అనే భావన అన్ని అరిష్టాలకి మూల కారణం. పుట్టినరోజునాడు వాయువు ద్వారా సత్ప్రవృత్తులను, అగ్ని ద్వారా మంచి దృష్టిని, ఆకాశము ద్వారా మంచి వాకును దింపుకోవడం నేర్చుకోవాలి.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-12

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -12 వాక్ శక్తి రెండు రకాలుగా పని చేస్తుంది. వికర్షణగా, ఆకర్షణగా పని చేస్తుంది. వాక్ శక్తి యొక్క వికర్షణ శక్తి ఎలక్ట్రిసిటీ కి కారణం. పూజలు, కర్మకాండ చెయ్యటంతో పాటు పుస్తాకాలు బాగా చదివితే గానీ మీకు జ్ఞానం రాదు. ఇప్పుడూ మనం ఉపయోగిస్తున్న వాక్శక్తి డివిజన్ ( విఖండము అవటానికి) విశ్లేషణ. మనం ఏం పట్టుకోవాలన్నా అఖండంగా పట్టుకోలేము, విఖండంగా పట్టుకోవాలి. ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క చుక్క అన్నీ కలిపితే అక్కడ ఒక బొమ్మ ఏర్పడుతుంది. ఆ చుక్కలన్నీ మీరు కలుపుకుంటారు, అక్కడన్నీ చుక్కలే ఉన్నాయి, వాటిని క్రిస్టల్స్ అంటాము ఇంగ్లీషులో. అక్కడ నిజానికి బొమ్మ ఏమీ లేదు, బిందువులు మాత్రమే ఉన్నాయి. కానీ వక్శక్తికి ఆకరిషించే గుణము ఉన్నది, కర్షయతి కృష్ణ, ఆకర్షించే శక్తి కృష్ణుడు.

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan-13

గాయత్రీ మహా విజ్ఞాన్ – Gayatri Maha Vigyan -13 యజ్ఞోపవీతంలోకి ఐదు శక్తులను ఆవాహన చేసుకోవాలి. బ్రాహ్మీ శక్తి - బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి, వైష్ణవీ శక్తి - విష్ణువు యొక్క పరిపాలనా శక్తి, రౌద్రీ శక్తి - ప్రకృతిలోని అవాంచనీయతలను తీసెవేసే రుద్ర శక్తి, గురు శక్తి - బ్రహ్మ, విష్ణు, శివాత్మక శక్తుల కలయిక ఐన గురు శక్తి, మహాకాల శక్తి - మహాకాలుని యొక్క శక్తిని ధారణ చెయ్యాలి. యజ్ఞోపవీత సంస్కారము అంటే ప్రకృతి యొక్క సృజనాత్మకమైన శక్తితో తాదాత్మ్యము, పరిపాలనా శక్తితో తాదాత్మ్యము, పకృతిలో ఉన్న అవాంచనీయతలను దగ్గరకు రానీయకుండా రౌద్రీ శక్తితో తాదాత్మ్యము, ఈ మూడింటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పే గురువుతో తాదాత్మ్యము తరువాత నాలుగు దేశ కాల పరిస్ధితులలో ఆ మహాకాలుడి యొక్క ప్రవాహములో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పే జ్ఞానాన్ని, ఆ సూత్రాలను, ఆఫార్ములాలను పట్టూకుంటాను అను దీక్ష.