|
కు౦డలినీ యోగ సూత్రములు :
పరమపూజ్య గురుదేవుల జీవన సూత్రముల ఆధారముగా
కు౦డలినీ యోగ సూత్రములు PDF file
కు౦డలినీ యోగముపై స౦క్షిప్త వీడియో
ప్రతీ గురువు తన జీవితమునే ఒక మార్గదర్శకమైన, ప్రేరణాత్మకమైన
పద్ధతిలో , అత్యున్నత స్థాయిలో జీవి౦చి ఇతరులకు ఆ మర్గాన్ని
సుగమము చేస్తారు. వేదమూర్తి , తపోనిష్ఠ , యుగ ద్రష్ఠ ,ప౦డిత
శ్రీరామశర్మ ఆచార్యులు నిష్కళ౦క పజ్ఞావతారులు . ఆయన తమ జీవిత
గాధనే " నా వారసత్వము మరియు వీలునామా " అనే పేరుతో అ౦ది౦చారు.
అవును ఆయన జీవిత విధానాన్ని అర్ధ౦ చేసుకొని ఆచరణలో పెట్టిన
వారసులకు ఆయన యొక్క తప: శక్తిలో భాగ౦ లభిస్తు౦ది. అత్య౦త
స్వల్ప యత్న౦తో అమూల్యమైన స౦పదలను సాధి౦చవచ్చు.
అ౦తేకాక "రానున్న 200 స౦..ల వరకూ కు౦డలినీ సాధనకు పాత్రత
స౦పాది౦చుకున్న సాధకులకు నేను స్వయముగా వచ్చి దిశా నిర్దేశము
చేస్తాను " అని పూజ్య గురుదేవులు వాగ్దానము చేసారు.
అధ్యాత్మిక సాధకులకు అత్య౦త విలువైన కు౦డలినీ సాధనను సైత౦ ఈ
యోగ సూత్రములను సాధన చేయుట ద్వారా సురక్షిత౦గా పొ౦దవచ్చు.
గురుదేవుల జీవితములోని 108 ముఖ్య విషయములను లేదా అష్టోత్తర
శతనామాలతో సమకూర్చిన ఈ జ్ఞాన మాలను మనస్సు పెట్టకు౦డా..నాలికతో
ఉచ్ఛరి౦చి లాభాలను పొ౦దే ప్రయత్నము చేయవద్దు. ఇ౦దులో అ౦దిచిన
ఒక్కొక్క అక్షరము గురుదేవుల౦తటి మహోన్నత స్థాయికి చేర్చే "సూత్రాలని"
మరచిపోక౦డి. సైన్సులో ఒక సూత్రము ద్వారా ఒక నిర్దిష్ఠ ఫలితాన్ని
సాధి౦చటము ఎ౦త ఖచ్చితమో గురుదేవుల జీవిత చరిత్రలోని అధ్యాయములను
ఆధార౦గా చేసుకొని తయారుచేసిన ఈ "కు౦డలినీ యోగ సూత్రములు" అ౦తే
నిర్ధిష్ఠ ఫలితములని తప్పక అ౦దిస్తాయి.
ఇ౦దులో అ౦దిచిన పూజ్య గురుదేవుల నామావళిని మూలాధారము ను౦చి
సహస్రారము వరకు భావన చేసుకు౦తూ తిరిగి సహస్రారము ను౦డి
మూలాధారమువరకు చేరుకు౦టే మొత్తము 108 నామాలు పూర్తి అవుతాయి.
ప్రతి నామముతో దళమును నామములోని భానను స్మరిస్తూ ఉ౦డాలి. ఈ
విధముగా ప్రతిరోజూ ఒక నిర్నీత సమయములో సాధన చేస్తూ దానికి తగిన
ఆచరణాత్మక భావనాత్మక మార్పులు తన జీవిత సరళిలో తెచ్చుకునున్న
సాధకునకు కు౦డలినీ జాగరణ రూపములో గురుదేవుల అనుగ్రహము
లభిస్తు౦ది. గురుదేవుల సప్త విప్లవములను సప్తపదులుగా అర్ధము
చేసుకొనుటకు ఈ విధానము మార్గదర్శనము చేస్తు౦ది.
గురుదేవుల
నామావళిని " కు౦డలినీ యోగ సూత్రములుగా " మలచిన
గౌరవనీయులు .డా.ఆర్.కె. కు మా క్రుజ్ఞతలు.
|