జనవరి

060196 గాయత్రీ మంత్రమును ఉపయోగించుకోవటం ఎలా ?

ఆకాశమునుండి కావలసిన శక్తిని, పదార్ధాలను, ఆకాశ తత్వాన్ని ఆకర్షించుకునేందుకు శబ్ఢాన్ని ఉపయోగించుకుంటాము - శబ్ధ తన్మాత్ర. విష్ణువు చేతిలోని శంఖము దీనికి గుర్తు. వాయు తత్వాన్ని స్పర్శతో కొలుస్తాము, స్పర్శలో వేడిని ఉపయోగించుకోవాలి. స్పర్శ=అగ్ని. వేడి ఎక్కువైన కొద్దీ తేజస్సుగా, వెలుతురుగా మారుతుంది. వేడిని తగ్గిస్తే జల తత్వముగా మారుతుంది. శబ్ధ, స్పర్శ, రూప, రస గంధములను సమర్పించటము అంటే ఈ తత్వాలను ఉపయోగించుకుంటూ పంచోపచార పూజ చేస్తాము. ఇవే గాయత్రీ మాత యొక్క 5 ముఖములు. పూజ సమయములో మనము చేస్కొనే సంకల్పమును కిందకి దింపుకోవటమే గాయత్రీ మంత్రము మనకు చెప్తుంది. అవ్యక్తముగా ఉన్న వస్తువులను వ్యక్త స్ధితిలోకి తేవటానికి యజ్ఞమును ఉపయోగించుకుంటాము.

060196 యజ్ఞ మంధన

మేఘము వర్షించాలంటే బరువు కావాలి, అది సిల్వర్ క్లోరైడ్తో చేస్తారు, యజ్ఞములో ఇదే విధానాన్ని మనము పాటిస్తాము. గాయత్రీ మంత్రమును యజ్ఞానికి ముందే బాగా చేస్తాము, ఈ జపము అంతా మేఘములుగా పైన చేరి ఉంటుంది, ( జపము ద్వారా ఆ అలోచనలు ఆకాశములో చేరతాయి). వాక్కు ఉచ్చరించాక అది ఆకాశంలోకే కదా పోతుంది. నేతితో కలిపి మనము మంత్రాన్ని ఉచ్చరించి ఆహుతి వేస్తాము, నేతి యొక్క భాష్పాలు చాలా బరువుగా ఉంటాయి, ఆ బరువైన ఆహుతులు అప్పటికే మనము ఆకాశములో నిర్మించిన గాయత్రీ మంత్ర తరంగాలతో కలుస్తాయి, దానివల్ల యజ్ఞములో మనము ఏది కోరుతామో ఆ ఫలితాన్ని పొందుతాము.

070196 సూర్యకిరణ విజ్ఞానము

సూర్యుని నుండి వచ్చే 7 కిరణాలను మాత్రమే మానవ జాతి పట్టుకోగలదు, ఒక్కొక్క రోజు శ్వాస ఒక రకంగా ఉంటుంది, 7 రోజులు 7 రకాలుగా ఉంటుంది కాబట్టే పారాయణా విధానము 7 రోజులు చెయ్యాలి.

070196 సాయిని సేవించటం ఎలా?

చంద్రుడియొక్క కిరణాలు కానీ సూర్యుడి యొక్క కిరణాలు కానీ బయటి నుండి లోపలికి వెళ్ళినప్పుడు శరీరములో వచ్చే మార్పులు గమనించుకోవాలి. శ్వాస ద్వారా సూర్యిడినుండి వచ్చే సూర్య కిరణాలు మన షట్చక్రాలలోకి 7 గ ప్రవేశించి, 3 అంతరిక్షములో ప్రవేశిస్తాయి. 4 వర్ణాలుగా అవి మన శరీరంలో ఉంటాయి. (త్రిపాదూర్ద్వ ఉదైత్పురుషహ). సూర్యుడి కిరణాలను ఎవరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతాయి, అంటే ఒక బిజినెస్ మాన్ వాటిని తన బిజినెస్ కి వాడుకుంటాడు...అలా 4 వర్ణాలు 4 రకాల వ్యక్తులుగా సమాజములో దర్శించచ్చు.

140196 ఉపాంశు జపం

ప్రేమతత్వం ఉన్న చోట దోషాలను గుర్తించము. ఇంకా ఎవరినయితె ప్రేమిస్తున్నామొ ఏమి చెయ్యగలము వారికి అని ఆలోచిస్తాము .నాకు ఏమి లాభం అని ఆలోచించము. ఆ సేవా భావము,ప్రేమ తత్వము పరస్పరం కలిసి ఉంటాయి ఎప్పుడు కూడ. ఈ ప్రేమ తత్వాన్ని మనం వేద జ్ఞానం ద్వార పొందుతున్నాం.ప్రపంచంలొ ప్రతి వ్యక్తి మీద నిరంతరం ప్రేమ తరంగాలు ఉద్భవిస్తు వాళ్ళను ముంచెత్తు ఉండాలి.

130196 ఓంకారం

మన జన్మ సార్ధకము చేస్కోవాలంటే జాగృత, స్వప్న సుషుప్థావస్థలలో మనకు పూర్తి ప్రావీణ్యతను సాధించాలి.

260196 ఓంకార సాధన

శక్తి ప్రచోదనం అంటె శక్తి జాగృతం అవ్వటం. ప్రతి మనిషికి బలహీనత ఉంటుంది.ఎలాంటి బలహీనత లేకుండ శక్తి జాగృతం అవ్వాలంటె సాధన ముఖ్యము.మనలొ ఉన్నటువంటి అంతర్ శక్తిని జాగృతం చెయ్యటానికి ఓంకారాన్ని ఉపయోగిస్తాము.

260196 శ్వాస ధ్యానము ప్రజ్ఞా గీతము

మైనే జీవన్ త్యాగ్ తితీక్షా అను ప్రజ్ఞా గీతమునకు, ఉత్తర్ సే ఆరహీ అను ప్రజ్ఞా గీతమునకు వివరణ . శ్వాస మన శరీరములోకి ప్రవేశించిన తరువాత 5 ప్రాణాలుగా ఎలా మారుతోంది అనేది గమనించండి.

పంచకోశ జాగరణ

పంచకోశ జాగరణ - మన శరీరానికి 6 అంగుళముల దూరమువరకు వ్యాపించి ఉండే అన్నమయ కోశము పై ధ్యానము, తరువాత నెమ్మదిగా అన్ని కోశములపి చేసే ధయాన ప్రక్రియా విధానము.

270196 పంచకోశ జాగరణ

అన్నమయకోశం ఎరుపు రంగు ధ్యానం. ప్రాణామయ కోశం కాషాయ రంగు ధ్యానం. మనోమయ కోశం పసుపు రంగు ధ్యానం, విజ్ఞానమయ కోశం అకుపచ్చ రంగు ధ్యానం , సర్వం వ్యాపించి ఉన్న నీలాకాశము అనందమయ కోశము నీలం రంగు ధ్యానం

270196 సుపర్ణ సూక్తం

అగ్నికి యోగ విధ్యకు చాల దగ్గర సంభందము ఉంది.సంస్కారాలను మార్చాలి అంటే అగ్నినే ఉపయోగించు కోవాలి. ఉప అంటే దగ్గరగ నయనం అంటే కన్ను అంటే చాల దగ్గరగ చూడగలిగింది . ఆత్మ మనకు చాల దగ్గర ఉంది ఆ పరమత్మ మనకు చాల దగ్గరగ ఉన్నాడు. ఆ పరమాత్మను చూడటానికి ఉపనయన సంస్కారం.

140196 శ్వాస

"దేవ సంస్కృతి అన్నా భారతీయ సంస్కృతి అన్నా ఒకటే. అహో రాత్రులలొ మనిషి 21 వేల 600 సార్లు శ్వాసను తీసుకుంటాడు. మీరు ఉందయం 1000 శ్వాసలు రాత్రి 1000 శ్వాసలు మాత్రమే తీసుకుంటె బ్రహ్మ జ్ఞానం మీకు వచ్చేస్తుంది. లాహిరీ మహాశయగారికి వారి గురువు నేర్పినది ఈ విద్యే ."

190801 సహజ కుంభక రేచరం

వయసు అత్మకి రాదు. మనం వెళ్ళవలసిన దారి ఆత్మ జ్ఞానం వైపు కనుక వయసుతో సంబంధం లేదు. ధృవుడు ,ప్రహ్లాదుడు చిన్న వయసు లోనె సాధన చేసి ఆత్మజ్ఞానం పొందారు. ఏ వయసు వారు అయినా ఆధ్యాత్మిక సాధన శ్రద్ధతొ చేసి ఫలితాలు సాధించవచ్చు

260196 వ్యాహృతుల సాధన

ఆ ఉ మ అన్నా పావక పవమాన శుచి అన్నా ఒక్కటే. ఎందువలన అనగా అ ఉచ్చారణ చేసేప్పుడు ఏర్పడే ఘర్షణ వలన అగ్ని వస్తుంది. ఓంకార సాధన వల్ల విద్యుత్తును ఉత్పత్తి చెయ్యవచ్చు.

ఏప్రిల్

110496 గాయత్రీ దీప యజ్ఞ ప్రాముఖ్యత

దేవతా శక్తులు గుడిలోనే ఉంటాయా? విద్య విద్యాలయాలలో మాత్రమే ఉంటుందా ? లేదు విద్యాలయంలో ఏమి నేర్చుకోవాలో బోధింపబడుతుంది కానీ విద్య నేర్చుకోవలసింది మీరే. దేవాలయాలలో దేవతా శక్తులవద్ద విద్య నేర్చుకుని మీరు ఇంటికి వెళ్ళాక ఆ పొందిన శక్తులను మీరు ఉపయోగించుకోవాలి. దేవాలయాలలో దేవతా శక్తులవద్ద శక్తిని పొందటానికి రెండు అస్త్రాలు మీ దగ్గర ఉండాలి, అవి గాయత్రీ మంత్రము మరియు యజ్ఞము.

మే

02051196 సంపన్నవంతులు అగుట ఎలా

" గొప్పవాళ్ళు కావటానికి దీర్ఘ శ్వాస తీస్కొనే అలవాటు చేసుకోండి. ఎప్పుడు వెన్ను నిటారుగ పెట్టి కూర్చోండి. మీరు ఎవరిని ఆదర్శంగ తీసుకుంటున్నారొ అలా మీరు మారితె ఎలా ఉంటారొ ఊహించుకోండి."

02051996 లలితాశ్రమము

బాహ్య పరిస్థితులు మనల్ని ఎంత బాధ పెట్టినా , బాహ్య వాతావరణంలొ మనకి ఎంత సుఖంగా లేక పోయినప్పటికి కూడా భగవంతుడు మీద విశ్వాసము పోకూడదు. లలితా దేవి యొక్క అనుగ్రహం,లలితా దేవి యొక్క ప్రేమ ,లలితా దేవి యొక్క సాన్నిధ్యము మనకు లభించాలి అంటే నామ పారాయణ చెయ్యండి. ఆ తల్లె మీకు దారి చూపిస్తుంది

05051996 మహాకాల యజ్ఞము

"పసుపు రంగు ప్రారబ్ధ కర్మను నాశనం చేస్తుంది. గురువుల ఆశీర్వాదం వలన పసుపు రంగు కిరణాలు మనల్ని సఫలీకృతం వైపు తీసుకు వెళుతున్నాయి అనే భావన. ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాసతో పాటు ప్రాణశక్తి లోపలికి వెళుతు శరీరం అంతా చైతన్యం అవుతోంది అనే భావన చెయ్యండి"

నవరాత్రి సాధన- ఉపాసన వివరణ

మన యొక్క ఇంద్రియాలు, మనయొక్క స్వార్ధము ఇవి కష్టాలు అని నిర్ణయిస్తుంది, నిజానికి కష్టము లేదు, సుఖము లేదు. ప్రకృతి తల్లి తన గర్భములో మనల్ని ఉంచుకుని పంచతత్వాలు అనే ప్రపంచములో పంచకోశాలలో మనల్ని ఉంచి మనల్ని ఉన్నత స్ధితికి తీస్కొని వెళ్ళేందుకు ప్రయత్నము చేస్తూ ఉంటుంది, తద్వారా మన గమ్యానికి మనల్ని త్వరగా తీస్కొని వెళ్తుంది, ప్రతి పరిస్ధితి ఆ పరమాత్మ యొక్క ఉపాసనే అనే సంతోషము సాదా సాధకుని మనస్సులో ఉండాలి

020596 సీక్రెట్ డాక్ట్రిన్

మీరు ఎన్ని కష్టాలను అధిగమిస్తె అంత ఎత్తుకు ఎదుగుతారు. కష్ట పడకుండ ఆధ్యాత్మిక సాధనలొ ఎదగలేరు. ఆధ్యాత్మిక సాధకుడు ఎప్పుడు మునిగి పోడు. మన అందరిలొను ఒకటె శక్తి పని చేస్తుంది అదె ఆధ్యాత్మికత.

050596 సీక్రెట్ డాక్ట్రిన్

సీక్రెట్ డాక్ట్రిన్

230596 సూర్య విజ్ఞానము - అగ్ని విద్య

సూర్యుడు మేష రాశీలో ఉన్నప్పుడు 3 లక్షణాలు మనం నేర్చుకోవాలి, 1. క్షమించటం నేర్చుకోవాలి. 2.ఎవరైన మనల్ని నిందిస్తే వాళ్ళని మన గురువుగా స్వీకరించాలి, మన తప్పుల్ని సవరించుకోవాలి. 3. ఓర్పు నేర్చుకోవాలి. మేష లగ్నము కానీ, మేష రాశీ కానీ మేషములో సూర్యుడు ఉన్నప్పుడు ఈ లక్షణాల్ని డెవలప్ చేస్కోవాలి. వృషభరాశి- కంఠ స్థలం - కృష్ణ తత్వానికి సంబంధించిన రాశి. ఏప్రిల్ నుండి మే 20 మధ్య. కంఠానికి సంబంధించిన విద్య, లెక్చరర్స్, స్టూడెంట్స్, పాటలు పాడేవారు, వాళ్ళకి ఇది ముఖ్యము. ఇది వాక్శక్తికి ప్రతీక. మిధున రాశీ యోగ విద్యకు ప్రతీక, ఎక్కడ రెండు రెండు భాగలు ఉంటాయో అవన్ని మిధున రాశి ప్రభావము ఉంటుంది.( Audio quality little poor)

210596 సూర్య విజ్ఞానము - అగ్ని విద్య

ఓడరేవులో జరిగిన సాధనా శిబిరములో శ్వాస- గాయత్రీ మంత్రముల సాధన నేర్పించారు. శ్వాస ఏ నాడుల నుండి ఎలా ప్రసరిస్తోందో అతి సున్నతంగా గమనించాలి. గాయత్రీ మంత్రము ఉచ్చారణ చేసినప్పుడు ఎక్కడ ఎక్కడ మీ శరీరములో ఆ మంత్రాలు నొక్కుకుంటున్నాయో తెలుసుకోవటమే ఈ సాధన.

250596 గురుస్తవనము

పృధ్వి నాశనం అవ్వవలసిన పని లేదు. ఈ పృధ్వి లొ ప్రతి ఒక్కరు కూడ అమృతత్వాన్ని సాదించగలడు. అమృతత్వానికి ప్రతీకలు దేవతలు . ఏ దేవతను కొలిచిన అమృతత్వం వైపుకె వెళతారు.శ్వాశ సంకల్ప శక్తి దీనితొ పాటు సూర్య విజ్ఞానము ,యజ్ఞ విధ్య కలిపితె కాని ఆ అమృతత్వము మనుషులకు అర్ధ మయ్యె బాషలొ భూమి మీదకు రాదు అని శ్రీరామశర్మ అచార్య చెప్పారు.

250596 విశ్వకుండలినీమంధన

"ప్రపచంలొ ప్రతి పదార్ధానికి నిర్ధారిత శక్తి ఉంది. విద్యుత్ శక్తి మూలాధారం అయితే ఆ విద్యుత్ శక్తి యొక్క సహస్రారం కుండలిని శక్తి. ప్రాణము కుండలినీ శక్తి మీధ ఆధారపడి ఉంది. ప్రాణమును cyclic process పైకి కిందకి మధించ గలిగితె ఎక్కడొ అక్కడ ప్రకృతిలో ఉన్న కుండలిని frequency కి మీ frequency కలుస్తుంది."

270596 త్రిముఖీ గాయత్రీ సాధన

ప్రతి కర్మకు ప్రాయిశ్చిత్త విధానము ఉంది దానినే దానము దక్షిణ అన్నారు. దానము చెయ్యటం నేర్చుకోవాలి. ముఖ్యముగ జ్ఞాన దానము. అన్ని దానముల కంటె కూడా జ్ఞాన దానము చాల గొప్పది. ఇతరులలొ ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి నా కున్నటువంటి జ్ఞానాన్ని దానము చేస్తాను. జ్ఞానాన్నిదానము చెయ్యటం వలన ఏ ప్రతిఫలము ఆశించము అనే భావన గాయత్రి మంత్రం లోని 'దేవస్య' దేవతా లక్షణం ప్రతిఫలం ఆశించ కుండ ఇవ్వటం.

త్రిముఖీ గాయత్రీ ధ్యాన విధానము

తత్ - అను అక్షరము - మొదటి పుష్పము - సూక్ష్మ కారణ శరీర నిర్మాణాల యొక్క సిధ్ధాంతిక నిర్మాణాన్ని 5 కోశములు 6 చక్రములు గురుంచి అధ్యయనము చేసి తెలుసుకుంటాను. సవితు:- రెండవ పుష్పము - 5 కోశాలు 6 చక్రాలను ఉపయోగించుకోవటము, దివ్య వాకు, దివ్య శ్రవణము సాధిస్తాము, బాహ్య శబ్ధములు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోను. నా యొక్క అలోచనా కిరణములు మంచి ఆలోచనలు వెదజల్లుతాను. వరేణ్యము - మూడవ పుష్పము - శ్రేష్ఠత్వమును, అన్ని పన్లు అత్యంత శ్రేష్ఠముగా చేస్తాను, ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాను. ఇవి కర్మ యోగము యొక్క మూడు పువ్వులు.

జూన్

260196 వ్యాహ్రుతుల సాధన

నిజమయినటువంటి గురువు మీకు భౌతికంగా లభ్యము కాడు. భౌతికంగా లభ్యమయ్యే గురువు భౌతికంగా మీతొ మాట్లాడే గురువు మీ నిజమయిన గురువు వైపుకు తీసుకు వెళ్ళెవాడే తప్ప నిజమయిన గురువు కాడు.

జులై

290796 గురు పౌర్ణమి

అహంకారము తీసివేసే మంత్రము గాయత్రీ మంత్రము. గాయత్రీ మంత్ర సాధకుడుకి అహంకారము రాదు. గాయత్రీ మంత్రానికే ఆంక్షలు వెయ్యడం మొదలు పెట్టాము భారత జాతి నిర్వీర్యమయిపోయింది. ఆ నిర్వీర్యమయిపోయిన భారత జాతి తిరిగి పునరుద్ధింపబడాలంటే గాయత్రీ మంత్రం ఒక్కటే మార్గము.

27079 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

యక్షులు అంటే టెక్నాలజీ తెలిసినవాళ్ళు అని అర్ధము. ఓంకార సాధన ద్వారా సూక్ష్మ జగత్తులో ఉన్న దేవతలు మన శరీరాన్ని సమన్వయం చేస్తారు. మ్మ్ అనే శబ్ధము వలన పిల్లలు నిద్రపోతారు, ఆ శబ్ధమును అర్ధం చేస్కునే ప్రయత్నము చెయ్యండి. Sound energy - Straight propagation , cirucal propagation & Kundalini propagation. Theory and practical of SSS Meditaiton.

27079 శ్వాస- పౌర్ణమి- అమావాశ్య

శ్వాస పీలుస్తుంటే నాడుల నుండి ఒకవేపు మొదలుపెట్టీ రివర్స్ లో ఇంకోవేపుకు వెళ్తుంది. మనము పెట్టుకునే నామాలు మన శ్వాస వెళ్ళే విధానాన్ని బట్టీ పెట్టుకునే సాంప్రదాయాన్ని మనుషులు చాలా తప్పుదోవ పట్టించారు. అన్నమయ కోశములోని ప్రాణవాయువు ఎలా వెళ్తోందో అలా మన శరీరములోని నాడీవ్యవస్థ అలానే వెళ్తుంది.

28079 క్లీం బీజ సాధన

పశు పక్ష్యాదులకు మనిషి ఉన్నట్టుగా వాళ్ళని ఒక కట్టుబాటులో ఉంచేందుకు ఎలాంటి వ్యవస్థలేదు, న్యాయ వ్యవస్థ వంటివి లేవు. మనిషి ఒక్కడే ప్రకృతికి విరుధ్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి దానిని సరి చెయ్యటానికి ఈ క్లీం బీజ సాధన ఉపయోగపడుతుంది.

28079 భగవంతుని దర్శించటం ఎలా ?

శ్వాస పీలుస్తుంటే నాడుల నుండి ఒకవేపు మొదలుపెట్టీ రివర్స్ లో ఇంకోవేపుకు వెళ్తుంది. మనము పెట్టుకునే నామాలు మన శ్వాస వెళ్ళే విధానాన్ని బట్టీ పెట్టుకునే సాంప్రదాయాన్ని మనుషులు చాలా తప్పుదోవ పట్టించారు. అన్నమయ కోశములోని ప్రాణవాయువు ఎలా వెళ్తోందో అలా మన శరీరములోని నాడీవ్యవస్థ అలానే వెళ్తుంది.

29079 గురుపూర్ణిమా సందేశము

గురుపూర్ణిమనాడు మీరు చేరే లక్ష్యము కోసం ఒక సంవత్సరం అంతా కష్టపడతాము, ఆ రోజు మనకు కాన్వకేషన్ రోజు వంటిది. వ్యాస పూర్ణము అంటే జ్ఞాననికి సంబంధించిన వ్యాసం , బ్రహ్మాండం మొత్తమును తెలియచేసేది. వ్యాసము - సర్కంఫరెన్స్ అని కూడా అర్ధము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల జ్ఞానాన్ని తెలియచేసేది. నాలుగు దిశలు పూర్తిగా ఎవరు వ్యాపించగలరో ఆయన నాలుగు తలలు కల బ్రహ్మ, అంటే సర్వజ్ఞత్వము. సర్వ వ్యాపకత్వము కలవాడు విష్ణువు, సర్వసమర్ధత కలవాడు శివుడు.

ఆగస్ట్

160896 జన్మాష్టమి

శ్రీ కృష్ణ చేతనత్వముతో మీరు ఎలైన్ అవ్వాలి అంటే రోజుకి కనీసం 4 గంటలపాటు నేను చెప్తున్న విషయాలను పదే పదే వినండి. విని మీరు ఆచరించాల్సిన విషయాలను అవగాహన చేసుకుని పధ్ధతిగా వాటిని ఆచరించండి.

అక్టోబర్

141096 డా. ఆర్.కె జన్మదినం

గాయత్రీ మంత్రం తప్ప వేరే ఏ మంత్రము వేదాలను కిందకు తీసుకు రాలేదు. ఆ వేదాలను దింపటానికి 1875 నుండి మన దేశంలొ ఆర్యసమాజం అనె పేరుతో, విదేశాలలొ థియొసాఫికల్ సొసైటీ అనే పేరుతో గాయత్రీమంత్రం జరుగుతూ వచ్చింది.

141096 ప్రకృతికి అణుగుణంగా జీవించటం

ప్రకృతికి అణుగుణంగా జీవించటం నేర్చుకోండి, శ్రీ రామ శర్మ గురుదేవులు ఒక కుటుంబములో ఉంటూ కూడా ఆయన ప్రకృతిలోనే జీవించారు, ఆయన తన గదిలో ఫ్యాన్ ను ఎవరన్నా వచ్చినప్పుడూ మాత్రమే వేసి వారు వెళ్ళగానే మరల తీసేసేవారు. గణపతి పూజా విధానము అంటే ఏమిటో సరిగ్గ అర్ధం చేసుకోవాలి, లేకపోతే మీరు చేసే పూజ నటన మాత్రమే.

141096 దుర్గా సప్తశతి

మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని గురువుకి పూర్తి సమర్పణా భావముతో సమర్పించండి, మిమ్మల్ని మీరు సమ్ర్పించుకోవటము వస్తే మీరు కూడా గురువులు ఐపోతారు.

151096 దత్త ప్రదక్షిణలు - సూర్యనమస్కారములు

యన్మండలం శ్లోకముతో దత్త ప్రదక్షిణలు - సూర్యనమస్కారములు - నక్షత్ర - రాశులను కలుపుకొని 12 పూర్తి ప్రదక్షిణలు చేసే విధి విధానమును వివరించారు. ఇదొక అద్భుతమైన ప్రయోగము. కాకివాయి ఆశ్రమములో ఈ సాధనా శిబిరమును నిర్వహించారు.

161096 కుండలినీ - సౌందర్య లహరి

హ్రీం భావత్మకమైన స్పందన - హృదయమునుండి వస్తుంది, ఇక్కడ సూర్యుడి స్పందనలు మీకు తెలుస్తాయి. శ్రీం ఆలోచనలు, క్లీం ఆచరణ. షట్చక్రాల జాగరణ ఒక్కో నెలలో ఒక్కో చక్రము జాగృతము అవుతుంది, దీనివలన కుండలినీ జాగరణ జరుగుతుంది. సూర్యుడి వలనే ఋతువులు ఏర్పడతాయి. సౌందర్యలహరిలో లోని ఒక శ్లోకము వివరణ. గాయత్రీ చందస్సుకి మానవజాతికి చల్లా దగ్గర సంబంధము ఉన్నది, 24.

181096 గ్రహాలు - దిక్కులు

శుక్ల పక్షమునాడు సూర్యుడినుంచి వచ్చే కిరణము, చంద్రుడి నుండి వచ్చే కిరణము, కృష్ణ పక్షమునాడూ సూర్యుడిలోకి వెళ్ళే కిరణము, వాటి పేర్లలోనే వాటి అంతరార్ధములు ఉన్నాయి. ఋషులు పేర్లలోనే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేసారు. ప్రకృతిలోని లయబధ్ధత మీ శరీరములో రావాలి. మీ కోరికలు పక్కనపెట్టగలిగితే సమర్పణా స్ధితిలో ఉంటే మీరు అతి సునాయాసంగా ప్రకృతితో మమేకమై జీవించవచ్చు.

181096 రామాయణము - కాకువాయి

లోక కల్యాణకరమైన ఆలోచనలు ఉన్న వారి వద్దకు నారదులవారు వస్తారు, వేదాలు అధ్యయనం చెయ్యటానికి వసుధైక కుటుంబకము అన్న భావనలు ఉండాలి. ఆ స్ధితిలో ఉంటె కావలసిన మార్గదర్శనం నారదులవారి వద్దనుండి వస్తుంది.

181096 - సౌందర్య లహరి

ఆది శంకరాచార్యులవారు సౌందర్య లహరిలో ఆ గురు పాదాల యొక్క గొప్పతనాన్ని ఎంత అద్భుతంగ వర్ణించారో వింటే వళ్ళు పులకించిపోతుంది. ఎంత వర్ణించినా ఆయనకి తనివితీరలేదు అనిపిస్తుంది. సౌందర్యలహరిలోని ఎన్నో రహస్యమయమైన అంశాలను వివరించారు.

181096 సూర్యనమస్కారములు - దత్త షోడశ నామాలు- గాయత్రీ స్తవనము

ప్రాణశక్తిధారలు అన్ని నాడులలో చక్కగా ప్రవహించాలి. శుక్ల పక్షములో మూడోరోజు తిధి - ఈ రోజు తిధి దేవత నిత్యక్లిన్న. సూర్యుడినుండి చంద్రుడిలోకి వెళ్ళే పేరు ప్రజ్ఞానం - చంద్రుడిలోంచి సూర్యుడిలోకి వెళ్ళే పేరు దర్శిత. ఒక్కో రాశిలో 8 నక్షత్రాల శక్తి ధారలు పనిచేస్తూ ఉంటాయి. మన శరీరములో చక్రములు- రంగులు-రాసులు సంపుటీకరణ.

161096 కుండలినీ - సౌందర్య లహరి

హ్రీం భావత్మకమైన స్పందన - హృదయమునుండి వస్తుంది, ఇక్కడ సూర్యుడి స్పందనలు మీకు తెలుస్తాయి. శ్రీం ఆలోచనలు, క్లీం ఆచరణ. షట్చక్రాల జాగరణ ఒక్కో నెలలో ఒక్కో చక్రము జాగృతము అవుతుంది, దీనివలన కుండలినీ జాగరణ జరుగుతుంది. సూర్యుడి వలనే ఋతువులు ఏర్పడతాయి. సౌందర్యలహరిలో లోని ఒక శ్లోకము వివరణ. గాయత్రీ చందస్సుకి మానవజాతికి చల్లా దగ్గర సంబంధము ఉన్నది, 24.

161096 కుండలినీ - సౌందర్య లహరి

హ్రీం భావత్మకమైన స్పందన - హృదయమునుండి వస్తుంది, ఇక్కడ సూర్యుడి స్పందనలు మీకు తెలుస్తాయి. శ్రీం ఆలోచనలు, క్లీం ఆచరణ. షట్చక్రాల జాగరణ ఒక్కో నెలలో ఒక్కో చక్రము జాగృతము అవుతుంది, దీనివలన కుండలినీ జాగరణ జరుగుతుంది. సూర్యుడి వలనే ఋతువులు ఏర్పడతాయి. సౌందర్యలహరిలో లోని ఒక శ్లోకము వివరణ. గాయత్రీ చందస్సుకి మానవజాతికి చల్లా దగ్గర సంబంధము ఉన్నది, 24.

211096 గురు అనుగ్రహము - అనుగ్రహమాలా మంత్ర దీక్ష

(Poor audio quality)

సెప్టెంబర్

అనుగ్రహమాలా మంత్ర దీక్ష-1996 దుర్గాష్టమి

సర్వాంతర్యామి, సర్వ సమర్ధుడు, సర్వ వ్యాపి గురువుని మీరు ఒక శరీరధారిలో చూడటానికి ప్రయత్నము చేస్తున్నారు, శరీరధారి మీకు మార్గదర్శనము మాత్రమే చెయ్యగలడు. కానీ ఆ గురువు వద్దకు చేరటము అనేది ఆ గురువు అనుగ్రహము వలన మాత్రమే సాధ్యము అని తెలుసుకోండి. 1996 దుర్గాష్టమి సందర్భముగా మీ అందరికీ ఇస్తున్న అనుగ్రహమాలా మంత్ర దీక్షలోని బీజాస్ఖరాలను శ్రధ్ధతో ఉచ్చరీస్తే ఆ అనుగ్రహము మీకు తప్పక లభిస్తుంది.

నవంబర్

011196 అశ్వనీ సూక్తము - శ్వాస

ఎప్పుడు జ్ఞానము గురువు యొక్క చరణాల దగ్గరనుండి పొందాలి, శిరస్సునుండి కాదు, చరణాలు మీకు దొరకకపోతే గురు పాదుకలను ఉపయోగించుకోండి. అశ్వనీ సీక్తమును పారాయణ చెయ్యటం ద్వారా మీకు సమాధానం దొరకని సంస్యలకు సమాధానం దొరుకుతుంది. ఐశ్వర్యము, నిరంతర ఆనందము, యశశ్శు, అతులిత సంపద, ఎటువంటి పరిస్ధితిలోనైనా గెలవగలగటం - ఈ లక్షణాలు భగవంతుడివి.

051196 అశ్వనీ సూక్తము - శ్వాస

శ్వనీ సూక్తము - శ్వాస

011196 అశ్వనీ సూక్తము - శ్వాస

ఏ పని చేసిన సమర్ధవంతముగా చెయ్యగలగాలి, సౌందర్య లహరిలోని 9 శ్లోకాలు ఎలా వాడాలో చెప్తాను. సూర్య నమస్కారములను ద్వాదశరాసులతో కలిపి చేసుకోండి. మనకు ఏ నక్షత్రములో పడితే ఆ దశలో మనము నడూస్తాము, మన జీవిత విధానము ఏ విధంగా నడుస్తుంది అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది అని తెలిస్తే మీకు నేను చెప్తున్న విజ్ఞానము అర్ధము అవుతుంది. ఒంగోలు అనుగ్రహపీఠములో నవగ్రహ స్థాపన.

డిశంబర్

251296 పంచీకరణసాధన

సాధకుడు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. భగవంతుడుకి ఏది అర్పించినా అది సాత్విక ఆహారంగానే మారుతుంది. అందుకనే మనం తీసుకునే ఆహారం భగవంతుడికి అర్పించి తినాలి. ఆహారాన్ని బట్టి సంస్కారాలు ఏర్పడతాయి.

1996 ఋషిమయ జీవితము

గాయత్రీ చాలీసాలోని హ్రీం శ్రీం క్లీం బీజాక్షరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలను స్పందిపచేసి వికసింపచేస్తాయి. శ్రీం మనకు రసానుభూతిని కలుగచేస్తుంది, క్లీం శరీర చేతనత్వాన్ని స్పందింపచేస్తుంది. సూర్యకిరణాలు సర్వ వ్యాపకత్వాన్ని కలిగిఉంటాయి. గాయత్రీ మంత్రము చేసేప్పుడు తప్పనిసరిగా దాని అర్ధాన్ని అనుభూతి చెందుతూ చెయ్యాలి.