T410s_336x280
Awgpsouth
మాగురించి లక్ష్యమ ఆడియ వీడియ సాహిత్యమ యజ్ఞమ ఋషుల స౦స్కారముల ధ్యానమ సాధనల యోగ సంప్రదించండి ప్రశ్నలు - సమాధానముల
Untitled Document
BLOG SPOT
విచారక్రాంత
ఇంగ్లీషు పేజీల కోసం
DIVINE
INDIAN YOUTH
ASSOCIATION
OUT VIDEO
CHANNEL
Thought Revolution - Hindi
Thought Revolution - Telugu
 

శ్రీ రామకృష్ణ గారి పరిచయము ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, మరియు  దేవర్షులకు రత్న గర్భ అయిన భారత దేశములోనే శ్రీ శ్రీరామకృష్ణ గారు మారెళ్ళ కామరాజు, సక్కుబాయి దంపతులకు మొదటి సంతానముగా 14 అక్టోబరు 1948 న మచిలీపట్నం కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు.   

వీరు బెనారస్ యునివర్శిటీ నుండి కెమిస్ట్రీలో డాక్టరేట్ పొందారు.

అధ్యాత్మిక జీవితపునాది : గురువులకు ఆలవాలమైన కాశీలోనే వీరి బాల్యం నుండి కిశోరావస్థ వరకు గడపటంతో ఎంతోమంది గురువుల వద్ద అవేక ఆధ్యాత్మిక సాధనలను అతి తక్కువ సమయములోనే సాధించారు. వీరి తాతగారు సోమేశ్వరరావు గారు వీరికి బాల్యం నుండి ఈ మార్గంలోకి ప్రవేశించేందుకు ఏంతో దోహదం చేసారు. వీరి ప్రియతమ గురువులు వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట, పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గారు. వీరు కలియుగ విశ్వామిత్రులు. వేదములను, పురాణములను, ఉపనిషత్తులను ఈ యుగములోని వారు అర్ధం చేసుకునేందుకు అనువైన రీతిలో హిందీ భాషలోకి వాంగ్మయాల రూపములో అందించారు. శ్రీరామశర్మ ఆచార్య గారి ఆలోచనా క్రాంతి ఆధ్యాత్మిక విద్యకే ఒక మైలురాయి.  

 శ్రీ శ్రీ రామకృష్ణ గారు వారి గురుదేవుల ఆదేశానుసారము గురుప్రణాళికలోని భాగంగా ఆంధ్రదేశము నుండి తమ కార్యక్రమములను మొదలు పెట్టారు. తమ గురుదేవులకు సర్వసమర్పణగావించుకోవటంలోని భాగమే వీరి బ్రహ్మచర్య తపస్సు.

శ్రీ శ్రీ రామకృష్ణ గారు నిర్వహించిన సాధనా శిబిరములు : పంచకోశ జాగరణ సాధనా శిబిరము, పిండాండ బ్రహ్మాండ సమన్వయ సాధనా శిబిరము, దత్త సాధనా శిబిరము, సాయి సాధనా శిబిరము, శ్రీ మహాలక్ష్మీ  సాధనా శిబిరము, సావిత్రీ కుండలిని సాధనా శిబిరము, కుండలిని సాధనా శిబిరము, సాయిమహాలక్ష్మి సాధనా శిబిరము, జీవనదేవత సాధన, ఆరాధన సాధనా శిబిరము, ఉపాసన సమర్పణ సాధనా శిబిరము, భాగవతము జీవించే కళ, సైకాలజీ ఆఫ్ రిచ్ నెస్స్, గీత జీవన విధానము, బీజమంత్రములు, విశిష్టత, దైవీశక్తుల జాగరణ, ప్రహ్లాద శిబిరము, ఋషికల్ప సాధనా శిబిరము, గోవర్ధనోద్ధాన శిబిరము, దివ్యాస్త్ర నిర్మాణ శిబిరము, మరియు సమర్ధ సద్గురు నిరంతర సాధనా శిబిరము.

కోట్ల సంఖ్యలో చేయించిన మంత్ర సాధనలు : గాయత్రీ, సావిత్రీ, అనుగ్రహ మాలా మంత్రము, ఓం సాయి వేంకటేశ శ్రీ రాం ఓం, దత్త మంత్రము, సాయి మంత్రము, శరణాగతి మంత్రము, కృష్ణ మంత్రము, శ్రీ మహాలక్ష్మీ మంత్రము ద్రాం మంత్రము, గురు మంత్రము, సూర్య మంత్రము, శివ పంచాక్షరి, లలిత మరియు బీజ  మంత్రములు : హ్రీం, శ్రీం, క్లీం మొదలగునవి. 

అనుగ్రహ పీఠములు : అనుగ్రహ పీఠముల పేరుతో ఎన్నో ఊళ్ళల్లో ఆధ్యాత్మిక జ్ఞాన శక్తి కేంద్రములను స్థాపించారు. ఈ కేంద్రముల లక్షము పరివ్రజకులకు శిక్షణ.

ఆశ్రమములు :
1. నిత్యావతార దత్త క్షేత్రము : వేటపాలెము, చీరాల, ఆంధ్రప్రదేశ్,
2.  
శ్రీ రామ సహ్యాద్రి ఆశ్రమము: ఓడరేవు, చీరాల, ఆంధ్రప్రదేశ్,
3.
సప్తర్షి ఆశ్రమము: గుంటూరు, ఆంధ్రప్రదేశ్,
4.
శ్రీ హంసరామా ఆశ్రమము : కాకివాయి, ఆంధ్రప్రదేశ్,
5.
అపూర్వ గణపతి: ఎర్రబాలెం,
6.
మౌంట్ శంబళా గ్లోబల్ పవర్ సెంటర్, విజయవాడ హైదరాబాదు హైవే మీద, బాట సింగారం గ్రామము, హైదరాబాదు.
రోగ నివారణకు గోమహాలక్ష్మీ సాధన
: 40 రోజులపాటు గోమహాలక్ష్మీ సాధనను చేస్తూ గోవు సన్నిధిలో గో సేవ చేస్తూ గడపటము ద్వారా కేన్సర్ వంటి క్లిష్టమైన రోగములను కూడా నివారించవచ్చని నిరూపించి చూపించారు.

ఐశ్వర్యమునకు శ్రీమహాలక్ష్మీ సాధన : శ్రీ విద్యారణ్య స్వామి విజయనగర సామ్రజ్య స్థాపనకు  చేసి రత్నాలు రాసులుగా పోయగల సస్యస్యామలమైన విశాల సామ్రాజ్య స్థాపన చేసారు. మరల ఆ సాధనను నేటి మానవునికి అందించి ప్రపంచ రాజకీయ వ్యవస్థను, వనరులను పటిష్టం చేసికొనుట ద్వారా వ్యక్తి సుఖము, శాంతి, సమృద్ధులతో జీవించేందుకు అతి సులువైన మార్గాన్ని చూపించారు.. కోటానుకోట్ల శ్రీమహాలక్ష్మీ సాధనను, శ్రీమహాలక్ష్మీ యజ్ఞములు నిర్వహించారు.   

దేవాలయములను అధ్యాత్మిక విద్యా కేంద్రములుగా పునరుద్ధరణ : ప్రదక్షిణ, దక్షిణ, తీర్ధ ప్రసాదముల వెనుక ఉన్న ఆంతర్యమును వివరించి వీనిని ఉపయోగించుకొని మన కర్మను ఎలా మార్చుకోవచ్చు? అనే సత్యాన్ని అత్యంత వైజ్ఞానిక నియమాలను అతి విస్తారముగా తెలియచేసారు. ప్రదక్షిణల ద్వారా కాలాన్ని ఎలా మార్చవచ్చు? ఏ దేవాలయాలలో దైవీ శక్తి ఉంది? ఆ దైవీశక్తిని మనము ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విద్యను శ్రీ రామకృష్ణ పరమహంస జ్ఞాన పునరుద్ధరణలోని భాగముగా తిరిగి అందించారు. 

లక్ష యజ్ఞములు : గత పాతిక సంవత్సరములుగా చేసిన యజ్ఞములు లక్షకు పైనే ఉన్నవి. గాయత్రీ సహస్ర కుండీ యజ్ఞములు వందకు పైగా నిర్వహించారు. గాయత్రీ యజ్ఞములు, శ్రీ మహాలక్ష్మి యజ్ఞములు, అఖండ భాగవత యజ్ఞములు, మరియు మేధా యజ్ఞములు వాటి వెనకాల దాగిఉన్న వైజ్ఞానికతను వివరిస్తూ ఏంతో శాస్త్రబద్ధముగా నిర్వహించారు.

 ఒకే సంవత్సరములో లక్ష గురు స్థానములు : (2005):  గురువుల అనుగ్రహాన్ని పొందేందుకు ప్రతి ఇంటిలో పరివార సభ్యులతో పాటు గురువుకు కూడా స్థానం ఉండటము అనేది కనీస మానవ కర్తవ్యము అని మానవజాతి బాధ్యతను గుర్తు చేసారు. షిరిడిసాయి ఏ విధముగా తమ గురుస్థానమును ఇటుకలు, దీపములతో అలంకరించిన విధానమును చూపించారో అదే విధముగా గురువును ప్రతి మానవుడు అర్ధించాలి అనే సత్సంకల్పమును పునరుద్ధరించారు.

12 ఇటుకలు, 5 దీపములు, 5 అగరవత్తులతో వ్యక్తి పంచకోశములను, పంచ ప్రాణములను బ్రహ్మాండములోని లేక గురువు యొక్క పంచకోశములతో సమ్మిళితము చేసుకొనే విధానమును ఈ సాధనలో అందించారు. 12 ఇటుకల అమరిక ద్వారా వాస్తు, గ్రహ, నక్షత్ర అనుకూలత సాధించటము కూడా ఈ గురుస్థానములోని లక్ష్యమే.  

అఖండ గురు చరిత్ర పారాయణలు : మా జీవితమే మా సందేశము - అనేక గురువుల చరిత్రల పారాయణలను కోరికలు తీర్చుకునే సాధనా గ్రంధాలుగా కాక గురువు చరిత్రలని చదివి తద్వారా మనము వారి జీవిత విధానాన్ని అనుసరించాలి అనే మార్గదర్శనాన్ని మానవజాతికి అందించారు. దీనికు గాను ఒక సంవత్సర అఖండ సాయి పారాయణను గుంటూరు సప్తర్షి ఆశ్రమము నందు మరొక సంవత్సరము పాటు హైదరాబాదు సాయి మందిరము నందు  నిర్వహించి పూర్ణాహుతి యజ్ఞములు నిర్వహించారు. ఒక సంవత్సరము పాటు అఖండ భాగవత యజ్ఞములు నిర్వహించారు.

సంకల్ప పత్రములు : ఒకే సంవత్సరములో లక్ష పత్రముల ద్వారా రోజువారి జీవితములో వ్యక్తి అనుసరించి తీరవలసిన నియమావళిని అందించారు. ఈ నియమాలను పాటించిన వ్యక్తి పరిమాణ క్రమములో అత్యంత వేగముగా ముందుకు ఎలా వెళ్ళవచ్చో తర్క తధ్యములతో నిరూపించారు. 

వీరు అందచేసిన ప్రత్యేక ధ్యానము : సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము.

వీరు దర్శించిన దేవత: మహాయొగేశ్వరి దేవి 

మంత్రము: అనుగ్రహ మాలా మంత్రము

యంత్రము: మహాకాల చక్రవర్తి యంత్రము

యజ్ఞములు: విశ్వ ఏకీకరణ యజ్ఞము, మహాకల యజ్ఞము

అవతారము: అఖండ గురు సత్తా. యదా యదహి ధర్మశ్య గ్లానిర్భవతి భారత...   ఎప్పుడు ఎప్పుడు ధర్మము నశిస్తుందో అప్పుడు అవతార ప్రాకట్యము జరుగుతుంది. కలియుగములో ఒకే శరీరము లో ఈ అవతరణ  జరగకుండా గురువుల సామూహిక ప్రయత్నమే  ఈ అవతారము అని కలియుగ అవతారన్ని అఖండ గురుసత్తాగా   తెలియచెసే ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించారు.

లక్ష్యము: పరిణామ క్రమములో మానవ జాతి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో పరిణితి సాధించటమే కాక ప్రపంచ పరిణామ క్రమములో మానవుల పాత్రని అర్ధం చేసికొని దానిని అనుగుణమైన జీవనవిధానాన్ని అనుసరిస్తూ, పృధ్విపై స్వర్గావతరణ గావించుట అనగా పృధ్వి మీద ఉన్న మానవులు దేవతలవలె అతి ఉన్నతమైన జీవన విధానాన్ని అనుసరించుట. రోగరహిత జీవితము, 2. వృధ్యాప్య రహిత జీవితము, 3. మృత్యు రహిత జీవితము వీటిని సశరీరముగా సాధించటమే మానవ  జీవిత లక్ష్యము.    

వీరు అందచేసిన రెండవ మంత్రము : ఓం సాయి వేంకటేశ శ్రీ రాం ఓం. ( మొత్తము జ్వాలాకుల్ మహర్షి అందించిన 36 పుస్థకముల సారాంశమే ఈ మంత్రము. )

వీరు అందచేసిన మరియొక దేవతా ఉపాసన : సాయి మహాలక్ష్మి ( గురువు అనుగ్రహముతో ఏ దేవత అనుగ్రహమైనా ఆ గురువుద్వారా ఎలా సాధించవచ్చు అనే విద్యకి మచ్చు తునక ఈ సాయి మహాలక్ష్మి మంత్రము, ధ్యానము మరియు ఉపాసన.

పుస్తకములు : వీరు పదివేలకు పైగా ఇచ్చిన ఉపన్యాసముల నించి అనుయాయులు కొన్నింటిని పుస్తకరూపాన్ని ఇవ్వటము జరిగినది. వాటిలో అత్యంత ముఖ్యమైనవి

భగవత్గీత ఉపన్యాసములు, సీక్రెట్ డాక్ట్రీన్ ఉపన్యాసములు ఏడు వాల్యూంస్, ఐశ్వర్యము యొక్క మానసిక స్థితి, వేదమయ జీవనము, భారతీయ జీవన విధానము, ప్రాక్టికల్ ధియసాఫీ, శ్వాస ధ్యానము, నవ్య యుగావతరణకు ఏకాదశ పుష్పములు, అనుగ్రహ మాలా మంత్రము, యూనివర్శల్ మైండ్, అమృతత్వ విద్య, రహస్య జోతిర్విద్య, పతంజలి యోగ సూత్రములు, సాయి భక్తుల జీవన విధానము, సాయి అనుగ్రహానికి ఆచరణ సూత్రములు, నా లక్ష్యము - నా సందేశము, ప్రకృతి ఎల్లప్పుడూ కరక్టే, శ్రవణము - కీర్తనము, శ్వాస మహా విజ్ఞానము, రహస్య కిరణములు, గాయత్రీ మంత్రము, నీవు శిష్యుడివి కాగలవా? యోగికులములో చేరండి, బుద్ధి -  వికాసము మొదలగునవి.

వీరు స్వయముగా వ్రాసిన పుస్తకములు : సమన్వయ భాగవతము, భగవద్గీత దీక్షలు, సమర్ధ సద్గురు స్పర్శ, అఖండ చేతనత్వ విజ్ఞానము సర్వగత అవతార సందర్శనము సోల్ అండ్ ఇట్స్ మెఖానిజం మొదలగునవి.

వీరి గురువులు పండిత శ్రీ రామశర్మ ఆచార్యుల వాంగ్మయములను తెలుగులోకి అనువదించటమే కాక వాటిని నేటి తరం వారికి అర్ధమయ్యేలా వివరించిన కొన్ని పుస్తకములు : గాయత్రీ కుండలినీ సావిత్రీ, జీవన దేవతా సాధన, ఆరాధన, వ్యక్తిత్వ వికాసము కొరకు ఉన్నత సాధనలు, సూక్ష్మీకరణ సాధన, కాయకల్ప సాధన, ఉపాసనా సమర్పణ యొగము, జీవితమును జీవించే కళ షోడశ సంస్కారములు, ప్రాణ శక్తి ఒక దివ్య విభుతి, విదాయి సందేశము, గురుదేవుల ఉద్భోధన, జాగృతాత్మల భాధ్యత, సర్వ సహ మాతా భగవతీ దేవీ దివ్య చరిత్ర, పృధ్వి పై స్వర్గావతరణ, అశ్వమేధ ఉపన్యాసములనే కాక మరెన్నో క్లుప్తమైన పుస్తకములను ఆంధ్రీకరించుట ఆంధ్రులకు వీరు చేసిన మరపురాని సేవ.      

వివిధ గురువులు అందించిన అధ్యాత్మిక గ్రంధములపై వీరు నిర్వహించిన తరగతులలోని ( అఖండ గురుసత్తా ) అత్యంత ముఖ్యమైనవి.

1.     థియొసాఫికల్ పుస్తకములు: సీక్రెట్ డాక్ట్రీన్, సోలార్ సిస్టం, కాసల్ బాడీ, మెంటల్ బాడీ, ఆస్ట్రల్ బాడి, ఫిసికల్ బాడీ, ఈథెరిక్ డబల్, మరియు థాట్ పవర్, మొదలగునవి. 

2. ఒక యోగి ఆత్మకధ: పరమహంస యోగానంద, శ్యామచరణ లాహరీ మహాశయుల జీవితములపై ప్రత్యేక వివరణ. 

3. ఆత్మ కధ: సర్వ సహ మాతా భగవతీ దేవీ దివ్య చరిత్ర మరియు గురుదేవులు వ్రాసిన నూట ఎనిమిది వాంగ్మయములలోని సగానికి పైగా వాంగ్మయములను తరగతుల ద్వారా అందించారు. గాయత్రీ మహా విజ్ఞానము మూడు వాల్యూంస్ మీద కొన్ని వందల క్లాసులు నిర్వహించారు. అంతేకాక వారి గురుదేవులపై ఒక అష్టోత్తర శతనామావళిని ప్రత్యేకముగా తయారుచేయటం మరొక అద్భుతమైన సృష్టి. అశ్వమేధ యజ్ఞములను గూర్చిన ప్రత్యేక వివరణ తరగతుల వలన వారి గురువుల సంకల్పమునకు మరింత చేయూత నిచ్చుట జరిగినది. 

4. లైఫ్ డివైన్, సావిత్రీ, సింథసిస్ ఆఫ్ యోగా, ద ఫ్యూచర్ రోల్ ఆఫ్ ఇండియా మరియు శ్రీ అరబిందో జీవితము.  

5. గాడ్ లివ్డ్ విత్ దెం, దె లివ్డ్ విత్ గాడ్, రామకృష్ణ పరమహంస జీవితము మరియు వీరు అందించిన ఉపనిషత్తులు. 

6. సాయి లీలామృతము, సాయి దివ్య చరిత్ర, సత్యం సివం సుందరం 

7. జిల్లెల్లమూడి అమ్మ యొక్క జీవనము, మెనీ మాన్షన్స్, స్టోరీ ఆఫ్ కర్మ 

8. జ్వాలాకుల్ అలీసా బెయిలీ ద్వారా అందించిన పుస్తకములోని కొన్ని పుస్తకములపై ప్రత్యేక తరగతులను నిర్వహించారు. 

9. థర్డ్ ఐ అనే పుస్తకము పై వీరు ఇచ్చిన తరగతులు లోపాసాంగ్ రాంపా యొక్క చేతనత్వానికి తప్పక ఒక జోడింపే.  

10. అంతే కాక వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఆస్ట్రాలజీలపై నిర్వహించిన తరగతులు అగణితములు.  

ఏది ఏమైనప్పటికి శ్రీ రామకృష్ణగారే కాదు ఏ గురువులు చేసిన  కార్యక్రమముల నైనను వాక్యరూపమిచ్చుట ఆకాశములోని నక్షత్రములను మన వేళ్ళతో లెక్కెంచుట వంటిది.  

Untitled Document
WORLD PEACE & HARMONY
 
 
మన కోసం
5 నిమిషముల
గాయత్రీ ద్వారా
 అధ్భుత ఫలితాలు
 
 
USER NAME  
   
PASSWORD  
   
Forgot Password
   
 
ఈ -గురుకులము
ఆన్ లైన్ గురుకులమ ు
 
 
 
Untitled Document
Contributions | Suggestions | Contact Us www.e-gurukul.net| www.th8revolution.com | www.awgp.org|www.dsvv.org | www.diya.net.in