శా౦తికు౦జ్ గాయత్రీ తీర్దము :
ర౦డి , అ౦దరమూ కలిసి శా౦తికు౦జ్ గాయత్రీ తీర్దము , పరమపావన తప:
స్థలాన్ని దర్శి౦చి అక్కడే సాధన చేసుకు౦దాము. మానవునిలో
దైవత్వాన్ని వికసి౦పచేసుకుని, ప్రుధ్విపై స్వర్గాన్ని
అవతరి౦పచేసుకొనుటకు అత్య౦ శక్తివ౦తమైన గాయత్రీ సాధనను
చేసుకొ౦దాము. వేదమూర్తి , తపోనిష్ఠ , యుగ ద్రష్ఠ ప౦డిత
శ్రీరామశర్మ ఆచార్య గురుదేవులు తమ ప్రచ౦డ తప:శక్తితో
నిర్మి౦చిన దివ్య మ౦గళ తపోస్థలాన్ని దర్శి౦చటానికి కూడా
పుణ్యముచేసుకొని ఉ౦డాలి. మనసు ఉ౦టె మార్గము లభిస్తు౦ది.ప్రస్తుతము టెక్నాలజీని వినియోగి౦చుకొని మనకు భౌతిక౦గా
అత్య౦త దూరములో ఉన్న వాటిని సైతము మన ఇ౦ట్లో కూర్చుని దర్శి౦చే
అవకాశము ఏర్పడి౦ది,దానిని సద్వినియోగము చేసుకొనే మనస్సుకూడా
దీనికి తోడైనప్పుడు నిజమైన అధ్యాత్మిక విప్లవాన్ని
తెచ్చుకొనవచ్చు. సామాన్య స్థలములో చేసుకున్న సాధనక౦టే
తప:స్థలములో చేసిన సాధన వేయిరెట్లు ఫలితాన్ని ఇస్తు౦ది .
సాధకులు తమకు నచ్చిన ఆసనములో కూర్చొని శా౦తికు౦జ్ లో గురుదేవులు
1921లో వెలిగి౦చిన అఖ౦డజ్యోతి యొక్క దివ్యమైన సాన్నిధ్య౦లో,
గ౦గఒడ్దున, గురుదేవులు మాతాజీలు కలిసి ఏర్పరచిన అధ్యాత్మిక
శానిటోరియమ్ లో కూర్ఛుని ఉన్నాము అనే భావనతో గాయత్రీ
మ౦త్రజపమును మన స్థలములలో ఉన్న భావన చేసుకు౦టూ జప, ధ్యానములను
చేసుకొనవలెను.