T410s_336x280
Awgpsouth
మాగురించి లక్ష్యమ ఆడియ వీడియ సాహిత్యమ యజ్ఞమ ఋషుల స౦స్కారముల ధ్యానమ సాధనల యోగ సంప్రదించండి ప్రశ్నలు - సమాధానముల
Untitled Document
BLOG SPOT
విచారక్రాంత
ఇంగ్లీషు పేజీల కోసం
DIVINE
INDIAN YOUTH
ASSOCIATION
OUT VIDEO
CHANNEL
Thought Revolution - Hindi
Thought Revolution - Telugu
 

 

పూజ్య. డాక్టర్. ప్రణవ్ పాండ్య [ డాక్టర్ సాహెబ్ ]

ప్రస్థుత మార్గదర్శకులు :     గాయత్రీ పరివార్ ను నడిపిస్తున్నవారు

సంస్థానాధిపతి :                 అఖిల విశ్వ గాయత్రీ పరివార్  

సంచాలకులు :                   బ్రహ్మవత్చస్ పరిశోధనా సంస్థ

రాజపండితులు :                దేవ సంస్కృతి విశ్వ విద్యాలయము

సంపాదకులు :                   అఖండ జ్యోతి - మాసపత్రిక

సభాపతి :                         స్వామి వివేకానంద యొగవిద్యా  మహా పీఠము
 

పట్టభద్రులు, పదవులు మరియు పరిశోధనలు :

1972 ఎమ్.బి.బి.ఎస్, ఎమ్.జి. ఎమ్. మెడికల్ కాలేజ్, ఇండోర్, ఇండియా
1975 డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎం.డి) ఎమ్.జి. ఎమ్. మెడికల్ కాలేజ్, ఇండోర్, ఇండియా (స్వర్ణ పతక గ్రహీత ) 
1975 – 1976 డిపార్టమెంట్ ఆఫ్ న్యూరాలజీ మరియు కార్డియాలజీ లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలసి ఎమ్.జి. ఎమ్. మెడికల్ కాలేజ్ లో పనిచేసారు.  " ట్రీట్మెంట్ ఆఫ్ సైకో సొమాటిక్ డిసీసెస్ " అనే అంశముపై తమ పరిశోధనా పత్రములను ప్రచురించారు.
1976- 1978 బి.హెచ్.ఇ.యల్, భోపాల్, హరిద్వార్ వైద్యాలయాలలో ఫిజిషియనుగా మరియు ఇంటెన్సివ్ కేర్ విభాగమునకుఇన్ఛార్జ్బాధ్యతలను స్వీకరించారు.
1978 భారత సాంప్రదాయ సేవలో గడుపుటకు అమెరికా సంయుక్త  రాష్ట్రముల అనేక ఉద్యోగ అవకాశములను, ప్రతిపాదనలను త్రోసిపుచ్చి భారత దేశములోనే బ్రహ్మవర్చస్ పరిశోధనా సంస్థకు నిర్వాహకులుగా స్థిరపడినారు.
2002 నుండి ఈనాటి వరకు దేవసంస్కృతి విశ్వవిద్యాలయ సంచాలకులు.
 
సంచాలకులు : బ్రహ్మవర్చస్ పరిశోధనా సంస్థ
1978 సంవత్సరము నుండి శాంతికుంజ్, హరిద్వార్ లో యుగనిర్మాణ ఆందోళన యొక్క ముఖ్య కార్యాలయములో (నవయుగ నిర్మాణ సంఘటన) శాశ్వతముగా మానవతా సేవకు అంకితమయినారు.
1974 - 1990 వరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులకు వ్యక్తిత్వ వికాసము, నీతి నడవడికల అధ్యాయన, శిక్షణా కార్యక్రమములకు బాధ్యతను స్వీకరించారు. 35000 మందికి పైగా అధికారులు ఈ  కార్యక్రమములో పాల్గొన్నారు.
1999 - 2000 వరకు విస్త్రుత దేశ, విదేశ యాత్రలు జరిపి, వైజ్ఞానిక సమ్మతమైన అనేకఅధ్యాత్మిక విషయ సంబంధిత కార్యక్రమాలను పెద్ద ఎత్తులో నిర్వహించారు.
  అమెరికా సంయుక్త రాష్ట్రములు, కెనడా, ఇంగ్లాండు, డెన్మార్క్, నార్వే, అష్ట్రేలియా, ఫిజి, న్యుజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, కెన్యా మొదలగు దేశాలలో గాయత్రీ పరివార శాఖలను స్థాపించారు. భారతీయ సంస్కృతి యొక్క సందేశమును విశ్వ వ్యాప్తి జేయుటకు కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫోర్డ్, హోర్వర్డ్, లాస్ ఏంజలెస్ లోని కాలిఫోర్నియా తదితర యునివర్సిటిల యందు సమావేశాలలో పాల్గొని, సెమినార్లను తమ ఆధ్వర్యములో నిర్వహించారు.
1992 ఫిబ్రవరిలో ఇంగ్లాండు నందు హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ లను ఉమ్మడిగా సంభోధించారు.
1994 తమ దర్శకత్వములో "వాటర్షెడ్ డెవలప్మెంట్ స్కీం" ను [వర్షపునీటి సేకరణ, వ్యవసాయము] దేశ వ్యాప్తముగా ప్రచారము చేసారు.
1993 చికాగోలో [అమెరికా సంయుక్త రాష్ట్రములు] 1999లో కేఫ్ టౌన్ [దక్షిణ అమెరికా] లలో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలీజియన్స్ సమావేశములలో భారతీయ సంస్కృతి వెనుక గల విజ్ఞానమును గురించి తెలియపరిచారు.

 

పూజ్య శ్రీమతి శైల్ బాలా పాండ్యా [శైల్ జీజి]

పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరియు మాతా భగవతీ దేవీగార్ల సుపుత్రిక

జన్మ వివరాలు : తెల్లవారు ఘామున డిసెంబర్ 20, 1953 [గీతా జయంతి], అఖండ  జ్యోతి సంస్థానము, ఘియామండి, మధుర.

ఆధ్యాత్మిక వాతావరణములో, తల్లితండ్రుల ఆశయాలకు పూర్తి సమర్పణలో పెరిగినారు.

విశ్వవిద్యాలయము నందు ఎన్.సి.సి, తదితర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఇండోర్ యునివర్సిటిలో క్లినికల్ సైకాలజీ యందు పరిశోధనా దృక్పధముతో, వినూత్న ప్రక్రియలు జరిపారు.  

కోశాధికారి : శ్రీ వేదమాత గాయత్రీ ట్రస్ట్, శాంతికుంజ్, హరిద్వార్.

ప్రస్థుత సంస్థానాధిపతి : శాంతికుంజ్, ముఖ్య కార్యాలయము, అఖిల విశ్వ గాయత్రీ పరివార్, యుగనిర్మాణము, విచార్ క్రాంతి అభియాన్. 

అఖిల విశ్వ గాయత్రీ పరివార్ అధ్యక్షులైన శ్రీ ప్రణవ్ పాండ్యగారి శ్రీమతి 

ఆమె జీవితములోని మైలు రాళ్ళు : మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ, దేవీ అహల్య  యునివర్సిటి, ఇండోర్, ఇండియా.

భర్త అయిన శ్రీ ప్రణవ్ పాండ్యగారితో, శాంతికుంజ్ బృందముతో కలసి పనిచేయుటకై ఇండోరును వదలి తన ఒకటిన్నర సంవత్సరముల బాలుడు చిన్మయ్ తో కలసి 1978 ఫిబ్రవరిలో గురుసత్తా పిలుపునందుకొని విశ్వవ్యాప్త గాయత్రీ ఆందోళనయందు పాల్గొనినారు.

Untitled Document
WORLD PEACE & HARMONY
 
 
మన కోసం
5 నిమిషముల
గాయత్రీ ద్వారా
 అధ్భుత ఫలితాలు
 
 
USER NAME  
   
PASSWORD  
   
Forgot Password
   
 
ఈ -గురుకులము
ఆన్ లైన్ గురుకులమ ు
 
 
 
Untitled Document
Contributions | Suggestions | Contact Us www.e-gurukul.net| www.th8revolution.com | www.awgp.org|www.dsvv.org | www.diya.net.in